marriage

జనవరిలో సౌందర్య రజనీకాంత్ పెళ్లి..?

Updated By ManamTue, 11/13/2018 - 11:06

Soundarya Rajinikanthసూపర్‌స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ రెండో పెళ్లికి సిద్ధమైందా..? త్వరలోనే రజనీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, నటుడు వికాసన్‌ను సౌందర్య వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబాలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఇద్దరి వివాహం జరగనున్నట్లు టాక్.

అయితే 2010లో ఇండస్ట్రియలిస్ట్ అశ్విన్‌ను సౌందర్య వివాహం చేసుకోగా.. మనస్పర్థల కారణంగా ఈ ఇద్దరు విడిపోయారు. వీరికి వేద్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. మరోవైపు వంజగర్ ఉలగమ్, సిగప్పు రోజక్కల్ 2 అనే చిత్రంలో నటించిన వికాసన్ పారిశ్రామిక వేత్త కూడా. అతడికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఆమెను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా

Updated By ManamMon, 11/12/2018 - 10:58

Varun Dhawanఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నానని తన ప్రేయసి గురించిన వివరాలను బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ వెల్లడించాడు. ప్రముఖ దర్శకనిర్మాత నిర్వహించే కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో కత్రినా కైఫ్‌తో పాటు వరుణ్ ధావన్ కూడా పాల్గొన్నాడు. 

అందులో తన లవ్ గురించి చెబుతూ.. ‘‘నేను నటాషాతో డేటింగ్ చేస్తున్నా. మేమిద్దరం పర్‌ఫెక్ట్ కపుల్. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’’ అంటూ వెల్లడించాడు. కాగా వరుణ్ చిన్నప్పటి స్నేహితురాలైన నటాషా.. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఓ సందర్భంలో నటాషా గురించి మాట్లాడిన వరుణ్.. ఆమె తనను చాలా అర్థం చేసుకుంటుందని, తనకు మంచి పార్ట్‌నర్ అని తెలిపిన విషయం తెలిసిందే. చూడాలి మరి త్వరలోనే ఈ జంట కూడా పెళ్లిపీటలెక్కనుందేమో.ఏప్రిల్లో మలైకా పెళ్లి..?

Updated By ManamTue, 11/06/2018 - 11:59

Mailaka Arora, Arjun Kapoorబాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ నెలలో దీపికా-రణ్‌వీర్ సింగ్.. వచ్చే నెలలో ప్రియాంక చోప్రా- నిక్ జోనస్‌ల వివాహం జరగనుండగా., తాజాగా మరో జంట పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న మలైకా అరోరా- అర్జున్ కపూర్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సన్నాహాలు కూడా మొదలైనట్లు సమాచారం.

కాగా మలైకా, అర్జున్ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకోవడానికి కూడా కారణం అర్జున్ అని అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. ఇక గతేడాది విడాకుల తరువాత అర్జున్- మలైకాలు కలిసి పలుమార్లు కెమెరాకు చిక్కారు. మరోవైపు వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు కూడా సమాచారం. కాగా 1998లో అర్బాజ్ ఖాన్‌ను మలైకా వివాహం చేసుకుంది. దాదాపు 19 సంవత్సరాలు ఈ ఇద్దరు కలిసి ఉన్నారు. వీరికి అర్హాన్ ఖాన్(15) అనే బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే.పెళ్లి సందడి మొదలైంది

Updated By ManamFri, 11/02/2018 - 15:04
Deepika Padukone

గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ ప్రేక్షపక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే పెళ్లితో ఒకటవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నెల 14, 15న ఇటలీలో వీరిద్దరి వివాహం జరగనుంది. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ వివరాలను దీపికా హెయిర్ స్టైలిష్ట్ షాలీనా నటానీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో కాషాయం రంగు పంజాబీ డ్రస్‌ను ధరించిన దీపికా మొహంలో పెళ్లి కల ఉట్టిపడుతోంది. ఇక మరోవైపు రణ్‌వీర్ ఇంట కూడా పెళ్లి పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాగా పద్మావత్ తరువాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న దీపికా.. త్వరలో ఇర్ఫాన్ ఖాన్ చిత్రంలో నటించనుంది. అలాగే షారూక్ ఖాన్ జీరోలో అతిథిపాత్రలో మెరవనుంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం సింబా(టెంపర్ రీమేక్‌), గల్లీ బాయ్‌లలో నటించనున్నాడు.

Deepika Padukone


ఆ పోస్ట్ పెళ్లి గురించేనా..!

Updated By ManamMon, 10/29/2018 - 13:27

Anushkaటాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్‌ లిస్ట్‌లో ఉన్న అనుష్క శెట్టి త్వరలో పెళ్లిపీటలెక్కనుందా..? ఈ ప్రశ్నను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఓ ఫొటో క్లూ ఇచ్చినట్లైంది. కాలి మెట్టెలుగా ఆకులను పెట్టుకున్న ఓ ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనుష్క. దానికి ‘క్యాప్షన్ అవసరం లేదు’ అంటూ ఓ కామెంట్ పెట్టింది. దీంతో త్వరలో పెళ్లి కబురు వినిపించబోతున్నారా..? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి అనుష్క పోస్ట్ వెనుక అసలు కారణమేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా ఈ ఏడాది మొదట్లో భాగమతి తరువాత అనుష్క ఏ చిత్రంలో కనిపించలేదు. సైజ్ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క ప్రస్తుతం దానిని తగ్గించుకునేందుకు సహజ సిద్ధమైన థెరపీలు తీసుకుంటుందని తెలుస్తోంది. త్వరలోనే అనుష్క ఇటు తెలుగులో నానితో కలిసి ఓ చిత్రంలో, అటు తమిళ్‌లో మాధవన్‌తో కలిసి మరో  సినిమాలో నటించనున్నట్లు టాక్.హీరో, హీరోయిన్ పెళ్లి డేట్‌ ఫిక్స్ 

Updated By ManamSun, 10/21/2018 - 17:12
Deepika Padukone And Ranveer Singh Are Getting Married In November

ముంబై : బాలీవుడ్‌లో హాట్ టాఫిక్‌ దీపికా పదుకోనె, రణవీర్ పెళ్లి వార్త. వీళిద్దరి పెళ్లిపై ఇప్పటికే చాలా వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఆ ఊహాగానాలకు హీరో, హీరోయిన్ పుల్‌స్టాఫ్ పెట్టేశారు. తమ వివాహ తేదీని రివీల్ చేసేశారు. ఇందుకు సంబంధించి దీపిక తన ట్విట్టర్‌లో ప్రకటన చేసింది. నవంబర్  14, 15 తేదీల్లో తమ వివాహం జరగనున్నట్లు ఈ జంట  వెల్లడించాయి.  ఇదే విషయాన్ని రణవీర్ కూడా షేర్ చేశాడు.

కాగా దీపిక పెళ్లి తేదీ ఫిక్స్ అయిందని, దీంతో పెళ్లి షాపింగ్‌లో ఆమె బిజీగా ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి కూడా. అయితే ఇప్పటికే డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ...తమ పెళ్లిపై మాత్రం పబ్లిక్‌గా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో హాట్ కపుల్ పెళ్లి వ్యవహారంపై రోజుకో వార్త వెలువడింది. 

అంతేకాకుండా దీపికా, రణవీర్ తమ కెరీర్‌పై దృష్టి పెట్టారని, ఆ తర్వాతే వివాహబంధం గురించి ఆలోచిస్తారనే వార్తలు వచ్చాయి. వీటన్నింటీ  ఒక్క ట్వీట్‌తో కొట్టిపారేస్తూ పెళ్లి వార్తను షురూ చేసేశారు. రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట ... స్క్రీన్‌పై ఫుల్ రొమాన్స్ పండించారు కూడా. అవును ఆ రోజే మా పెళ్లి: సైనా

Updated By ManamMon, 10/08/2018 - 13:26

Saina Nehwalహైదరాబాద్: పారుపల్లి కశ్యప్‌తో పెళ్లి వార్తలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పందించింది. డిసెంబర్ 16న తాము పెళ్లి చేసుకోబోతున్నామని సైనా తెలిపింది. డిసెంబర్ 20 తరువాత ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, ఆ తరువాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఉండటం వలన ఆ లోపే చేసుకోవాలని అనుకున్నామని పేర్కొంది. ఈ సందర్భంగా తన ప్రేమ ఎలా చిగురించిందో కూడా చెప్పుకొచ్చింది.

2007 నుంచి తామిద్దం టోర్నీల కోసం కలిసి ప్రయాణిస్తున్నామని, అప్పుడే తమ మధ్య ఆకర్షణ మొదలైందని సైనా తెలిపింది. అయితే కెరీర్‌లో బిజీగా ఉండటం వలన పెళ్లి గురించి ఇన్ని రోజులు ఆలోచించలేదని, ఇప్పుడు దానికి సమయం వచ్చిందని పేర్కొంది. ఇక ఇంట్లో వాళ్లకు తమ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం రాలేదని, వాళ్లే అర్థం చేసుకున్నారని సైనా చెప్పుకొచ్చింది.పుట్టినరోజు నాడే పెళ్లి ప్రకటన..?

Updated By ManamThu, 09/27/2018 - 11:28

Prabhasటాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్‌లలో ‘బాహుబలి’ ప్రభాస్ ఒకడు. అతడి వివాహం కోసం కుటుంబసభ్యులే కాదు అభిమానులు కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే అతడి వివాహంపై రూమర్లే తప్ప అధికారికి ప్రకటనలు మాత్రం రావడం లేదు. ఇలాంటి సమయంలో ప్రభాస్ పెళ్లి గురించి మరో వార్త తాజాగా టాలీవుడ్‌లో షికారు చేస్తోంది.

అదేంటంటే వచ్చే నెలలో(అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజు ఉండగా.. అదే రోజున అతడి పెళ్లి గురించి ప్రకటన చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈసారైనా ప్రభాస్ పెళ్లి వార్త నిజం అవుతుందో లేదో చూడాలి. కాగా బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహోలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి

Updated By ManamSat, 09/22/2018 - 13:28

Venkateshవిక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేశ్ కుమార్తె అశ్రిత వివాహానికి సన్నాహాలు ప్రారంభమైనట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు(మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి కుమారుడి)తో అశ్రిత వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేశ్ సోదరుడు సురేష్ బాబు... వరుడి నివాసానికి వెళ్లి ...పెళ్లి విషయాలు మాట్లాడినట్లు సమాచారం.

దీనికి సంబంధించిన ఇరు కుటుంబాల సభ్యులు వివాహాన్ని ఖరారు చేసుకున్నట్లు భోగట్టా. కాగా బేకరీ రంగంలో శిక్షణ తీసుకున్న అశ్రిత ఇన్ఫినిటీ ప్లేటర్ పేరుతో సిటీలో పలు స్టాల్స్‌ను నిర్వహిస్తోంది. కాగా వెంకటేశ్ ప్రస్తుతం ఎఫ్‌ 2 సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉండగా.. ఆయన హైదరాబాద్‌కు రాగానే కుమార్తె నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్లు చెప్పుకుంటున్నారు.

అయితే గతంలో అశ్రితను నాగార్జున రెండో కొడుకు,  హీరో అఖిల్ తో వివాహం జరిపిస్తారనే రూమర్స్ వినిపించాయి కూడా.  కాగా వెంకటేశ్ ఫ్యామిలీ మాత్రం ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే విషయం తెలిసిందే. రేర్ గా మాత్రమే వెంకటేశ్ తన కుటుంబసభ్యులతో బయటకు వస్తారు.ముంబై నటిపై అత్యాచారం..

Updated By ManamThu, 09/20/2018 - 15:25

TV actress alleges rape on promise of marriage, files complaint with Alwar policeముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేసినట్టు ముంబైకి చెందిన బుల్లితెర నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని నీమ్రానా ప్రాంతంలో సెప్టెంబర్ 4న చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బుల్లితెర నటి ముంబైలో నివసిస్తోంది. 2014లో ముంబైలో నటి, నిందితుడు ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో చాట్ చేస్తూ ఫోన్ నెంబర్లు మార్చుకొని గంటలకొద్ది మాట్లాడుకునేవారు.

ఈ క్రమంలో నిందితుడు ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. కొన్నిరోజుల తర్వాత ఢిల్లీలోని తన ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు ఆమెను పరిచయం చేశాడు. ఈ నెల 4న కారును అద్దెకు తీసుకొని అందులో బాధితురాలితో పాటు తన సోదరి, స్నేహితుడిని తీసుకొని హోటల్‌కు వెళ్లాడు. హోటల్ గదిలోకి తీసుకెళ్లిన అనంతరం పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి పలుమార్లు అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు నిందితుడికి ఫోన్ చేసి నిలదీసింది. అందుకు అతడు పెళ్లికి అంగకీరించలేదని బాధితరాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న అల్వార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Related News