Gopi Sunder

విజయ్, క్రాంతి మాధవ్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్

Updated By ManamFri, 10/12/2018 - 14:26
Vijay Deavarakonda, Kranthi Madhav

‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన క్రాంతి మాధవ్, టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దసరా సందర్భంగా అక్టోబర్ 18న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరగున్నాయి.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు భామలు రొమాన్స్ చేయనున్నారు. వారిలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజాబెల్లె లైతే ఉన్నారు. కాగా కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఐశ్వర్యా రాజేశ్‌, మోడల్‌ ఇజాబెల్లె లైతేలకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు.75కోట్ల క్లబ్‌లో ‘గీత గోవిందం’

Updated By ManamFri, 08/24/2018 - 09:24

Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం 75కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాడుతో పాటు ఆస్ట్రేలియా, యూఎస్‌లో ఈ చిత్రం తన హవాను కొనసాగిస్తోంది. ఇప్పటికే 75కోట్ల క్లబ్‌లో చేరిందంటే ఇక ఫుల్‌రన్‌లో ఈ చిత్రం మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. కాగా రొటీన్ స్టోరీ అయినప్పటికీ పరశురామ్ తెరకెక్కించిన తీరు, నటీనటుల సహజ నటన, గోపి సుందర్ మ్యూజిక్ ఈ చిత్రానికి మెయిన్ అస్సెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.‘గీత గోవిందం’ రివ్యూ

Updated By ManamWed, 08/15/2018 - 13:21
Geetha Govindam

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన‌ `పెళ్లిచూపులు`, `అర్జున్ రెడ్డి` సినిమాల త‌ర్వాత రిలీజ్‌కి ముందు ఆ రేంజ్‌లో ప‌బ్లిసిటీ వ‌చ్చిన సినిమా `గీత గోవిందం`. తొలి సినిమా `చ‌లో`తో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మండ‌న్న ఇందులో హీరోయిన్‌. వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించిన `ఇంకేం ఇంకేం కావాలే` సాంగ్ సూప‌ర్ హిట్‌. సినిమా రిలీజ్‌కి ముందు పైర‌సీ అయి కొన్ని సీన్లు లీక‌య్యాయి. ఇవ‌న్నీ ఎక్స్ పెక్టేష‌న్స్ ని భారీగా పెంచాయి. సినిమా వాటికి ధీటుగా ఉంటుందా? ఆల‌స్య‌మెందుకు.. రివ్యూ చ‌దివేయండి. 

బ్యాన‌ర్‌:  జిఎ2 పిక్చ‌ర్స్
తారాగ‌ణం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌,  రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు...
మ్యూజిక్‌: గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్
ఆర్ట్‌: ర‌మ‌ణ వంక‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: స‌త్య గ‌మిడి
లిరిక్స్‌: అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి, 
ప్రెజెంట్స్: అల్లు అర‌వింద్‌
ప్రొడ్యూస‌ర్‌: బ‌న్నివాసు
స్టోరీ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్‌: ప‌రశురామ్‌
విడుద‌ల తేదీ: 15.08.2018

క‌థ‌
విజ‌య్ గోవింద్ (విజ‌య్ దేవ‌ర‌కొండ) ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌. గీత (ర‌ష్మిక‌) సాఫ్ట్ వేర్ ఎంప్లాయీ. గీత కంపెనీ ఓన‌ర్ కూతురు నీలు కి విజ‌య్ అంటే ఇష్టం. అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది. త‌న చెల్లెలి నిశ్చితార్థం కోసం ప‌ల్లెటూరికి వెళ్తాడు విజ‌య్‌. బ‌స్సులో అత‌ని ప‌క్క సీట్లో గీత ట్రావెల్ చేస్తుంది. అనుకోకుండా ఆమెతో అత‌నికి లిప్ లాక్ అవుతుంది. త‌న త‌ప్పేం లేద‌ని చాలా మొత్తుకుంటాడు విజ‌య్‌.

అత‌ని మాట విన‌కుండా త‌న అన్న‌య్య‌కు ఫోన్ చేసి విష‌యం చెబుతుంది. అత‌న్ని చంపేయాల‌ని తిరుగుతుంటాడు ఆమె అన్న‌య్య (సుబ్బ‌రాజు). అయినా అనుకోని ప‌రిస్థితుల కార‌ణంగా గీత‌, విజ‌య్ క‌లిసి తిరగాల్సి వ‌స్తుంది. దీని వ‌ల్ల ఏమైంది?  విజ‌య్ చెల్లెలి పెళ్లి సంగ‌తేంటి?  గీత అన్న‌య్య విజ‌య్ మీద ప‌గ పెంచుకున్నాడా? అతనికి ఇత‌నిపై ఎలాంటి అభిప్రాయం ఉంది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. 

geeta govindam

స‌మీక్ష‌
ప్ర‌తి వ్య‌క్తికీ పెళ్లి ఒక క‌ల‌. చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి?  చేసుకున్నాక ఎలా చూసుకోవాలి.. వంటివ‌న్నీ అబ్బాయిల జేబుల్లో లిస్ట్ అయి రెడీగా ఉంటుంది. ఈ సినిమాలో విజ‌య్ పాత్ర కూడా అలాంటిదే. చిన్న‌ప్పుడే త‌ల్లిని పోగొట్టుకుని, క‌నుసైగ‌ల్లో అర్థం చేసుకునే భార్య రావాల‌ని కోరుకుంటుంటాడు. తొలి చూపులోనే గీతతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అనుకోని పొర‌పాటు వ‌ల్ల త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసే సంద‌ర్భం అత‌నికి రాదు.

త‌న మ‌న‌సులోని మాట‌ను తీరా అవ‌త‌లి వ్య‌క్తి చెప్పే సంద‌ర్భ‌మే ఎదురైనా తృణీక‌రిస్తాడు. త‌ర్వాత త‌ప్పు తెలుసుకుని బాధ‌ప‌డ‌తాడు. బావ‌ను కాళ్లావేళ్లా ప‌డి త‌ను అనుకున్న‌ది సాధిస్తాడు. ఇదంతా ఏంటి? అంటే కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుల‌తో వ్య‌క్తులు చేసే యుద్ధ‌మే. క్లిష్ట‌మైన ప‌రిస్థితుల‌ను త‌మ‌కు తాము సృష్టించుకుంటున్న ప‌లువురు యువ‌త‌కు నిద‌ర్శ‌నం విజ‌య్ పాత్ర‌. గీత పాత్ర కూడా నేటి స‌మాజానికి అద్దం ప‌టే పాత్రే. ఈ పాత్ర‌ల చుట్టూ ద‌ర్శ‌కుడు క‌థ అల్లుకున్నారు.

అయితే సీన్లు కాసింత కొత్త‌గా రాసుకుని ఉంటే బావుండేది. భావోద్వేగాల్లో ఇంకాస్త ప‌దును చూపించి ఉంటే స‌రిపోయేది. ముందే హిట్ట‌యిన పాట‌ల ఊపు సినిమాకు ప‌నికొచ్చింది. ఎన్న‌డూ లేనంత‌మంది యువ‌త‌ను థియేట‌ర్ల వైపు తీసుకొచ్చింది. ప్రారంభ‌పు వ‌సూళ్ల‌ను పిచ్చ‌గా రాబ‌ట్టింది. సినిమా యువ‌త‌కు న‌చ్చుతుంది. స‌కుటుంబంగా చూసేలా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు ప్ల‌స్‌.

ర‌ష్మిక కూడా ప్ల‌స్సే. .. కాక‌పోతే క్లైమాక్స్ లో ఏడ‌వ‌డం స‌రిగా రాలేదు. ఆమె ఏడుస్తున్నా.. చిత్రమేంటో న‌వ్వుతున్న‌ట్టే అనిపించింది. అన్న‌పూర్ణ‌మ్మ‌, వెన్నెల కిశోర్ కామెడీ బావుంది. నాగ‌బాబుకు గొంతు అరువిచ్చారు. అయితే అదేదో కృత్తిమంగా అనిపించింది. సుబ్బ‌రాజుకు చాన్నాళ్ల త‌ర్వాత మంచి పాత్ర ప‌డింది. ద‌ర్శ‌కుడు సినిమాను చ‌క్క‌గా తీసినా, ఆయ‌న గ‌త సినిమాల్లో ఉన్న సెంటిమెంట్ స‌న్నివేశాలు, ప‌దునైన డైలాగులు ఇందులో అంత‌గా క‌నిపించ‌లేదు.

ప్ల‌స్ పాయింట్లు
- పాట‌లు
- న‌టీన‌టులు
- కామెడీ
- కెమెరా

మైన‌స్ పాయింట్లు
- నాగ‌బాబు వాయిస్‌
- ర‌ష్మిక న‌ట‌న‌
- పేల‌వంగా సాగే స‌న్నివేశాలు
- క‌థ ఫ్లాట్‌గా ఉండ‌టం

రేటింగ్‌: 3/5
బాట‌మ్ లైన్‌:  యూత్ కోసం `గీత గోవిందం`.ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

Updated By ManamTue, 08/07/2018 - 11:21

Sailaja Reddy Alluduనాగచైతన్య, అను ఇమ్మాన్యుల్ జంటగా నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర మొదటి సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘అను బేబి’ అంటూ సాగే మొదటి పాట ఆగష్టు 10వ తేదిన ఉదయం 10గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు.విజయ్ దేవరకొండ పాట.. రేపే విడుదల

Updated By ManamWed, 07/25/2018 - 10:52

Geetha govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్లలో వేగాన్ని పెంచుతోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్, మొదటి సింగిల్ విడుదలై అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా రెండో సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వాట్‌దఎఫ్‌ అంటూ సాగే ఈ పాటను విజయ్ ‌దేవరకొండనే ఆలపించడం విశేషం. ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించగా.. గోపి సుందర్ సంగీతం అందించాడు.హీరోగా మారిన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌

Updated By ManamWed, 07/18/2018 - 14:51

gopi sunderత‌న సంగీతంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్ నేష‌న‌ల్ అవార్డుని సైతం అందుకున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడు మంచి ఫామ్‌తో వ‌రుస సినిమాల‌కు సంగీతాన్ని అందిస్తున్నాడు గోపీసుంద‌ర్. ఈ యువ సంగీత ద‌ర్శ‌కుడు యూ ట‌ర్న్ తీసుకుని హీరోగా మారాడు. గోపీసుంద‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `టోల్ గేట్‌`. ఈ సినిమాలో గోపీసుంద‌ర్ ఫ‌స్ట్‌లుక్‌ను దుల్క‌ర్ స‌ల్మాన్ విడుద‌ల చేశారు. `మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన గోపీ సుంద‌ర్ న‌ట‌న‌తోనూ మ్యాజిక్ చేస్తాడు` అంటూ దుల్క‌ర్ ఈ సంద‌ర్భంగా పెర్కొన్నాడు. ‘తేజ్ ఐ ల‌వ్ యు’ రివ్యూ

Updated By ManamFri, 07/06/2018 - 12:44
tej

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ల‌వ్ సినిమాల‌ స్పెష‌లిస్ట్‌  క‌రుణాక‌ర‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం తేజ్ ఐ లవ్ యు. అయితే ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేంటే ఈ సినిమాలో కీల‌క‌మైన ఈ ఇద్ద‌రికీ స‌క్సెస్ అవ‌సరం. సాయిధ‌ర‌మ్ ఐదు వ‌రుస అప‌జ‌యాల త‌ర్వాత చేసిన చిత్రమిది. అలాగే ల‌వ్ స్పెష‌లిస్ట్ డైరెక్ట‌ర్‌కి కూడా డార్లింగ్ సినిమా త‌ర్వాత హిట్ ద‌క్క‌లేదు. స‌క్సెస్ అవ‌స‌ర‌మైన త‌రుణంలో ఈ ఇద్ద‌రూ క‌లిసి చేసిన ప్రేమ క‌థా చిత్రం `తేజ ఐ ల‌వ్ యు`.. ఇద్ద‌రికీ విజ‌యాన్ని అందించిందా?  లేదా?  అని తెలుసుకోవాంటే ముందుగా క‌థేంటో చూద్దాం..

చిత్రం:  తేజ్ ఐ ల‌వ్ యు
సెన్సార్‌:  యు
బ్యాన‌ర్‌:  క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ మూవీ మేక‌ర్స్‌
న‌టీన‌టులు:  సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు 
మ్యూజిక్‌:  గోపీసుంద‌ర్‌
ఆర్ట్‌:  సాహి సురేశ్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
మాట‌లు:  డార్లింగ్ స్వామి
కెమెరా: అండ్రూ.ఐ 
నిర్మాత‌:  కె.ఎస్‌.రామారావు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎ.క‌రుణాక‌ర‌న్‌

క‌థ‌:
త‌న త‌ల్లి ఆశ‌యం మేర‌కు లండ‌న్ నుంచి హైద‌రాబాద్‌కి వ‌స్తుంది నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) . అక్క‌డ అనుకోకుండా తేజ్ (సాయిధ‌ర‌మ్‌తేజ్‌)ని చూస్తుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు తేజ్‌. త‌న చెల్లెలిని ఆమెకు న‌చ్చిన వాడికిచ్చి పెళ్లి చేశాడ‌న్న కార‌ణంగా అంత‌కు మునుపే ఇంట్లో వాళ్ల‌కి దూరమ‌వుతాడు తేజ్‌. హైద‌రాబాద్‌లో చిన్నాన్న (పృథ్వి) ఇంట్లో ఉంటాడు. చిన్నాన్న కుమార్తెకు సాయం చేయ‌బోయి నందినిని ఏడిపిస్తాడు. దాన్ని అవ‌కాశంగా తీసుకుని 15 రోజులు త‌న‌కు బాయ్‌ఫ్రెండ్‌గా ఉండాల‌ని నందిని, తేజ్‌ని అడుగుతుంది. స‌రేన‌ని తేజ్ కూడా ఒప్పుకుంటాడు. కానీ ఒకానొక సంద‌ర్భంలో సీన్ రివ‌ర్స్ అవుతుంది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ద‌గ్గ‌రవుతున్నార‌ని అనుకుంటుండ‌గా ఆమెకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ స‌మ‌యంలోనే నందిని తండ్రి లండ‌న్ నుంచి ఇండియాకు దిగుతాడు. నందినికి తేజ్‌ని దూరం చేస్తాడు. యాక్సిడెంట్ కార‌ణంగా నందినికి క‌లిగిన లాస్ ఏంటి? ఆమె ప్రేమ‌ను తేజ్‌కి చెప్ప‌గ‌లిగిందా?  లేదా? న‌ందిని తండ్రి మంచివాడా?  చెడ్డ‌వాడా?  తేజ్‌ని అత‌ని కుటుంబం అక్కున చేర్చుకుందా?  లేదా? ఇంత‌కీ నందిని తల్లి ఆశ‌యాన్ని నెర‌వేర్చ‌గ‌లిగిందా?  తేజ్ చిన్న‌త‌నంలో ఏడేళ్ల పాటు  శిక్ష ఎందుకు అనుభ‌వించాడు వంటివి ఈ చిత్రంలో కీల‌కం. 

tej

ప్ల‌స్ పాయింట్లు
- తేజ్ న‌ట‌న‌, లుంగీ గెట‌ప్‌
- అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ లుక్స్, న‌ట‌న‌
- కెమెరా ప‌నిత‌నం 
- కొన్ని ట్యూన్స్
మైన‌స్ పాయింట్లు
- ఫ్లాట్ స్టోరీ
- రొటీన్ స్క్రీన్‌ప్లే
- కామెడీ పెద్ద‌గా లేదు
- మాట‌లు
- ఎక్క‌డా కొత్త‌ద‌నం లేదు
- బోరింగ్ క్లైమాక్స్

సమీక్ష‌:
ప్రేమ క‌థాచిత్రాల స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న క‌రుణాక‌ర‌న్.. మెగా హీరోతో ప్రేమ‌క‌థా చిత్రం చేస్తున్నాడ‌నగానే సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ గ‌త కొంత‌కాలంగా స‌క్సెస్‌లేని క‌రుణాక‌ర‌న్ మ‌రోసారి ల‌వ్ ఎమోష‌న్‌ను ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ చేయ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు స్ప‌ష్టంగా తెర‌పై క‌న‌ప‌డింది. హీరో.. త‌న‌కు న‌చ్చిన‌వాడితో చెల్లెలు పెళ్లి చేయ‌డం.. దాని వ‌ల్ల ఇంటి నుండి వ‌చ్చేయ‌డం.. ఓ సంద‌ర్భంలో హీరోయిన్‌ని చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌టం.. ఒక‌రిపై ఒక‌రు చిన్న‌పాటి క‌క్ష‌లు తీర్చుకోవ‌డం.. ప్రేమ‌లో ప‌డ‌టం.. ఉన్న‌ట్లుండి హీరోయిన్ గ‌తాన్ని మ‌ర‌చిపోవ‌డం.. ఆమెకు గ‌తాన్ని గుర్తుకు తెచ్చే క్ర‌మంలో హీరో అండ్ గ్యాంగ్ తాప‌త్ర‌య ప‌డ‌టం.. ఇలాంటి అంశాలన్నీ ఏదో ఒక చిత్రాల్లో ప్రేక్ష‌కులు చూసేసిన‌వే. ఎందుకంటే ద‌ర్శ‌కుడు త‌ను చెప్పాల‌నుకున్న ఏ విష‌యాన్ని స‌రిగ్గా పొట్రేట్ చేయ‌లేక‌పోయాడు. ప్రేమ‌లోని స్ట్ర‌గుల్‌.. తెర‌పై ప్రొట్రేట్ చేయ‌లేక‌పోయాడు క‌రుణాక‌ర‌న్‌. ఇక సినిమాలో స‌న్నివేశాలను కెమెరామెన్ అండ్రూ అందంగా చూపించాడు. గోపీసుంద‌ర్ అందించిన సంగీతంలో పాట‌ల్లో అంద‌మైన చంద‌మామ.. పాట మిన‌హా.. మిగ‌తావేవీ బాగా లేవు..అలాగే నేప‌థ్య సంగీతం కూడా మెచ్చుకునేలా లేదు. ల‌వ్ మ్యాజిక్ అన్నీ సంద‌ర్భాల్లో ఒకేలా ఉంటే వ‌ర్కవుట్ కాద‌ని క‌రుణాక‌ర‌న్‌కి తెలిసొచ్చి ఉంటుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ రోల్ బావుంది. పృథ్వీ, జ‌య‌ప్ర‌కాశ్‌, ప‌విత్రాలోకేష్ స‌హా అంద‌రూ పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. 

బోట‌మ్ లైన్‌:   తేజ్ ఐ ల‌వ్ యు.. ఆక‌ట్టుకోలేని ప్రేమ‌క‌థ‌
రేటింగ్‌: 2.5/5‘గీత గోవిందం’కు రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamTue, 07/03/2018 - 08:58

Geetha Govindamవిజయ్ దేవరకొండ హీరోగా పరుశురాం తెరకెక్కిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదిని తాజాగా చిత్ర యూనిట్ తెలిపింది. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతం అందించాడు. ఇప్పటికే పోస్టర్‌లతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.‘తేజ్ ఐ లవ్ యు’కు సెన్సార్ పూర్తి

Updated By ManamMon, 07/02/2018 - 14:16

Tej I Love u సాయి ధరమ్ తేజ్ హీరోగా కరుణాకరణ్ తెరకెక్కించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తైంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు సర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేఎస్ రామారావు నిర్మించగా.. గోపి సుందర్ సంగీతం అందించారు. ఇప్పటికే వరుసగా ఐదు పరాజయాలను ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్ ఈ మూవీపై చాలా అంచనాలే పెట్టుకున్నాడు.కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది

Updated By ManamMon, 06/25/2018 - 10:28

Pantham యాక్షన్ హీరో గోపిచంద్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మెహ్రీన్ నటించింది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ‘‘కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది. ధర్మం వైపు నిలబడాలో, అధర్మం వైపు నిలబడాలో నిర్ణయం అప్పుడే తీసుకోవాలి’’, ‘‘పదవుండి చేస్తే పనిమంతుడు అంటారు. లేకుండా చేస్తే శ్రీమంతుడు అంటారు’’, ‘‘ఒక్కరికి మంచి జరగాలంటే ఫైల్ మీద పదిమంది సంతకాలు పెట్టే పద్దతి మారితే కానీ సామాన్యుడికి ఏ సాయం అందదు’’, ‘‘అవినీతి చేసిన ఓ నాయకుడిని అరెస్ట్ చేస్తే మాత్రం బంద్‌లు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కరు రోడ్డుకెక్కేస్తారు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్‌ను రా’’ అనే డైలాగ్‌లు అందరినీ మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌లతో సినిమాపై ఆసక్తిని పెంచిన గోపిచంద్ ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేశాడు. ఇక ఈ చిత్రాన్ని రాధామోహన్ నిర్మించగా.. గోపిసుందర్ సంగీతం అందించాడు.

Related News