trivikram

త్వరలోనే చెబుతా: అల్లు అర్జున్

Updated By ManamThu, 11/08/2018 - 09:45

Allu arjunసినిమా కోసం ఎంతైనా కష్టపడే అల్లు అర్జున్‌కు సరిపోయే కథలు దొరకడం లేదు. ఓ వైపు తన తోటి హీరోలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు చేస్తుంటే.. బన్నీ మాత్రం ఆ రేస్‌లో కాస్త వెనుకబడ్డాడు. అందుకే నిదానమైనా ఫర్వాలేదు గానీ ఈసారి గట్టిగా ఓ పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కథలను వింటూనే ఉన్నాడు. అయితే బన్నీ ఇంకా తదుపరి సినిమాను ప్రకటించకపోవడంపై ఆయన అభిమానులు మాత్రం నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఉత్సాహపరిచేందుకు అల్లు అర్జున్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.

‘‘ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి కాంతులు నింపాలని ఆశిస్తున్నా. నా తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు థ్యాంక్స్. త్వరలోనే నా చిత్రం గురించిన వివరాలు ప్రకటిస్తా. మీ ప్రేమ, అభిమానానికి థ్యాంక్యు’’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

 శింబు ‘అత్తారింటికి దారేది’ ఫస్ట్‌లుక్

Updated By ManamTue, 11/06/2018 - 09:32

Attarintiki Darediపవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ని తమిళ్‌లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు నటిస్తున్నాడు. ‘వంత రాజవతాన్ వరువేన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, సమంత పాత్రలో, ఖుష్బూ, నదియా పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా.. దీపావళి కానుకగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదల అయ్యింది. ఇక ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వనుంది.‘అరవింద సమేత’ టీం క్షమాపణలు చెప్పాల్సిందే

Updated By ManamTue, 10/16/2018 - 12:21

Trivikramఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత ఓ వైపు థియేటర్లలో దూసుకుపోతుంటే మరోవైపు వివాదాలు మాత్రం ఆగడం లేదు. తాను రాసిన రెండు కథల నుంచి ఈ సినిమాను తెరకెక్కించారంటూ వేంపల్లి గంగాధర్ అనే యువకుడు దర్శకుడు త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేయగా.. రాయలసీమకు చెందిన కొన్ని సంఘాలు కూడా ఈ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా రాయలసీమ విద్యార్థి పోరాట సమితి చిత్ర యూనిట్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. మూలపడిన రాయలసీమ ఫ్యాక్షన్‌ను ఈ చిత్రంతో మళ్లీ గుర్తుచేశారని ఆ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సినిమాలో రాయలసీమ ప్రాంతాన్ని కించపరిచేలా కొన్ని డైలాగులు, సీన్లు ఉన్నాయని అందుకే ఆ ప్రాంత ప్రజలందరికీ బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని వారు అంటున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.‘అరవింద సమేత’పై కాపీ వివాదం

Updated By ManamMon, 10/15/2018 - 15:05

Trivikramఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత’. విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా కథ తాను రాసిన నవలల నుంచి త్రివిక్రమ్ కాపీ అంటూ వేంపల్లి గంగాధర్ అనే రచయిత సాక్ష్యాధారులతో సహా బయటపెట్టాడు.

తాను రాసిన పుస్తకాల గురించి తెలుసుకున్న త్రివిక్రమ్ ఓ సారి ఫోన్ చేసి రమ్మన్నారని, అలా ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో ఆయనను కలిశానని గంగాధర్ తెలిపాడు. రాయలసీమ ఫ్యాక్షన్ కథలపై పరిశోధన చేసి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ పొందిన విషయం విని, తనను అభినందించారని చెప్పాడు. ఇక తన హిరణ్య రాజ్యం పుస్తకంలోని కథనాన్ని హీరోయిన్ పాత్రకు వాడుకున్నారని.. అలాగే మొండి కత్తిలోని కథను వాడుకొని అరవింద సమేతను తెరకెక్కించాడని విమర్శించాడు. త్రివిక్రమ్‌ను కలిసి, తన కథల గురించి లోతుగా చెప్పడం తాను చేసిన మొదటి తప్పని గంగాధర్ చెప్పాడు. త్రివిక్రమ్ తెలివైన మూర్ఖుడని, రకరకాల కథల్లోంచి ఒక్కో పాత్రను దొంగలించి కొత్త కథను అల్లగడని, అలా వండిన మరో కథే అరవింద సమేత అని చెప్పాడు.

కాగా త్రివిక్రమ్‌పై విమర్శలు రావడం కొత్తేం కాదు. ‘అతడు’, ‘జులాయి’లోని చాలా సన్నివేశాలు హాలీవుడ్ మూవీ నుంచి కొట్టేసినవనీ.. ప్రముఖ రచయిత యద్ధలపూడి సులోచనారాణి రచించించిన ‘మీనా’ అనే నవలతో ‘అఆ’ను తెరకెక్కించి ఆమెకు గుర్తింపు ఇవ్వలేదని(ఇదే నవల ఆధారంగా విజయ నిర్మల 1973లో ‘మీనా’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు), ఇక ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్‌’ రీమేక్ రైట్స్ తీసుకోకుండా ‘అఙ్ఞాతవాసి’గా తెరకెక్కించారని ఇలా చాలా విమర్శలే ఉన్నాయి. మరి అప్పటి విమర్శలు పక్కనపెడితే.. కొత్త వివాదంపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

త్రివిక్రమ్ ఒక మొండి కత్తి: ------------------------- త్రివిక్రమ్ నుంచి మొదటి సారిగా ఏప్రిల్ 15 వ తేదీ మధ్యాహ్నం ఫోన్...

Posted by రాజ రాయలసీమ on Saturday, October 13, 2018

 అరవింద సమేతపై చెర్రీ ప్రశంసలు

Updated By ManamMon, 10/15/2018 - 09:44

NTR, Ram Charanఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ థియేటర్లలో దూసుకుపోతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసిన రామ్ చరణ్.. చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించాడు.

‘‘ఎన్టీఆర్ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలలో ఇది కూడా ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వం సూపర్. జగపతిబాబు, థమన్ మ్యూజిక్ చిత్రానికి రెండు పిల్లర్లు. పూజాహెగ్డే నటనను చాలా ఎంజాయ్ చేశా. అరవింద సమేత టీంకు కంగ్రాట్స్’’ అంటూ చెర్రీ కామెంట్ పెట్టాడు. కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

 

One of the best performances of Jr NTR’s career. Bold story, superb direction and intense dialogues by Trivikram...

Posted by Ram Charan on Sunday, October 14, 2018

 బన్నీ నెక్ట్స్ మూవీ సెట్ అయినట్టేనా..?

Updated By ManamFri, 10/12/2018 - 15:14

Allu Arjun, Trivikram‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా అల్లు అర్జున్ తదుపరి చిత్రంపై క్లారిటీ రాలేదు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు షికార్లు చేసినప్పటికీ.. దానిపైనా అధికారిక ప్రకటన రాలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం బన్నీ తదుపరి మూవీ సెట్ అయినట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు మంచి విజయాన్ని సాధించగా.. తాజాగా హ్యాట్రిక్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది మొదట్లో ‘అఙ్ఞాతవాసి’తో పరాజయాన్ని పొందినప్పటికీ తాజాగా ‘అరవింద సమేత’తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు త్రివిక్రమ్. దీంతో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్‌నే.వారి సలహా మేరకే ‘అరవింద’ క్లైమాక్స్‌ను మార్చా

Updated By ManamFri, 10/12/2018 - 10:54

Trivikramఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా విజయంపై దర్శకుడు త్రివిక్రమ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

సక్సెస్ మీట్‌లో మాట్లాడిన త్రివిక్రమ్ ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ‘‘సాధారణంగా ఏ సినిమాలో అయినా చివరిలో యుద్ధం జరుగుతంది. అలా కాకుండా ఈ సినిమాలో మేము యుద్ధం తరువాత కథను చెప్పగలిగాము. నిజానికి క్లైమాక్స్ కోసం ఓ యాక్షన్ సీన్ అనుకున్నాం. కానీ యాక్షన్‌తో క్లైమాక్స్ వద్దని ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ సూచించారు. వారి సూచన అందరికీ నచ్చడంతో అలాగే చేశాం. సినిమా రిలీజ్ తరువాత క్లైమాక్స్‌పై మంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. అందుకు రామ్-లక్ష్మణ్‌కు థ్యాంక్స్ చెబుతున్నాం’’ అని త్రివిక్రమ్ అన్నారు.‘అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌’ రివ్యూ

Updated By ManamThu, 10/11/2018 - 14:32
Aravindasametha Veeraraghava

స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమ‌తి మ‌మ‌త‌
సంస్థ‌:  హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌
ఆర్టిస్టులు:  ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, జ‌గ‌ప‌తిబాబు, ఈషా రెబ్బా, నాగ‌బాబు, సునీల్‌, రావు ర‌మేశ్‌, సుప్రియా పాథ‌క్‌, న‌వీన్ చంద్ర‌, సితార‌, బ్ర‌హ్మాజీ, ఈశ్వ‌రీరావు, ర‌విప్ర‌కాశ్ త‌దిత‌రులు
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  పి.ఎస్‌.వినోద్‌
స్టంట్స్:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌
ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి
ఆర్ట్ డైర‌క్ష‌న్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) 
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  త్రివిక్ర‌మ్ 

రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సినిమా అంటేనే అది ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్ లోకి చేరుతుంది. అయితే యుద్ధానంత‌రం ప్ర‌శాంతం ఎలా ఉంటుంది?  ఫ్యాక్ష‌న్ ఉన్నా.. దాని వ‌ల్ల ఎక్కువ‌గా న‌ష్టానికి గుర‌యిన ఆడ‌బిడ్డ‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుంది?  మ‌న‌సుతో ఆలోచించి త్రివిక్ర‌మ్ రాసుకున్న క‌థ ఇది. `నేను చేస్తాను స్వామీ` అంటూ త్రివిక్ర‌మ్ ఆలోచ‌న‌ల‌కు య‌న్‌.టి.ఆర్ విలువిచ్చి చేసిన సినిమా ఇది. 12 ఏళ్ల సుదీర్ఘ‌మైన ప్ర‌యాణం త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి చేసిన చిత్ర‌మిది. సీమ భాష సొగ‌సు, వీరిద్ద‌రి `మాట‌ల‌` సొగ‌సు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిపడేస్తాయా?  ఇన్నాళ్లు ఊరించిన కాంబినేష‌న్ క‌డుపు నింపుతుందా?  పెద‌వి విరిచేలా చేయిస్తుందా.. ఆల‌స్య‌మెందుకు చ‌దివేద్దాం.
 
క‌థ‌:
రాయ‌ల‌సీమలోని కొమ్మ‌ద్ది ప్రాంతానికి నార‌ప రెడ్డి(నాగ‌బాబు) పెద్ద‌. అలాగే న‌ల్ల‌గొడి ప్రాంతానికి బ‌సిరెడ్డి(జ‌గ‌ప‌తిబాబు) పెద్ద‌. ఓ ఐదు రూపాయ‌ల కోసం కొమ్మ‌ద్ది, న‌ల్ల‌గొడి ప్రాంతాల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. బ‌సిరెడ్డి ఓ వ్య‌క్తిని చంపేస్తాడు. ఆ కోపంతో నార‌ప‌రెడ్డి బ‌సిరెడ్డి మ‌నుషుల‌ను చంపేస్తాడు. చివ‌ర‌కు ఒక‌రి తండ్రిని మ‌రొక‌రు చంపేసుకుంటారు. నార‌ప‌రెడ్డి కొడుకు వీర రాఘ‌వ రెడ్డి(ఎన్టీఆర్‌)  విదేశాల్లో చ‌దివి ఊరికి వ‌స్తాడు. ఆ స‌మ‌యంలో బ‌సిరెడ్డి, అత‌ని కొడుకు బాల్ రెడ్డి(న‌వీన్ చంద్ర‌) దాడి చేస్తారు. ఆ దాడిలో నార‌ప రెడ్డి చ‌నిపోతాడు. బ‌సిరెడ్డిని రాఘ‌వ పొడిచేస్తాడు. అంద‌రూ బ‌సిరెడ్డి చ‌నిపోయాడ‌నుకుంటారు కానీ.. బ్ర‌తికి పోతాడు. అయితే ఈ గొడ‌వ‌ల కార‌ణంగా అంద‌రూ చనిపోతున్నారు. ఊర్లో ఎవ‌రూ సంతోషంగా ఉండ‌టం లేద‌ని తెలుసుకున్న రాఘ‌వ గొడ‌వలు త‌గ్గాలంటే తాను ఆ ఊర్లో ఉండ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని ఊరి వ‌దిలేసి హైద‌రాబాద్ వ‌చ్చేస్తాడు. కొన్ని ప‌రిస్థితుల్లో నీలాంబ‌రి(సునీల్‌)అనే మెకానిక్‌ని కలిసి అత‌నికి స‌హాయం చేస్తాడు. అత‌నితో షెడ్డులోనే ఉంటాడు. ఓ సంద‌ర్భంలో క్రిమిన‌ల్ లాయ‌ర్ కూతురు అర‌వింద‌(పూజా హెగ్డే) ప‌రిచ‌యమ‌వుతుంది. ఆమె చెప్పిన మాట‌లు రాఘ‌వ‌పై ఎంతో ప్ర‌భావం చూప‌డంతో వారి ఇంట్లోనే ఉంటూ వారికి కావాల్సిన విధంగా స‌హాయ పడుతుంటాడు రాఘ‌వ‌. అయితే ఓ చిన్న త‌ప్పు కార‌ణంగా రాఘవ హైద‌రాబాద్‌లో ఉన్నార‌నే నిజం బ‌సిరెడ్డికి తెలిసిపోతుంది. దాంతో వాళ్లు రాఘ‌వ‌ను దెబ్బ తీయడానికి అర‌వింద‌, ఆమె త‌మ్ముడిని కిడ్నాప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే రాఘవ కాపాడుతాడు. చివ‌ర‌కు ఈ గొడ‌వ‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌ట్ట‌డానికి రాజ‌కీయ నాయ‌కులు(రావు ర‌మేశ్‌, శుభ‌లేక సుధాక‌ర్) స‌హాయం తీసుకుంటాడు. శాంతి చ‌ర్చ‌లు జ‌రుపుతాడు. ఇంత‌కు ఆ శాంతి చ‌ర్చ‌లు ఏమ‌వుతాయి?  బ‌సిరెడ్డి శాంతి సంధికి ఒప్పుకుంటాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Aravindasametha Veeraraghava

ప్ల‌స్ పాయింట్లు
- ఎన్టీఆర్ న‌ట‌న‌, బాడీ లాంగ్వేజ్ బావుంది
- త్రివిక్ర‌మ్ డైలాగులు
- రాయ‌ల‌సీమ ప‌ద్ధ‌తులు, యాస‌
- నేప‌థ్య సంగీతం
- కెమెరా

మైన‌స్ పాయింట్లు
- ఎడిటింగ్‌
- అక్క‌డ‌క్కడా విసుగు పుట్టించే స‌న్నివేశాలు
- కామెడీ లేక‌పోవ‌డం
- సునీల్ , హీరోయిన్ పాత్ర‌ల‌కు పెద్ద ప్రాముఖ్య‌త లేక‌పోవ‌డం
- కొన్ని పాట‌లను ఫిక్స్ చేసిన సంద‌ర్భం, పిక్చ‌రైజేష‌న్ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు

విశ్లేష‌ణ‌:
 ఫ్యాక్ష‌న్ సినిమాలంటే నరుక్కోవ‌డం.. ప్ర‌గ‌, ప్ర‌తీకారాల‌తోనే సాగుతుంటుంది. చివ‌ర‌ల్లో ఏదో చిన్న‌మెసేజ్ ఇచ్చి వ‌దిలేస్తారు. కానీ అలా కాకుండా ఫ్యాక్ష‌న్ ప్రాంతంలో త‌న తండ్రిని చంపిన ప‌గ‌వాడిని కూడా చంప‌కుండా శాంతి కోసం పాకులాడే ఓ యువ‌కుడి క‌థే ఇది. త‌న‌దైన రోజు ఎవ‌డైనా కొడ‌తాడు. కానీ గొడ‌వ రాకుండా ఆపుతాడే వాడే గొప్పోడు .. అనే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ ఇది. ఇది ఎమోష‌న‌ల్ కంటెంట్‌ను ఎక్కువ‌గా యాడ్ చేశాడు. త‌న‌దైన స్ట‌యిల్లో డైలాగ్స్‌తో మెప్పించాడు. మ‌రి ఎన్టీఆర్ లాంటి హీరో క‌దా! కేవ‌లం ఎమోష‌న‌ల పాయింట్ ఏం వ‌ర్కవుట్ అవుతుంద‌నుకోకుండా యాక్ష‌న్ సీక్వెల్స్‌లో ఎన్టీఆర్ అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థంలో ఇర‌వై నిమిషాలు వ‌చ్చే ఫైట్ సీన్‌లో సిక్స్ ప్యాక్ కూడా చూపించాడు. ఇక రెడ్డి ఇక్క‌డ సూడు.. పాట‌లో డాన్సులు ఇర‌గ‌దీశాడు. ఇక హీరోయిన్‌ని, ఆమె త‌మ్ముడిని విల‌న్స్ కిడ్నాప్ చేసిన‌ప్పుడు హీరో వాళ్ల‌ని బెదిరించే తీరు.. రావు ర‌మేశ్‌తో, న‌వీన్ చంద్ర‌తో ఎన్టీఆర్ సంధి జ‌రిగే క్ర‌మంలో వ‌చ్చే డైలాగ్స్ అన్ని ట‌చింగ్‌గా అనిపిస్తాయి. జ‌గ‌ప‌తిబాబు విల‌నిజం లెజెండ్ త‌ర్వాత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. ఫ్యాక్ష‌నింజ‌లో మ‌రో యాంగిల్‌ను ట‌చ్‌చేసే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌. పి.ఎస్‌.వినోద్ కెమెరా వ‌ర్క్ బావుంది. పాట‌లు బాగానే ఉన్నా..పిక్చ‌రైజేష‌న్ ఎఫెక్టివ్‌గా లేదు. ఎమోష‌న్స్ భారీగా ఉండ‌టం యూత్ ప్రేక్ష‌కుల‌కు కాస్త ఇబ్బందే. ఇక పూజా హెగ్డే పాత్ర‌కు పెద్ద‌గా ప్రాముఖ్య‌త లేదు. సునీల్ కామెడీకి పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర‌. ఇక ఈషా రెబ్బా పాత్ర కూడా మ‌రి చిన్న లెంగ్తీలో ఉంది. శుభ‌లేఖ సుధాక‌ర్‌, రావు ర‌మేశ్‌, సితార, ఈశ్వ‌రీ రావు, దేవ‌యాని త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల్లో మెప్పించారు. 
బోట‌మ్ లైన్‌: ఎమోష‌న‌ల్ వీర రాఘ‌వుడు 
రేటింగ్‌: 3/5హిట్.. ఫ్లాప్.. పెద్దగా పట్టించుకోను

Updated By ManamWed, 10/10/2018 - 01:14

‘‘రైటర్, డైరెక్టర్ అని నన్ను నేను రెండుగా విభజించి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకటే సినిమాల్లోలాగా నేను ఇద్దరిని కాదు. ఒక సినిమాను డైరెక్ట్ చేసినప్పుడు అందులో నేను డైలాగులు బాగా రాశాననే అంటే.. అంత మాత్రాన దాన్ని నెగటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగనిదాన్ని కిరీటంగా భావించాల్సిన పనిలేదు’’ అంటున్నారు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో వచ్చిన
 ‘అరవింద సవేుత’ విడుదల సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ...


ఆయనే ఫోన్ చేశారు...
image- సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 29న అనుకున్నాం. ఆ తర్వాత సినిమాను సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలని నేను, నిర్మాత చినబాబుగారు అనుకున్నాం. జనవరిలో వేరే సినిమాలు ఉండటం వల్ల మార్చిలో సినిమాను విడుదల చేయాలనేది మా ఆలోచన. ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం జరిగిన రోజు ఆయనతోనే ఉన్నాం. రెండో రోజు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఎన్టీఆర్‌గారే ఫోన్ చేశారు. ‘ఎట్టి పరిస్థితుల్లో మనం అక్టోబర్ 11కే వస్తున్నాం. ఈ విషయాన్ని చినబాబుగారికి కూడా చెప్పండి’ అని అన్నారు. ‘ఇప్పుడేం పరావాలేదు.. పదిరోజుల తర్వాత మాట్లాడుకుందాం’ అని నేను అంటే ‘పదిరోజులా! అంత లేదు.. ఇప్పటికే షూటింగ్ ఆలస్యమైంది.. పూజా కూడా ఇక్కడే స్టే చేస్తుంది. మూడు రోజుల వరకు నేను బయటకు రాకూడదు’ అన్నారు. నాలుగో రోజు ఆయన సెట్‌కు వచ్చేశారు.  

అదే కొత్త కోణం అనిపించింది..
- నిజానికి ముందు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేద్దామని అనుకోలేదు. రెండు మూడు ఐడియాలు వచ్చాయి. ఆ సమయంలో వచ్చిన ఆలోచన ఇది. ఒక గొడవ జరిగే ముందు.. గొడవ జరిగే సమయంలో విషయాలు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఘటన జరగడానికి ముందు.. తర్వాత యాక్షన్ మిక్స్ అవడంతో ఎమోషన్స్‌కు మనం కనెక్ట్ అవుతాం. ఇంతకు ముందు సక్సెస్ అయిన ఫ్యాక్షన్ సినిమాలను గమనిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. పోయినవాళ్ల ఫ్యామిలీలు.. ఉన్నవాళ్ల ఫ్యామిలీల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది.. కచ్చితంగా కొత్త కోణం అవుతుందనిపించింది. ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. గొడవల్లో ఇప్పటి వరకు ఆడవాళ్లను ఎవరూ ఇన్‌వాల్వ్ చేయలేదు. ఎందుకనో మనం ఇంట్లో ఆడవాళ్లను పెద్దగా పట్టించుకోం. అలా కాకుండా వాళ్లని కన్‌సిడర్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను కథగా రాసుకుని ఎన్టీఆర్‌కు చెప్పాను. తనకు బేసిక్‌గా నా ఆలోచన నచ్చింది. 

అందరికీ నచ్చిన కాన్స్‌ప్ట్
- కోబలి సినిమా రీసెర్చ్ సమయంలో నేను కొంతమంది రాయలసీమ కవులను కలిశాను. తిరుమల రామచంద్రగారి imageసాహిత్యంతో పరిచయం ఏర్పడింది. నాకు భరణిగారు హంపి నుంచి హరప్పా దాకా ఉందని ఇచ్చారు. అక్కడ లాంగ్వేజ్, పడికట్టు ఏది తెలియాలన్నా ఇది చదివితే చాలని చెప్పారు. నేను అప్పటికే నామిని సాహిత్యానికి పెద్ద ఫ్యాన్‌ని. కాకపోతే ఆయన తాలూకు చిత్తూరు జిల్లా భాగం.  అక్కడ కరువు ప్రాంతం. అక్కడ ఫ్యాక్షన్, కక్షలు, కార్పణ్యాలు లేవు.  నాకు కడప, అనంతపూరు ఏరియాల్లో.. ఫ్యాక్షన్ ఉంది. ఇక్కడున్న కరువు ఫోర్స్‌డ్ కరువు. పెనిమిటి పాట కూడా ఈ ప్రాసెస్‌లోనే కుదిరింది.  అందరి ఆడవాళ్లకీ హీరో మదర్‌ని సింబలైజ్ చేశాం. నేను చెప్పగానే అందరికీ నచ్చిన కాన్సెప్ట్ ఇది. 

ఫ్యాన్స్ సినిమాకే..
బిగినింగ్‌లో కొంత కామెడీ ఉంటుంది. ఎక్కడా బలవంతంగా ఉన్నట్లు అనిపించదు. ఇంతకు ముందు బ్రహ్మానందంగారి లాంటి వారిని పట్టుకొచ్చి ఒక ఐటెమ్ చేసేవాళ్లం కదా.. అలా చేయదలచుకోలేదు. కొంచెం స్ట్రిక్ట్‌గా కథ ఏం చెబుతుందో అదే విందామని అనుకున్నా. సినిమాకు ఫ్యాన్స్ ఉంటారు గానీ, మనకుంటారని నేననుకోను. 

12 ఏళ్ల అనుబంధం...
imageఎన్టీఆర్‌తో 12 ఏళ్ల అనుబంధం.‘నాన్నకు ప్రేమతో’ నుంచి మొదలైంది... ఆయనేమో ఆ సినిమా చేస్తున్నారు. నేనేమో ‘అ..ఆ’ చేస్తున్నా. అప్పటి నుంచి ఇద్దరం కలిసి సినిమా చేయాలనే ఆలోచిన సీరియస్‌గా అనిపించింది. నాతో ఉన్న సమస్య అంటే రాత్రి నాకు ఏదో ఒక ఐడియా వస్తుంది.. లేచి కూర్చుని సూపర్ అని రాసుకుంటా. నిద్రలేచి చూస్తే నాకే సిగ్గుగా ఉంటుంది. ఈ ఐడియా ఎందుకు రాశానా? అని. అఫ్‌కోర్స్ నేను తీసిన సినిమాలు చాలా చూసినప్పుడు కూడా అనిపిస్తుంది కానీ.. ఇప్పుడు కూడా అనిపించింది. 

పెద్దగా పట్టించుకోను...
జయాపజయాలను పెద్ద పట్టించుకోను. నాకు ఏదైనా కొత్తగా చూసినప్పుడు, చదివినప్పుడు మాత్రమే  కిక్ వస్తుంది. హిట్, ఫ్లాప్‌లు పట్టించుకోనంటే అబద్ధమే. పట్టించుకుంటా. కానీ ఓ.. పిసికేసుకోను. నాకు ‘అత్తారింటికి దారేది’ వచ్చినప్పుడు  అలాగే ఉంటా. ‘అజ్ఞాతవాసి’ వచ్చినప్పు డూ అలాగే ఉంటా. ఫ్లాప్ అయినప్పుడు బాధపడతా. కాకపోతే ఓ రెండు, మూడు రోజులు.. అంతే. అయిపోయిన తప్పులు మనకు తెలుస్తాయి. చూడకూడదనుకుంటే ఎప్పటికీ చూడం. తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే తెలుస్తుంది. దానికి ఎక్కువ సమయం పట్టదు. డస్ట్ బిన్ మెళ్లో వేసుకుని తిరగడం దేనికి.. ఫ్లవర్ బొకే అయితే తిరుగుతాం. సినిమా నచ్చడానికి లక్ష కారణాలుంటాయి. నచ్చకపోవడానికి లక్ష కారణాలుంటాయి. దాని గురించి మనం ఏమీ మాట్లాడలేం. మాట్లాడేకొద్దీ మనం వీక్ అవుతామే తప్ప, ఇంకేమీ జరగదు. 

ఎవరూ తక్కువ వాళ్లు కారు...
మీతో ఎలా ఉన్నానో.. నా హీరోలతో కూడా అలాగే ఉంటాను. నేను తెలివితేటలు చూపిస్తే వాళ్లు ఇంకెన్ని తెలివిimage తేటలు చూపించాలి. నేను పనిచేసిన ఎవరూ కూడా తక్కువ వాళ్లు కాదు. సురేశ్‌బాబుగారు, స్రవంతి రవికిషోర్, అల్లు అరవింద్.. అందరూ ఎన్నో ఎత్తు పల్లాలను చూసినవాళ్లే. మనం వెళ్లి కూర్చుని మొదలుపెట్టగానే మన మైండ్‌లో ఏముందో.. స్క్రిప్ట్ సేల్ చేయడానికి వస్తున్నాడా..? కథ చెప్పడానికి వస్తున్నాడా? కూడా చెప్పేయగలరు. 
 

అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు
మామూలుగా సునీల్  గత రెండేళ్లుగా ‘నేను ఇందులో బంధీనైపోయాను. ఎలాగైనా బయటపడాలి. ఏదో ఒకటి చేయాలి అని..’ అంటూనే ఉన్నాడు. అప్పుడు నేనన్నా.. ‘అది నేచురల్‌గా జరుగుతుంది. నువ్వు పెద్దగా దాని గురించి ఆలో చించకు. నీ చేతిలో ఉన్న కమిట్‌మెంట్స్ అన్నీ ముందు పూర్తి చెయ్. ఆ తర్వాత హీరోగా కొత్తవేవీ ఒప్పుకోవద్దు. అప్పుడు నేచురల్‌గా ఎందుకు జరగదో చూద్దాం’ అని అన్నా. నేచురల్ గానే మా కన్నా ముందే ‘సిల్లీఫె లోస్’ మొదలైం ది. విడుదలైంది. ఎప్పుడైతే సునీల్ మెంటల్‌గా దాన్నుంచి బయటికి వచ్చాడో, అప్పుడే ఆటోమేటిక్‌గా అందరికీ తెలిసిపోయింది. అలాంటివి మనం చెప్పాల్సిన పనిలేదు. అందరికీ ఇట్టే తెలిసిపోతాయి. 

మన దగ్గర అంత తేలిక కాదు...
imageభీమవరం నుంచి వచ్చినప్పుడు నేను కూడా ఇంగ్లిష్ సినిమాలు చూసేవాడిని. అలాగే తీయాలనుకునేవాడిని. కానీ వాళ్లకు సింగిల్ జోన్రా ఉంటుంది. కానీ మనదగ్గర అలా కాదు. మనం ఒకే సినిమాలో అన్నిటనీ చూడ్డానికి అలవాటు పడిపోయాం. అందువల్ల మన దగ్గర అది అంత తేలిక కాదు. ఆ ప్యాట్రన్‌ని బద్ధలు కొట్టేవారు ఎవరో ఒకరు రావాలి. మాకు మాత్రం తీయాలని ఉండదా? అని ప్రతి ఒక్కరం చెబుతుంటాం. అందులో నేనేమీ అతీతుణి కాదు. కాకపోతే ప్యాట్రన్‌ని బద్ధలు కొట్టాలి. ‘లవకుశ’ కలర్‌లో విడుదలైన 12 సంవత్సరాల దాకా కూడా కలర్‌లో మనం తీయలేదు. అప్పటికి హిందీ, తమిళ్.. అన్నీ కలర్‌లోకి వెళ్లాయి. తమిళ్‌లో కొత్తవాళ్లతో తీసిన ‘కాదలిక్క నేరమిలై’్ల కలర్‌లో ఉంటుంది. తెలుగులో పెద్ద హీరోలతో తీసిన సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. అంటే అప్పటికి మనకు కలర్ అంటే భయం. ఆ ప్యాట్రన్ బ్రేక్ చేయడానికి భయం. కానీ ఇప్పుడు మనం ఆ భయాన్ని బ్రేక్ చేస్తున్నామని అనిపిస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ బ్రేక్ ఏదో రకంగా జరుగుతూనే ఉంటుంది.

నా నిర్మాతలు చెప్పరు..
నా నిర్మాతలు నా సినిమాలకు ఎంత బడ్జెట్ అయ్యిందనే విషయాన్ని నాకు చెప్పరు. అయితే దర్శకుడికి బడ్జెట్ ఎంత పెడుతున్నామనే దానిపై కొంచెంగా ఉండాలి. ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువుంటే కథ రాసేటప్పుడే ఇటలీలో జరిగే కథ.. ఇండియా లోకి.. ఇంకెక్కడో జరిగేది ఇంట్లోకి.. ఇలా మెల్లగా మారిపో తుంది.

జర్నీ కూడా ముఖ్యమే...
రిజల్ట్ ముఖ్యంకాదు.. జర్నీ కూడా ముఖ్యమే కదా. ఏదో ఒక కాలమ్ రాశారనుకుందాం. అది సరిగా రానంత మాత్రాన మీరు పనికి రారంటే ఎలా? ఎన్ని చదువుకుని, ఎన్నో కలలతో ఊరి నుంచి రావడం, ఇక్కడ కలిసిన వ్యక్తులు... ఈ ప్రయాణం.. ఇదంతా చాలా ముఖ్యం కదా. అది 90 పర్సెంట్. ఫైనల్ టిప్ 10 శాతం. అదే రిజల్ట్.

ముందుగా ప్లాన్ చేసుకోను...
మహిళ ప్రాధాన్యత వచ్చేలా టైటిల్స్ పెట్టాలని నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకోను. హీరోయిన్స్‌ను గ్లామర్‌గా చూపించమని డైరెక్టర్స్ అడిగినా నాకు తెలియదనే చెప్పేస్తాను. ఎందుకంటే నాకు అలా చూపెట్టడం తెలియదు. నేను ట్రై చేయలేదు.

అందులో మోహమాటం లేదు...
ఎన్టీఆర్ పక్కన నేను నిలబడ్డానని చెప్పడం ఆయన మంచితనం గానీ... నిజం చెప్పాలంటే ఎన్టీఆర్‌గారే మా పక్కనimage నిలబడి సినిమా పూర్తి చేశారు. అది నిజం! ఇందులో మోహమాటం ఏం లేదు. ఓపెన్‌గా చెబుతున్నా. హరికృష్ణగారి మరణం తరవాత ఎన్టీఆరే సెకండ్ డే ఫోన్ చేసి, ‘నేను వస్తాను. మీరేం వర్రీ అవకండి’ అని చెప్పారు. ‘మీరు కంగా రు పడకండి. బాధ పడకండి’ అని మేము చెప్పింది తక్కువే. ఎందుకం టే... మాటలతో చెబితే తగ్గే విషాదం ఏమీ కాదు. అందువల్లే, ప్రీ రిలీజ్ వేడుకలో నేను ఒక్క మాటే మాట్లాడాను. ‘అంత పెద్ద విషాదంనుంచి అంత త్వరగా బయటకు వచ్చారు’ అని. తన విషాదాన్ని తనకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. మిగతా ఎవరికీ పంచి పెట్టలేదు.

రాజకీయాలు మాట్లాడుకోం..
పవన్‌కల్యాణ్‌గారు రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఇద్దరం మధ్య దూరం పెరగలేదు.  పదేళ్ళ నుంచి మేం అలాగే ఉన్నాం. మేమిద్దరం కలిస్తే అసలు సినిమాల గురించి మాట్లాడుకోం. ఇక ఆయనకు సలహాలిచ్చేంత సీన్ లేదు. ఎందుకంటే ఆయన ఏం చేసినా వాళ్ళ అన్నయ్యకు, వాళ్ళ అమ్మకు చెప్పడు. అందరూ తెల్లారిన తరవాత పేపర్‌లో చదువుకోవడమే.

ఆ స్థితి రాకుండా ఉంటే చాలు...
జీవితంలో నేను ఒక్కసారి ఎవరికైనా ఫ్రెండ్ అయితే ఫ్రెండే. నా భీమవరం ఫ్రెండ్స్ ఇప్పటికీ వాళ్లే నా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక ఎవరు ఫ్రెండ్స్ అయితే వాళ్లే ఫ్రెండ్స్. అందరితో నేను బావుంటాను. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్... ఒక్కసారి నా జర్నీ స్టార్ట్ అయితే చచ్చేవరకూ ఆగదు. నేను ఏది నమ్ముతాను అంటే.. భార్య ఇచ్చే సలహాలు భర్త ఎన్ని వింటాడు. అలాగని, భార్యను ఎందుకు వదలడు? ఆ రిలేషన్‌షిప్‌లో ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది. స్నేహితులుకు  గానీ... కుటుంబం గానీ... సలహాలు ఇవ్వాలనో, ఎడ్యుకేట్ చేయాలనో కాదు. ఇట్స్ సెన్స్ ఆఫ్ కంఫర్ట్. స్నేహితుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. మనల్ని జడ్జ్ చేయకుండా మన భావాల్ని పంచుకోవాలి. పవన్, మహేశ్, ఎన్టీఆర్... ఈ స్థాయికి వచ్చిన వ్యక్తులకు సలహాలు ఏం ఇస్తాం. మనం ఏం సలహాలు ఇవ్వాలి. వాళ్లు మనకు సలహాలు ఇచ్చే స్థితికి రాకుండా ఉంటే చాలు.
 

image

 ఈషా రెబ్బా హీరోయిన్ కాదా?

Updated By ManamTue, 10/09/2018 - 13:13

Eesha Rebbaఅమి తుమీ, బ్రాండ్ బాబు చిత్రాల త‌ర్వాత ఈషా రెబ్బా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`లో న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది. ఈమె పాత్ర ఎలా ఉంటుందనే ఆస‌క్తి ఎప్పటి నుండో మొద‌లైంది. అయితే త్రివిక్ర‌మ్ ఇద్ద‌రి హీరోయిన్స్‌లో ఒక‌రిని ట్రంప్ కార్డ్‌లాంటి పాత్ర‌కు ఉప‌యోగించుకుంటూ ఉంటాడు. ఈషా హీరోయిన్‌గా క‌న‌ప‌డుతుందా?  అనే ప్ర‌శ్న‌కు మ‌రి కొద్ది గంట‌ల్లో తెర‌ప‌డ‌నున్న సంద‌ర్భంలో ఈమె పాత్ర గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి తెలిసింది. అదేంటంటే.. ఈషా రెబ్బా.. ఎన్టీఆర్ చెల్లెలి పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నార‌ని. ఇందులో నిజా నిజాలేమిటో సినిమా విడుద‌లైతే కానీ... తెలియ‌వు. అయితే హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న త‌రుణంలో ఇలాంటి పాత్ర‌ను ఒప్పుకోవ‌డం ఈషా గొప్ప‌త‌మ‌నే మ‌రి!!

Related News