rambha

పండంటి బాబుకు జన్మనిచ్చిన రంభ

Updated By ManamWed, 09/26/2018 - 09:15

Rambhaఅలనాటి నటి రంభ పండంటి బాబుకు జన్మనిచ్చారు. కెనడాలోని టొరంటోలో ఈ నెల 23న బాబుకు ఆమె జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రంభ భర్త ఇంద్రకుమార్ సోషల్ మీడియాలో వెల్లడించారు. మాకు బాబు పుట్టాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెటిజన్ల నుంచి రంభకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2010లో రంభ, ఇంద్రకుమార్‌లకు వివాహం జరగగా.. ఇప్పటికే వారిద్దరికి లాన్య, సాషా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరు ప్రస్తుతం టొరంటోలో స్థిరపడ్డ విషయం తెలిసిందే.రచ్చ రచ్చ చేసిన ‘రంభ’.. ఫొటోలు వైరల్!

Updated By ManamTue, 08/14/2018 - 19:36

rambha

రంభ.. ఒకానొక సమయంలో తన అందచెందాలతో కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. ఈమె ఫలానా సినిమాలో నటించిందంటే చాలు ఆ సినిమాలో సూపర్ డూపర్ హిట్టే.. అలాగని అన్నీ హిట్లేకాదు. ఈ ముద్దులగుమ్మ సినిమాలకు కుర్రాళ్లకు క్యూ కట్టేవారు.. అదీ రంభ రేంజ్. కానీ కొత్త కొత్తవాళ్లంతా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం క్రమేణా అవకాశాలు తగ్గిపోవడంతో ఈమె సినిమాలకు కాసింత దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే చిన్నపాటి అవకాశాలొచ్చినా చాలు నటించి.. అభిమానులను మెప్పించేందుకు ఈ భామ సిద్ధమవుతోంది.  టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో న‌టించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కి దూర‌మైపోయింది. 

Actress rambha
అప్పట్లో.. రంభ, ఆమె భర్త మధ్య గొడవలు 2016లో తన భర్త నుంచి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. తన పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ.2.50లక్షలు చెల్లించాలని కోర్టును కోరింది. అయితే కొంత కాలంగా ఈ కేసుపై సుదీర్ఘ చర్చ జరిపిన కోర్టు ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు రావాల్సిందిగా కోరింది. ఆ తర్వాత మళ్లీ వారిద్దరూ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమైంది. అలా అప్పట్లో సీరియల్‌గా రంభ వార్తల్లో నిలిచారు.

Actress rambha seemantham

అయితే.. తాజాగా అభిమానులందరికీ ఓ శుభవార్తను అందించింది రంభ. భ‌ర్తతో క‌లిసి ఆనందంగా జీవితాన్ని గడిపేస్తున్న రంభ త్వరలో మరో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇప్పటికే లాన్య(7), శాషా(3) అనే ఇద్ద‌రు కూతుళ్లకు జన్మనిచ్చిన రంభ ఫ్యామిలీలో.. త్వ‌ర‌లో వారింట మ‌రో బేబి అడుగుపెట్ట‌నుంది. ఈ సందర్భంగా సోమవారం అనగా ఆగస్ట్ 13న రంభ శ్రీమంతం కుటుంబీకులు, అలనాటి స్నేహితురాళ్ల మధ్య ఘ‌నంగా జ‌రుపుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తన భర్త, బంధువుల‌తో క‌లిసి స్టెప్పులేసి రచ్చరచ్చజేసింది రంభ. దీంతో తాము జీవితంలో సంతోషంగా ఉన్నామని ఈ కార్యక్రమం ద్వారా అభిమానులకు తెలియజేసినట్లైంది.

Actress rambha

డ్యాన్స్ చేసిన అనంతరం రంభపై.. భ‌ర్త బంతి పూల వ‌ర్షం కురిపించారు. తన కుటుంబీకులు, స్నేహితులతో దిగిన ఫొటోలను రంభ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడీ ఈ ఫొటోలు, వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఆనందంతో ఎగిరిగంతులేస్తున్నారు. రంభ డ్యాన్స్ చూసిన అభిమానులు అప్పటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పటికీ రంభలో ఏ మాత్రం మార్పు రాలేదని.. రానున్న రోజుల్లో తమ కోసం మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తారని ఆశిస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె తన అభిమానుల కోరికను మన్నించి.. రీ ఎంట్రీ ఇస్తారా..? లేకుంటే ఫ్యామిలీకే పరిమితమవుతారో వేచి చూడాల్సిందే మరి.

Actress rambha dance

 

A post shared by RambhaIndrakumar? (@rambhaindran_) on

 20 ఏళ్ళ 'బావ‌గారూ బాగున్నారా' 

Updated By ManamMon, 04/09/2018 - 15:49

bbమెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ ఉన్నాయి. వాటిలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'బావ‌గారూ బాగున్నారా' ఒక‌టి. 'ప్రేమించుకుందాం రా' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై కె.నాగ‌బాబు నిర్మించారు. అంత‌కుముందు 'రుద్ర‌వీణ‌', 'త్రినేత్రుడు', 'ముగ్గురు మొన‌గాళ్ళు' వంటి చిత్రాల‌ను నిర్మించినా.. ఈ బ్యాన‌ర్‌లో క‌మ‌ర్షియ‌ల్‌గా సెన్సేష‌న్ సృష్టించిన సినిమా మాత్రం 'బావ‌గారూ బాగున్నారా' అనే చెప్పాలి. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. ముఖ్యంగా.. 'ఆంటీ కూతురా', 'సారీ సారీ' పాట‌లు అప్ప‌ట్లో ఒక ఊపు ఊపాయి.

చిరంజీవి, రంభ కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కాగా.. ప్ర‌థ‌మార్థంలో చిరు, రంభ‌, బ్ర‌హ్మానందం మ‌ధ్య సాగే స‌న్నివేశాలు.. ద్వితీయార్థంలో చిరు, కోట‌, శ్రీహ‌రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. ర‌చ‌న‌, ప‌రేష్‌ రావెల్‌, స‌త్య‌నారాయ‌ణ‌, షావుకారు జాన‌కి, అచ్యుత్ తదిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అందించిన మాట‌లు హైలైట్‌గా నిలిచాయి. 1998 ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం.. నేటితో 20 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌న‌కి 21 ఏళ్లు

Updated By ManamWed, 10/11/2017 - 10:52

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అతి త్వ‌ర‌లో ఆయ‌న 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా తెరంగేట్రం చేసిన ప‌వ‌న్‌.. తొలి అడుగుల్లోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి'తో న‌ట‌న‌కి శ్రీ‌కారం చుట్టిన ప‌వ‌న్‌.. నేటితో వెండితెర‌పైకి వ‌చ్చి 21 ఏళ్లు పూర్త‌వుతున్నాయి. స‌రిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే అక్టోబ‌ర్ 11న ఆయ‌న న‌టించిన తొలి చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌రాలు సుప్రియ క‌థానాయిక‌గా న‌టించిన ఏకైక చిత్ర‌మిది. రంభ ప్ర‌త్యేక గీతంలో క‌నువిందు చేసిన ఈ చిత్రానికి కోటి సంగీత‌మందించారు.

Related News