Three killed

బాణాసంచా పేలి ముగ్గురు సజీవ దహనం

Updated By ManamWed, 09/12/2018 - 13:11
Three killed in cracker blast in tamilnadu

చెన్నై : తమిళనాడు చెన్నైలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా పేలి ముగ్గురు సజీవ దహనం అయిన దుర్ఘటన నగరంలో  శాస్త్రినగర్లో బుధవారం ఉదయం జరిగింది. టపాసులను కొనుగోలుచేసిన ఓ వ్యక్తి వాటిని వాహనంలోకి లోడ్ చేయిస్తుండగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  మరోవైపు  పేలుడు ధాటికి సమీపంలోని అయిదు ఇళ్లతో పాటు, ఓ అపార్ట్‌మెంట్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ర‌రాజ్యంలో మ‌ళ్లీ కాల్పుల క‌ల‌క‌లం

Updated By ManamMon, 08/27/2018 - 08:05
three dead as video gamer goes on shooting spree
  • ఫ్లోరిడాలో కాల్పులు, ముగ్గురు మృతి

ఫ్లోరిడా : అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌ళ్లీ కాల్పులు మోత క‌ల‌క‌లం రేపింది. ఆన్‌లైన్ ఫుట్‌బాల్ వీడియో గేమ్ పోటీలలో పాల్గొన్న‌వారిపై ఇద్ద‌రు దుండ‌గులు  విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రో 11మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఈ సంఘ‌ట‌న ఫ్లోరిడా లోని జాక్సన్‌విలేలోని లాండింగ్ ప్రాంతంలో ఆదివారం జ‌రిగింది. కాగా  పోటీలను ప్రత్యక్షప్రసారం చేస్తున్న కెమెరాలో కాల్పులు ఘటన రికార్డయింది. మృతుల్లో ఓ దుండ‌గుడు కూడా ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కర్నూలులో బాంబు పేలుడు, ముగ్గురు మృతి

Updated By ManamTue, 07/31/2018 - 12:55
kurnool blast

కర్నూలు : నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతులు స్థిరాస్తి వ్యాపారం చేసే.. జంపాల రాజశేఖర్‌, జంపాల మల్లికార్జున, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. గాయపడిన సుధాకర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాగా పొలంలో... ఫ్లాట్ల సర్వే కోసం రాయిని తొలగిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ యుగంధర్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కుల్గాం కాల్పుల్లో ముగ్గురు మృతి

Updated By ManamSat, 07/07/2018 - 13:51

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిరసనకారులు, భద్రతా దళాల మద్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం జరిగిన ఘర్షణల్లో ఓ టీనేజ్ యువతితో పాటు మరో ఇద్దరు స్థానికులు మరణించారు.

Kashmir encounter

కాగా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ చనిపోయి రెండో ఏడాది సందర్భంగా వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ముందు  జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్ల దాడి చేశారు.

వారిని అదుపు చేసేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దక్షిణ కశ్మీర్ జిల్లాల్లో ముందస్తుగా మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు. 
 హైదరాబాద్‌లో భారీ వర్షం: ముగ్గురి మృతి

Updated By ManamThu, 05/03/2018 - 18:32

Three killed, Heavy rain at Hyderabad Heavy rain, Hyderabad, GHMC, Capital Cityహైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాల కారణంగా గురువారం నగరంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పట్టపగలే కారు చీకట్లు కమ్ముకున్నాయి. అన్ని  ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అశోక్‌నగర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, బహుదూర్‌పురా, యాకుత్‌పురా, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌, ముషీరాబాద్‌, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, ఈసీఐఎల్‌, ఓయూ, తార్నాక తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పెద్ద శబ్దాలు రావడంతో భయాందోళనలకు గురయ్యారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. రాజధాని నగరంలో ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈదురు గాలుల బీభత్సానికి నెక్లెస్‌ రోడ్డుపై చెట్టు విరిగిపడింది. కారు, ఆటో, రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతిచెందారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోనూ చెట్లు కూలాయి. మరోచోట బస్‌ షల్టర్‌ ఒరిగిపోయింది. విరిగిపడిన చెట్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు తొలగిస్తున్నారు.

Related News