Actors

వాళ్లేనా?

Updated By ManamSun, 09/23/2018 - 07:25

పాత్రల కోసం నటులు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్న రోజులివి. ఆ పాత్రగా మారిపోవడంలో భాగంగా రూపం మార్చుకోడానికీ, ఎంత కష్టమైనా పడడానికీ నటులు ముందుకొస్తున్నారు. ఒక్కోసారి ఆ పాత్ర చేసింది ఫలానా నటుడు లేదా నటి అని చెప్తే తప్ప గుర్తుపట్టలేకపోతున్నాం. ఇప్పుడు హాలీవుడ్‌లో కొంతమంది తారలు చేస్తున్న పాత్రలు చూస్తుంటే, వాటిలో వాళ్ల రూపం చూస్తుంటే అది వంద శాతం నిజమనిపిస్తోంది. అలా పాత్ర కోసం రూపం మారిన కొంతమంది నటులపై 
ఓ లుక్కేద్దాం...

మార్గొట్ రాబీ 
(మేరీ క్వీన్ ఆఫ్ స్కాట్స్)

image


ఈ హిస్టారికల్ డ్రామాలో క్వీన్ ఎలిజిబెత్ 1గా మార్గొట్ రాబీని ఎంపిక చేసినప్పుడు చాలా సాధారణంగా కనిపించే రాణి పాత్రలో సౌందర్యరాశి అరుున ఆమె ఎలా సరిపోతుందనే విమర్శలు వినిపించారుు. అరుుతే ఎప్పుడైతే ఎలిజిబెత్‌గా ఆమె లుక్ బయటకొచ్చిందో, అప్పుడు ఆ విమర్శలన్నీ సద్దుమణిగిపోయూరుు. పెద్ద విగ్గు, హెవీ పౌడర్‌ఫేస్‌తో రాబీ పూర్తిగా ఆ పాత్రలోకి వెళ్లిపోయూరనే ఆమోద ముద్ర లభించింది. ‘టెర్మినల్’, ‘ఐ, టోన్యా’, ‘సూసైడ్ స్క్వాడ్’ సినిమాలతో మెప్పించిన రాబీ, త్వరలో ఎలిజిబెత్ రాణిగానూ మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.

నికోల్ కిడ్‌మన్ (డిస్ర్టాయర్)
 

image


హాలీవుడ్‌లోని అత్యంత సౌందర్యరాశుల్లో ఒకరిగా నికోల్ కిడ్‌మన్‌కు పేరుంది. అలాంటిది కరీన్ కుసమ డైరెక్ట్ చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘డిస్ర్టాయర్’లో ఆమె డీగ్లామరస్‌గా మారిపోయూరు. ఎరిన్ బెల్ అనే అండర్‌కవర్ డిటెక్టివ్‌గా అందమైన తన ఉంగరాల జుట్టు స్థానంలో షార్ట్ బ్రౌన్ విగ్, మురికిగా కనిపించే ముఖంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయూరు. ఈ మద్యే ‘లయన్’, ‘ద బిగైల్డ్’, ‘ది అప్‌సైడ్’ సినిమాల్లోని పాత్రలతో ఆకట్టుకున్న ఆమె ‘డిస్ర్టాయర్’తో ఆస్కార్ అవార్డ్ సాధించినా ఆశ్చర్యపోవాల్సింది లేదనేది 
విశ్లేషకుల మాట.

టామ్ హార్డీ (ఫోన్జో)
imageపాత్రల కోసం రూపం మార్చుకోవడం టామ్ హార్డీకి కొత్తేం కాదు. ఇదివరకు ‘బ్రాన్సన్’గా, ‘ద డార్క్‌నైట్ రైజెస్’లో క్రూర విలన్ బేన్‌గా టామ్ విశేషంగా రాణించారు. ఇప్పుడు ‘ఫోన్జో’ సినిమా కోసం రియల్ లైఫ్ కేరక్టర్ మాఫియూ డాన్ అల్ కపోనేగా మారిపోయూరు. చివరి దశలో డిమెన్షియూ వ్యాధితో బాధపడిన కపోనే పాత్రలో టామ్ నటన గొప్పగా ఉందంటున్నారు. సిగార్ తాగుతూ డిఫరెంట్ మేకప్‌తో ఇప్పటివరకూ ఆన్‌లైన్‌లో బయటకు వచ్చిన ఆయన లుక్ మార్లన్ బ్రాండో (‘గాడ్‌ఫాదర్’)ను గుర్తుకు తెస్తున్నదని సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.

షియూ లాబ్యూఫ్ (హనీ బాయ్)
image‘అమెరికన్ హనీ’, ‘ఫ్యూరీ’, ‘నింఫోమేనియూక్’ వంటి సినిమాలతో హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన షియూ లాబ్యూఫ్ ఇప్పుడు ‘హనీ బాయ్’ పాత్రలో సరికొత్త రూపంతో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. విశేషమేమంటే ఆయన ఈ సినిమాలో చేస్తోంది స్వయంగా ఆయన తండ్రి పాత్రనే. హనీ బాయ్ అనేది చిన్నతనంలో ఆయన ముద్దుపేరు. తన తండ్రికీ, తనకూ మధ్య ఉన్న అనుబంధంతో షియూ రాసిన స్క్రిప్టుతోటే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముందు కాస్త బట్టతల, వెనుక పెరిగిన జుట్టు, పెద్ద కళ్లద్దాలు, డెనిమ్ డ్రెస్‌లో తన అందమైన రూపానికి భిన్నంగా ఈ పాత్రలో కనిపించనున్నారు షియూ.

డేవిడ్ హార్బర్ (హెల్‌బాయ్)
image‘స్ర్టేంజర్ థింగ్స్’ స్టార్ డేవిడ్ హార్బర్ తాజా ‘హెల్‌బాయ్’ రీమేక్‌లో టైటిల్ రోల్ పోషించే అవకాశం సంపాదించడంతో చాలా మంది ఆశ్చర్యపోయూరు. ఆన్‌లైన్‌లో ఆయన ఫస్ట్‌లుక్ బయటకు వచ్చినప్పుడు ‘హెల్‌బాయ్’ అభిమానులు కన్విన్స్ అయ్యూరు. 2004, 2008 సంవత్సరాల్లో వచ్చిన ‘హెల్‌బాయ్’, ‘హెల్‌బాయ్ 2’ సినిమాల్లో ఈ సూపర్ హీరో కేరక్టర్‌ను రాన్ పెరిమన్ పోషించి, అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు కండలు తిరిగిన దృఢమైన శరీరంతో హార్బర్ ఆ కేరక్టర్ లుక్‌లో షాక్‌కు గురిచేశారు. ఎందుకంటే ఇప్పటివరకూ ఆయన కండలు తిరిగిన దేహంతో కనిపించలేదు మరి.వాళ్లు లేకపోతే ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఉండదు!

Updated By ManamSat, 04/14/2018 - 20:03

Artist Sunitha on Casting Couch

గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఎవరినోట చూసిన ‘కాస్టింగ్ కౌచ్’ మాటే. ప్రాంతీయ మీడియాలు మొదలుకుని జాతీయ మీడియా వరకు ఈ వ్యవహారం చేరింది. ఇప్పటి వరకూ ఈ కాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది మాట్లాడినప్పటికీ ఎవరూ పక్కా ఆధారాలతో బయటపెట్టలేకపోయారు.. అంతేకాదు తమకు ఇండస్ట్రీలో ఉనికి ఉండదని చాలా మంది మీడియా ముందుకు రావడానికి భయపడ్డారు. అయితే ఈ విషయంలో మాత్రం నటి శ్రీరెడ్డి ధైర్యం చేసి తనకు అవకాశాలిస్తామని చెప్పి.. వాడుకుని వదిలేసిన బడా బాబులు, ప్రొడ్యూసర్లు, వారి కుమారులు, డైరెక్టర్లు, సింగర్స్ ఇలా అందరీ బాగోతాలు పక్కా ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. అప్పట్నుంచి ఒక్కొక్కరుగా జూనియర్ ఆర్టిస్ట్‌లు, పలువురు హీరోయిన్లు మీడియా ముందుకు రావడానికి సాహసం చేస్తున్నారు. 

Related Article:- క్రిటిక్ కత్తి బండారం బట్టబయలు

 

కాగా ఇటీవలే.. ‘నేను ఇకపై తెరపై పెద్దగా కనిపించను.. కొన్ని కేసుల విషయాల్లో తిరగాల్సి ఉంది.. నా తర్వాత నా అక్కలు, చెల్లెళ్లుగా ఉన్న బాధితులంతా మీడియా ముందుకు వస్తారు’ శ్రీరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా.. జూనియర్ ఆర్టిస్ట్ సునీత వెలుగులోకి వచ్చారు. అసలు ఈ కాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటి..? ఎవరు ఇలా చేస్తారు..? ఆమెను ఇబ్బంది పెట్టిన వాళ్లెవరు? అనే విషయాలను సునీత మాటల్లోనే విందాం. 

"అవును ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. ఇండస్ట్రీలో ఎవరైనా కమింట్మెంట్స్ అడిగినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరైనా అలా అడిగినప్పుడు అప్పటికప్పుడే డైరెక్టర్, మేనేజర్‌కుగానీ ఫిర్యాదు చేయాలి.  మరీ ముఖ్యంగా ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు డ్రస్ విప్పమన్నా.. ఇంకేదైనా చేయమన్నా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెద్దలకు గానీ, డైరెక్టర్స్‌కు మొహమాటం లేకుండా చెప్పేయాలి. 

ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది..!
ఎవరైనా సరే మూవీ ఆఫీస్‌కు వెళ్లారంటే కచ్చితంగా అలా చేయమని అడుగుతారు.. ఇదంతా కామన్ అయిపోయింది. మొట్టమొదట ఇండస్ట్రీలో అడిగేది అదే. అయితే దాన్ని ఎదుర్కోవాల్సిన పద్ధతులు వేరు. చేసేదంతా చేసిన తర్వాత.. ఇలా నన్ను మోసం చేశారని చెప్పుకోవడం మొదటి తప్పు.

ఆ ఒక్కటిపోతే ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం పోతుంది..!
కో-ఆర్డినేటర్స్ వెళ్లిన ప్రతి ఒక్కరూ కాస్టింగ్‌ కౌచ్‌లో బాధితులవుతున్నారు. ఈ సిస్టం అనేది తీసేస్తే ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం పోతుంది. కో డైరెక్టర్స్, అసోసియేటివ్ డైరక్టర్స్‌ను మనం తప్పుపట్టకూడదు.. వారిని వేలెత్తి చూపలేము. కోఆర్డినేషన్ వాళ్లంతా ఎక్కువగా డబ్బుల కోసం ఆశపడుతారు. ఈ కోఆర్డినేటర్ అనే వ్యక్తి.. ఆర్టిస్ట్‌ను సినిమా ఆఫీస్‌కు తీసుకెళ్లి అవకాశమిప్పిస్తా అని చెప్పి.. (ఒక పదివేలు మాట్లాడుకున్నాడంటే అతని ఐదారు వేలు తీసుకుంటాడు.) డబ్బులు గుంజుతాడు.

కాస్టింగ్ కౌచ్ ఇక్కడ్నుంచే ప్రారంభం..
మొట్ట మొదట ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ప్రారంభమయ్యేదే కో ఆర్డినేటర్ నుంచే. ఈ కో ఆర్డినేటర్స్ వల్లే.. అసిస్టెంట్, అసోసియేటివ్ డైరక్టర్స్ అనే వాళ్లు విర్రవీగి ప్రవర్తిస్తారు. వాళ్లను చూసే అందరూ ఇలా ఫాలో అవుతున్నారు.. ఇది 1000% కరెక్ట్. కేవలం కో-ఆర్డినేటర్స్, కాస్టింగ్ చూసే ఏజెంట్స్ వల్లే ఈ వ్యవహారం అంతా జరుగుతోంది. అసలు ఈ కో-ఆర్డినేటర్స్ అనే పద్ధతే తీసేస్తే అలా జరగదు.

అసలీ ఈ కో-ఆర్డినేటర్ ఏం చేస్తాడంటే..!
సినిమా అవకాశం కోసం వెళ్ళిన వారితో మొట్టమొదట ఫొటోలు తీసుకుంటాడు. సినిమా ఆఫీస్‌కు తీసుకెళ్లే ముందు అన్నీ అడుగుతూ.. ‘కమిట్మెంట్’ ఇస్తారా అంటాడు. అసలు నటన, అనుభవం, అందం, అభినయం  ఇవన్నీ ఏం చూడరు.. కమిట్మెంట్.. కమిట్మెంట్ అంతే. ఈ కోఆర్డినేటర్స్ తప్ప ఇలాంటి పనులు చేయడానికి భయపడతారు. 

ఒక వేళ కమిట్మెంట్ ఇవ్వమని చెబితే బయల్దేరండి.. నువ్ కాకపోతే ఇంకా వేలు, వందలాది మంది అమ్మాయిలుంటారని అని చెప్పి గెంటేయడం.. ఫోన్ చేస్తే కట్ చేయడం ఇలాంటి చేస్తుంటారు ఈ కోఆర్డినేటర్స్. ఇండస్ట్రీలో ఎంతమంది ఇలాంటి వాళ్లున్నారంటే లెక్కపెట్టలేము. ఆఖరికి లేడీ కో-ఆర్డీనేటర్స్ కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. ఒక్కసారి కమిట్మెంట్ అనేది మాట్లాడుకుంటే రోజుకు వేలల్లో డబ్బులొస్తుంది. ఇలా డబ్బులకు ఆశపడి చేయడం వల్లే ఇండస్ట్రీ ఇందాక వచ్చింది.!

రెండు రకాల ఫేమెంట్స్..!
ఇండస్ట్రీలో అవకాశాలివ్వాలన్నా.. ఫేమెంట్స్ ఇవ్వాలన్నా రెండు రకాలుగా ఉంటాయి. 1 కమిట్మెంట్స్‌తో(కో-ఆర్డినేటర్స్ ద్వారా వచ్చే వాళ్లు) వస్తే ఒక రకమైన ఫేమెంట్. 2 కమిట్మెంట్ లేకుండా వస్తే ఇంకో రకంగా ఫేమెంట్ ఉంటుంది. ఇది అన్నీ ఆఫీసుల్లో జరగదు.. కొన్ని ఆఫీసుల్లో మాత్రం కచ్చితంగా జరుగుతోంది. ఒక్కసారి కమిట్మెంట్ ఇవ్వనని చెబితే చాలు.. ఇక అంతే సంగతులు సినిమా చాన్స్ అస్సలు రాదంతే. 

అప్పారావుపై ఆరోపణలు చేసినోళ్లే షూటింగ్ వస్తున్నారు..!
కొందరు.. కో ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు.. అలా చేశారు.. ఇలా చేశారని చెప్పుకుంటున్నారు.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కానీ ఎక్కడా ఆధారాలతో సహా బయటపెట్టలేదు. అంతేకాదు ఇప్పుడు ‘సైరా’ షూటింగ్‌కు కూడా వాళ్లంతా వస్తున్నారు. అంటే అర్థం వాడుకున్నారంటారు.. అవకాశాలివ్వలేదంటున్నారు.. మరి షూటింగ్‌కు ఎలా వస్తున్నారు (ఆరోపణలు చేసినోళ్లు కొందరు)" అని జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఓ టీవీ చానెల్‌ డిబెట్‌‌లో నిశితంగా వివరించారు. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ పెద్దల్నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.

http://www.manamnews.com/content/kathi-mahesh-forced-me-artist-sunitha-shocking-allegations-over-tollywood-casting-couch

Related News