hello guru prema kosame

ఫైనల్ కాపీ చూసేశాం.. సెలబ్రేషన్స్ స్టార్ట్

Updated By ManamMon, 10/15/2018 - 12:40

Hello Guru Prema Kosameరామ్ హీరోగా నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు తెరకెక్కించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. అనుపమ పరమేశ్వరన్, ప్రకాశ్ రాజ్, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రలలో నటించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ఫైనల్ కాపీ రెడీ అవ్వగా.. దాన్ని చూసిన చిత్ర యూనిట్ సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిత్రం హిట్ గ్యారెంటీ అంటూ అప్పుడే సెలబ్రేషన్స్‌ను కూడా ప్రారంభించేసింది.

ఈ విషయాన్ని ఆ చిత్ర మాటల రచయిత ప్రసన్న కుమార్ సోషల్ మీడియాలో తెలుపుతూ.. ‘‘సినిమా ఫైనల్ కాపీ చూసేశాం. సెలబ్రేషన్స్ స్టార్ట్. ఈ సారి దసరా.. క్యాలెండర్‌లో, థియేటర్లో ఒకేసారి వస్తుంది. హలో గురు ప్రేమ కోసమే అక్టోబర్ 18న రానుంది’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఈ సందర్భంగా వారి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ ఫొటోను కూడా షేర్ చేసుకున్నాడు. అందులో దర్శకుడు త్రినాథరావు, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌లు కూడా ఉన్నారు.

 కొత్త డ్యాన్స్‌ను పరిచయం చేస్తున్న రామ్

Updated By ManamMon, 10/15/2018 - 10:48

Ram Pothineniడ్యాన్స్‌లలో బాలీవుడ్‌ హీరోలను ఢీకొట్టే ఎంతోమంది హీరోలు మన టాలీవుడ్ సొంతం. సీనియర్ హీరోలలో చిరంజీవిని మొదలుకొని యంగ్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్, సుధీర్ బాబు, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మంది హీరోలు తమ డ్యాన్స్‌లతో అందరినీ ఆకట్టుకుంటుంటారు. అంతేకాదు వీరిలో పలువురు డ్యాన్స్‌లలో కొత్త కొత్త స్టైల్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేశారు(రీసెంట్‌గా నా పేరు సూర్యలో అల్లు అర్జున్ క్యాప్ డ్యాన్స్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే). కాగా తాజాగా యంగ్ హీరో రామ్ మరో కొత్త డ్యాన్సింగ్ స్టైల్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడు.

త్రినాథరావు దర్శకత్వంలో రామ్ హలో గురు ప్రేమ కోసమే అనే చిత్రంలో నటించగా.. అందులో పెద్ద పెద్ద కళ్లతోటి అనే పాట కోసం పాపింగ్ అనే కొత్త స్టైల్‌ను పరిచయం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విజయ్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటలో పాపింగ్ స్టైల్‌ను దక్షిణాదికి పరిచయం చేయబోతున్నట్లు రామ్ తెలిపారు. కాగా ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, ప్రణీత నటించారు.

 కాలేజ్‌లో జాయిన్ అవ్వగానే చేసే ఫస్ట్‌ పని ఏంటో తెలుసా..?

Updated By ManamWed, 10/10/2018 - 11:22

Hello Guru Prema Kosameరామ్ హీరోగా ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఇందులో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా నటించగా.. ప్రకాశ్ రాజ్, సితార, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో రామ్ కొత్త లుక్‌లో ఆకట్టుకోగా.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ ట్రైలర్ నవ్వులు పూయిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. హైపర్, ఉన్నది ఒక్కటే జిందగీ పరాజయాల తరువాత వస్తున్న ఈ చిత్రంపై రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 12న జరగనున్న విషయం తెలిసిందే.

 ‘హలో గురు ప్రేమకోసమే’ మొదటి పాట విడుదల 

Updated By ManamMon, 09/24/2018 - 17:13

HGPKరామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు తెరకెక్కించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మొదటి పాటను విడుదల చేశారు. మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. ఆల్ఫోన్స్ జోసెఫ్ పాటను ఆలపించారు. హీరోయిన్‌ను చూసి హీరో తన ఫీలింగ్‌ను చెప్పేలాగా వచ్చిన ఈ పాట యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రణీత తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.మల్టీస్టారర్‌లో రామ్..?

Updated By ManamTue, 09/11/2018 - 14:53

Ram   అన్ని ఇండస్ట్రీలలో మల్టీస్టారర్ల హవా పెరిగిపోతోంది. దీంతో మల్టీస్టార్లర్ చిత్రాలలో నటించేందుకు యంగ్ హీరోలు మొదలుకొని సీనియర్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో రామ్ కూడా మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. స్రవంతి రవికిశోర్ నిర్మించబోయే ఈ చిత్రంలో ఓ తమిళ హీరోతో పాటు రామ్ నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం రామ్ హలో గురు ప్రేమ కోసమే అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.‘హలో గురు ప్రేమ కోసమే’ టాకీ పార్ట్ పూర్తి

Updated By ManamMon, 09/10/2018 - 14:17

Hello Guru Prema Kosameరామ్ హీరోగా నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. గత కొన్ని రోజులుగా ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టాకీ పార్ట్ పూర్తైంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది. ఇక మిగిలిన పనులను కూడా పూర్తి చేసుకొని అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది.

రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ నటించగా.. ప్రకాశ్ రాజ్, ప్రణీత కీలక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.‘హ‌లో గురు ప్రేమ కోసమే’ టాకీ పూర్తి

Updated By ManamSun, 09/09/2018 - 15:00
ram-Anupama Parameswaran

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `హ‌లో గురు ప్రేమ కోస‌మే`. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సిబుల్, క్యూట్ ప్రేమ క‌థా చిత్రం కావ‌డంత‌తో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. `సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్’ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్త‌య్యింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి  సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌ని నిర్మాత దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. విడుద‌ల చేస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Ram-Anupama Parameswaran.. hello guru prema kosame

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు త‌న‌దైన సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు.. ర‌చ‌న స‌హ‌కారం సాయికృష్ణ అందిస్తున్నారు.ప్రకాశ్ రాజ్‌తో అనుపమకు గొడవ నిజమేనా..?

Updated By ManamThu, 07/12/2018 - 13:28

Prakash Raj, Anupamaతన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్‌పై ఇంతవరకు ఎలాంటి రూమర్లు రాలేదు. అయితే ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం షూటింగ్‌లో ఆమెకు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌కు గొడవలు వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. షూటింగ్‌లో ప్రకాశ్ రాజ్, అనుపమను తిట్టాడని అందుకు ఆమె బాధపడుతూ కుప్పకూలిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ సమయంలో దర్శకుడు త్రినాథరావు కలగజేసుకొని వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చాడని ఇలా రకరకాల మాటలు వినిపించాయి. 

అయితే వీటికి తెరదించుతూ ప్రకాశ్ రాజ్‌తో తీసుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనుపమ. అంతేకాకుండా ఆ వార్తలన్నీ అబద్ధాలు అంటూ ఓ స్టేట్‌మెంట్‌ను కూడా ఇచ్చేసింది. కాగా ప్రేమకథగా తెరకెక్కుతున్న హలో గురు ప్రేమ కోసమే అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

 ‘హలో గురు ప్రేమకోసమే’కు రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamWed, 07/11/2018 - 13:15
HGPK

రామ్ హీరోగా ‘నేను లోకల్’ ఫేం త్రినాథరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదిని ఖరారు చేశారు దర్శకనిర్మాతలు. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ మరోసారి నటించగా.. ప్రకాశ్ రాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. హైపర్, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి పరాజయాలలో ఉన్న రామ్ ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు.రామ్ మూవీకి మొదలైన మ్యూజిక్ సిట్టింగ్స్

Updated By ManamWed, 05/30/2018 - 11:51

HGPKరామ్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్‌ను ప్రారంభించేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తుండగా శ్రీమణి సాహిత్యాన్ని ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అయితే డేట్స్ కుదరక ఈ మూవీ నుంచి దేవీ శ్రీ ప్రసాద్ తప్పుకున్నట్లు.. ఆ స్థానంలో థమన్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటికి తెరదించుతూ దేవీ శ్రీనే మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యాడు. కాగా ఇంతకుముందు రామ్, దేవీ కాంబినేషన్లో వచ్చిన ‘రెడీ’, ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలు విజయాన్ని సాధించడంతో ఈ మూవీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Related News