pawan kalyan

ఎవరి గెలుపు కోసం పవన్ పోటీ చేస్తున్నారో..?

Updated By ManamTue, 10/16/2018 - 10:47

Pawan Kalyan, Yanamala Ramakrishnuduఅమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌వి లాలూచీ రాజకీయాలని.. ఎవరి గెలుపు కోసం పవన్ పోటీ చేస్తున్నారో చెప్పాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్‌పై కోపం లేదంటూనే, అతడి అవినీతి దేవుడికి తెలుసని పవన్ మాట్లాడటం హాస్యాస్పదమని యనమల ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో జగన్ అవినీతి తెలీదా అంటూ ప్రశ్నించారు.

జగన్, మోదీని వదిలేసి పవన్ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని, రాఫెల్ స్కాంపై పవన్ ఎందుకు మాట్లాడలేదని అడిగారు. ముఖ్యమంత్రి కావాలంటే అందరివాడై ఉండాలని, చంద్రబాబు అందరివాడు కాబట్టే 14ఏళ్లు సీఎం కాగలిగారు అని చెప్పారు. చిరంజీవి అందరివాడు అనే సినిమాను తీసినా.. నిజ జీవితంలో కొందరి వాడిలాగే మిగిలిపోయారని.. పవన్ ప్రచారం చేసిన పాలకొల్లులోనూ చిరంజీవి ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్నికల తరువాత జనసేన ఎవరితో కలిసిపోతుందో పవన్ చెప్పాలని యనమల రామకృష్ణుడు అన్నారు. కాగా సోమవారం రాజమహేంద్రవరంలో జనసేన కవాతు సందర్భంగా ప్రసగించిన పవన్.. టీడీపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. లోకేశ్‌కు ఏం తెలుసని?: పవన్ కల్యాణ్

Updated By ManamMon, 10/15/2018 - 18:01
Pawan kalyan speech in JanaSena Kavathu

రాజమండ్రి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ‘జనసేన కవాతు’ సాక్షిగా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. పవన్ ఈ సందర్భంగా టీడీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మీ కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికా నేను జనసేన పార్టీ పెట్టింది అంటూ ఆయన ధ్వజమెత్తారు. 

జనసేన ఎప్పుడూ పల్లకి మోస్తూనే ఉండాలా? అని సూటిగా ప్రశ్నించారు. నేతలు తప్పుడు వాగ్ధానాలతో రగిలి రగిలి జనసేన ఆవిర్భవించిందని పవన్ కల్యాణ్ అన్నారు. భరిస్తాం...సహిస్తాం... ఎక్కువ చేస్తే తాట తీస్తాం అంటూ ఆయన హెచ్చరించారు. దౌర్జన్యాన్ని చీల్చిచండాడే కొదమ సింహాలే తన జనసేన సైనికులు అని పవన్ పేర్కొన్నారు. 

‘నన్ను సినిమా యాక్టర్ అంటున్నారు సరే...మరి లోకేశ్‌‌కు ఏం తెలుసు?. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని నారా లోకేశ్‌ను పంచాయతీ రాజ్ శాఖమంత్రిని చేశారు. నేను మీకు మద్దతు ఇస్తే...మీరు నన్ను, మా అమ్మను తిట్టించారు. అవినీతి గురించి గతంలో హెచ్చరించాను. నాకు ముఖ్యమంత్రి పదవి అలంకారం కాదు. ఓ కానిస్టేబుల్ కొడుకు సీఎం ఎందుకు కాలేడు?. లోకేశ్, జగన్‌లా నాకు సీఎం పదవి వారసత్వం కాదు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చినా ఎలాంటి పదవులు అడగలేదు. 

రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలనే చంద్రబాబును కోరాను. ఏ విషయంలోనూ చంద్రబాబు నన్ను సంప్రదించలేదు. అవినీతిపై ప్రశ్నిస్తే...నేను హఠాత్తుగా మారిపోయానంటున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయి. అవి జన్మభూమి కమిటీలా?... గుండా కమిటీలా? . రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మౌలిక సదుపాయాలు కరువు. విజన్-2020లో చెప్పినట్లు ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఏమీలేవు.’ అని పవన్ మండిపడ్డారు.జనసేన కవాతులో అపశ్రుతి

Updated By ManamMon, 10/15/2018 - 17:07
Janasena Kavathu

రాజమండ్రి : ధవళేశ్వరం వంతెనపై జనసేన పార్టీ చేపట్టిన జన కవాతులో అపశ్రుతి చోటుచేసుకుంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు... సభా ప్రాంగణం పక్కన ఉన్న నీటి పారుదల శాఖ పురాతన భవనాన్ని ఎక్కారు. అయితే పురాతన భవనంతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు దానిపైకి ఎక్కడంతో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 

pawan kalyan-janasena kavathu

కాగా జనసేవ కవాతులో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొనటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. దీంతో భద్రతా కారణాలరీత్యా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను సభాస్థలికి కారులోనే వెళ్లాలని పోలీసులు సూచించారు. పవన్ వాహనం దిగి సభా ప్రాంగణానికి చేరుకునే సమయంలో పోలీసులు... కార్యకర్తలు, అభిమానులను అదుపు చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది. కాగా పిచ్చకలంక నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ కవాతు కొనసాగింది.పవన్ కవాతుకు పోలీసుల బ్రేక్

Updated By ManamMon, 10/15/2018 - 13:15

Pawan Kalyanరాజమహేంద్రవరం: మరికాసేపట్లో జనసేవకులతో కవాతుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు ఆదిలోనే బ్రేక్ ఇచ్చారు. ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతుకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్యారేజీ పిట్టగోడలు బలహీనంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. అలాగే సభాప్రాంగణం కూడా 10వేల మందికంటే ఎక్కువ సరిపోదని, వేరే చోట సభను నిర్వహించుకోవాలని చెప్పారు. ఈ మేరకు రాజమండ్రి అర్బన్ పోలీసులు పవన్‌కు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కవాతులో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి పవన్ అభిమానులు వేలాదిమందిగా వచ్చారు. ఈ క్రమంలో పోలీసుల నోటీసుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జనసేన కవాతుకు సర్వం సిద్ధం

Updated By ManamMon, 10/15/2018 - 10:28

Pawan Kalyanరాజమండ్రి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో నేడు ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3గంటలకు పిచ్చుకలం నుంచి ఈ కవాతు ప్రారంభం కానుండగా.. ధవళేశ్వరం కాటన్ విగ్రహం వరకు బ్యారేజీపై రెండున్నర కిలోమీటర్ల వరకు ఈ కవాతు కొనసాగనుంది. అనంతరం నేడు సాయంత్రం 5గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జి దగ్గర బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం వంతెన వద్దకు జనసేన శ్రేణులు చేరుకోగా.. జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో వంతెన ఎరుపుమయంగా మారింది. పోలీసులు బందోబస్తును నిర్వహించారు. కాగా పవన్ కాన్వాయ్‌లో కేవలం 40వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు.

మరోవైపు జనసేన కవాతు సందర్భంగా రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రావులపాలెం, కడియం కెనాల్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను.. బొమ్మూరు మీదుగా రాజమండ్రిలోకి మళ్లించారు. అలాగే రాజమండ్రి నుంచి ధవళేశ్వరం మీదుగా వెళ్లే వాహనాలను మోరంపూడి మీదుగా దారి మళ్లించారు. అలాగే కవాతు, రోడ్‌ షోకు వచ్చే వారి వాహనాలకు ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 7పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.జనసేన ‘కవాతు’ పాట ఇదే..

Updated By ManamSat, 10/13/2018 - 20:45
  • పాట రికార్డింగ్ వీడియోను షేర్ చేసిన పవన్ కల్యాణ్

  • తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనకు జనసేనాని ఏర్పాట్లు 

Janasena, Kavathu song, Pawan Kalyan, Song Record video viralజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన‌కు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని పర్యటన సందర్భంగా పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం ఉప్పొంగుతోంది. దీనికి మరింత ఉత్సాహాన్ని జోడించేందుకు జనసేన పార్టీ కవాతు పాటను రూపొందించారు. తాజాగా ఈ కవాతు పాటకు సంబంధించిన ‘పద పద పద పద్‌ మెరుపులా పద.. ఆ గగనం భువనం అదిరే మెరుపుతూ పద..’ లిరిక్స్‌ను పవన్‌ శనివారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

త్వరలో ఈ పాటను విడుదల చేయనున్నట్టు ట్వీట్ చేశారు. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించారని, రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాక ఈ పాట రికార్డు చేసేటప్పుడు తీసిన వీడియోను కూడా పవన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. జగన్, పవన్ కలిసినా మేమే గెలుస్తాం

Updated By ManamFri, 10/12/2018 - 09:56

Nara Lokeshన్యూఢిల్లీ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్‌ పొత్తు పెట్టుకున్నా.. టీడీపీనే ఘన విజయం సాధిస్తుందని మంత్రి నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో జగన్, పవన్ కలిసి పోటీ చేసినా.. టీడీపీ 150సీట్లు వస్తాయని అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ అవసరాలు తీర్చుకునేందుకు కలిసేవారిని ప్రజలు ఆదరించరని అన్న నారా లోకేశ్.. జగన్ మాటలకు విలువలేదని, పవన్‌కు తానేం మాట్లాడుతున్నానన్న విషయంలో కూడా కనీస అవగాహన లేదని విమర్శించారు. ఇక వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగానే ఏపీ అభివ‌ృద్ధి విషయంలో ముందుందని నారా లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుక అన్ని రకాల అనువైన వాతావరణం ఉన్నందు వల్ల ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు.జనసేనలోకి నాదెండ్ల మనోహర్ 

Updated By ManamThu, 10/11/2018 - 12:06
  • కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన నాదెండ్ల మనోహర్

Nadendla Manohar to join Janasena

అమరావతి:  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి ‘హ్యాండ్’ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన గురువారం రాజీనామా చేశారు. నాదెండ్ల మనోహర్ త్వరలో జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను ఆయన తిరుపతిలో కలవనున్నారు. పవన్ ఇవాళ సాయంత్రం తిరుపతి చేరుకోనున్నారు. పవన్‌తో భేటీ అయ్యేందుకు నాదెండ్ల మనోహర్... తిరుపతి బయల్దేరి వెళ్లారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.నేను కొణిదెల వెంకట్రావు పుత్రుడిని

Updated By ManamWed, 10/10/2018 - 08:59

Pawan Kalyanఅమరావతి: తాను మోదీ దత్తపుత్రుడినని వస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తానెవరికీ దత్త పుత్రుడిని కాదని, తాను కొణిదెల వెంకట్రావు పుత్రుడినని పవన్ పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తనకు సంబంధం ఉందన్న విమర్శలను ఖండించిన పవన్.. తానిప్పటికీ బీజేపీ మోసం చేసిందన్న మాటమీదే నిలబడి ఉంటానని తెలిపారు.

ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో కరచాలనం చేస్తున్నప్పుడు ఆయన కళ్లలో ఎంతో ప్రేమ, వినయం కనిపించాయని.. మరి తననెప్పుడైనా మోదీతో అలా చూశారా? అంటూ ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రినైతే అలా చేస్తా, ఇలా చేస్తా అని జగన్‌లా తాను హామీలు ఇవ్వనని, అలాగే తనను మళ్లీ సీఎంను చేస్తే ఇంకా బాగా పాలిస్తానని చంద్రబాబులా కూడా చెప్పనని పేర్కొన్నారు. 

ఇక ఐటీ సోదాలపై మాట్లాడుతూ.. ఆ దాడులు ఎక్కడో జరిగితే చంద్రబాబు భయపడిపోతున్నారని, ఆయనకెందుకో అంత భయం అని ఎద్దేవా చేశారు. పోలవరం సందర్శనకు ప్రతీ రోజూ వందలమంది వస్తున్నారని, అక్కడ చూసేందుకు ఇనుప ఊచలు, సిమెంట్ తప్ప  మరేమీ లేదని విమర్శించారు. అక్కడికి వెళ్లే వారికి తాగినంత మందు, తిన్నంత తిండి పెడితే ఎవరైనా బాగుందనే చెబుతారని పవన్ ఎద్దేవా చేశారు.మళ్లీ సినిమాల్లోకి పవన్..!

Updated By ManamTue, 10/09/2018 - 12:01

Pawan Kalyanమొన్నటివరకు సినిమాలు, రాజకీయాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ జనసేన తరఫున పోటీ చేయాలనుకుంటున్న పవన్.. అందుకు తగ్గట్లుగా ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే పవన్ మళ్లీ వెండితెరపైకి రావాలని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ మళ్లీ సినిమాల్లోకి రానున్నాడంటూ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు ట్వీట్ చేశారు. 

ఓ భారీ బడ్జెట్ చిత్రంలో పవన్ కల్యాణ్ నటించనున్నాడని, అయితే 2019 ఎన్నికల తరువాత ఇది సెట్స్ మీదకు వెళ్లనుందని ఉమైర్ తెలిపారు. అయితే ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ వార్తతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ తమ అభిమాన నటుడిని వెండితెరపైన చూసే అవకాశం వస్తుందంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని నిర్మించనున్నానని ప్రముఖ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి అధికారిక ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు వైజయంతీ మూవీస్ సహ నిర్మాతలుగా ఉంటారని ఆయన తెలిపారు. అయితే దీనిపై త్రివిక్రమ్ గానీ, అశ్వనీదత్‌ గానీ ఇంతవరకు స్పందించలేదు. 

 

Related News