love

ప్రేమకు ప్రతిరూపం

Updated By ManamFri, 10/12/2018 - 02:12

imageతెలంగాణ (ఇండియాలో) ఒక ప్రయోగాల గడ్డగా ప్రసిద్ధికెక్కింది. రూపుదిద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రా జధాని అమరావతిని ఆనుకొని ప్రవహిస్తున్న కృష్ణా నది ఆవలి గట్టున విరాజిల్లుతున్న అందమైన మిర్యా లగూడ పట్టణంలో ప్రేమ ప్రతిమను ప్రతిష్ఠించేందు కు నేడు తెలంగాణ సిద్ధమవుతోంది. ఆ పట్టణానికి దక్షిణ దిక్కున భారత ప్రథమ ప్రధానమంత్రి జవహ ర్‌లాల్ నెహ్రూ ‘వ్యవసాయ ఆలయం’గా కీర్తించి ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షా సారథ్యం లోని హిందుత్వ పాలనలో హిందూ దేవాలయాలు కాకుండా వ్యవసాయ ఆలయాలను, అశోక చక్రాలను నిర్మించిన నెహ్రూ ద్వేషం తీవ్రస్థాయిలో వ్యక్తమవు తోంది. అమరావతి, మధ్యయుగాల నాటి బౌద్ధ సన్యాసి నివసించిన, సంచరించిన నందికొండ వంటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు మిర్యాలగూడ పట్టణం చుట్టూ ఉన్నాయి. బుద్ధిజం ప్రధాన సందేశం ద్వేషం కాదు ప్రేమ. పెళ్ళికి భారమితిగా కుల పారంపర్యతను బుద్ధి జం ఎన్నడూ ఆమోదించలేదు. పెళ్ళి అనే విషయం వైయక్తిక ఎంపిక అని బుద్ధుడు తరచూ చెప్పేవారు. అయితే హిందూ కులతత్వవాదం అందుకు వ్యతిరే కంగా లక్ష్మణరేఖలు గీసింది. ఈ లక్ష్మణరేఖలు ఇండి యాలోని యువ ప్రేమికుల హృదయాలలో భయో త్పాతాన్ని సృష్టిస్తున్నాయి.

ఈ మిర్యాలగూడ పట్టణంలో అత్యంత క్రూరం గా హత్యకు గురైన తన భర్త దళిత ప్రణయ్ ప్రేమకు ప్రతిరూపంగా ఒకimage ‘ప్రేమ ప్రతిమ’ను (స్టాచ్యూ ఆఫ్ లవ్) నిర్మించాలని 21 ఏళ్ళ ధనిక ఆర్యవైశ్య బాలిక అమృతవర్షిణి తలపెట్టింది. అతను మాల కులానికి చెందిన (ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్కర్ కులం) 13 ఏళ్ళ అందమైన వ్యక్తి (ఆమె మాటల్లో అందమైన ప్రణ య్). గ్లోబల్ భవిష్యత్ ఆశలు, ఆశయాలతో కూడిన దృక్కోణంతో వారిద్దరూ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో కలసి చదువుకున్నారు. వాళ్ళిద్దరూ 9వ తరగతి నుంచి మంచి స్నేహితులుగా ఎదిగారు. యుక్తవయ సు వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకుందామని నిర్ణయిం చుకోవడమే కాక, గత జనవరిలో వాళ్లిద్దరూ ఒక ఇంటి వారయ్యారు. అమృత వర్షిణి తండ్రి తిరు నగ రు మారుతిరావు శతకోటీశ్వరుడు. కిరోసిన్ డీలర్ షిప్, వాహనాల డీలర్‌షిప్, రియల్ ఎస్టేట్ వంటి తప్పుడు వ్యాపారాలలో, అవినీతి పనులతో కోట్లను కూడబెట్టాడు. తనకు ఊహ తెలిసి వచ్చినప్పటి నుం చి తండ్రి సంస్కృతిని అమృత తీవ్రంగా ద్వేషిస్తూ వచ్చింది. వాళ్ళ కులంలోనే  తన కిష్టమొచ్చిన అబ్బా యిని ఎవరినైనా పెళ్ళి చేసుకోవాలని మారుతీరావు తన కూతుర్ని చిత్రహింసలకు గురిచేసేవాడు. తన్ను లు, గుద్దులు, నిర్బంధాలు, ఆకలికి మాడ్చడం వంటి ఎన్నో చిత్రహింసలను అమృత ఎదిరించి నిలిచింది. క్రూరుడు అమృతరావు, అతని శక్తిమంతమైన ఆర్య వైశ్య సంస్కృతి, చరిత్ర, వారసత్వాలను, అంతకంటే అధికంగా కులతత్వ హిందూ మత తీవ్ర నిరోధాలను ప్రతిఘటించి చివరికి ప్రణయ్‌ను వివాహం చేసుకుంది.

అమృత వర్షిణి తండ్రి మారుతీరావు బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ అనే కిరాయి హంతకునికి కోటి రూపాయలు సుపారి ఇచ్చి ప్రణయ్‌ను కిరాతకంగా హత్య చేయించాడు. మొత్తం ఈ హత్యా పథకాన్ని మాజీ ఉగ్రవాద బృందానికి చెందిన మహమ్మద్ అజ్ఘర్ అలీ, మహమ్మద్ అబ్దుల్ బారిల సారథ్యంలో నడిచింది. గుజరాత్ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్యకేసులో ముద్దాయిలుగా వారిద్దరూ గతంలో వి చారణ ఎదుర్కొని నిర్దోషులుగా బయటపడ్డారు. మిర్యాలగూడలోని మెజారిటీ ఆర్యవైశ్యులు హిందుత్వ అనుకూల ప్రజలు. అయినప్పటికీ తన దళిత అల్లుడ్ని చంపేందుకు ముస్లిం ఉగ్రవాదులను వినియోగించ డంపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పో యాయి. కుల శత్రుత్వం మత శత్రుత్వం కంటే బల మైనది. తన అత్తమామలు (భర్త ప్రణయ్ తల్లిదం డ్రులు) బాలస్వామి, ప్రేమలతలతో కలసి ఆరునెలల గర్భవతి అమృత ఇప్పుడు కలసి జీవిస్తోంది. సుభాష్ శర్మ తన భర్త సుభాష్‌ను నరికిచంపుతున్న సమ యం లో అత్తమ్మ తనతోనే ఉన్నది. ఆమె విధవరాలైన తన కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. తన కోడలితో ఇంటర్వ్యూ చేసేందుకు వస్తున్న వారికి ప్రేమలత ఎంతో ఓరిమితో ఏర్పాట్లు చేస్తోంది. ఆమె తన కుమా రుడు ప్రణయ్ కోడలి గర్భంలో పిండంగా పెరుగుతు న్నట్లు భావిస్తోంది. తన అమ్మ కంటే అత్తమ్మపైనే అమృతకు విశ్వాసం, ప్రేమాభిమానాలు ఎక్కువ. తన భర్తను చంపడంలో తన తల్లి కూడా తండ్రికి సహక రించిందని అమృత భావిస్తోంది.

తన తండ్రిని, ఆయన నియోగించిన ప్రణయ్ హంతకులను ఉరితీయాలని అమృత డిమాండ్ చేస్తోం ది. తన తండ్రి సంపాదించిన అక్రమాస్తులన్నిటినీ సంబంధిత ప్రజల్లో పంపిణీ చేయాలని, మిగతా న్యా యబద్ధమైన ఆస్తిని తనకు, తన తల్లికి సమానంగా పంచివ్వాలని మీడియా, హక్కుల బృందాలు, ఈ వ్యా స రచయితతో ఆమె స్పష్టంగా చెప్పింది. ప్రణయ్‌కు చెందిన  ‘ప్రేమ ప్రతిరూపం’ నిర్మాణాన్ని ఆర్య వైశ్య శక్తులు సహా కులాంతర వివాహ వ్యతిరేక దక్షిణ పక్ష శక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకే కులంలో వివాహాలు చేసుకునే విధానం హిందూ మత జీవ రక్తంగా ఉంది. ముమ్మారు అనే తలాక్‌ను రద్దుచేసి ఇస్లాం సంప్రదాయ సంకెళ్ల నుంచి ముస్లిం యువతు లకు విముక్తి కలిగించేందుకు గట్టిగా కృషి చేస్తున్న ఆరెస్సెస్/బీజేపీ శక్తులు కులాంతర వివాహాన్ని వ్యతిరే కించే శక్తులను సమర్థిస్తున్నాయి. అవే శక్తులు కేరళ లోని శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ళ స్త్రీల ప్రవే శాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు హిందూ మతంలో కాక, ఇస్లాం మతంలో మాత్రమే సంస్కరణలు కోరుకుంటున్న విషయాన్ని ఇది తెలియజేస్తుంది.

image


ఆధునిక భారత దేశంలో మహిళల స్థితిగతులను మార్చేందుకు సామాజిక సంస్కర్తలందరూ వివాహ వ్యవస్థను సమూలంగా మార్చక తప్పదు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. అయితే ఈ ఉద్యమం కులాంతర వివాహాల సమస్యను లేవనెత్తదు. ఆంధ్రప్రదేశ్‌లో కందుకూరి వీరేశలింగం లేదా బెంగాల్‌లో రాజారా మ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ విద్యాసాగర్ వంటి బాల్య వివాహ వ్యతిరేక ఉద్యమ కారులెవ్వరూ హిం దూ ధర్మానికి వ్యతిరేకమైన కులాంతర వివాహాల సమస్యను అసలు పట్టించుకోనేలేదు. సంస్కరణ ఎజెండాను ప్రకటించినప్పటికీ ఇంతవరకు కులాంతర వివాహాలను ఆరెస్సెస్ ప్రోత్సహించనే లేదు. ఈ మధ్యకాలం తెలంగాణలో కులాంతర వివాహ హత్య లు అధికంగా జరుగుతున్నప్పటికీ ఆరెస్సెస్-బీజేపీ శక్తులు ఒక్క బాధితుని కుటుంబాన్ని కూడా పరామ ర్శించలేదు. కుల వ్యతిరేక భావజాల చర్యల్లో కులాం తర వివాహం అత్యంత కీలకమైన ముందడుగుగా మహాత్మా ఫూలే, అంబేడ్కర్ వంటి కుల సంస్కరణ వాదులు గుర్తించారు. ఈ దిశగా అత్యంత గణనీయ మైన పురోగతిని పెరియార్ రామస్వామి నాయకర్ సాధించారు. ఆయన బహిరంగ సమావేశాల్లో వేలాది కులాంతర వివాహాలు జరిపించారు. ఆ విధంగా హిం దూ మతతత్వ శృంఖలాల నుంచి మహిళలకు విముక్తి కల్పించడంలో కులాంతర వివాహాలను ఒక విప్లవా త్మక ప్రతీకగా నిలిపారు. వధూవరులను ఆయన నల్ల బట్టలు వేసుకోవాలని మాత్రమే కోరే వారు. కేవలం దండలు మాత్రమే మార్చుకుని పెళ్ళితంతు ముగిం చి, ప్రభుత్వ కార్యాలయం రిజిస్టర్ చేసుకోవాలని ఆయన వారిని కోరేవారు. కులాంతర వివాహాల నిర్వహణ ద్వారా పెరియార్ రెండు లక్ష్యాలను సాధిం చినట్లయింది. ఒకటి-కుల సంస్కృతిని నిర్వీర్యం చేయడం, రెండు-మహిళల సమానత్వం. కులాంతర వివాహాలు చేసుకోవాలని ఆయన పెద్ద ఎత్తున ప్రచా రం నిర్వహించడమే కాకుండా, అలాంటి వివాహాలను ఒక ఉద్యమంలా నిర్వహించారు. పెరియార్ లాగా ఏ సంఘసంస్కర్త కులాంతర వివాహాలపై అంత కృషి చేయలేదు.

వైశ్య కులస్థులైన మహాత్మా గాంధీ సైతం సూత్ర బద్ధంగా కులాంతర వివాహాలను వ్యక్తిగత ఇష్టాయి ష్టాలకు సంబంధించిన అంశంగా ఆమోదించారు. తన ఆశ్రమంలో కొన్ని నిర్వహించారు. అయితే కులాంతర వివాహ ఉద్యమం నిర్వహించడం ఆయన ఎంచుకున్న ఎజెండా కాదు. ఆ రోజుల్లో చాలా కులాంతర వివా హాలు మధ్యతరగతి, ఉన్నత తరగతి వర్గాల్లోనే ప్రబ లంగా జరిగేవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉన్నత కులాల మధ్య జరిగిన కులాంతర వివాహా లపై అంత పెద్ద వ్యతిరేకత ఏర్పడలేదు. పర్యవసా నంగా ఒక విధమైన భద్రలోక్ రూపొందింది. భారత సమాజంలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఒక మహా సామాజిక సంస్కరణ రూపుదిద్దుకునేందుకు ఆధునిక విద్య దోహదం చేస్తోంది. ఈ దశలో దళిత యువకు నికి, అగ్రవర్ణ యువతులకు మధ్య జరిగే వివాహాలు అత్యంత ఉద్రిక్తపూరిత సమస్యల్లో ఒకటిగా మారింది. దళిత పిల్లలు చురుకుగా ఉంటే వారిని పెళ్ళి చేసుకు నేందుకు అగ్రవర్ణ ఆడపిల్లలు ఆసక్తి చూపుతున్నారు. పర్యవసానంగా రిజర్వేషన్ కోటా కింద ఉద్యోగాలు పొందుతున్నారు. సొంత కులంలోని మగవాళ్ళ కంటే దళిత అబ్బాయిలు వల్ల అగ్రవర్ణ అమ్మాయిలకు మ రింత స్వేచ్ఛ లభిస్తోంది. తన తండ్రి కోరికను తీవ్రం గా వ్యతిరేకిస్తున్న అమృత తానెందుకు ప్రణయ్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నానని వివరిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రణయ్ ప్రేమాస్పదుడైన భర్త మాత్రమే కాదు, అతని కుటుంబం మానవత్వం, నాగరికత కలిగి ఉందని ఆమె చెప్పింది. అగ్రవర్ణాలు నాగరికత కలవారని, వెనకబడిన కులాల వారు అనా గరికులని చెబుతున్న దానికి భిన్నంగా ‘నాగరికం’ అనే పదానికి నిర్వచనాన్ని ఆమె మార్చివేసింది. అనేక మీడియా సమావేశాల్లో, టీవీ ఇంటర్వ్యూల్లో తన జీవి తాన్ని అత్తమామల సంస్కృతి సంప్రదాయాలకు అను గుణంగానే గడుపుతానని, తన తల్లిదండ్రుల అణచి వేత సంస్కృతిని ద్వేషిస్తున్నానని ఆమె స్పష్టం చేసింది. 

కుల దురహంకార క్రూర హత్యాకాండను వ్యతరే కించిన అమృత భారతదేశపు ‘మలాలా’గా నిలిచింది. తన తండ్రికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఆమె పోరాడాలని, తన భర్త కోసం ‘ప్రేమ ప్రతి రూపాన్ని’ నిర్మించాలని అనుకుంటోంది. వాస్తవంలో అదొక గొప్ప లక్ష్యం. ఇండియాలో ‘ప్రేమ వివాహాలు వర్థిల్లాలి, కుల వివాహాల్ని ఉరితీయాలి’ అనే కొత్త నినాదం మారుమోగుతోంది. ప్రేమ కోసం చాలా మంది యువతీయువకులు బలవుతున్నారు. సమా జంలో వెల్లివిరుస్తున్న కొత్త ప్రేమ చైతన్యానికి సంబురాలు జరుపుకోవాలి. మిర్యాలగూడలో ‘ప్రేమ ప్రతిరూపం’ ఆవిష్కృతం కావాలని ఆశిద్దాం!

- కంచ ఐలయ్య షెఫెర్డ్బెల్జియం యువతితో విజయ్ లవ్ నిజమేనా..?

Updated By ManamThu, 09/20/2018 - 15:05

Vijay Devarakonda వరుస విజయాలతో సన్సేషనల్ హీరోగా వెలుతుగున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు అటు కోలీవుడ్‌లో నోటా అనే చిత్రంతో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కనపెడితే బెల్జియంకు సంబంధించిన ఓ యువతితో విజయ్ దేవరకొండ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

అయితే అవన్నీ ఫొటో మార్ఫింగ్ చేసిన ఫొటోలు అంటూ ఆ తరువాత కొంత మంది కొట్టివేశారు. కాగా.. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఆ యువతి కుటుంబం ఉన్న ఫొటో ఒకటి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. విజయ్ ఫ్యామిలీతో కూడా ఆ యువతి క్లోజ్‌గా ఉండటంతో ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ అని కొందరు, పెళ్లిచూపులు చిత్రం నుంచే వీరిద్దరికి పరిచయం ఉందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Vijay Devarakonda

 మా ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కలిగిందంటే

Updated By ManamTue, 09/11/2018 - 10:06

Priyanka Chopra, Nick Jonasగత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ఇటీవలే నిశ్చితార్ధం చేసుకొని తమ బంధాన్ని బలపరుచుకున్నారు. అయితే అసలు వారు ఎలా పరిచయం అయ్యారు..? వారిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు కలిగింది,  అనే విషయాలు పెద్దగా ఎవరికీ తెలీవు. వీటి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నిక్ జోనస్.

ప్రియాంక, తను కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యామని.. ఫస్ట్‌ మెసేజ్‌లతో సాగిన తమ బంధం ఆ తరువాత ఫోన్ కాల్స్‌తో ప్రేమ వరకు వచ్చిందని తెలిపాడు. ఇక తాము పర్సనల్‌గా కలవడానికి ఆరు నెలల సమయం పట్టిందని, ఫస్ట్‌ టైమ్ తామిద్దరం మెట్ గాలా ఈవెంట్‌లో కలిశామని పేర్కొన్నాడు. మొదట్లో మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉండేవారిమని, కానీ తమ మధ్య ఏదో ఉందని తమ స్నేహితులు అనుకుండేవారని చెప్పుకొచ్చాడు. అయితే ఐదు నెలల క్రితమే తమ రిలేషన్‌షిప్ పట్ల తాము సీరియస్‌గా ఉన్నామని ఫీల్ అయ్యామని, ఆ తరువాత వెంటనే ఎంగేజ్ అయిపోయామని నిక్ చెప్పాడు. ఇక ఇద్దరికీ కలిపి ప్రిక్ అని పెట్టిన పేరు తనకు నచ్చిందని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో వీరిద్దరు వివాహం చేసుకోవడానికి మరో రెండేళ్లు పడచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రేమికుడి కోసం సెల్ టవర్ ఎక్కిన యువతి

Updated By ManamFri, 07/13/2018 - 12:56

Jyothi ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగింది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలంకు చెందిన జ్యోతి.. తాను ప్రేమించిన భాస్కర్‌తో వివాహం చేయాలని వలిగొండలో మూడు రోజులుగా దీక్ష చేస్తోంది. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదంటూ భాస్కర్ ఇంటి ముందు కూడా ఆందోళనకు దిగింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం ఉదయం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. భాస్కర్‌తో తన పెళ్లి చేస్తేనే కిందికి వస్తానంటూ ఆమె అంటోంది.

కాగా జ్యోతి, భాస్కర్ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా చేస్తుండగా.. భాస్కర్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భాస్కర్‌, జ్యోతిని దూరం పెట్టడం.. ఆ తరువాత మరో వివాహానికి ఒప్పుకోవడం తెలిసిన ఆమె తాజాగా సెల్ టవర్ ఎక్కింది. ఇదిలా ఉంటే భాస్కర్ కానీ, అతడి కుటుంబసభ్యులు కానీ ప్రస్తుతం అక్కడ లేరని, వారి వివరాల కోసం ఆరా తీస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.నేను కూడా ప్రేమిస్తాను: వర్మ

Updated By ManamSat, 05/19/2018 - 15:14

varma వివాదాస్పద వ్యాఖ్యల్లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రముఖులపై ఆయన ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. అందుకు వారి అభిమానుల నుంచి ప్రతివిమర్శలు ఎదుర్కొంటారు. అయితే తాజాగా తనలో కూడా ప్రేమ ఉందని తెలిపాడు వర్మ. ఒక కుక్క పిల్లతో ఫొటోను తీసుకున్న రామ్ గోపాల్ వర్మ, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘‘నేను కూడా ప్రేమిస్తాను’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ‘ఆఫీసర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

 అవును ప్రేమలో ఉన్నా

Updated By ManamSat, 04/21/2018 - 11:26

Rakul రెండు సంవత్సరాల క్రితం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ స్టేటస్‌ను అనుభవించిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు దాదాపుగా తెలుగు ఇండస్ట్రీకే దూరం అయింది. అయినా తెలుగు ఇండస్ట్రీపై మాత్రం తన ప్రేమను చూపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ రిపోర్టర్.. మీరు ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నను. అవును తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో ప్రేమలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. దానికి రకుల్ కచ్చితంగా అంటూ సమాధానాన్ని ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రకుల్ తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. కాగా.. నాగ చైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’లో స్పెషల్ సాంగ్‌లో రకుల్ నటిస్తున్నట్లు వార్తలు రాగా, వాటిని ఆమె ఖండించిన విషయం తెలిసిందే.ప్రేమ పేరుతో వేధింపులు.. బ్లాక్‌మెయిల్.. పెళ్లి రద్దు!

Updated By ManamThu, 04/12/2018 - 12:15

love threats .. sexual assault

మేడ్చల్: ఏమీ తెలియని వయసులో పదో తరగతిని యువతిని ప్రేమ పేరుతో వంచించి.. లైంగికంగా వేధించాడో దుర్మార్గుడు. పాపం ఆ యువతి ఎవరికీ చెప్పుకోలేక.. తెలిస్తే ఎక్కడ తమ కుటుంబ పరువు రోడ్డున పడుతుందో అని భయపడి బాధనంతా తన కడుపులోనే దాచుకుంది. అప్పట్నుంచి యువతిని పలుమార్లు బెదిరించి లొంగదీసుకున్న దుండగుడు ఆఖరికి ఆమె వివాహం కూడా జరగకుండా నిలిపేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా, జవహర్‌ నగర్ నాగారం గ్రామంలో చోటు చేసుకుంది.

ఎస్సై సైదులు వివరాల ప్రకారం.. 
మేడ్చల్‌ జిల్లా నాగారం గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌యాదవ్‌, పక్కనే ఉన్న దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన యువతిని పదో తరగతి చదవుతున్నప్పట్నుంచి ప్రేమిస్తున్నాడంటూ వెంటపడ్డాడు. ఈ క్రమంలో పలుమార్లు ఇంట నుంచి బలవంతంగా బయటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడేవాడు. ఎవరికైనా చెప్పినట్లు తెలిస్తే మరుసటిరోజే చంపేస్తానని యువతిని బెదిరించేవాడు. దీంతో తీవ్ర భయాందోళనకు యువతి ఇంట్లో, ఫ్రెండ్స్‌కూ చెప్పలేక కుమిలిపోయింది. అలా పదో తరగతి నుంచి డిగ్రీవరకు ఆ కామంధుడు యువతిని వేధించసాగాడు. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న యువతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.

మంచి సంబంధం రావడంతో ఇరువైపుల పెద్దలూ కూర్చోని మాట్లాడుకుని ఏప్రిల్‌ 19న వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్.. మళ్లీ యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తనతో బయటికి వస్తావా లేకుంటే ఇది వరకు జరిగిన విషయాలన్నీ నిన్ను కట్టుకోబోయే వాడికి చెప్పాలా? అంటూ వేధించసాగాడు. చేసేదేమీలేక ఇంట్లో చెప్పలేక.. ఎక్కడ ఈ విషయాలన్నీ బయటపెడతాడో అని భయపడిన యువతి.. శ్రీకాంత్ చెప్పిందల్లా చేసింది. గత నెల 30న యువతికి ఫోన్‌చేసి తనతో బయటికి వస్తావా..? రావా..? అని బయపెట్టడంతో యువతి మళ్లీ శ్రీకాంత్‌తో కలిసి వెళ్లాల్సి వచ్చింది.

మేడ్చల్ నుంచి భువనగిరి ప్రాంతంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లిన దుండగుడు యువతిపై మరోసారి లైంగిక దాడి చేశాడు. అప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న శ్రీకాంత్.. ఇక ఆ యువతి జీవితాన్ని నాశనం చేయడమే తరువాయి అని భావించిన శ్రీకాంత్.. పెళ్లి కుమారుడికి ఫోన్ చేసి విషయాలన్నీ చెప్పేశాడు. దీంతో మీ అమ్మాయిని చేసుకోవట్లేదని పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి లోనైన యువతి తన తల్లిదండ్రులతో కలిసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి ఫిర్యాదు చేసిందని ఉన్నతాధికారి చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రీకాంత్‌‌ ఇంట్లోనుంచి పారిపోయాడని తెలిసింది. అతన్ని పట్టుకుని విచారిస్తామని అవసరమైతే కాల్ రికార్డ్స్ సేకరిస్తామని పోలీసులు చెుబుతున్నారు. ఈ కేసులో కాల్ రికార్డ్స్ కీలకంగా మారనున్నాయి. త్వరలో నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని.. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే చివరికేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.సాయిపల్లవి-రవితేజ రూమర్స్‌పై గంటా క్లారిటీ

Updated By ManamSat, 03/10/2018 - 12:49

Ravi Teja- Sai Pallavi Rumours

హీరోయిన్ సాయిపల్లవి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మళయాళ ‘ప్రేమమ్‌’తో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో మన ప్రేక్షకులను ఫిదా చేసేసింది. సాయి పల్లవి ముద్దు ముద్దు మాటలు, ఎక్స్‌ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను ఆమెకు పిచ్చ ఫ్యాన్ చేసేశాయి. అయితే ఒకట్రెండు సినిమాలతోనే పేరు తెచ్చుకున్న ఈ సాయిపల్లవిపై సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.

గత కొద్దిరోజులుగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ, హీరోయిన్ సాయిపల్లవి ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మంత్రి గంటా చెవిన పడటంతో ఆయన క్లారిటీ ఇచ్చేశారు. " ఇలాంటి విషయాలపై సాధారణంగా స్పందించను కానీ తప్పక క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ఇతరుల జీవితాలపై మచ్చ వేసేలా వార్తలు రాయడం తగదు. నా కుమారుడు రవితేజపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవం. గంటా రవితేజ, సాయిపల్లవిపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. నా కుమారుడు, సాయిపల్లవి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు" అని గంటా తేల్చిచెప్పేశారు. కాగా మంత్రి గంటా శ్రీనివాస్‌రావు కుమారుడు రవితేజ ఇటీవల ‘జయదేవ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

గతంలో.. 
ఇదిలా ఉంటే.. సాయి పల్లవి కోలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉందని సౌత్ ఇండస్ట్రీ మొత్తం గతంలో కోడైకూసిన సంగతి తెలిసిందే. ఆ రూమర్స్‌పైనే ఈ బ్యూటీ ఇంతవరకూ స్పందిచలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు రావడం.. దీంతో మంత్రి గంటా మీడియా ముందుకు రావడంతో ఈ రూమర్స్‌కు తెరపడినట్లైంది. చాలా వరకు రూమర్స్‌పై స్పందించడానికి సాయిపల్లవి మీడియా ముందుకు రాదన్న విషయం తెలిసిందే. అయితే ఏకంగా మంత్రి స్పందించారు గనుక సాయిపల్లవి కూడా స్పందించే అవకాశముంది.లవ్ వైరస్

Updated By ManamSun, 02/25/2018 - 00:52

‘జాతీ లేదు.. మతమూ లేదు..
కట్నాలేవీ కోరుకోదు ప్రేమ’

imageప్రేమ గొప్పదనాన్ని తెలిపే ఓ పాటలోని చరణం ఇది. కానీ ఇప్పటితరం మాత్రం అంత మెచ్యూర్డ్‌గా ఆలోచించడం లేదు. ఆకర్షణకు, ప్రేమకు తేడా తెలియని వయసులోనే ప్రేమలో పడిపోతున్నారు. బాయ్‌ఫ్రెండ్ / గాళ్‌ఫ్రెండ్ ఉండటాన్ని ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. లేకుంటే అదో వెలితిగా, చిన్నతనంగా చూస్తున్నారు. ప్రేమను ఒక నిత్యావసర వస్తువులా భ్రమిస్తున్నారు. ఈ ప్రేమ ఓ వైరస్‌లా వ్యాపిస్తోంది. కుగ్రామాలు మొదలు పట్టణాలు, నగరాలు, మెట్రోలు అన్న తేడా లేకుండా ‘ప్రేమికుల రాజ్యం’ విస్తరిస్తోంది. చాలామంది టీనేజ్‌లోకి రావడం ఆలస్యమన్నట్టు గాళ్‌ఫ్రెండ్ / బాయ్ ఫ్రెండ్‌ను కోరుకుంటున్నారు. పాఠశాల స్థాయి నుంచే ఈ ప్రేమాయణం మొదలవుతోంది. కాలేజీల్లో సంగతి చెప్పనక్కర్లేదు. పెళ్లిపీటల వరకూ నడిచే ప్రేమికుల కంటే మధ్యలో కటీఫ్ చెప్పేవారి సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ. ప్రేమ పేరుతో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.  

దారి తెన్నూ లేకుండా..
తమ పిల్లలు ప్రయోజకులు కావాలని, ఉన్నత స్థానానికి వెళ్లాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు. కానీ ఉజ్వల భవిష్యత్‌కు నిచ్చెనగా మారే వయసులో చాలామంది దారి తప్పుతున్నారు. దీనికి ప్రేమ కూడా ఓ కారణం. ప్రేమ పేరుతో విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అసలు లక్ష్యాన్ని మరిచి ఇదే జీవితమనే భ్రమలో గడుపుతున్నారు. చదువును నిర్లక్ష్యం చేసి.. ఫలితంగా ఉద్యోగాల వేటలో వెనుకబడుతున్నారు. పోనీ జీవితాంతం కలిసుంటారా అంటే చాలా తక్కువ. ప్రేమను సరదాగా భావించేవారే ఎక్కువ. ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో అనే భావించేవారు కొందరు.. ఒకరి కంటే ఎక్కువమందితో ప్రేమలో పడేవారు మరికొందరు.. ఎక్కడికక్కడ కటీఫ్ చెబుతూ కొత్త ప్రేమికులను వెతుక్కునేవారు.. ఇలా భిన్న మనస్తత్వాలు గలవారు ప్రేమకు అర్థాన్నే మార్చేస్తున్నారు.

యువతపై సినిమాల ప్రభావం
సినిమా అన్నాక అందులో హీరో హీరోయిన్లు.. వారి మధ్య ప్రేమ.. పాటలు ఉండాల్సిందే. ఇలాంటి సన్నివేశాలు లేని భారతీయimage సినిమాలు చాలా అరుదు. వీటి ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటోందని.. సినిమాల్లో చూపించినట్లుగా అత్యంత సులభంగా ప్రేమలో పడిపోయే అమ్మాయిలు, అబ్బాయిలు ఉండరన్న వాస్తవాన్ని గమనించలేకపోతున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం రేపిన ప్రియా వారియర్ కన్నుగీటే సన్నివేశం, పాట చూసి ఎంతోమంది అలా ప్రయత్నించారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లా ఉండాలని, ప్రేమ/ఆకర్షణ, ఆశయాల గురించి వివరంగా చెప్పాలని సూచిస్తున్నారు. 

ప్రేమ పేరుతో హింస 
ప్రేమించలేదని అమ్మాయిలను వేధించడం, దాడి చేయడం.. తనను ప్రేమించి మరొకరితో చనువుగా ఉంటోందని ఏకంగా చంపేయడం.. ప్రేమించి మోసం చేశాడని అమ్మాయిలు ఆందోళన చేయడం.. ప్రేమ పేరుతో వంచించి రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక భార్య/భర్తలు వివాహేతర సంబంధం పెట్టుకుని హత్య చేయించడం ఇలాంటి విషయాలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. 

జీవితాంతం తోడు నీడగా..
మొదటి లైన్‌లో సినీ కవి రాసినట్టుగా ప్రేమ.. కులమతాలకు, ప్రాంతాలకు, భాషలకు, జాతీయత, పేద/ధనిక తారతమ్యాలకు అతీతైవెునది. లక్ష్యం మరవని ప్రేమికులు, వివాహ బంధంతో ఒక్కైటెన వారు.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగినవారు.. జీవితాంతం తోడు నీడగా కలిసున్నవారు ఎందరో ఉన్నారు. కులాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నవారు.. భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా ఉన్నవారూ ఉన్నారు. 

image

ప్రేమలో 4 దశలు

1. భాగస్వామి ఎంపిక
ముందుగా మనతో కలిసి జీవించేవారు ఎవైరెతే సరైనవాళ్లో ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒక గది నిండా బోలెడంత మంది ఉన్నా.. వాళ్లలో ఎవరో ఒకరే మనల్ని బాగా ఆకర్షిస్తారు. మన జన్యువులు అవతలి వాళ్ల జన్యువులతో కలుస్తాయని శరీరం గ్రహించడం వల్లే ఆ ఆకర్షణ అనేది పుడుతుంది. దాన్ని సరిగ్గా గుర్తించి, అవతలి వాళ్లను ఎంచుకోగలగాలి.

2. ప్రేమలో పడటం
ప్రతివాళ్లూ దీని గురించే మాట్లాడుతారు. ఈ దశలో వాస్తవాలేంటో చూడం.. ప్రేమ గుడ్డిది. వాళ్లు మనవాళ్లు కావాలని ఆశిస్తుంటాం.మెదడులో ఉండే మోనోఐమెన్లు అనే రసాయనాల కారణంగా.. మనం ప్రేమలో పడతాం, లేదా అవతలివాళ్లతో ప్రేమలో పడినట్లు భావిస్తాం. అది నిజైమెన ప్రేమేనా.. కాదా అనే విషయాన్ని గుర్తించాలి. 

3. ప్రేమ నుంచి బయటపడటం
ప్రేమలో పడిన చాలామంది దాన్నుంచి బయట కూడా పడతారు. చాలా గాఢైమెన ప్రేమలో మునిగిపోయాం అనుకునేవాళ్లు సైతం ఒకోసారి ఆ ప్రేమ నుంచి బయటకు వచ్చేస్తారు. ఒక్కసారి ఆకర్షణ మాయైమెందంటే.. అవతలి వ్యక్తి మనకు నచ్చడం మానేస్తారు. అప్పుడు మన ఎంపిక తప్పన్న విషయం తెలుస్తుంది. ఎంత త్వరగా బయటకు వచ్చేస్తామా అని చూస్తామట.

4. నిజైమెన ప్రేమ
ఆకర్షణ ముగిసే సవుయానికి కూడా.. వాళ్లే మనకు సరైనవాళ్లని నిర్ణయించుకోగలిగితే మాత్రం అది అసలుసిసైలెన ప్రేమ అని అర్థం. మధ్యలో గిల్లికజ్జాలు వచ్చినా.. ఆ ప్రేమ కలకాలం నిలబడుతుందట. ఏళ్లు గడిచేకొద్దీ ప్రేమ మరింత బలోపేతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు వాళ్లు చిరకాలం తమ బంధాన్ని కొనసాగిస్తారని, అదే నిజైమెన ప్రేమ అని అంటున్నారు. 
 కలకలం: భాగ్యనగరంలో ఇద్దరు దారుణ హత్య

Updated By ManamTue, 01/30/2018 - 11:40

Two Murdered By Unknown Persons In Hyderabadహైదరాబాద్: భాగ్యనగరంలో రోజురోజుకు నేరాలు, ఘోరాలు ఎక్కువవుతున్నాయి. నిత్యం నగరంలో ఫలానాచోట దారుణం జరిగిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు మన పొరుగు రాష్ట్రాల్లో ఇలా జరుగుతోందని చెప్పుకోవాల్సిన పరిస్థితులుండేవి?.. అయితే గత ఏడాదిగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే పొరుగు రాష్ట్రాలకు నేరాల్లో ఏ మాత్రం తీసిపోమని స్పష్టమవుతోంది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఇద్దరు హత్యగావించబడ్డారు.

Women Brutally Killed

హయత్‌నగర్‌లో..
నగరంలోని హయత్‌నగర్‌లో అనూష అనే యువతి దారుణ హత్యకు గురైంది. అనూష తలపై బండరాయితో కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బీటెక్ పూర్తి చేసిన అనూష హయత్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటోంది. ఉద్యోగానికి కోచింగ్ కోసం అనూష హైదరాబాద్‌‌‌కు వచ్చింది. అనూష స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ. అయితే మూడు నెలల క్రితం మోహన్ అనే యువకుడితో నిశ్చితార్థం అయినట్లు తెలుస్తోంది. మోహన్ గత రెండు నెలలుగా అక్కను వేధిస్తున్నాడని ఈ హత్య కూడా అతనే చేసి ఉంటాడని మృతురాలి తమ్ముడు మీడియాతో చెప్పాడు. ఈ ఘటన జరిగినప్పట్నుంచి మోహన్ సెల్‌ఫోన్ కూడా స్విచాఫ్‌లో ఉండటంతో అనూష కుటుంబీకులు మరింత అనుమానం పెరిగింది.

స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అనూష ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? కుటుంబ గొడవల నేపథ్యంలో అనూష హతమార్చారా? లవ్ విషయంలో ఏమైనా చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా చుట్టుపక్కలున్న సీసీ ఫుటేజీ తీసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మహిళను చంపి.. మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి..!
నగరంలోని కొండాపూర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను హత్య చేసిన దుండగులు శవాన్ని మూటలో కట్టి గోనెసంచిలో పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కిరాతక చర్యతో కొండాపురం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీ రాంసాగర్ కాలనీ బొటానికల్‌ గార్డెన్ సమీపంలో అనుమానస్పద స్థితిలో రెండు మూటలను ఆగంతకులు వదిలివెళ్లారు. మార్నింగ్ వాక్ వచ్చిన వారు ఈ మూటలను అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన పోలీసులు గార్డెన్‌‌కు చేరుకొని మూటలను తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నారు. మూటలో మహిళను చంపి మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా చేసి వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు. 

రంగంలోకి దిగిన స్పెషల్ టీం.. మహిళ ఎవరు? ఎవరు చంపారు ఎందుకు చంపాల్సి వచ్చింది? అత్యాచారానికి పాల్పడి హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఈ ఘటన నాలుగు రోజుల కిందటే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీనీ పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. గత నాలుగైదు రోజుల్నుంచి రికార్డయిన దృశ్యాలను సేకరిస్తే ఏదైనా వాహనంలో వచ్చి మృతదేహాన్ని పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా మొత్తానికి చూసుకుంటే ఈ రెండు ఘటనల్లోనూ సీసీ ఫుటేజే కీలకంగా మారనుంది. త్వరలోనో ఈ రెండు కేసులనూ చేధిస్తామని పోలీసులు మీడియాకు చెబుతున్నారు.

Related News