kerala

నా జాబ్ డస్ట్‌బిన్‌లో పడేశా...

Updated By ManamMon, 11/12/2018 - 11:52
Kerala minister wife Jubilee Navaprabha resigns from university post

తిరువనంతపురం : తనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో కేరళ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి జీ.సుధాకరన్ భార్య  జూబిలీ నవప్రభ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. భర్త సిఫార్సుల మేరకే నవప్రభకు కేరళ వర్శిటీలో డైరెక్టర్‌ పదవి చేపట్టారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘అలప్పుజలోని ఎస్డీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యాను. ఆ తర్వాత కేరళ యూనివర్శిటీ ప్రకటన చూసి దరఖాస్తు చేశాను. నా ఎంపిక పారదర్శకంగా జరిగింది. ఇక నా భర్తకు చక్కటి ట్రాక్ రికార్డు ఉంది. నా ఉద్యోగ నియామకం విషయంలో నా భర్త విశ్వసనీయతపై విమర్శలు రావడం బాధాకరంగా ఉంది. ఆరోపణల నేపథ్యంలో మనస్తాపం చెంది నా ఉద్యోగాన్ని డస్ట్‌బిన్‌లో పడేయాలని నిర్ణయించుకున్నా. ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను.’ అని తెలిపారు.

ఇక నవప్రభ ఎస్డీ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ తరువాత, కేరళ విశ్వవిద్యాలయం పరిధిలోని స్వతంత్ర కళాశాలల నిర్వహణను పర్యవేక్షించే డైరెక్టరేట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే భర్త సాయంతో మరో మహిళకు రావాల్సిన పోస్ట్‌ను నవప్రభ పొందారని విమర్శలు వచ్చాయి.

కాగా గతంలో కూడా పరిశ్రమల శాఖ మంత్రి ఇ.పి.జయరాజన్ 2016లో తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయన తన బంధులను నియమించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆయనకు ఈ ఏడాది న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో తిరిగి జయరాజన్  తన పదవిని చేపట్టారు.బన్నీకి కేరళ సీఎం ఆహ్వానం

Updated By ManamTue, 11/06/2018 - 11:26

Allu Arjunస్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన ఆహ్వానం లభించింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రూ ట్రోపీ బోట్ రేస్‌కు ముఖ్య అతిథిగా హాజరు అవ్వాల్సిందిగా బన్నీకి కేరళ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమం ఈ నెల 10న అలప్పుల సమీపంలోని పున్నంద సరసులో జరగనుంది. ఇక కేరళ ప్రభుత్వ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన బన్నీ.. ఆ కార్యక్రమానికి హాజరు అవుతానని మాటిచ్చినట్లు సమాచారం.

కాగా తెలుగులో టాప్ హీరోగా దూసుకుపోతున్న బన్నీకి, మలయాళంలోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. అంతేకాదు అతడి చిత్రాలన్నీ అక్కడ కూడా విడుదలై మంచి కలెక్షన్లను రాణిస్తుంటాయి. ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరోలతో సమానంగా కేరళలో గౌరవాన్ని పొందుతున్నాడు బన్నీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ను కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇక ఈ గౌరవం పొందిన తొలి టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. కాగా ఈ ఏడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’తో వచ్చిన బన్నీ.. తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత

Updated By ManamTue, 11/06/2018 - 10:17

Sabarimalaతిరువనంతపురం: శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. శ్రీ చితిర అట్ట తిరునాళ్ పూజ నిమిత్తం మంగళవారం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఈ క్రమంలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశం నలువైపుల నుంచి భక్తులు పోటెత్తుతుండగా.. సుప్రీం ఇచ్చిన తీర్పుతో కొందరు మహిళలు కూడా అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు అయ్యప్ప భక్తులతో పాటు పలు హిందూ సంస్థల ప్రతినిధులు శబరిమలకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి వచ్చిన ఇద్దరు మధ్య వయస్కులైన మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ మహిళల ధ్రువపత్రాలు పరిశీలించాకే దర్శనానికి అనుమతించారు.ఏది ధర్మం.. ఏది న్యాయం?

Updated By ManamWed, 10/31/2018 - 00:03

imageఎవరో కొంతమంది చేసిన పనితో శబరిమల.... ఆ మాట కొస్తే యావద్దేశం అట్టుడుకుతోంది. శబరిమల కొండమీద కి.. పదునెట్టాంబడి (18 మెట్లు) ఎక్కడానికి 10-50 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లను అనుమతించాలా.. వద్దా అన్న విషయమై మొదలైన వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ల డం అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4-1 తేడాతో ఆలయాలు, ప్రార్థనాస్థలాల్లో లింగవివక్ష కూడ దంటూ తీర్పు చెప్పి, ఏ వయసు మహిళలైనా శబరిమలలో దేవుడి వద్దకు వెళ్లొచ్చని తేల్చిచెప్పింది. కానీ, అదే సమ యంలో దేశవ్యాప్తంగా కొన్ని కోట్లమంది అయ్యప్ప భక్తుల వాదనలను కోర్టు పూర్తిస్థాయిలో విందా.. లేదా అనే విష యం కూడా ఇప్పుడు చాలామందికి వస్తున్న అనుమానం.

అయ్యప్ప ఆలయాన్ని నెలవారీ ఐదురోజుల పూజకోసం తెరిచిన తర్వాత ఇప్పటివరకు అక్కడకు వెళ్లడానికి ప్రయimage త్నించినవారు లేదా కొండపై వరకు వెళ్లిన మహిళలను చూస్తే వారిలో ఎవరూ మండల దీక్ష చేసినవారు దాదాపుగా కనిపించలేదు. తమ ఆధిపత్యం చూపించుకోడానికి, కేవలం తాము కూడా అయ్యప్ప ఆలయానికి వెళ్లామని నిరూపించు కోడానికి బలప్రదర్శనలా వెళ్లినవారే ఎక్కువగా కనిపిస్తు న్నారు. వాళ్లు కాకపోతే.. విధి నిర్వహణ పేరుతో అయ్యప్ప ఆలయం ముందు నుంచి.. లేదా 18 మెట్లు ఎక్కి ఆ పై నుంచి లైవ్ కవరేజి ఇవ్వడానికి అత్యుత్సాహంతో వెళ్లిన కొంతమంది పాత్రికేయులు కనిపించారు. నిజానికి న్యూ యార్క్ టైమ్స్ గానీ, మోజో టీవీ గానీ అక్కడ ఏం జరుగు తోందన్న విషయాన్ని తమ పాఠకులు లేదా వీక్షకులకు చూ పించాలని అంత ఉత్సాహంగా ఉంటే కేవలం మహిళా రిపో ర్టర్లను మాత్రమే పంపాల్సిన అవసరం లేదు. మగవాళ్లను కూడా పంపచ్చు.

మండల దీక్షచేసిన వారు మాత్రమే కాక.. దీక్ష తీసుకోకుండా సాధారణంగా అయ్యప్ప దర్శనం చేసుకో డానికి కూడా చాలామంది పురుషులు వెళ్తారు. అయితే, శబరిమలలోని అయ్యప్ప ఆలయ నిబంధనల ప్రకారం.. స్వామి ఘోటక బ్రహ్మచారి కాబట్టి అక్కడకు రుతుక్రమం ఉన్న మహిళలు వెళ్లడం నిషిద్ధం. అలాగని పూర్తిగా మహిళల రాకను కూడా అక్కడ నిషేధించరు. పదేళ్ల లోపు, 50 ఏళ్లు దాటిన మహిళా భక్తులు కూడా అక్కడకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో దీక్ష తీసుకుని మరీ వస్తుంటారు. ఈ విష యాన్ని మహిళా భక్తులను ఆలయంలోకి అనుమతించాల్సిం దేనంటున్న సంఘాల వాళ్లు పట్టించుకున్న పాపాన పోయి నట్లు కనిపించడం లేదు. ఎటూ తమకు సుప్రీంకోర్టు అండ ఉంది కాబట్టి, పోలీసుల భద్రతా వలయంతో అక్కడివరకు వెళ్లచ్చన్న ధీమా మాత్రమే కనిపిస్తోంది. శుక్రవారం నాటి ఘటనలే చూసుకుంటే.. ఒక్క మహిళా రిపోర్టరును కొండ మీదకు తీసుకెళ్లడానికి ఆమెకు కూడా పోలీసులు ధరించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్ ధరింపజేసి చుట్టూ దాదా పు 25-30 మంది పోలీసులు వలయంలా నిలబడి, మూడు వరుసల్లో ఆమెకు భద్రత కల్పించి.. ఆమె దరిదాపుల్లోకి చీమ కూడా దూరనంత స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుని మరీ ఆమెను కొండ పైవరకు తీసుకెళ్లగలిగారు.

కొండ మీద కు వచ్చేశానన్న విజయగర్వం ఆమె ముఖంలో తొణికిసలా డింది. కానీ, మన దేశంలో ప్రతి ఆలయానికి కొన్ని నియమ నిబంధనలుంటాయి. కొన్ని చోట్లకు అసలు పురుషుల ప్రవే శం నిషిద్ధం అనే ఆలయాలు సైతం ఉన్నాయి. ఇక 99 శా తం మసీదులలో ఇప్పటికీ ముస్లిం మహిళలకు ప్రవేశం లే దు. అంతవరకు ఎందుకు, ముస్లింల పెళ్లిళ్లు జరిగే కళ్యాణ మండపాలు చూస్తే, పురుషుల ప్రవేశద్వారం వేరు, మహిళల ప్రవేశద్వారం వేరు. హిందూ మతాచారం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో అలా భార్యలను వేరుగా పంపి భర్తలు తమ స్నేహి తులు, బంధువులలోని పురుషులతో మాత్రమే వెళ్లడం ఎక్క డైనా చూశారా? మరి ముస్లిం మహిళల హక్కుల కోసం తృ ప్తిదేశాయ్ లేదా, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ లాంటి వాళ్లు ఎవరైనా ఒక్కసారైనా కోర్టు గుమ్మం ఎక్కగలి గారా? వాళ్ల ఆచార వ్యవహారాలను సవాలు చేయగలి గా రా? అంతవరకు ఎందుకు.. ముస్లిం మహిళల పాలిట శా పంలా ఉన్న ట్రిపుల్ తలాఖ్ పద్ధతిని నిషేధించడానికే మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతకాలం పట్టింది. దాన్ని కూడా వాళ్ల మతాచారాలలో జోక్యం చేసుకోవడం, వాళ్ల స్వాతంత్య్రాన్ని హరించడం లాంటి మాటలతో విమ ర్శించినవాళ్లు కోకొల్లలుగా ఉన్నారు. 

కేవలం హిందూమతం మీద మాత్రమే ఈ తరహా దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అయ్యప్ప ఆలయాన్ని ఎందుకు టార్గెట్‌గా చేసుకున్నారన్న ప్రశ్నలు సామాన్య భక్తు ల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. శబరిమల విషయాన్నే చూసుకుంటే, అక్కడ మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న వారిలో ఎక్కువమంది మహిళా భక్తులే కనిపిస్తున్నారు. 50 ఏళ్ల వయసు దాటిన మహిళలు అయ్యప్ప నామస్మరణ చేసు కుంటూ.. భజనలు చేస్తూనే వాహనాలు తనిఖీ చేయడం, అందులో 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు కనిపిస్తే వారికి నచ్చజెప్పి జాగ్రత్తగా కిందకు దింపేసి తిరిగి పంపే యడం లాంటివి చేస్తున్నారు. వాళ్ల చేత అలా చేయించేది అయ్యప్ప మీద ఉన్న అచంచలమైన భక్తిభావమే తప్ప, కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడాలన్న పైత్యం కాదు. ఇక దాదాపుగా మెట్ల వరకు వచ్చిన మహిళలకు పోనీ స్వామి దర్శనభాగ్యం లభించిందా అంటే అదీ లేదు. 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎవరైనా ఆలయంలోని 18 మెట్లలో ఒక్క మెట్టు ఎక్కినా మరుక్షణమే తాను ఆలయం తలుపులు మూసేసి ఇంటికి వెళ్లిపోతానని అయ్యప్ప ఆల యం ప్రధాన పూజారి కందరారు రాజీవరు స్పష్టం చేశారు. బలప్రదర్శన చేయాలన్న మొండిపట్టు మహిళలకు ఉంటే, తాను ఇన్నాళ్లుగా కొలుస్తున్న స్వామి పవిత్రతను కాపాడా లన్న ఉద్దేశం ఆయనకు కూడా ఉంటుంది. దాంతో పోలీసు లు కూడా ఏమీ చేయలేక, అక్కడివరకు భద్రత కల్పించడం మాత్రమే తమ బాధ్యత అని, ఆలయ ప్రవేశం అన్నది పూర్తిగా ప్రధాన పూజారి, ఇతర పూజారుల ఇష్టాన్ని బట్టి ఉంటుందని.. ఆయన వద్దంటున్నారు కాబట్టి ఇక వెనక్కి తిరిగి వెళ్లడం మంచిదని సదరు ఉద్యమకారిణులకు సూచిం చారు. 

అసలు బలప్రదర్శన చేయడానికి శబరిమల ఆలయం ఏమీ గోదాకాదు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఒక పవిత్రస్థలం. వాటిని దెబ్బతీయడానికి పెద్దసంఖ్యలోనే జనం కాసుకుని కూర్చుని ఉండచ్చు. కానీ, అదే సమయంలో దేశంలో ఇన్నాళ్లుగా ఉన్న సోదరభావం, మత సామరస్యాలు ఏమవుతాయోనన్న ఆలోచన కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంది. మైనారిటీ లకు భద్రత కల్పించాలన్న వాదన చేసేవాళ్లు మెజారిటీల మనోభావాలను కూడా గౌరవించాలని ఎందుకు ఆలోచిం చరో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని చెప్పగలగాలి. నిప్పును తాకకూడదు అని చెప్పినపుడు ఎందుకని ప్రశ్నించే వాళ్లున్న సమాజంలో ఏం చెప్పాలన్నా ఎలా సాధ్యమవు తుంది? ధర్మం.. న్యాయం ఈ రెండింటికీ చాలా సంద ర్భాలలో ఒకటంటే ఒకదానికి పడదు. న్యాయం చెప్పేట పుడు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అందరూ చెబుతారు గానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం అలా జరగడం అరు దు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎటూ తీర్పు చెప్పే సింది కాబట్టి దాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం తప్పుకాదు. అందులోనూ దేవుడిని, ఆచా రాలను, మత విశ్వాసాలను నమ్మని కమ్యూనిస్టు ప్రభుత్వం కాబట్టి ఆ విషయంలో నాలుగడుగులు ముందుకే వేస్తుంది తప్ప వెనక్కి తగ్గదు. కానీ, వేలాదిమంది భక్తులు.. స్వామిని ఇన్నేళ్లుగా తన సొంతచేతులతో అలంకరించి మురిసిపోతున్న పూజారులు.. వీళ్లంతా మాత్రం తమ ధర్మా న్ని తాము కాపాడుకోవాలన్న తపనతో తమవంతు ప్రయ త్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేసి, తానిచ్చిన తీర్పును అదే కోర్టు సమీక్షించుకోవాలని కోరుతున్నారు. ఆ పిటిషన్లు ఏమవుతాయో.. వాటి విచారణ సందర్భంగా ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయో, ఆ తర్వా త ఏ తీర్పు వెల్లడవుతుందో కాలానికే ఎరుక. స్వలింగ సంపర్కం నేరమని ఒక తండ్రి ఒక సమయంలో తీర్పు చెబితే, ఆయన కొడుకు దాన్ని నేరం కాదని ఆ తర్వాత ఇటీవలి కాలంలో తీర్పు చెప్పారు. నాటి తీర్పును సమీక్షిం చుకుని.. అది కాలపరీక్షకు నిలబడదని స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో ఏమవుతుందో, ఎలాంటి తుదితీర్పు వస్తుందో వేచిచూడాల్సిందే. 

- రాఘవ
సీనియర్ పాత్రికేయుడుఅయ్యప్ప భక్తులకు అండగా ఉంటాం..

Updated By ManamSat, 10/27/2018 - 18:44
amit shah in kerala

తిరువనంతపురం : శబరిమలలో మహిళల ప్రవేశం విషయంలో కేరళ ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడుతోందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. కేరళ ప్రజలు, అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాలకు బీజేపీ మద్దతు ఇస్తుందని, మీ వెంటే ఉంటామంటూ ఆయన భరోసా ఇచ్చారు. శబరిమల ఆలయంలో బ్రహ్యచర్యం దీక్ష పాటించే వారికే అనుమతి ఉంటుందని, ప్రత్యేకించి ఓ వయసు మహిళలను అనుమతించరని అన్నారు. దేశంలో చాలా ఆలయాలు మహిళలకు మాత్రమే ఉన్నాయని, పురుషులను అనుమతించరని, ఆ ఆలయాల్లోకి ప్రవేశించేందుకు మగవాళ్లు ప్రయత్నించరని అమిత్ షా అన్నారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ షా తన ప్రసంగాన్ని ముగించారు. 

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకున్నందుకు 2800 మందికిైపెగా అరెస్ట్ చేయడాన్ని షా ప్రస్తావిస్తూ.. వీరు సంప్రదాయాలను కాపాడుకునేందుకు పోరాడుతున్నారని అన్నారు. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆలయంలోకి మహిళలు (10-50 ఏళ్ల మధ్య వయసు వారు) ప్రవేశించకుండా కేరళలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా, పలుచోట్ల హింస చోటుచేసుకుంది.

శనివారం కేరళలోని కన్నూరులో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ఈ విషయంపై స్పందించారు. కేరళలో ప్రభుత్వ నిరంకుశత్వానికి, మతవిశ్వాసాలకు మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. శబరిమల అంశాన్ని కేరళ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, బీజేపీ, ఇతర పార్టీ సానుభూతి పరులను అరెస్ట్ చేయడానికి దీన్ని అవకాశంగా తీసుకుంటోందని విమర్శించారు. వేలదిమంది కార్యకర్తలు జైలులో ఉన్నారని చెప్పారు. శబరిమలపై సుప్రీం కోర్టు తీర్పు అమలు పేరుతో భక్తులను వేధించవద్దని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను హెచ్చరించారు. కేరళలో ఆలయాల పవిత్రతను దెబ్బతీసేందుకు పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని అమిత్ షా ఆరోపించారు. 

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మహిళలు ప్రవేశించకుండా చేపట్టిన ఆందోళనకు కేరళ బీజేపీ శాఖ మద్దతు ప్రకటించింది. నెలవారీ పూజల నిర్వహణకు ఈ నెల 17 నుంచి 22 వరకూ అయ్యప్ప స్వామి ఆలయాన్ని తెరిచి ఉంచారు. ఈ సందర్భంగా ఆలయ దర్శనానికి వెళ్లిన మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేరళలో 2825 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి, మొత్తం 495 కేసులను నమోదు చేశారు. కొండెక్కి.. యూటర్న్

Updated By ManamSat, 10/20/2018 - 00:15
  • శబరిమల వరకు వెళ్లి తిరిగి వెనక్కి.. ఇద్దరు మహిళలకు చేదు అనుభవం

  • ఒకరు హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు.. మరొకరు కేరళ ముస్లిం ఉద్యమకారిణి

  • వస్తే ఆలయ తలుపులు మూసేస్తామన్న .. ఆలయ ప్రధాన పూజారి స్పష్టీకరణ

  • మహిళలకు నచ్చజెప్పిన పోలీసు ఐజీ

శబరిమల: సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అండతో శబరిమల కొండ పై వరకు వె ళ్లగలిగినా, అక్కడి నుంచి అయ్యప్ప ప్రధానాలయం దర్శనం చేసుకోకుండానే ఇద్దరు మహిళలు వెనుదిరగాల్సి వచ్చింది. దారిలో తీవ్రస్థాయిలో నిరసనలు ఎదురైనా లెక్కచేయకుండా ఆ మహిళలిద్దరూ శుక్రవారం ఉదయం కొండ వరకు వెళ్లారు. వారికి  చుట్టూ పోలీసులు రక్షణ కవచంలా నిలిచారు. ప్రధానాలయానికి కేవలం 500 మీటర్ల దూరం వరకు కూడా వాళ్లు వెళ్లిపోయారు. ఆ కొద్ది దూరం దాటితే 18 మెట్లు కూడా ఎక్కేసేవారే. అయితే, ప్రధానాలయం దగ్గర క్షేత్రస్థాయి పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని, అక్కడి భక్తులను నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చని ఆ ఇద్దరు మహిళలకు పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్. శ్రీజిత్ తెలిపారు. దాంతో.. ఆ ఇద్దరూ తిరిగి బేస్ క్యాంపు వద్దకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఒకవేళ మహిళలను ఆలయ దర్శనానికి అనుమతిస్తే ఆలయాన్ని పూసేస్తామని ప్రధాన పూజారి  రాజీవరు కందరారు కూడా పోలీసులకు స్పష్టం చేశారు. ఇది ఆచారాన్ని మంటగలపడమేనని, అందులో తాను భాగం కాలేమని ఆయన అన్నారు. తాము మహిళలను ఆలయం సమీపం వరకు తీసుకెళ్లగలమే గానీ.. దర్శనం మాత్రం ప్రధాన పూజారి అనుమతితో మాత్రమే జరుగుతుందని ఐజీ తెలిపారు. తాము ఇద్దరు మహిళలను ఆలయం వరకు తీసుకెళ్లినా, ప్రధాన పూజారి, ఇతర పూజారులు మాత్రం వారు మరింత ముందుకొస్తే ఆలయాన్ని మూసేస్తామని హెచ్చరించారని ఐజీ తెలిపారు.

image


ఒకవేళ మహిళలు వస్తుంటే ఆలయాన్ని మూసేయాలని ప్రధాన పూజారికి పాండలం రాజకుటుంబ సభ్యులే సూచించినట్లు తెలిసింది. ఆ ఇద్దరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన మోజో టీవీ మహిళా జర్నలిస్టు కవిత కాగా, మరొకరు కొచ్చి ప్రాంతానికి చెందిన మహిళ ఫాతిమా రెహనా. వారిద్దరూ నిరసన ప్రదర్శనలను అధిగమించి కొండ పైవరకు వెళ్లారు. చుట్టూ పోలీసు బందోబస్తు నడుమ మహిళలు హెల్మెట్లతో పాటు పోలీసులు ధరించే రక్షణ దుస్తులన్నింటినీ ధరించి మరీ పైకి వెళ్లారు. తాను ఆలయం సమీపం నుంచి రిపోర్టింగ్ చేస్తానని, అందుకే తనను పైకి తీసుళ్లడానికి తగిన భద్రత కావాలని కవిత కోరారు. తాను అక్కడకు భక్తురాలిగా వెళ్లడం లేదు కాబట్టి 18 మెట్లు ఎక్కనని అన్నారు. దానికితోడు ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తులు ఆచరించాల్సిన కర్మలను కూడా ఆమె పూర్తిచేయలేదు. మరోవైపు కొచ్చి నుంచి వచ్చిన రెహనా ఫాతిమా అనే ముస్లిం ఉద్యమకారిణి మాత్రం.. అవకాశం ఉంటే 18 మెట్లు ఎక్కేందుకు సిద్ధపడే వచ్చారు. ఆమె సంప్రదాయ నల్ల దుస్తులలో ఆలయం వరకు వచ్చారు. కాగా, రెహనా శబరిమలకు బయల్దేరుతున్న విషయం తెలిసి.. కొచ్చిలోని ఆమె ఇంటిమీద కొందరు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. 

అంతకుముందు న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన ఇద్దరు మహిళా జర్నలిస్టులకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఢిల్లీకి చెందిన సుహాసినీ రాజ్.. తన విదేశీ సహోద్యోగితో కలిసి పంబా నదిని ఎలాగోలా దాటారు. అయితే, సరిగ్గా కొండ ఎక్కడానికి ముందు కొంతమంది భక్తులు మానవ కవచంలా మారి ఆమెను అడ్డుకున్నారు. తాను ఆలయానికి రావడం లేదని, పని చేసుకోడానికి వస్తున్నానని ఆమె చెప్పినా.. భక్తులు మాత్రం ఊరుకోలేదు. తాను సగం దారి వరకు వెళ్లానని, కానీ అక్కడ నిరసనలు బాగా ఎక్కువవ్వడంతో ఇక తిరిగి వచ్చేయాల్సి వచ్చిందని సుహాసినీరాజ్ అన్నారు. భక్తులు దారికి అడ్డంగా కూర్చుని నినాదాలు చేశారని, దాంతో ఆమె వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఆమెను బలవంతంగా పంపలేదని, ఆమే వెళ్లిపోయారని తిరువనంతపురం ఐజీ మనోజ్ అబ్రహం తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం బలప్రయోగం చేసి.. భక్తుల మనోభావాలను దెబ్బతీయదని చెప్పారు. శుక్రవారం ఆలయానికి వెళ్లిన ఇద్దరు మహిళల్లో ఒకరు ఉద్యమకారిణి అని తర్వాత తెలిసిందని, బలప్రదర్శనకు.. ఉద్యమాలు చేయ డానికి శబరిమల సరైన ప్రాంతం కాదని ఆయన అన్నారు.శబరిమలలో కొనసాగుతున్న 144సెక్షన్

Updated By ManamThu, 10/18/2018 - 12:00

Sabarimalaతిరువనంతపురం: శబరిమలలో బంద్ కొనసాగుతోంది. బుధవారం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శబరిమల పరిసరాల్లో పోలీసులు 144సెక్షన్ విధించగా.. ఈరోజు కూడా కొనసాగుతోంది. అయితే నెలవారీ పూజల నిమిత్తం శబరిమల అయ్యప్ప సన్నిధానాన్ని బుధవారం తెరిచారు. ఇటీవల సుప్రీం తీర్పు నేపథ్యంలో పలువురు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లారు.

అయితే మహిళల అనుమతిని నిరాకరిస్తూ శబరిమల సంరక్షణ సమితి 24గంటల హర్తాళ్‌కు పిలుపునిచ్చింది. శబరిమల సంరక్షణ సమితితో పాటు విశ్వహిందూ పరిషత్ కూడా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన మహిళలను అడ్డుకున్నారు. మరికొందరిపై దాడి కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 144 సెక్షన్‌ను విధించారు పోలీసులు.శబరిమలలో టెన్షన్ వాతావరణం

Updated By ManamWed, 10/17/2018 - 13:12

Sabarimalaతిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం సాయంత్రం అయిదు గంటలకు ఆలయాన్ని తెరవనున్న నేపథ్యంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. శబరిమల ఆలయంలోకి అన్నివయసుల మహిళలను అనుమతించాలంటూ ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 

కోర్టు తీర్పు నేపథ్యంలో మహిళలు..శబరిమలకు తరలి వస్తున్నారు. దీంతో  మహిళా భక్తులను అయ్యప్ప సన్నిధికి వెళ్లకుండా ఆందోళనకారులు ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుమారు వెయ్యిమంది పోలీసులు మోహరించి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. సేవ్ శబరిమల పేరుతో పతనంతిట్ట బస్టాండ్‌లో భారీగా ఆందోళనకారులు ఆందోళన చేస్తున్నారు.

మరోవైపు మహిళా జర్నలిస్టులపై కూడా ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. అలాగే అక్కడకు వెళ్లిన రిపోర్టర్ సరితా బాలన్‌పై కొంతమంది దాడి చేశారు. దాంతో ఆమెతో పాటు మరికొందరు రిపోర్టర్లను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా అన్ని వయసు గల మహిళలను శబరిమలకు వెళ్లొచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.

ఈ తీర్పును కట్టుబడి ఉంటామన్న కేరళ ప్రభుత్వం మహిళా భక్తులకు భద్రత కల్పిస్తామని తెలిపింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తున్న కొందరు సేవ్ శబరిమల పేరుతో ఆందోళనను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు మహిళలను శబరిమల కొండ వెళ్లకుండా అడ్డుకున్ని, వెనక్కి పంపించివేశారు.కేరళ మాజీ బిషప్‌కు బెయిల్ మంజూరు

Updated By ManamMon, 10/15/2018 - 12:02

Bishopతిరువనంతపురం: నన్‌లను అత్యాచారం చేసిన కేసులో అరెస్టైన కేరళ మాజీ బిషప్‌ ఫ్రాన్స్‌కో ముక్కల్‌కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కేరళ హైకోర్టు సోమవారం అతడికి బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే బెయిల్ అనంతరం కేరళలోకి అతడు రాకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, అలాగే పాస్‌పోర్టును కూడా ఇచ్చేయాలని హైకోర్టు ఆంక్షలు విధించింది.

అయితే 2014 నుంచి 2016వరకు బిషప్ ములక్కల్ తనను 13సార్లు అత్యాచారం చేశాడని 43ఏళ్ల నన్ ఓ కేసును నమోదు చేసింది. ఆ తరువాత కూడా పలువురు అతడిపై ఆరోపణలు చేయగా.. పలు కోణాల్లో బిషప్‌ను ప్రశ్నించిన పోలీసులు సెప్టెంబర్ 21న తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇదివరకు పలుమార్లు బిషప్ బెయిల్ కోసం పెట్టిన పిటిషన్లను కింది కోర్టు, హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.తల్లితనానికి మన్నన

Updated By ManamTue, 10/09/2018 - 07:16

imageఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుల్లో ఒకటి, శబరిమల అయ్యప్ప దేవాలయ ప్రవేశానికి స్త్రీలకు అర్హత ఉందని చెప్పడం. 21వ శతాబ్దంలో ఒక గుడిలోకి ‘స్త్రీత్వం’ కారణంగా ప్రవేశం కల్పించాలని ఈ దేశ ఉన్నత న్యాయస్థానమే ఆదేశించిందంటే మనం మానవ హక్కుల విషయంలో ఎంత దిగజారి ఉన్నామో ఈ విషయం తెలపకనే తెల్పుతుంది. ఆ తీర్పుని ఎందరో స్వాగతిస్తుంటే మరోవై పున కేరళలో కొందరు మహిళలే దాన్ని వ్యతిరేకించడం, ఊరేగిం పులు తీయడం కూడా జరిగిపోయింది.

మంత్రతంత్రాలున్న విఠలాచార్య సినిమాల్లో చూ శాం. నిన్న మొన్న ఇంగ్లీషు చిత్రం ‘మమ్మీ’లో చూ శాం. తమ వాళ్ళను తామే చంపే ఉన్మాదిగా తయారు చేసి వదిలే సంఘటనలు. మమ్మీలో దుష్టశక్తి నోరు తెరవగానే కొన్ని కీటకాలు వస్తాయి. ఆ కీటకాలు కుట్ట గానే ఆ కుట్టిన వ్యక్తులు దుష్టశక్తి సైన్యంగా మారిపో తారు. దుష్టశక్తిని చంపడానికి వస్తున్న తమవాళ్ళనే చంపేస్తారు. మంత్రాలకీ, తంత్రాలకీ ఇలాంటి శక్తులు ఉండవు. కానీ, ఒక భావజాలం మాత్రం అలా మం త్రించి వదిలేస్తుంది. అలాంటి సంఘటన నిన్న మొన్నే చూశాం. ఇదే వైదిక భావజాలాన్ని బతికిస్తు న్న మనువాదం. 
కేరళలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ‘స్త్రీల కు ప్రవేశం కల్పించాలి, ఇది మానవ హక్కు’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో మహిళలే ఊరేగింపు చేయడం. ‘మాకు ప్రవేశం వద్దు’ అని వారు నినదించడం. ‘దేవాలయంలోకి మేం వెళ్ళం’ అంటే వీళ్ళేదో నాస్తికులై హేతువాద చైతన్యం తో చేసిన ఊరేగింపు కాదు. వైదిక భావజాలాన్ని, వం టబట్టించుకున్న వాళ్ళే, మతవాదుల మాయాజాలం లో చిక్కుకున్న వాళ్ళు!

కేరళలో రాజకీయంగా బతకడం కోసం మత వా దం చేసిన ప్రయత్నంలో ఇది ఒక భాగమే కావచ్చు. అయినా, ‘మాకు ఆ హక్కు’ వద్దు అంటూ మహిళలే రావడం ఇది మనువాద మతోన్మాద మంత్ర ప్రభావ మే! అంబేడ్కర్ అనే మహాశక్తి లేకపోతే ‘రిజర్వేషన్లు మేం తీసుకోం. అది తప్పుగదా!’ అని ఈ దేశ దిగువ కులాల వారితో ఎప్పుడో ‘మనమంతా ఒక్కటే’ అనే మధుర గీతాలు పాడించేవారే మనువాదులు! సమా జంలో వివక్షలు రేపి, కులభేదాలతో, లింగ అసమాన తలతో భావజాల బానిసలుగా కట్టిప డేయడమే మనువాద నీతి. దీనిలో భాగమే ‘మాకు దేవాలయ ప్రవేశం వద్దు’ అని కేరళలో మహిళలే ఊరేగింపు తీయడం. 

‘నెలసరి’ మొదలు కాని ఆడపిల్లలకు, నెలసరి ఆగిపోయిన వయస్సు మళ్ళిన స్త్రీలకు శబరిమల దేవాలయ ప్రవేశం ఉంది కానీ, ‘నెలసరి’ కొనసాగే స్త్రీలకు మాత్రం ప్రవేశం లేకపోవడం నిజంగా విడ్డూ రం. నెలసరి అనేది స్త్రీ శరీరతత్వం. నిజానికి నెలసరి అనేది స్త్రీ ఆరోగ్యానికి ఒక సూచిక. స్త్రీ అంటే మాతృ త్వం. ఆ ప్రక్రియ తల్లితనానికి తొలి అర్హత. ప్రపంచ మనుగడకు నెలవాలమైన ఈ అర్హతనే కించపరచే విధానం ఎంత నీచమైందో ఆలోచిస్తేనే అర్థమవు తుంది.
జీవ పరిణామం ప్రకారం జీవులు పుట్టి ఈ భూ మ్మీద నాలుగు వందల కోట్ల సంవత్సరాలు కావొ స్తుంది. ఆ తర్వాత 350 కోట్ల సంవత్సరాలు గడిచాక  (నేటికి 50 కోట్ల సం॥నాడు) స్త్రీ, పురుష విభజన జరిగింది. స్త్రీ జీవులు గర్భం ధరించి, సంతానాన్ని క నే పరిణామం జరిగి ఏడు కోట్ల సంవత్సరాలు క్రితం మాత్రమే! ఈ కనే జీవుల్లో కూడా రుతుచక్రం (నెల సరి) ప్రారంభమైంది కేవలం కోటి సంవత్సరాల క్రిత మే. ఈ పరిణామ క్రమంలో ఉడుత, ఎలుక, ఏను గు, గుర్రం, పశువులు, చింపాంజీలు, మనుషులు మొదలైన క్షీరదాలన్నింటిలో నెలసరి రుతుక్రమం ఉం ది. రుతు క్రమం కనిపించడం జీవి ఆరోగ్యానికి సంకే తం. ఇది జీవ పరిణామక్రమంలో ఉన్నత దశ. సురక్షితమైన జీవచర్య.
ఇలాంటి ఈ జీవచర్యని ‘అంటు’తో ముడి పెట్ట డం ఒక్క భారతీయ సమాజంలోనే చూస్తాం. ము ఖ్యంగా వైదిక భావజాలంలో స్త్రీలందరూ శూద్రులు  కిందే లెక్క. శూద్రులకు ఏ విధమైన జ్ఞానార్జన హక్కు లు లేవో ఆ హక్కులు బ్రాహ్మణ  స్త్రీలకూ లేవు. వైదిక సంస్కృతిలో స్త్రీలకు విద్యలు, వేద విద్యలూ నిషేధం. అందుకే ‘తల్లి శూద్రురాలు తానెట్లు బాపడు’ అని ప్రశ్నించాడు వేమన.

ఐతే, ఒక నెలలోని మొత్తం రోజుల్లో 24 రోజులు స్త్రీలను శూద్రురాలిగా చూస్తూ, మిగిలిన నాలుగైదు రోజులు ‘అంటరాని’ పంచమజాతికి చెందిన వ్యక్తిగా దూరంగా పెట్టడం అనేది కూడా ఈ వైదికంలో కని పిస్తుంది. ఈ దురాచారం రుతుక్రమం వల్ల వచ్చిన రోగమే! నెలసరి అయిన ఆ నాలుగైదు రోజులు స్త్రీని అంటుకోకూడదు. అంటే స్త్రీలను ఇటు శూద్రులుగా, అటు పంచములుగా రెండు రకాల ‘హోదాలు’ కల్పించి, వారిని దూరంగా పెట్టిందీ వైదిక సంప్రదా యం. అసలు ఈ అంటు అనే భావజాలం తొలిగా వే దంలోనే పడింది. కృష్ణయజుర్వేదం 2-5-1లో ఇలా ఉంది-

త్వష్ణ కుమారుడు విశ్వరూపుడు. విశ్వరూపుడు దేవతల పురోహితుడు. కానీ, యజ్ఞంలో లభించే హవి ర్భాగాన్ని దేవతలతో పాటు అసురులకు కూడా చెందే ట్టు చూడ్డం వల్ల ఇంద్రునికి ఇతనిపై కోపం వచ్చింది. అతని మూడు తలల్ని నరికేశాడు. దానితో ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం పట్టుకుంది. ఆ పాపభారాన్ని మోయలేక ఇంద్రుడు భూమి దగ్గరకు వచ్చి తన పాప భారాన్ని తీసుకోమని అడుగుతాడు. భూమి ఆ పాపం లో మూడోభాగం తీసుకుంది. ఆ కారణంగా భూమిపై కొంతభాగం ఎడారిగా మారింది. అలాగే చెట్లదగ్గరకు వచ్చి అడిగాడు. కొన్ని చెట్లు మూడోభాగాన్ని తీసుకు న్నాయి. ఆ ఫలితంగా ఆ చెట్ల నుంచి జిగురులు స్రవి స్తున్నాయి. చివరకు ఇంద్రుడు స్త్రీల దగ్గరకు వెళ్ళి తన పాపభారాన్ని పంచుకోండని అర్ధిస్తాడు. అప్పుడు వారు అంగీకరిస్తారు. ఆ పాపభారం వల్లే స్త్రీలకు ‘రజస్వల’ కలుగుతుంది. అది పాపభార ఫలితం కాబ ట్టి ఆ సమయంలో స్త్రీలను తాకకూడదు. వారితో మాట్లాడకూడదు. కలసి కూర్చోకూడదు. వారు తినే సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే రజ స్వల బ్రహ్మహత్యాఫలం కాబట్టి ఇదే కృష్ణ యజు ర్వేదంలోని అంశం. నెలసరికి కారణం ఏమిటో తెలి యని కాలంలో అల్లిన ఒక కథే ఆ తర్వాత అదే సామాజిక అంశంగా మారింది. సాంఘిక దురాచా రంగా, లింగవివక్షగా కరుడుకట్టుకు పోయింది. స్త్రీల నెలసరి దోషం అనే విషబీజం ఇక్కడే పడింది. ఆ ఫలితమే స్త్రీలకు అంటుగా, శబరిమలలో అంటరాని తనంగా మారింది.
‘తల్లి’తనాన్ని కూడా వికృతంగా చూసే మను వ్యవస్థకు మారురూపమే ఈ దేవాలయ ప్రవేశ నిషి ద్ధం. మన పురాణ ఇతిహాసాల్లో కూడా దేవుళ్ళకీ, మా తృత్వానికీ పెనవేసుకున్న అనురాగబంధాల్ని చూడ లేం. ఒక్క శ్రీకృష్ణుడు తప్ప పాకృతిక నియమాల ప్రకారం తల్లిగర్భాన పుట్టిన దైవాలు కూడా దాదాపు గా లేరు. అందరూ చిత్రవిచిత్రంగా ప్రభవించిన వారే! తల్లి గర్భాన ప్రసవమందినవారు దాదాపుగా లేరు. అందుకే మాతృత్వపు గొప్పదనం అనేది  మన మానవీయ ఆలోచనల్లో తప్ప, మన ఆథ్యాత్మిక అంశా ల్లో ఎప్పుడూ లేదు. స్త్రీని గౌరవిస్తే గదా! తల్లిని గౌర వించేది! స్త్రీ గౌరవానికి చోటులేని వైదిక మనుధర్మం లో మాతృత్వ గౌరవానికీ పెద్ద ప్రాముఖ్యత ఏముంటుంది?
శారీరక ధర్మశాస్త్రం ప్రకారం, శరీరం ఒక యం త్రం. నిరంతరం దాన్లో ఎన్నో మలినాలు తయారవు తూ ఉంటాయి. వాటిని నిరంతరం విసర్జిస్తూ ఉండా లి. ‘విసర్జన అపచారం’ అని మడిగట్టుకుని బతికే జీవి ఏదీ ఈ భూమ్మీద లేదు. తినడం కంటే విసర్జనే ఆరోగ్యానికి మూలం. వాహనంలో ట్యాంకు నిండా పెట్రోలు నింపినా, మంచి పవర్ గల బ్యాటరీతో స్వి చ్ కొట్టినా, విసర్జన అవయవమైన పొగగొట్టాన్ని మూ సి ఉంచితే బండి స్టార్ట్ కాదు.

మన శరీరం కూడా అంతే... చెమటగా, గుమిలి గా, పుసిగా, పడిశంగా, మూత్రంగా, మలంగా మలి నాలూ ఎప్పుడూ బైటకు పోతూ ఉండాల్సిందే! ఇవి దైహిక కార్యక్రమాలు. వీటికి తోడు స్త్రీలకి సంతానం కనే లక్షణం ఉంది. దానికి ‘అండం’ అవసరం. కాబ ట్టి అండాలు కూడా పుట్టిగిట్టుతూ ఉంటాయి. గిట్టిన అండాలు అక్కడే ఉంటే గర్భాశయం కుళ్ళి తల్లికి అ నారోగ్యం కలుగుతుంది. మనకు పుట్టే యోగం ఉండ దు. జాతి నశిస్తుంది. అందుకే ఆ అండాలు బైటకు విసర్జించబడతాయి. ఈ అండ విసర్జననే రజస్వల లే దా నెలసరి అంటాం. ఇది 28 రోజుల చక్రం. మనం పుట్టడం కోసం తల్లి గర్భాలయాన్ని శుద్ధిచేసి, మన కోసం మన జన్మ కోసం సిద్ధంగా ఉంచే అతి పవిత్ర కార్యం ఇది.  ఇక్కడ మనం ఖచ్చితంగా కొన్ని విష యాల్ని చెప్పుకు తీరాలి.

ఒకటి: దైవ పూజలు చేసే రోజుల్లో భక్తులు తమ ఇతర విసర్జనల్ని మానుకుంటున్నారా? ఆ విసర్జనలు దైవదర్శనానికో, దైవపూజకో అడ్డంకి కానప్పుడు ఈ మాతృగర్భ అండ విసర్జన ఎలా అడ్డంకి అవుతుంది? ఒక విసర్జన శుద్ధం, ఒక విసర్జన అశుద్ధం ఎలా అవుతుంది? రెండు: వేదం చెప్పింది కాబట్టి వేద వాక్కుగా భావిద్దామా? అంటే... ఈ రోజున వేదంలో చెప్పినట్టు దైవాల్ని పూజించే వాళ్ళు ఒక్కరూ లేరు. వేదకాలంలో వేల సంవత్సరాలు పూజలందుకున్న ఇంద్రుణ్ణి ఇప్పుడు పూజించేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ‘వేదభూమిలో’ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ పెట్టి వెదికినా కన్పించరు. పైగా ఇప్పుడు ఇంద్రుడు పెద్ద వ్యభిచారి. స్త్రీలోలుడుగా మిగిలిపోయాడు. వేదా ల్ని, వేద కర్మల్ని పాటించేవారు లేనేలేరు. కాబట్టి ఈ ‘నెలసరి’ విషయాన్ని పాటించాల్సిన పనేలేదు. మూడు: సాధారణంగా నెలసరి రోజుల్లో ఏ స్త్రీ కూడా దైవకార్యాలు చేయదు. కానీ ఇక్కడ శబరిమలలో నెల సరి కనిపించే ఆ మూడు నాలుగు రోజులే కాదు, పరి పూర్ణ మాతృత్వానికి ప్రతీకగా ఉండే నెలసరి చక్రపరి ధిలో ఉన్నన్నాళ్ళు (రజస్వల నుంచి మెనోపాజ్ వర కు) స్త్రీలకి ఆలయ ప్రవేశార్హతలు లేవన్నమాట. అంటే ఈ దైవం ‘మాతృత్వ విరోధి’ (ఈస్ట్రోజన్ హార్మోన్ వైరి) అన్నమాట. మాతృత్వ వైరి మనిషే కాదు. మరి దైవం ఎలా అవుతాడు? ఇది, తల్లితనాన్ని తక్కువ గా, హీనంగా చూడ్డమే.
వైదిక సంప్రదాయంలో స్త్రీలకి ఆధ్యాత్మిక హక్కు లేదు. వేదాధ్యయనం, సంస్కారాలు, ఎలానూ లేవు. కనీసం దేవాలయ ప్రవేశం కూడా లేకపోవడం ఎంత దుర్మార్గం. ఇంట్లో భార్య, బిడ్డలు (కూతుళ్ళు) చేసిన వంటలు కూడా అయ్యప్పమాల ధరించిన వారు తిన రు. ఇది నిష్టా! మాలాధారణ ఇందుకేనా? సొంత ఇం ట్లోనే అంటరాని తనాన్ని నెలకొల్పే దైవారాధనల్ని ఏమనాలి?

స్త్రీలకి ఆధ్యాత్మిక రంగంలో స్థానం కల్పించిన మొదటి వ్యక్తి బుద్ధుడే. వారి కోసం ఒక ప్రత్యేక భిక్షు ణీ సంఘాన్ని ఏర్పాటు చేసిన వారికి ధార్మిక జీవనా న్ని అందించిన మానవీయుడు ఆయనే! మహిళలకు ఆస్తి హక్కు, విద్యా హక్కు, ఉద్యోగపు హక్కు ఎలాగో ఆధ్యాత్మిక హక్కు కూడా అలాంటిదే! దైవాన్ని పూజిం చడం, పూజించకపోవడం, దర్శించుకోవడం, దర్శిం చుకోకపోవడం అది ఆస్తిక, నాస్తిక భావజాల అంశం. ఇష్టం వచ్చిన దైవాన్ని పూజించుకోవడం లౌకిక అం శం. కానీ, వివక్షతో దేవాలయ ప్రవేశం లేదని చెప్ప డం అమానవీయం. అనైతికం. ఒకప్పుడు స్త్రీలకు ఆ స్తి హక్కు లేదు. ఓటు హక్కు లేదు. విద్యను పొందే హక్కు లేదు, ఉద్యోగపు హక్కు లేదు ఇవ్వన్నీ హక్కు లే! ఇవేవీ వైదిక మతం ప్రసాదించిన వరాలు కాదు. ఈ ఊరేగింపు తీసినవారు, తీయించినవారు మా మత ధర్మాన్ని మంటగలిపారు. స్త్రీలకి ఎన్నోహక్కులు కల్పించారు. ఇది వైదిక ధర్మ విరుద్ధం. కాబట్టి ‘ఆ హక్కులూ’ మాకు వద్దు అని అనిపించగలరా? అరిపించగలరా?

ఇలాంటి ఊరేగింపుల్ని చూస్తే  ‘ఎప్పటి నుంచైతే స్త్రీని గౌరవించడం భారతదేశం మానేసిందో, అప్ప టి నుంచే మన పతనం ప్రారంభమయ్యింది. ఎప్పుడై తే అన్నిరంగాల్లో, అన్ని విషయాల్లో స్త్రీలను తీర్చిదిద్ద గలమో అప్పుడే మన అభివృద్ధి మొదలవుతుంది’ అని ఎలుగెత్తి చాటిన వివేకానందుడు తల్లడిల్లడా?  మనుషులంతా సమానమే అయినప్పుడు... కుల, మత, జాతి, లింగ వివక్షలు లేని మన సమాజంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించాల్సిందే! ఇది తల్లితనానికి తెచ్చిన గౌరవంగా కీర్తించాల్సిందే! 

- బొర్రా గోవర్ధన్,
9390600157.

Related News