marriage

ఈ నెలలోనే ‘కలర్స్’ స్వాతి పెళ్లి

Updated By ManamMon, 08/13/2018 - 12:47

Swathi ప్రముఖ నటి కలర్స్ స్వాతి త్వరలో ఏడడుగులు వేయనుంది. గత కొంత కాలంగా వికాస్ అనే వ్యక్తితో స్వాతి ప్రేమలో ఉండగా.. తాజాగా ఈ ఇద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపాయి. అంతేకాదు వీరి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆగష్టు 30న హైదరాబాద్‌లో వివాహం జరగనుండగా.. సెప్టెంబర్ 2న కొచ్చిలో రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం.

అయితే ఇండేనేషియా రాజధాని జకార్తాకు చెందిన వికాస్, మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో పైలెట్‌గా పనిచేస్తున్నారు. వివాహం తరువాత స్వాతి కూడా అక్కడే స్థిరపడనున్నట్లు తెలుస్తోంది. కాగా కలర్స్ అనే టీవీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన స్వాతి ఆ తరువాత డేంజర్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టా చెమ్మా, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, లండన్ బాబులు వంటి చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే.అబూ సలేం పెళ్లి పెరోల్ తిరస్కరణ

Updated By ManamTue, 08/07/2018 - 14:31

Abu Salemముంబై: పెళ్లి చేసుకునేందుకు 45రోజులు పెరోల్ అడుగుతూ గ్యాంగ్‌స్టర్ అబూ సలేం చేసుకున్న పిటిషన్‌ను ముంబై హైకోర్టు కొట్టివేసింది. 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడైన అబూసలేం ప్రస్తుతం తాలోజ జైల్‌లో యావజ్జీవ కారగారశిక్షను అనుభవిస్తున్నాడు. ముంబ్రాకు చెందిన కౌశర్ బెహ్రాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, అందుకు 45రోజుల పెరోల్ కావాలని అతడు దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని విచారించిన చీఫ్ జస్టిస్ విజయ కస్పే తహిల్రామని, జస్టిస్ మహేశ్ సోనక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అతడి పెరోల్‌ను కొట్టివేశారు. అయితే కౌశర్‌ను పెళ్లి చేసుకోవడం కోసం గతంలో కూడా రెండుసార్లు అబూ సలేం పిటిషన్ దాఖలు చేయగా, రెండుసార్లు తిరస్కరణకు గురైంది.

కాగా.. 2014లో కేసు విచారణ నిమిత్తం లఖ్‌నౌకు వస్తున్న అబూసలేం, ఆ ప్రయాణంలో ఫోన్‌లో కౌశర్ బెహ్రాను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఆమెను వివాహం చేసుకునేందుకు పెరోల్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉంటే గతేడాది కౌశర్ కూడా లోకల్ కోర్టులో ఓ పిటిషన్‌ను వేసింది. తనకు అబూ సలేంతో వివాహం జరగకపోతే చనిపోతానంటూ అందులో పేర్కొంది. దీనిపై ఇంకా విచారణ జరుగుతుంది. కాగా 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస దాడుల్లో 300మంది మరణించగా, 1400మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో అబూ సలేంను 2005లో పోలీసులు పోర్చుగల్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన లాడెన్ తనయుడు

Updated By ManamMon, 08/06/2018 - 10:07

ladenప్రపంచాన్ని వణికించిన అల్‌ఖైదా ఉగ్రసంస్థ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ వారసుడు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడని అతడి కుటుంబసభ్యులు వెల్లడించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హంజా గురించి అతడి కుటుంబ సభ్యులు సంచలన విషయాలు వెల్లడించారు. అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుక అతడు సిద్ధమయ్యాడని వారు వెల్లడించారు. ఇక 9/11 దాడులకు నేతృత్వం వహించిన మహ్మద్ అట్టా కుమార్తెను హంజా వివాహం చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. 

అయితే హంజాతో తమకు ప్రత్యక్ష సంబంధాలు ఏవీ లేవని వారు తెలిపారు. అయితే అల్‌ఖైదాకు జీవం పోసి మళ్లీ దాడులకు హంజా ప్రయత్నిస్తున్నాడని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అతడి ఆచూకీ తెలుసుకునేందుకు కొన్ని నిఘా సంస్థలు గత రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు హంజాను గతేడాది అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించింది.త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా.. మీరంతా రండి 

Updated By ManamThu, 08/02/2018 - 12:41

Shah Rukh త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా అంటూ మీడియా ప్రతినిథులకు షాక్ ఇచ్చాడు బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్. ఇటీవల ముంబైలో జరిగిన వోగ్ అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొన్న షారూక్ ఖాన్‌ను ప్రియాంక చోప్రా పెళ్లి విషయంపై వారు ప్రశ్నలు అడిగారు.

ఈ నేపథ్యంలో షారూక్ స్పందిస్తూ.. ‘‘ప్రియాంకనే కాదు నేను కూడా పెళ్లి చేసుకోబోతున్నాను. మీకు తప్పకుండా ఆహ్వాన పత్రికను పంపిస్తా. మెహందీ వేడుకతో పాటు రెసెప్షన్‌కు మిమ్మల్ని ఆహ్వానిస్తాను. మీరు తప్పకుండా రావాలి’’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడున్న సెలబ్రిటీలతో పాటు మీడియా ప్రతినిథులందరూ పగలబడి నవ్వుకున్నారు. అయితే ప్రియాంక చోప్రా, తన ప్రియుడు నిక్ జోనస్‌తో వివాహానికి సిద్ధమైనట్లు ఇటీవల బాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై వారు అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కాగా ప్రస్తుతం షారూక్ ఖాన్ జీరో అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారూక్ సరసన కత్రినా, అనుష్క నటించగా.. దీపికా పదుకునే, శ్రీదేవి తదితరులు అతిథి పాత్రలలో కనిపించనున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రియుడి పుట్టినరోజున ప్రియాంక వివాహం

Updated By ManamMon, 07/30/2018 - 13:26

Priyanka ప్రియుడు, అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లికి సిద్ధమైంది. ఈ క్రమంలో వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. నిక్ జోనస్‌ పుట్టినరోజైన సెప్టెంబర్ 16న వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దలు పనులు ప్రారంభించినట్లు సమాచారం. కాగా మరోవైపు వివాహం నేపథ్యంలో సల్మాన్ నటిస్తున్న భారత్ చిత్రం నుంచి ప్రియాంక తప్పుకున్న విషయం తెలిసిందే. ఇటలీలో పెళ్లి.. ముంబైలో రిసెప్షన్

Updated By ManamSat, 07/28/2018 - 11:52

ranveer, deepika బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్‌వీర్, దీపికలు త్వరలో పెళ్లిచేసుకోనున్నారా..? అంటే అవునంటున్నారు వారి సన్నిహితులు. ఈ నవంబర్‌ 10న ఈ ఇద్దరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర ఇటలీలోని లంబార్టీ అనే ప్రదేశంలో ప్రకృతి అందాల మధ్య ఈ ఇద్దరి వివాహం జరగనుందని సన్నిహితవర్గాలు తెలిపాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఈ ఇద్దరు వివాహం చేసుకోనున్నారట. దీనికి సంబంధించి అక్కడికి వెళ్లనున్న అతిథులందరి కోసం లాడ్జిలు, విల్లాలు ఇప్పటికే బుక్ చేశారని అంటున్నారు. ఇక ఆ తరువాత ముంబైలో అందరి కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

కాగా పద్మావతి తరువాత ఏ చిత్రాన్ని ఒప్పుకోని దీపికా.. ప్రస్తుతం పెళ్లి పనులు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు గల్లీబాయ్‌తో పాటు టెంపర్ రీమేక్‌లో నటిస్తున్న రణ్‌వీర్ ఈ రెండు చిత్రాలను నవంబర్‌లోగా పూర్తి చేయాలని భావిస్తున్నాడట. మరి ఈ వార్తలపై రణ్‌వీర్, దీపికా జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచో వస్తాయో ఏమో

Updated By ManamSat, 07/28/2018 - 11:01

Tamannaahఅమెరికాకు చెందిన డాక్టర్‌తో మిల్కీబ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా త్వరలో జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవి కాస్త తమన్నా దగ్గరకు వెళ్లడంతో వాటిపై స్పందించింది ఈ బ్యూటీ. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

‘‘ఒకరోజు నటుడితో, మరోరోజు క్రికెటర్‌తో, ఇప్పుడు డాక్టర్‌తో. ఇవన్నీ వింటుంటే నేను భర్తలను వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నననే భావన కలుగుతుంది. నేను ప్రేమలో ఉండాలని అనుకుంటున్నప్పటికీ.. నా వ్యక్తిగత విషయంలో వచ్చే ఇలాంటి అర్థం పర్థం లేని వార్తలను అస్సలు ప్రోత్సహించను.  ప్రస్తుతం నేను సింగిల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు నాకోసం వరుడిని వెతికే పనిలో లేరు. ప్రేమ అనే భావన ఇష్టమే కానీ, పర్సనల్ లైఫ్‌ని టార్గెట్ చేస్తూ ఇలాంటి రూమర్స్ పుట్టించడమే సరికాదు.

ప్రస్తుతం నేను సినిమాలకు సంబంధించిన వ్యవహారాలతో రొమాన్స్ చేస్తున్నాను. నా పనిలో నేను బిజీగా ఉంటే.. ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటాను నేను షూటింగ్‌లలో బిజీగా ఉంటే ఇలాంటి వార్తలన్నీ ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. ఈ వార్తలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఒకవేళ నా జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా నేనే ఈ ప్రపంచానికి చెప్తాను. నాపై వస్తున్న పెళ్లి వార్తలను నమ్మకండి. ఇవన్నీ కొందరి ఊహావార్తలు మాత్రమే’’ అంటూ తమన్నా పోస్ట్ చేసింది.అమెరికా కోడలు కానున్న తమన్నా..?

Updated By ManamWed, 07/25/2018 - 11:25

tamannaah టాలీవుడ్‌లో ఉన్న బ్యాచులర్ హీరోయిన్లల లిస్ట్‌లో మిల్కీబ్యూటీ తమన్నా ఒకరు. 28సంవత్సరాల వయసున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 13సంవత్సరాలు పూర్తి కాగా.. అప్పుడప్పుడు అడపాదడపా చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆమె కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నారని, ఈ క్రమంలో అమెరికాకు చెందిన డాక్టర్‌ను తమన్నా కోసం ఓకే చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరికి నిశ్చితార్ధం జరిపి, ఆ తరువాత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే తమన్నానే స్పందించాలి. కాగా ప్రస్తుతం తమన్నా ‘క్వీన్’ తెలుగు రీమేక్‌తో పాటు తెలుగులో ‘ఎఫ్-2’లో నటిస్తున్న విషయం తెలిసిందే.హీరోను పెళ్లాడిన హీరోయిన్ మదాలస శర్మ

Updated By ManamTue, 07/10/2018 - 17:15
Mahaakshay Chakraborty

చెన్నై : అర్థాంతరంగా నిలిచిపోయిన బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్ష‌య్ వివాహం ఎట్టకేలకు జరిగింది. దక్షిణాది నటి మదాలస శర్శను మహాక్షయ్ మంగళవారం పెళ్లాడాడు. తమిళనాడు ఊటీలోని మిథున్ చక్రవర్తికి చెందిన హోటల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. కాగా తనతో సహజీవనం చేసి, బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ మహాక్షయ్‌పై ముంబైకి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

అతడితో పాటు మిథున్ భార్యపై కూడా కేసు నమోదు అయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, నిన్న బెయిల్‌పై విడుదల అయ్యాడు. కాగా మదాలస శర్మతో మహాక్షయ్ పెళ్లి ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. అయితే పోలీసులు అతడిని చివరి నిమిషంలో అరెస్ట్ చేయడంతో ఆ వేడుక నిలిచిపోయింది. 

మదాలస శర్మ తెలుగులో.. ఫిట్టింగ్‌ మాస్టర్, ఆలస్యం అమృతం, మేం వయసుకు వచ్చాం, చిత్రం చెప్పిన కథ వంటి పలు చిత్రాల్లో నటించింది. అలాగే తమిళ, కన్నడ చిత్రాల్లోనూ ఆమె నటించింది. కాగా మహాక్షయ్, మదాలస శర్మ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి పందిరిలో ఊహించని విషాదం.. అరుంధతీని చూస్తూ..!

Updated By ManamSat, 07/07/2018 - 16:26

Shocking! Bride Dies During Marriage Ceremony in Nagar Kurnool

నాగర్ కర్నూలు:  మూడు ముళ్లతో ఏడడుగులు వేసి నిండు నూరేళ్లు భర్త నీడన చల్లగా జీవితం చల్లగా వెళ్లిపోతుందని ఎన్నో కలలు కన్న ఆ నూతన వధువు అరుంధతీ నక్షత్రం చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కాసేపట్లో వివాహ తంతు పూర్తై అత్తారింట్లో అడుగుపెడుతుందనగా ఊహించని విధంగా విధి కాటేసింది. దీంతో ఎంతో సందడిగా వధువు, వరుడి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వధువును ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఆమె తుదిశ్వాస విడిచిందని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రి ఆవరణలో ఆర్తనాదాలు మిన్నంటాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది. 

ఓ వైపు చుట్టూ జనం.. మరో వైపు ఫొటోలతో హడావుడి పెళ్లి పందరంతా ఆనందంలో మునిగి తేలుతుండగా .. ఇదిగో అరుంధతీ.. అంటూ పంతులు ఆకాశం వైపు వేలు చూపిస్తుండగా హఠాత్తుగా బుజ్జి కుప్పకూలిపోయింది. కాగా.. అసలేం జరిగిందో తెలియరాలేదు. అరుంధతీ నక్షత్రం చూస్తూ చనిపోవడమేంటని అందరూ చర్చించుకుంటున్నారు. అల్లారు ముద్దుగా బుజ్జి పెంచిన తల్లిదండ్రులు ఉన్నంతలోనే కట్నకానుకలిచ్చి గ్రాండ్‌గానే వివాహం చేశారు. కానీ ఇంతలో విధి ఆడిన వింత నాటకంతో బుజ్జి తిరిగిరానిలోకాలకు చేరుకుంది.

గుండెపోటుతోనే నవ వధువు మరణించిందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టంలో అసలేం జరిగిందనే విషయం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. అయితే అమ్మాయి ఇప్పటి వరకూ ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అరుంధతీ చూస్తూ భర్త కాళ్ల మీద పడి కుప్పకూలిపోవడం పలువుర్ని కంటతడిపెట్టిస్తోంది.

Related News