Eggs

వంద బిలియన్లు చేరనున్న గుడ్ల ఉత్పత్తి

Updated By ManamSat, 10/13/2018 - 00:48

eggన్యూఢిల్లీ: భారత్‌లో ప్రస్తుతం ఏడాదికి 90 బిలియన్లుగా ఉన్న కోడిగుడ్ల ఉత్పత్తి  100 బిలియన్లకు అతి త్వరలో చేరనున్నట్లు ప్రభుత్వం శుక్రవారంనాడు వెల్లడించింది. దేశంలో కోళ్ల పెంపకం పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని, వ్యవస్థీకృతమవుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పర్షోత్తం రూపాల  అన్నారు. సెప్టెంబర్ 12న ప్రపంచ గుడ్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇది ఆహార భద్రతకు కూడా తోడ్పడుతోందని అన్నారు. కోళ్ల పెంపక రంగం పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి ఇది అపారంగా సహాయపడగలదని మంత్రి అన్నారు. కోళ్ళ పెంపకం వ్యాపారానికి భారీ పెట్టుబడులు అవసరం లేదని, చిన్న, సన్నకారు రైతులకు సాయపడుతుందని రూపాల అన్నారు. గుడ్లు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారమని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కృష్ణ రాజ్ అన్నారు. దైనందిన జీవితంలో వాటి ప్రాధాన్యాన్ని ఆమె వివరించారు. దేశంలో కోళ్ళ పరిశ్రమ విలువ లక్ష కోట్ల రూపాయలు ఉంటుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి తరుణ్ శ్రీధర్ అన్నారు. ఈ రంగం ఏటా 6 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని చెప్పారు. ఈ రంగం వ్యవస్థీకృతమవడం వల్ల ఎగుమతి మార్కెట్లను వినియోగించుకోవడం సాధ్యపడుతుందని ఆయన అన్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ ఏడాదికి ఒక వ్యక్తికి సుమారు 180 గుడ్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఏడాదికి దాదాపు 70 గుడ్లు అందుబాటులో ఉన్నాయని శ్రీధర్ వెల్లడించారు.చేతి గోర్లు అందంగా,ఆరోగ్యంగా ఉండటానికి... 

Updated By ManamTue, 09/04/2018 - 14:42

nailsసాధారణంగా అమ్మాయిలు చేతి గోర్లను చాల జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఇంట్లో పనుల వలన గోర్లు విరిగిపోవడం, పొడిబారిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అలా జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ చూసి తెలుసుకోండి.

ఆలివ్ ఆయిల్... 
ఆలివ్ ఆయిల్ ఎంత సహజసిద్ధమైందో తెలిసిందే. అలాంటి ఆలివ్ ఆయిల్‌ను గోర్లకు వాడడం వలన సరైన పోషణ అంది.. అవి బలంగా, అందంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

పోషకాహారాన్ని తీసుకోవాలి..
గోర్లు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారం గుడ్లు, క్యాలీఫ్లవర్, అవకాడ్. ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన గోర్లకు సరైన పోషణ అంది అందంగా కనిపిస్తాయి.

గోర్లకు ఎక్కువ ఒత్తిడి ఇవ్వకూడదు..

నీటిలో గోర్లు ఎక్కువసేపు ఉండడం వలన వాటి దృఢత్వవాన్ని కోల్పోయి విరిగిపోతాయి. అందుకే చేతికి గ్లౌజులు వాడి వాటిని సంరక్షించుకోవాలి. అలాగే వాటిని నీటిలో ఎక్కువ సమయం ఉంచకుండా చూసుకోవాలి అప్పుడే అవి ఆరోగ్యాంగా ఉంటాయి..గుడ్డుతో మధుమేహుల్లో గుండెజబ్బులకు చెక్!

Updated By ManamMon, 05/07/2018 - 18:56

Eggs, risk of cardiovascular disease, Type-2 diabetes వెబ్ ప్రత్యేకం: గుడ్డు తినాలంటే దాదాపు అందరూ ఇష్టపడతారు. గుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం.. తిననివారు కూడా లోట్టలేసుకుంటూ గుటుక్కమని గుడ్లు మీద గుడ్లు మింగేస్తారు. గుడ్లు తిననివారి కంటే గుడ్లు తినేవారిలో గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందంట. ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో కూడా గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు గుడ్డు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలపై అధ్యయనం చేశారు. పరిశోధకుల అధ్యయనంలో వారానికి 12 గుడ్లు చొప్పున ఏడాదిపాటు తినడం ద్వారా మధుమేహం, టైప్-2 మధుమేహంతో బాధపడేవాళ్లలో గుండెజబ్బులతో వచ్చే ప్రమాదం తగ్గుతుందని గుర్తించారు. ఈ అధ్యయానికి సంబంధించి కథనాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో పరిశోధన సంస్థ ప్రచురించింది. మూడు నెలల క్రితం జరిపిన అధ్యయనంలో కూడా ఇటువంటి ఫలితాలే వెల్లడి కావడంతో పరిశోధనను పొడిగించారు. పరిశోధన ప్రారంభంలో పాల్గొన్న వారికి గరిష్ఠంగా వారానికి (12 గుడ్లు చొప్పున), కనిష్ఠంగా వారానికి ( 2 కంటే తక్కువ గుడ్లు) తినేలా డైట్ పాటించారు.

మూడు నెలలు చివరి రోజుల్లో గుడ్లు తిన్నవారిలో హృదయరోగ సంబంధిత వ్యాధులకు కారణమైయ్యే ప్రమాద కారకాలను గుర్తించలేదు. పరిశోధనలో పాల్గొన్న ఒక గ్రూపుకు గుడ్లు తక్కువ, ఎక్కువ మొత్తంలో ఇస్తూనే.. మరో గ్రూపుకు బరువు తగ్గేలా డైట్‌ ఫుడ్‌ను ఇస్తూ మొత్తం మూడు నెలలు అదనంగా ఇచ్చారు. ఇందులో పాల్గొన్న మరో గ్రూపుకు మిగతా ఆరునెలలు నుంచి 12 నెలల పాటు అదే మోతాదులో గుడ్లను తినేలా సూచించారు. అన్ని దశల్లో రెండు గ్రూపుల్లో గుండెజబ్బులకు సంబంధించి ఎలాంటి ప్రతికూల మార్పులు కనిపించలేదని, బరువు తగ్గే డైట్ చేసినవారితో సమానంగా గుడ్డు తిన్నవారు కూడా బరువు తగ్గినట్టు గుర్తించినట్టు సిడ్నీ యూనివర్సిటీ నిక్ ఫుల్లర్ పేర్కొన్నారు. గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయని వెల్లడించారు. దీనివల్ల ముఖ్యంగా కళ్లు, గుండె ఆరోగ్యం, రక్తనాళాలు, ఆరోగ్యకరమైన గర్భాలకు కూడా ఎంతో మేలు కలుగుతుందని ఫుల్లర్ తెలిపారు.

Related News