ram

మనుషుల్లాగా ప్రవర్తిద్దాం..

Updated By ManamTue, 09/18/2018 - 04:53
  • ప్రణయ్ హత్యపై సినీ నటులు మనోజ్, రామ్ స్పందన  

imageహైదరాబాద్: అగ్రకులానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడంతో పరువు హత్యకు గురైన  ప్రణయ్ హత్యకు గురికావడంపై సినీ హీరోలు మంచు మనోజ్, రామ్ ట్విట్టర్ ద్వారా తమ స్పందను తెలిపారు. ‘ కుల పిచ్చి కారణంగా ఓ పసిగుడ్డు లోకాన్ని చూడకముందే తండ్రిని కోల్పోయిందని, మనుషుల్లాగా ప్రవర్తిద్దామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కుల పిచ్చిపై ఆధారపడిన సినీ నటులు, రాజకీయ పార్టీలు, కాలేజ్ యూనియన్లు, కుల, మత సంస్థలు ఉండడం అనాగరికం. వీటిని సమర్ధించే వారు ప్రణయ్ హత్యకు బాధ్యత వహించాలి.

ఈ లోకాన్ని చూడని, తండ్రి స్పర్శను తెలుసుకోక ముందే ఓ పసిగుడ్డు తండ్రిని కోల్పోయింది. మనమంతా ఒకే సమాజంలో జీవిస్తున్నాం. అలాంటప్పుడు కులం పేరుతో వివక్ష ఎందుకు? కులాన్ని ప్రేమించేవారు, సపోర్ట్ చేసే వారిని చూసి సిగ్గుపడాలి. మనుషుల్లాగా ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా అర్థిస్తున్నా. ప్రణయ్ భార్య అమృత, అతని కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రణయ్ మృతిపట్ల  నా ప్రగాడ సంతాం. మీ ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ ఓ భావోద్వేగైమెన లేఖను మనోజ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘ఒక పక్క సెక్షన్ 377ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు అందరూ ఒకటే అని తీర్పు చెప్పినప్పుడు ఈ కులాలు, మతాలు, పరువు హత్యలు ఏంటి? జంగిల్ ఫెలోస్. ముందు మనుషుల్లాగా ప్రవర్తించడం నేర్చుకోండి’’ అంటూ ప్రణయ్ హత్యపై రామ్ ఘటుగా స్పందించారు.రామ్, దుల్కర్ మల్టీస్టారర్.. దర్శకుడు అతడేనా..?

Updated By ManamFri, 09/14/2018 - 13:38

Ram, Dulquerటాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు క్రేజ్  పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలలో నటించేందుకు యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, మలయాళ స్టార్  దుల్కర్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రంలో తెరకెక్కనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మించనున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం రామ్ హలో గురు ప్రేమకోసమే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ తమిళ, మలయాళ సినిమాలలో బిజీగా ఉన్నారు.మల్టీస్టారర్‌లో రామ్..?

Updated By ManamTue, 09/11/2018 - 14:53

Ram   అన్ని ఇండస్ట్రీలలో మల్టీస్టారర్ల హవా పెరిగిపోతోంది. దీంతో మల్టీస్టార్లర్ చిత్రాలలో నటించేందుకు యంగ్ హీరోలు మొదలుకొని సీనియర్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో రామ్ కూడా మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. స్రవంతి రవికిశోర్ నిర్మించబోయే ఈ చిత్రంలో ఓ తమిళ హీరోతో పాటు రామ్ నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం రామ్ హలో గురు ప్రేమ కోసమే అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.‘హలో గురు ప్రేమ కోసమే’ టాకీ పార్ట్ పూర్తి

Updated By ManamMon, 09/10/2018 - 14:17

Hello Guru Prema Kosameరామ్ హీరోగా నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. గత కొన్ని రోజులుగా ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టాకీ పార్ట్ పూర్తైంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది. ఇక మిగిలిన పనులను కూడా పూర్తి చేసుకొని అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది.

రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ నటించగా.. ప్రకాశ్ రాజ్, ప్రణీత కీలక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.‘హలో గురు ప్రేమకోసమే’కు రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamWed, 07/11/2018 - 13:15
HGPK

రామ్ హీరోగా ‘నేను లోకల్’ ఫేం త్రినాథరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదిని ఖరారు చేశారు దర్శకనిర్మాతలు. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ మరోసారి నటించగా.. ప్రకాశ్ రాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. హైపర్, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి పరాజయాలలో ఉన్న రామ్ ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు.రామ్ మూవీకి మొదలైన మ్యూజిక్ సిట్టింగ్స్

Updated By ManamWed, 05/30/2018 - 11:51

HGPKరామ్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్‌ను ప్రారంభించేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తుండగా శ్రీమణి సాహిత్యాన్ని ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అయితే డేట్స్ కుదరక ఈ మూవీ నుంచి దేవీ శ్రీ ప్రసాద్ తప్పుకున్నట్లు.. ఆ స్థానంలో థమన్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటికి తెరదించుతూ దేవీ శ్రీనే మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యాడు. కాగా ఇంతకుముందు రామ్, దేవీ కాంబినేషన్లో వచ్చిన ‘రెడీ’, ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలు విజయాన్ని సాధించడంతో ఈ మూవీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.దేవీనే కావాలంటున్న దిల్ రాజు..?

Updated By ManamFri, 05/25/2018 - 13:27

hgpk టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌కు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా మూవీ పోస్టర్‌లో దేవీ పేరు ఉందంటే ఆ సినిమా సగం హిట్ అని పలువురు అభిప్రాయపడుతుంటారు. అందుకే కొంచెం డిమాండ్ ఎక్కువైనా అతడినే తమ సినిమాలకు తీసుకోవాలని చూస్తుంటారు దర్శకనిర్మాతలు. 

అయితే ఇటీవల విదేశీ టూర్లపై మక్కువ చూపిస్తున్న దేవీ శ్రీ ప్రసాద్ తనకు వచ్చిన కొన్ని సినిమాలను వదులుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చిత్రం హలో గురు ప్రేమ కోసమే నుంచి దేవీ తప్పుకున్నాడని, ఆ స్థానంలో థమన్ వచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మళ్లీ దేవీనే ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయినట్లు తెలుస్తోంది. మామూలుగా ఈ చిత్రాన్ని ఆగష్టులో కానీ సెప్టెంబర్‌లో కానీ విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావించాడట. ఆ సమయంలో దేవీకి యూఎస్ టూర్ ఉండటంతో చేయలేనని చెప్పేశాడట. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని దసరా తరువాత విడుదల చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడట. ఆ సమయంలోగా దేవీ టూర్ కూడా ముగియనుండటంతో ఎలాగైనా అతడినే ఒప్పించాలని దిల్ రాజు భావిస్తున్నాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ నటిస్తుండగా.. త్రినాథరావు దర్శకత్వం వహించనున్నాడు. రామ్ సరసన పవన్ హీరోయిన్..?

Updated By ManamWed, 04/11/2018 - 13:01

Pranitha, Ram హీరో రామ్ ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మెయిన్ హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ను ఎప్పుడో ఫైనల్ చేశారు. కాగా.. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో రెండో హీరోయిన్‌గా ప్రణీతను ఎంపికను చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘బ్రహ్మోత్సవం’ తరువాత తెలుగులో అస్సలు కనిపించకుండా పోయిన ప్రణీత.. ఆ తరువాత తమిళ్, కన్నడ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఒకవేళ ఇదే నిజమైతే ఆమెకు తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లే. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా, దేవీ శ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు. జూలైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.రామ్‌కు హీరోయిన్‌ ఫిక్స్ 

Updated By ManamWed, 03/21/2018 - 11:45

Ram, Kajal గతేడాది 'ఉన్నది ఒక్కటే జిందగీ'తో యావరేజ్ హిట్‌ను సొంతం చేసుకున్న రామ్.. ప్రస్తుతం నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు రామ్.

ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ మూవీలో రామ్ సరసన హీరోయిన్‌గా కాజల్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కాజల్ అగర్వాల్ కాల్షీట్లను కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వెనిగల్ల ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే రామ్, కాజల్ కాంబినేషన్‌లో ఇంతకుముందు గణేష్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.సెట్స్‌పైకి 'హలో గురు ప్రేమకోసమే'

Updated By ManamMon, 03/12/2018 - 09:51
Hello Guru Prema Kosame

రామ్ హీరోగా త్రినాథరావు తెరకెక్కిస్తున్న చిత్రం 'హలో గురు ప్రేమకోసమే'. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సోమవారం సెట్స్ మీదకు వెళ్లింది. ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ రెండో సారి జోడీ కడుతుండగా.. ప్రకాశ్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. జూలైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

Related News