keerthy suresh

‘మహానటి’కి పన్ను మినహాయింపు పరిశీలిస్తాం: చంద్రబాబు

Updated By ManamSat, 05/26/2018 - 14:33

keerthy suresh ‘మహానటి’ టీంకు ప్రశంసల వెల్లువలు ఆగడం లేదు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు మహానటి టీంను సత్కరించగా.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘మహానటి’ టీంకు సన్మానం చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక, స్వప్నాదత్, హీరోయిన్ కీర్తి సురేశ్, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరిలను చంద్రబాబు సత్కరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సావిత్రి ఆత్మవిశ్వాసం అందరికీ స్పూర్తి అని, ఆమె జీవితకథను బాగా పరిశోధించి నాగ్ అశ్విన్ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపును పరిశీలిస్తామని వెల్లడించారు. కాగా విడుదలై మూడు వారాలు దాటినా ఈ చిత్రం థియేటర్లలో ఇంకా సత్తా చాటుతోంది. అటు తమిళనాడు, కేరళలోనూ మంచి కలెక్షన్లను రాబడుతోంది మహానటి.

 

ఫొటోల కోసం కింద లింక్‌ను క్లిక్ చేయండి.

 

‘మహానటి’ సినిమా యూనిట్‌ను సన్మానించిన సీఎం చంద్రబాబు‘మహానటి’ సావిత్రి డబ్బింగ్‌ను చూశారా..?

Updated By ManamSun, 05/20/2018 - 13:12

Savitri సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది కీర్తి సురేశ్. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో అయితే కీర్తి, సావిత్రిని గుర్తుచేసింది పలువురు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. కాగా ఈ చిత్రం కోసం కీర్తి సురేశ్ చెప్పిన డబ్బింగ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియోలో కూడా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి అందరినీ ఆకట్టుకుంటోంది కీర్తి సురేశ్. ఇదిలా ఉంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 2 మిలియన్ క్లబ్‌లో ‘మహానటి’

Updated By ManamSat, 05/19/2018 - 08:24

Mahanati సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో 2 మిలియన్ల క్లబ్‌లో చేరింది మహానటి. కథ, కథనంతో పాటు ప్రధానపాత్రాధారుల నటన, దర్శకత్వం, సంగీతం ఇలా ప్రతి విభాగంలోనూ సినిమా అందరినీ ఆకట్టుకోవడంతో ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో కనిపించగా.. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, క్రిష్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ నిర్మాణంలో స్వప్నా దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు.

 నాన్న పాత్రను తప్పుగా చూపారు: జెమినీ గణేషన్ కుమార్తె

Updated By ManamThu, 05/17/2018 - 09:38

kamala  సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో తన తండ్రి పాత్రను తప్పుగా చూపించారని జెమినీ గణేషన్ మొదటి భార్య కుమార్తె, ప్రముఖ వైద్యురాలు కమలా సెల్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సావిత్రి కంటే ముందే జెమినీ గణేశన్ తన తల్లిని పెళ్లాడి ఇద్దరు పిల్లను కూడా కన్నారని, తొలి ప్రేమ సావిత్రి మీద కాదని, తన తల్లిమీదేనని తెలిపారు. 

ఇక సినిమాలో చూపించినట్లు సావిత్రికి జెమినీ గణేశన్ మద్యం అలవాటు చేయలేదని, ఆమెనే తన తండ్రికి మద్యాన్ని అలవాటు చేసిందని కమలా సెల్వరాజ్. కెరీర్ మొత్తం బిజీగా ఉన్న తన తండ్రిని అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్నట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ‘ప్రాప్తం’ సినిమా నుంచి వెనక్కు తగ్గాలని చెప్పడానికి నాన్నతో పాటు తాను కూడా సావిత్రి ఇంటికి వెళ్లామని.. ఆ సమయంలో ఆమె తమపైకి కుక్కులను ఉసిగొల్పిందని, వాటి నుంచి తప్పించుకునేందుకు గోడ దూకి పారిపోయామని కమలా సెల్వరాజ్ గుర్తు చేసుకున్నారు. అయినా ప్రేక్షకులు జెమినీ గణేశన్‌ను అంగీకరించకుంటే ‘కాదల్ మన్నన్’ అనే బిరుదును ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. అయితే మరోవైపు ఈ చిత్రంపై సావిత్రి, జెమినీ గణేశన్ కుమార్తె, కుమారుడు చాముండేశ్వరి, సతీశ్‌లు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తన తల్లికి ఈ చిత్రం ఘన నివాళి అని వారు తెలిపారు. ఇదిలా ఉంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కీర్తి..?

Updated By ManamTue, 05/15/2018 - 12:24

Keerthy Suresh సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ప్రధానపాత్రను పోషించిన కీర్తి సురేశ్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో కీర్తి, సావిత్రిని గుర్తుచేసిందని విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ఇలాంటి సమయంలో కీర్తి సురేశ్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. మహానటిలో కీర్తి నటనను చూసి ఫిదా అయిన రాజమౌళి, ఇప్పటికే ఆమెపై ప్రశంసలు కురిపించాడు. తాజాగా తన చిత్రంలో ఒక హీరోయిన్‌గా ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


 ఓవర్సీస్‌లో దూసుకుపోతున్న ‘మహానటి’

Updated By ManamSun, 05/13/2018 - 13:30

mahanati సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడు, ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో వన్ మిలియన్ డాలర్లను సంపాందించిన ఈ చిత్రం మిగిలిన దేశాల్లో కూడా సత్తా చాటుతోంది.

ఆస్ట్రేలియాలో 1,25,900 డాలర్లు, యూకేలో 28,373 పౌండ్లు, న్యూజిలాండ్‌లో 9,899డాలర్లును మహానటి సాధించినట్లుగా ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. కాగా ఈ చిత్రంలో కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో నటించగా.. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, ప్రకాశ్ రాజ్, షాలిని తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్నాదత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

 ‘మహానటి’ ఎంత బాగుందంటే..: నాని

Updated By ManamFri, 05/11/2018 - 10:22

Nani, Mahanati సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా సావిత్రిగా కీర్తి నటన, దర్శకుడు నాగ్ అశ్విన్ టేకింగ్, సాంకేతిక నిపుణుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని చూసిన నాని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

‘‘మహానటి ఎంత బాగుందంటే, ఎంత బాగుందో చెప్పలేనంత. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌‌ను తప్ప ఎవ్వరినీ ఊహించుకోలేనంతగా అద్భుతంగా నటించింది. నాగి నిన్ను చూస్తే గర్వంగా ఉంది. స్వప్నా, ప్రియాంక, దుల్కర్, విజయ్, డేని, మిక్కీ జే మేయర్ అలాగే టీం మొత్తానికి థ్యాంక్యు’’ అంటూ కామెంట్ పెట్టారు నాని.
 

 ‘మహానటి’లో ప్రకాశ్ రాజ్ పాత్ర ఏంటంటే..?

Updated By ManamTue, 05/08/2018 - 11:36

Prakash Raj  సావిత్రి జీవిత కథ ఆధారంగా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. బుధవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ప్రకాశ్ రాజ్ కారెక్టర్‌ టీజర్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. ప్రముఖ దర్శక నిర్మాత చక్రపాణి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు. నాని వాయిస్‌తో మొదలైన ఈ టీజర్‌లో చక్రపాణికి, సావిత్రికి మధ్య గల సినీ అనుబంధాన్ని తెలిపారు. కాగా భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రంపై అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళంలో ఈ చిత్రం విడుదల కానుంది.‘మహానటి’ కోసం అతిథిగా ఎన్టీఆర్

Updated By ManamTue, 05/01/2018 - 12:20

Mahanati  మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’(తమిళ్‌లో నడిగర్ తిలగమ్). ఈ చిత్ర తెలుగు ఆడియో మంగళవారం హైదరాబాద్‌లో  జరగనుండగా, ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నాడు. చిత్ర నిర్మాతలలో ఒకరైన స్వప్నాదత్‌, ఎన్టీఆర్‌కు మంచి స్నేహితురాలు కావడంతో ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ఎన్టీఆర్ ఒప్పుకొన్నట్లు సమాచారం. 

ఇక సినిమాలోని ప్రధాన పాత్రాధారులైన కీర్తి సురేశ్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, శాలిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకోవడంతో ఆల్బమ్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి స్వరాలను అందించిన విషయం తెలిసిందే. 

 సావిత్రి పాత్ర దొరకడం నా అదృష్టం

Updated By ManamSun, 04/29/2018 - 11:41

Savitri సావిత్రి పాత్రలో నటించడం నిజంగా తన అదృష్టమని మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్ అన్నారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపింది. మొదట ఈ పాత్ర తనకు వచ్చినప్పుడు నటించాలా వద్దా అని చాలా ఆలోచించానని కీర్తి పేర్కొన్నారు. సావిత్రి జీవిత చరిత్ర ఒక తెరిచిన పుస్తకమని, కానీ ఈ పాత్రలో నటించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయన నమ్మకమే ఈ మూవీలో ఇంత బాగా నటించేందుకు సహకరించదని తెలిపారు.

ఇక ఈ పాత్రలో నటించేందుకు సావిత్రి నటించిన పలు చిత్రాలను చూశానని, నిజజీవితంలో ఆమె గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని చెప్పారు. అలాగే ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరు సినిమా బాగా వచ్చేందుకు కృషి చేశారని పేర్కొంది.
Related News