tirumala

తిరుమల సమాచారం

Updated By ManamSat, 05/26/2018 - 08:39

tirumala  తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి 26గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా శుక్రవారం 73,727 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 54,490 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఇదిలా ఉంటే వేసవి సెలవుల సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతుండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు.రంగంలోకి స్వామి

Updated By ManamTue, 05/22/2018 - 21:55
  • సుప్రీంకోర్టుకు వెళ్తానన్న ఎంపీ సుబ్రమణ్యం స్వామి

  •  కులదైవం అంటూనే నామాలు: భూమన కరుణాకర్‌రెడ్డి

  • ఇప్పటికే కోర్టును ఆశ్రయిస్తున్న సామాన్య భక్తులు

Tirumalaతిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) మాజీ ప్రధాన అర్చకులు, టీటీడీపై చేసిన ఆరోపణలపై విచారణకు డిమాండు చేస్తూ పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. దాంతో ఈ వివాదం రోజురోజుకూ మరింత పీటముడి పడుతోంది. నిత్యం స్వామి వారి సేవలో ఉండే  అర్చకులు అధికారులపై ఆరోపణలు చేస్తుంటే విచారణ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కొన్ని రోజులుగా టీటీడీ వ్యవహారాలను గమనిస్తున్నానని, రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేయనున్నట్లు ప్రముఖ న్యాయవాది, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కరుణాకర్ రెడ్డి కూడా.. అర్చకులను వేధింపులకు గురిచేయడం సరికాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు వేంకటేశ్వరస్వామి తమ కులదైవం అంటూనే, ఆయనకే నామాలు పెడుతున్నారని విమర్శించారు. వీరితోపాటు సామాన్య భక్తుల నుంచి కూడా రమణ దీక్షితులుకు మద్దతు పెరుగుతోంది. పలువురు భక్తులు ఈ వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకుని వెళ్లేందుకు సంసిద్ధులవుతున్నారు. ఇప్పటికే స్వయంగా న్యాయవాది అయిన ఓ భక్తుడు ఈ విషయమై కోర్టును ఆశ్రయించారని కూడా సమాచారం. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన పోరాట యాత్ర మూడోరోజున శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుతూ రమణ దీక్షితులు గత 25 ఏళ్లుగా వేంకటేశ్వర స్వామి సేవలో ఉన్నారని, అలాంటి వ్యక్తి చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. గతంలో ఎన్నోసార్లు రమణ దీక్షితుల నుంచి ఆశీర్వచనాలు పొందిన చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధికోసం ఆయనను బలి చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై భక్తులకు కూడా పలు అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నా రు. త్వరలోనే ప్రభుత్వం ఈ ఆరోపణలకు నిగ్గు తేల్చకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. 

సుప్రీంకోర్టుకు వెళతా: సుబ్రమణ్యం స్వామి 
సుబ్రమణ్యం స్వామి పేరు చెబితే రాజకీయ నాయకుల్లోనే కాదు, అధికారుల్లో కూడా వణుకు మొదలవుతుంది. బోఫోర్సు కుంభకోణం నుంచి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు వరకు సుబ్రమణ్యం స్వామి కోర్టులో పిటిషను దాఖలు చేసి, ముఖ్యమంత్రులను కేంద్రమంత్రులను జైలుకు పంపిన ఘనత ఆయనదే. ప్రస్తుతం బీజేపీ ఎంపీ అయిన స్వామి సైతం రమణ దీక్షితులు అంశంపై స్పందించారు. రమణ దీక్షితులును పదవీచ్యుతున్ని చేసిన వ్యవహారాన్ని సరిదిద్దుకోకపోతే టీటీడీ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేస్తానని హెచ్చరించారు. ఈవేురకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు టీటీడీ నిధులు దుర్వినియోగం కావడంపై సీబీఐ విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరనున్నట్లు తెలిపారు. అదే విధంగా టీటీడీని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరనున్నట్లు చెప్పారు. 

బాబు ఆడిస్తున్న నాటకమే: కరుణాకర్ రెడ్డి
టీటీడీలో రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై స్పందించకుండా, ట్రస్టుబోర్డు చైర్మన్, ఈవోలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ మిరాశీలు చేపట్టిన ఆ నాలుగు కుటుంబాల కైంకర్య దీక్షలతోనే తిరుమల దివ్య క్షేత్రానికి అనంత ప్రాధాన్యం వచ్చిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు హిందూ సంప్రదాయాలను దెబ్బకొట్టి బౌద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తమకు కులం దైవం వేంకటేశ్వర స్వామి అంటూనే ఆయనకే నామాలు పెడుతున్నారని అన్నారు. శ్రీవారి ఆలయం మీద కార్యనిర్వహణాధికారి పెత్తనవేుమిటని ప్రశ్నించారు.  గతంలో బ్రిటిష్‌వారు, మహ్మదీయులు కూడా శ్రీవారి ఆలయంలో పెత్తనం చెలాయించలేదని, వారు కేవలం పరిపాలనా కార్యక్రమాలను మాత్రమే చేపట్టారని అన్నారు. శ్రీవారిపోటులో ఏం జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలియాలని అన్నారు. తిరువాభరణ రిజిస్టరును సంభావన అర్చకుడు ప్రదర్శించటవేుమిటని అన్నారు. ఆభరణాలు కనిపించడం లేదన్న ఘటనతో పాటు అర్చకులపై చేస్తున్న ఆరోపణలపైన కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండు చేశారు. వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, దానిపైన పెత్తనం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 11 నెలల తరువాత ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వస్తుందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ నాలుగు కుటుంబాలకు సమున్నత స్థానం కల్పిస్తామన్నారు. వైఖానస కుటుంబాల వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. స్వార్థం  కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సీఎం చంద్రబాబు వేంకటేశ్వర స్వామిని ఉపయోగించుకుంటున్నాడని తెలిపారు. శ్రీవారి నగలు ప్రదర్శించడానికి మేము సిద్ధమే

Updated By ManamTue, 05/22/2018 - 15:08

Singhal తిరుమల: టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని, అన్ని అంశాలపై చట్టపరంగా ముందుకెళ్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం మాట్లాడిన సింఘాల్.. శ్రీవారి నగలన్నీ సురక్షితంగా ఉన్నాయని అన్నారు. 1952 నుంచి శ్రీవారి నగలకు సంబంధించిన రికార్డులన్నీ తమ వద్ద ఉన్నాయని, 2011 జనవరిలో వేసిన రిటైర్డ్ జడ్జీల కమిటీ నివేదిక ప్రకారం శ్రీవారి ఆభరణాలన్నీ అలానే ఉన్నాయని తెలిపారని ఆయన అన్నారు.

అయితే అందులో శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన నగలు ఏవో కమిటీ తేల్చలేకపోయిందని తెలిపారు. శ్రీవారి ఆభరణాల జాబితాను ఇప్పటికే సీఎంకు ఇచ్చామని, శ్రీవారి నగలు ప్రదర్శించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి నగలను ప్రదర్శిస్తామని తెలిపారు. బూందీపోటు దగ్గర ఎలాంటి తవ్వకాలు జరగలేదని ఆయన వెల్లడించారు. 

కాగా టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాట్లడుతూ.., ఇటీవల జెనీవాలో వేలం వేసిన గులాజీ రంగు వజ్రం శ్రీవారిదేనంటూ రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేశారని, అయితే అసలు అలాంటి వజ్రమే స్వామివారికి ఉన్నట్లు లెక్కల్లో లేదని లేని వజ్రాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.శ్రీవారి ఆభరణాలు అప్పటికే మాయమయ్యాయి

Updated By ManamTue, 05/22/2018 - 14:15

tirumala తిరుమల: 2011లో శ్రీవారి ఆభరణాలను తనిఖీ చేశామని, శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి శాసనాల ఆధారంగా ఆభరణాలెన్నో పరిశీలించామని, శ్రీవారికి సంబంధించిన చాలా ఆభరణాలు ఆనాటికే కనుమరుగయ్యాయని పురావస్తు శాఖ మాజీ డైరక్టర్ చెన్నారెడ్డి అన్నారు. ఆ ఆభరణాలపై ఇప్పటి ప్రభుత్వాలకు గానీ, గత ప్రభుత్వాలకు గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రమణ దీక్షితులకు ఇబ్బంది వచ్చింది కాబట్టే ఆయన మాట్లాడుతున్నారని చెన్నారెడ్డి విమర్శించారు. పురావస్తు శాఖ పరిధిలోకి టీటీడీని తీసుకుంటే ఇబ్బందేమీ లేదని, ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలంటే తాము సలహాలిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే తిరుమలలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని, ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ ఏ కార్యక్రమం జరగడం లేదని, శ్రీవారి నిధులు తప్పుదారి పడుతున్నాయని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.తిరుమల సమాచారం

Updated By ManamTue, 05/22/2018 - 07:51

tirumala  తిరుమల: తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి ఆలయానికి భక్తులు తాకిడి పెరిగింది. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు అన్ని నిండగా.. వెలుపల భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి సర్వదర్శనానికి 57గంటల సమయం పడుతోంది. ఇక తిరుమతిలో రెండో రోజు గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంస వాహనంపై స్వామి వారు విహరించనున్నారు.జెనీవాలో వేలానికి వచ్చిన వజ్రం శ్రీవారిదేమో: రమణ దీక్షితులు

Updated By ManamSun, 05/20/2018 - 13:56

ramana  తిరుమల: శ్రీవారి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, టీటీడీ అధికారుల మధ్య వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. తిరుమల కొండపై ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలను పక్కనపెట్టి టీటీడీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఇటీవల రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేయగా.. దానిపై తాజాగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. టీటీడీలో అన్ని కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని, స్వామి వారి ఆభరణాలన్నీ భద్రంగా ఆయన అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు చేసి కాసేపు అవ్వకముందే టీటీడీ గురించి మరోసారి సంచలన విషయాలను బయటపెట్టారు రమణ దీక్షితులు.

తిరుమల తిరుపతి ఆలయంలో 1996 నుంచి ఆభరణాలకు భద్రత కరువు అయ్యిందని రమణ దీక్షితులు ఆరోపించారు. 1996లో మీరాశి రద్దు కావడంతో ఆభరణాలను టీటీడీ స్వాధీనం చేసుకుందని ఆయన అన్నారు. స్వామివారి ఆభరణాలలో ఐదు పేటల వజ్రాలు పొదిగిన ప్లాటినం హారంలో గులాబీ రంగు వజ్రం ఉండేదని ఆయన అన్నారు. గరుడసేవలో భక్తులు విసిరిన నాణేలకు వజ్రం పగిలిందని రికార్డుల్లో రాశారని, నాణేలకు ఎక్కడైనా వజ్రం పగులుతుందా? అంటూ ప్రశ్నించారు. ఇటీవల జెనీవాలో ఓ గులాబీ రంగు వజ్రం వేలానికి వచ్చిందని, ఆ వజ్రం అదేనని తన అనుమానమని ఆయన పేర్కొన్నారు. 22 ఏళ్లలో ఎన్నో మణులు, మాణిక్యాలు శ్రీవారిని దాటి వెళ్లిపోయానని, వీటిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని రమణ దీక్షితులు తెలిపారు. 

అపచారాల నుంచి స్వామివారే భక్తులను కాపాడాలి
అయినా మరమ్మత్తుల కోసం 25రోజులు పోటును ఎందుకు మూసేశారని, ఎవరి సలహాలు తీసుకోకుండానే మరమ్మత్తులు ఎలా చేస్తారని రమణ దీక్షితులు అన్నారు. ప్రసాదం బయట చేసి తీసుకురావడం ఆగమశాస్త్ర విరుద్ధమని, ప్రసాదం తయారు చేశాక నైవేద్యం పెట్టేవరకు వంటమనిషి, అర్చకులు తప్ప దానిని ఎవరూ చూడకూడదంటూ తెలిపారు. అర్చకులంటే టీటీడీకి ఎప్పటికీ చులకన భావం ఉంటుందని, అపచారాల నుంచి స్వామివారిని భక్తులే కాపాడాలని రమణ దీక్షితులు పేర్కొన్నారు. ఇనుప నిచ్చెన మీద స్వామివారిని మండంపైకి తరలిస్తున్నారని, స్వామి వారికి ఇనుము తాకితే అపరాధమని, తేజస్సు పోయి అనగ్రహం లభించదని చెప్పారు.

 శ్రీవారికి నలుగురు కొత్త ప్రధాన అర్చకులు

Updated By ManamFri, 05/18/2018 - 07:57

Tirumala తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా పని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలపై ఆరోపణలు చేసిన ఎ.వి.రమణదీక్షితులపై వేటు పడింది. ప్రధాన అర్చక స్థానం నుంచి ఆయనన తొలగిస్తూ గురువారం టీటీడీ నిర్ణయం తీసుకుంది. మరోపక్క ఒకేసారి నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది. దేవస్థానం చరిత్రలో ఒకేసారి నలుగురు ప్రధాన అర్చకులను నియమించడం ఇదే తొలిసారి. 

పూర్వపు మిరాశీ వ్యవస్థ కింద గొల్లపల్లి కుటుంబం నుంచి వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి వంశీయుల నుంచి కృష్ణ శేషాచల దీక్షితులు, పెద్దింటి కుటుంబం నుంచి శ్రీనివాస దీక్షితులును బుధవారమే నియమించగా తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులను నియమిస్తూ గురువారం టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. వారందరూ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. అలాగే ఆలయంలో పని చేస్తున్న మిరాశీయేతర అర్చకులు 32 మంది సర్వీసును క్రమబద్ధీకరించడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

 టీటీడీలోకి కొత్త అర్చకులు..!

Updated By ManamWed, 05/16/2018 - 17:38

TTDramana deekshituluboard meetingPutta sudhakar yadavtirumala

తిరుమల: టీటీడీలో అర్చకులుగా పనిచేస్తున్న 65 ఏళ్లు నిండిన వారంతా రిటైర్మెంట్ ఇవ్వాలని టీటీడీ కొత్త పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వెంటనే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తేవాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణ దీక్షితులు పదవులు కోల్పోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పద నిర్ణయం తీసుకుందని పలువురు అర్చకులు, ప్రముఖులు విమర్శకులు గుప్పిస్తున్నారు.

రమణ దీక్షితులు అవుట్.. 65 ఏళ్లు దాటితే రిటైర్మెంట్
 

కాగా.. వారి స్థానంలో ప్రధాన అర్చకులుగా గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి వంశం నుంచి కృష్ణ శేషాద్రి దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులను టీటీడీ నియమించింది. 

TTDramana deekshituluboard meetingPutta sudhakar yadavtirumalaఅధికార బలంతో శ్రీవారి ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు

Updated By ManamWed, 05/16/2018 - 09:02

tirumala  చెన్నై: రాజకీయ నాయకులు తిరుమల ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, వారి నుంచి శ్రీవారిని రక్షించుకోవాలని టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. అధికార బలంతో శ్రీవారి ఆలయ ఆగమ శాస్త్ర నియమాలను గాలిని వదిలేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే ఆభరణాల వివరాలు తెలియడం లేదని, శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఇచ్చిన ఆభరణాల పరిస్థితి ఏంటని అని ప్రశ్నించారు.

లడ్డు ప్రసాదాన్ని వ్యాపారంగా మార్చుతున్నారని, ఏ చరిత్రా తెలియని పాలకమండలి, అధికారుల వల్ల ఆలయ ప్రతిష్ట మంటగలుస్తోందని, అన్యమతస్తుల విషయం నాయకుల విచక్షణకే వదిలేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. హుండీ ఆదాయం స్వామివారి సేవకేనని పేర్కొంటూ, ఓ అధికార పార్టీ ఎమ్మెల్సీ తమ ఊరిలో కల్యాణమండపానికి పది కోట్లు కోరుతున్నారంటే ప్రభుత్వ తీరు అర్థమౌతుందని విమర్శించారు. ప్రభుత్వం, అధికారుల కనుసన్నల్లో జరుగుతున్న అవినీతి నుంచి స్వామివారిని కాపాడుకునేందుకు తాము నిత్యం పోరాడుతూనే ఉంటామని, ఇందుకోసం భక్తులు కలిసి రావాలని రమణ దీక్షితులు కోరారు. 

 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Updated By ManamMon, 05/14/2018 - 12:32
titupati

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం 'క్యూ' కాంప్లెక్స్ లో ​17​ కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి సర్వదర్శనానికి ​26 గంటలు , ప్రత్యేక దర్శనం కోసం 2 గంటల సమయం పడుతుంది. కాగా ఆదివారం స్వామి వారిని 93,906మంది భక్తులు దర్శించుకోగా.. 45,322మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

 
Related News