Case filed

మాచర్లలో వ్యక్తి దారుణ హత్య

Updated By ManamMon, 10/01/2018 - 16:26

మాచర్ల : గుంటూరు జిల్లా మాచర్లలో పట్టపగలే ఓ వ్యక్తిని దుండగులు సోమవారం మధ్యాహ్నం దారుణంగా హతమార్చారు. బుల్లెట్ బైక్‌పై వెళుతున్న వ్యక్తిని కారుతో వెంబడించి మరీ హతమార్చారు. కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేసి వ్యక్తిని అందరూ చూస్తుండగానే నరికి చంపారు.

కాగా పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

మృతుడు చెరుకుపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్‌. ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్లిన అతడు ఇటీవలే విడుదలయ్యాడు. కాగా వెల్దుర్తిలో టీచర్‌గా పనిచేస్తున్న భార్యను కలిసేందుకు వచ్చిన ప్రేమ్ కుమార్‌ను దుండగులు కాపుకాసి హత్యచేశారు.



భార్యను చితకబాదిన మణుగూరు ఎస్ఐ

Updated By ManamFri, 08/31/2018 - 09:28
case filed against Manuguru SI Jitender

కొత్తగూడెం : అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఎస్ఐ విచక్షణ కోల్పోయాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ... కట్టుకున్న భార్యతో పాటు ఆమె తల్లిని కూడా రక్తం వచ్చేలా కొట్టాడు. ఈ ఘటనపై ఎస్ఐపై మణుగూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జితేదంర్ మూడేళ్ల క్రితం న్యాయవాది అయిన పర్వీన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా భర్త వైఖరిలో మార్పు రావడాన్ని గమనించిన పర్వీన్... ఆరా తీయగా జితేందర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. 

ఇదే విషయంపై భర్తను నిలదీయడంతో భార్యభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పుట్టింటిలో ఉన్న పర్వీన్ నిన్న (గురువారం సాయంత్రం) ఇంటికి వచ్చింది. ఆ సమయంలో భర్తతో పాటు మరో మహిళ ఉండటాన్ని గమనించిన పర్వీన్ జితేందర్‌ను నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన ఎస్ఐ జితేందర్‌ అతి దారుణంగా రక్తం వచ్చేలా చితకబాదాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించాన ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 



శ్రీరెడ్డిపై కేసు నమోదు.. పవన్ అభిమానుల ఆగ్రహం..

Updated By ManamTue, 04/17/2018 - 20:56

Case filed by Pawan Fan on Srireddy after comments on Pawan Kalyanపంజాగుట్ట (హైదరాబాద్‌): టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై పోరాటం చేస్తున్న సినీనటి శ్రీరెడ్డిపై మంగళవారం పంజాగుట్ట పోలీసు ఠాణాలో కేసు నమోదైంది. జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను దూషించినందుకు ఆయన అభిమాని శశాంక్‌వంశీ అనే వ్యక్తి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీశక్తి (శ్రీరెడ్డి) వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రముఖ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళలందరూ తలదించేకులా ఉన్నాయన్నారు. సినీరంగంలో ఏదైనా తప్పు జరిగితే పోలీసులను ఆశ్రయించమని పవన్ కల్యాణ్ చెప్పడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై ఆమెకు మద్దతిచ్చిన మహిళా నేతలు ఏమని సమాధానం చెబుతారని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న పవన్‌ సలహాపై శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌ కల్యాణ్‌కు మహిళలంటే గౌరవముందా అంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై పవన్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





Related News