andhra pradesh

‘ఢిల్లీ కన్నా ఏపీపైనే ఇష్టం ఏర్పడింది’

Updated By ManamSat, 09/29/2018 - 15:26
AP chief secretary Dinesh Kumar is retiring on Sunday

అమరావతి : ఐఏఎస్‌ అధికారిగా తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తి ఇచ్చిందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ అన్నారు. ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...‘కేంద్రంలో పని చేసిన మూడేళ్లు ఎంతో అసౌకర్యంగా అనిపించిందన్నారు. దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

స్వ రాష్ట్రం ఢిల్లీ నుంచి ఏపీకి అపాయింట్‌మెంట్‌ పొందినప్పుడు ఆనంద భాష్పాలొచ్చాయని.. ఏపీలో, హైదరాబాద్‌లో పని చేసిన తర్వాత తన స్వస్థలం ఢిల్లీ కన్నా ఏపీపైనే ఎక్కువ ఇష్టం ఏర్పడిందన్నారు. తనపై నమ్మకం ఉంచి సీఎస్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దినేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు

Updated By ManamTue, 09/18/2018 - 18:45
  • ఏపీలో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనం పెంపు

kala venkatarao

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో 23,484మంది సిబ్బందికి లబ్ది చేకూరనుంది. పెరిగిన వేతనాలు ఏప్రిల్ 2018 నుంచి అమలు కానున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.305 కోట్లు అదనపు భారం పడనుంది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనం పెంపును విద్యుత్ సంఘాల సమక్షంలో మంత్రి కళా వెంకటరావు మంగళవారం ప్రకటించారు. అలాగే పదేళ్లకు పైబడి సేవలందిస్తున్న సిబ్బందికి ప్రతినెలా రూ.500 నుంచి రూ.1000 వరకూ అదనపు సర్వీస్ ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. తమది కార్మికపక్షపాత ప్రభుత్వమని, కార్మికుల సంక్షేమమే తమ థ్యేయమన్నారు. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

Updated By ManamTue, 09/18/2018 - 12:25

AP Government likely to issue notification for 20,000 jobsఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న  20 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇరవై వేలకు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అక్టోబర్ 9 నుంచి దసరా సెలవులు

Updated By ManamMon, 09/17/2018 - 14:18
  • ఏపీలో దసరా సెలవులు ప్రకటన

Dusshera holidays in Andhra pradesh schools from october 9

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 9వ తేదీ మంగళవారం నుంచి 21వ తేదీ ఆదివారం వరకూ సెలవులు ఇస్తున్నట్టు ప్రకటన చేసింది. తిరిగి 22వ తేదీ నుంచి పాఠశాలు ప్రారంభించాలని, సెలవు రోజుల్లో స్కూళ్లు నడపరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కాగా, ఈ సంవత్సరం అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి పర్వదినాలు రానున్నాయి. 21వ తేదీన ఆదివారం రావడంతో, 22న స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది.  దీంతో విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి.శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Updated By ManamWed, 09/12/2018 - 21:02

Andhra Pradesh, Brahmotsavams, Srivari Temple, Lord Venkateswaraతిరుమల: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణలో భాగంగా బుధవారం తిరువీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మకరలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది.

అదేరోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గురువారం రాత్రి 8గంటలకు పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. పెద్ద శేష వాహన సేవతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీలో పెట్రోల్‌పై రూ.2 వ్యాట్ తగ్గింపు

Updated By ManamMon, 09/10/2018 - 15:45
  • పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ప్రజలకు స్వల్ప ఊరట

  • రూ.2 వ్యాట్ తగ్గిస్తూ చంద్రబాబు ప్రకటన

Andhra pradesh cut VAT  by Rs2 on petrol, diesel

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెట్రల్, డీజిల్ ధరలపై స్వల్ప ఊరట లభించింది. పెట్రోల్ ధరలపై ఏపీ ప్రభుత్వం రూ.2 వ్యాట్ తగ్గించింది. ఈ నిర్ణయంతో ఏపీ ఖజానాపై దాదాపు రూ.1120 కోట్ల భారం పడనుంది. కాగా పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం ప్రస్తుతం వ్యాట్ రూ.4 వసూలు చేస్తోంది.చమురు ధరల పెంపుపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. తగ్గిన ధరలు రేపటి (మంగళవారం) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. 

‘గడిచిన నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత చమురు సంస్థలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అదుపులేకుండా పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ రోజు ప్రతిపక్షాల బంద్‌కు ప్రజలనుంచి వచ్చిన విశేష స్పందనే ఇందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, బాధ్యతారహిత విధానాలతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అన్ని వర్గాలకు భరించలేని భారంగా మారాయి. 

ప్రజలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలను గత నాలుగున్నరేళ్లుగా తీసుకోకపోవడం గర్హనీయం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్‌కు సంఘీభావంగా తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నాయి. ప్రజల ఆవేదనల్లో పాలు పంచుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు పెరగడం వల్ల రాష్ట్రాల వ్యాట్‌ రేట్లు పెంచడం వల్ల డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించడంసాధ్యం కాదని పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉద్ఘాటించారు. ఈ ప్రకటన వాస్తవానికి దూరంగాను, ప్రజల్ని మభ్యపెట్టేదిగా ఉంది. బాధ్యతా రహితమైన ఈ ప్రకటనను ఖండిస్తున్నాం.’

‘2014లో క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 105.5 డాలర్లు ఉండగా నేడు కేవలం 72.23 డాలర్లుగా ఉంది. 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 49.60పైసలు ఉంటే నేడు 86.71పైసలకు పెరిగింది. డీజిల్‌ ధర 2014లో రూ.60.98పైసలు ఉంటే.. నేడు రూ. 79.98లుగా ఉన్నది. గతంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా కేంద్రం తగ్గించకుండా అదనపు పన్నులు, సెస్‌ల పేరుతో దోచుకుంది.

ఇప్పుడు మాత్రం ముడిచమురు ధరలు పెరిగాయన్న నెపంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నారు. ఒక విధానమేమీ లేకుండా నిరంకుశంగా కేంద్రం వ్యవహరిండచాన్ని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 2014 జూన్‌లో డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం లీటర్‌పై రూ. 3.50 పైసలు ఉండగా.. 2017 సెప్టెంబర్‌ నాటికి లీటర్‌పై రూ.17.33 పైసలకు పెంచారు. 

2014లో లీటర్‌ పెట్రోల్‌ ధరపై 9.48 పైసలు ఉన్న కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని 2018 నాటికి లీటర్‌కు రూ.19.48 పైసలు పెంచారు. ఇదే కాకుండా మౌలిక సదుపాయాల సెస్‌ పేరుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.8లు అదనపు భారాన్ని వినియోదారులనుంచి వసూలు చేస్తున్నారు.

ఒకవైపు వినియోగదారులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సెస్‌ల రూపంలో వారిపై అదనపు భారాన్ని మోపుతోంది. గత నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10లక్షల కోట్లు పైచీలుకు నిధులు ఎక్సైజ్‌డ్యూటీ ద్వారా సమకూరుతున్నప్పటికీ సామాన్య జనంపై భారం తగ్గించడానికి కేంద్రం చొరవ చూపకపోవడం దుర్మార్గం. కేంద్రం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోతోంది’ అని విమర్శించారు.

 త్యాగాలకు మారుపేరు తెలుగుదేశం

Updated By ManamSat, 09/08/2018 - 18:21
  • కార్యకర్తలకు పాదాభివందనాలు: చంద్రబాబు

  • కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది...

  • తెలంగాణలో టీడీపీ ఓ చారిత్రక అవసరం

  • కేసీఆర్, నాకు మధ్య మోదీ చిచ్చుపెట్టే యత్నం

chandrababu naidu speech in NTR trust bhanvanహైదరాబాద్: 36 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీని భుజాల మీద మోసిన పార్టీ కార్యకర్తలకు పాదాభివందనాలు చేస్తున్నాని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన తెలంగాణ టీడీపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని అన్నారు.

‘తెలంగాణలో టీడీపీ పార్టీ ఓ చారిత్రక అవసరం. ఇక్కడ కార్యకర్తలు ఎంతో పట్టుదలతో ఉన్నారు. త్యాగాలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ.  పార్టీని నిలబెట్టుకోవడానికి కార్యకర్తలు ముందుకు వచ్చారు.  భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనట్లుగా ...క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్న పార్టీ ఒక్క టీడీపీయే. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.

విభజన చట్టంలో ఏపీకి అన్యాయం జరిగింది. సమన్యాయం అని మాట్లాడామే తప్ప, ఎవరికీ అన్యాయం చేయమని చెప్పలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా అభివృద్ధి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుని, సీట్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఎలాంటి చర్చలు లేకుండా తెలంగాణలో బీజేపీ... పొత్తులకు అవకాశం లేదంటూ ప్రకటించింది. టీడీపీ ఎప్పుడూ అధికారం కోసం పాకులాడలేదు. 

తెలంగాణ ధనిక రాష్ట్రం కావడానికి టీడీపీ కష్టం ఉంది. అంతేకాదు రాష్ట్ర విభజన జరిగాక కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోవాలన్నదే నా ఆకాంక్ష. భారతదేశంలో ఏపీ, తెలంగాణ ...తొలి రెండు స్థానాల్లో నిలవాలి. విభజన తర్వాత నా మీద గురుతరమైన బాధ్యత నామీద ఉంది.

హైదరాబాద్‌లాగా ఏపీని కూడా అభివృద్ధిని చేయడం. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఘటన ఎన్టీఆర్. అలాగే పేద పిల్లలకు గురుకులాలు ఏర్పాటు చేసింది కూడా మన పార్టీయే. మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది కూడా టీడీపీనే. ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలను తీసుకొచ్చాం. భావి తరాల భవిష్యత్ కోసమే ఇదంతా చేసాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తనకు మెచ్యూరిటీ లేదని మోదీ అంటున్నారని, అలాగే కేసీఆర్ కు పరిణితి ఉందని వ్యాఖ్యానిస్తూ తమ మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏపీని మోసం చేసిందని ఆయన అన్నారు. నార్కో నిర్ణయంపై తీర్పు వాయిదా

Updated By ManamThu, 09/06/2018 - 22:50
  • అయేషామీరా హత్య కేసులో హైకోర్టు 

andhra courtహైదరాబాద్: బీ ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నార్కో పరీక్షలు నిర్వహించాలన్న కేసులో తమ నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది. నార్కో అనాలసిస్ పరీక్షలకు విజయవాడలోని కోర్టు అనుమతి ఇవ్వలేదు. దాంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కింది కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని న్యాయమూర్తి బాలయోగి వెల్లడించారు. విజయవాడ సమీపంలోని ఓ హాస్టల్‌లో అయేషా మీరా 2007లో హత్యకు గురయ్యింది. అప్పుడు ఆమెతోపాటు గదిలో ఉన్న ఇద్దరు యువతులు, హాస్టల్ వార్డెన్ పద్మ, వార్డెన్ భర్త వెంకట శివరామకృష్ణ, ఆయేషా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న.. అబ్బూరి గణేష్, కోనేరు సతీష్‌బాబు, చింతల పవన్ కుమార్‌కు నార్కో పరీక్షలకు 2008లో విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసుతో సత్యంబాబుకు సంబంధం లేదని హైకోర్టు తీర్పు చెప్పడంతో తిరిగి దాఖలైన వ్యాజ్యాల నేపథ్యంలో మళ్లీ సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. దాంతో పైవారికి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు కింది కోర్టు నిరాకరించింది. నార్కో పరీక్షలు నిర్వహించాలని ఆయేషా తల్లిదండ్రులు, సిట్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పు వాయిదా పడింది. హైకోర్టు, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు

Updated By ManamFri, 08/31/2018 - 13:44
supreme court

న్యూఢిల్లీ : హైకోర్టు విభజనపై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా అభిప్రాయం తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలపాటు  వాయిదా పడింది.

ప్రస్తుత హైకోర్టు భవనాన్ని రెండుగా విభజించాలని ... తెలంగాణ న్యాయవాదులు ఈ సందర్భంగా సుప్రీంకోర్టును కోరారు. హైకోర్టులో 24 హాళ్లు ఖాళీగా ఉన్నాయని, ఒకవేళ ఏపీ ప్రభుత్వం వాడుకోవాలంటే ఖాళీగా ఉన్న ఆ హాళ్లను వాడుకోవాలని, లేకుంటే తామే ఖాళీ చేసి వెళతామని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ లేదు: రోజా

Updated By ManamSun, 08/26/2018 - 17:54

No protection, Women, Andhra pradesh, Rojaవిశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. వైఎ‍స్సార్‌సీపీ గెలుపునకు మహిళలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. మెడికల్‌ స్టూడెంట్‌ రిషితేశ్వరి ఉదంతంలో నిందితులకు ఇంకా శిక్ష పడలేదని ధ్వజమెత్తారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడిచేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కూడా చర్యలు తీసుకోలేదని రోజా విమర్శించారు.

కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలే ఉన్నారని ఆరోపించిన రోజా.. సీఎం చంద్రబాబుది మహిళా వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. బ్రిటీష్‌ పాలన కంటే దారుణంగా చంద్రబాబు పాలన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పని జరగదని భావించిన చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకడుతున్నారని రోజా విమర్శించారు. కాంగ్రెస్‌లో టీడీపీని విలీనం చేయడానికి రంగం సిద్దమవుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకడుతున్నారని రోజా మండిపడ్డారు. 

Related News