anganwadi

ఆశా, అంగన్ వాడీలకు గుడ్‌న్యూస్

Updated By ManamTue, 09/11/2018 - 15:52
modi
  • ఆశా, అంగన్ వాడీ వర్కర్లకు వేతనాలు పెంపు   

న్యూఢిల్లీ : ఆశా, అంగన్ వాడీ వర్కర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ అందించారు. ఆశా, అంగన్ వాడీ వర్కర్లకు జీతాలు పెంచుతూ ప్రధాని మంగళవారం ప్రకటన చేశారు. ప్రస్తుతం తీసుకుంటున్న రూ.3000వేల వేతనాన్ని రూ.4500 పెంపు, రూ.2200 వేతనం అందుకుంటున్న వారికి రూ.3500 పెంచుతున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆశా, అంగన్ వాడీ వర్కర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని ఈ మేరకు ప్రకటన చేశారు. 


అలాగే  ఆశా, అంగన్ వాడీ సహాయకులకు వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు. అంగన్ వాడీ సహాయకులకు రూ.1500 నుంచి రూ. 2250 పెంచుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే కంప్యూటర్ ఇతర సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన‌ ఉన్నవారికి మరి కొంత నగదు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. నైపుణ్యత ఆధారంగా రూ. 250 నుంచి రూ.500 అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.అంగన్‌వాడీల్లో.. ట్యాబ్‌లతో పర్యవేక్షణ

Updated By ManamMon, 04/30/2018 - 04:16
  • యాప్‌లతో అక్రమాలకు చెల్లు.. ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన

  • ఐసీడీఎస్ అధికారులకు ట్యాబ్‌లు.. వచ్చే నెల 1 నుంచే అమలు

anganwadiహైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందులో భాగం గానే ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మాతా, శిశు సంక్షేమ శాఖ రెండు యాప్‌లకు రూపకల్పన చేసింది. వీటిలో ఒకటి అధికారుల తనిఖీ, పర్యవేక్షణ విధానం(ఆఫీసర్స్ విజిట్ మానిటరింగ్ సిస్టం). రెండోది హాజరు పర్య వేక్షణ విధానం(అటెండెన్స్ మానిటరింగ్  సిస్టం). ఇవి పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే అక్రమాలకు కళ్లెం పడినట్లే. ఈ ప్రక్రియను అమ లుచేసేందుకు అధికారులకు ప్రభుత్వం ట్యాబ్‌లను సమకూరుస్తోంది. వచ్చే నెల 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు  చేసేందుకు ఉన్నతాధికారులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. 

ఇలా పనిచేస్తుంది..
ఐసీడీఎస్ సీడీపీవోలు, డీడబ్ల్యూవోలు అంగన్వాడీ కేంద్రాల పరిశీలనకు వెళ్లిన సమయం లో అక్కడ పరిశీలించిన అంశాలను కాగితాలపై నమోదు చేసుకునే విధానం అమలులో ఉంది. ఇకపై అలా కుదరదు. సర్ఫ్ మానిటరింగ్ యాప్ ద్వారా ఏరోజుకారోజు తనిఖీ సమాచారాన్ని ఉన్నచోటు నుంచే ఆన్‌లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పనిని కనీసం పక్కకొ చ్చి చేద్దామనుకున్నా కుదరుదు. ఎందుకుంటే ఇప్పటికే ఆంగన్‌వాడీ కేంద్రాలను జియోట్యాగిం గ్‌కు అనుసంధానం చేశారు. సూపర్‌వైజర్ మొదలు డైరెక్టర్ వరకు ఈ యాప్‌ని వినియోగిం చాల్సి ఉంటుంది. తనిఖీకి వెళ్లి ఫొటో తీయగానే జియోట్యాంగింగ్ అయి ఉన్నందున ఆ కేంద్రం తాలూకు ప్రాంతం (లొకేషన్) నమోదవుతుంది. అందులో వివరాలు నమోదు చేశాక అక్కడున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలతో సెల్ఫీ దిగి వెంటనే అప్‌లోడ్ చేయాలి.

అటెండెన్స్ మానిటరింగ్ యాప్..
ఇది బయోమెట్రిక్‌లా పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగాగల సీడీపీవో కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఉద్యోగుల వివరాలను తొలుత నమోదు చేస్తారు. మినిస్టీరియల్ సిబ్బందికీవర్తిస్తుంది. కార్యా లయానికి ఎవరు, ఎప్పుడు వచ్చినా హాజరు నమోదు చేయాలి. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావుండదు. నెల చివరన ఎవరెన్ని రోజులు వచ్చారనేది స్పష్టంగా తెలుస్తుంది. కార్యాలయంలో హాజరు నమోదు చేసుకుని బయటకు వెళ్లిన సందర్భాలలోనూ సదరు అధికారి తనిఖీ నిమిత్తం ఏ కేంద్రానికి వెళ్లారనేది జియో ట్యాగింగ్ ద్వారా పైస్థాయి అధికారులు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లోని సీడీపీవోలు తమకిష్టమున్న సమయంలో కార్యాలయానికి వచ్చి విజిటింగ్ వెళ్లినట్లుగా చెప్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక నుంచి ఇటువంటి వాటికి కొంతమేర అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయి. చాలామంది సీడీపీవోలు కార్యాలయం సమయ పాలన అంటే ఏమిటో తెలియని దుస్థితి. సీడీపీవో కార్యాలయం ఉన్న ప్రాంతంలో వీరు ఉండకుండా జిల్లా కేంద్రాల్లో, సమీపంలోని పట్టణాల్లోఎక్కువగా ఉంటున్న దాఖలాలున్నాయి. వీరు ఇంటి వద్ద నుంచి తమకిష్టమున్న సమయంలో బయల్దేరి, వెళ్లే దారిలో ఏదో ఒక అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి కార్యాలయానికి వచ్చి విజిటింగ్ వెళ్లినట్టుగా పేర్కొన్నారు. ఈ యాప్‌లను ప్రభుత్వం పారదర్శకతతో నిర్వహిస్తే సీడీపీవోల పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలను మరింతగా పరిశీలిస్తారు. తద్వారా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉందంటున్నారు. త్వరలో అమలులోకి రానున్న ఈ రెండు నూతన విధానాల అమలు తీరుపై పక్కాగా నిఘా ఉంటుంది. ఇందుకోసం జిల్లా సంక్షేమ అధికారులకు ట్యాబ్‌లను అందజేస్తున్నారు. వీరికి తమ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పాస్‌వర్డ్‌లను ఇస్తారు. వీటిని డీకోడ్ చేసుకుంటే చాలు తనిఖీ, హాజరు, పర్యవేక్షణ తీరెలా ఉందనేది, ఎక్కడి నుంచైనా చూసే వెసులుబాటు ఉంటుంది.

Related News