kadiyam srihari

ఆఫీసర్ల పాలనొద్దు మేమే ఉంటం

Updated By ManamSun, 07/15/2018 - 02:28
 • మాతోనే సంక్షేమం సజావుగా అమలు

 • పదవీకాలం పొడిగించాలని సర్పంచుల డిమాండ్

 • మంత్రులను కలుస్తున్న ఆ సంఘం నాయకులు 

kadiyamsrihariహైదరాబాద్: ఈ నెల 31వ తేదీతో గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగుస్తుండడంతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమ యింది. అయితే, బీసీల రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించొ ద్దని కోర్టు తేల్చి చెప్పింది. ఈ కారణంతో ఎన్ని కల నిర్వహణ పెండింగులో పడింది. దానితో పదవీకాలం ముగుస్తుండడంతో గ్రామ పంచా యతీల పాలనా బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క, గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించడంపై సర్పంచు లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే మంత్రు లను కలిసి సమస్యలను విన్నవించుకుంటు న్నారు. గతంలో కూడా సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కానీ ఇప్పుడు సర్పంచులు ఆఫీసర్ల పాలనొద్దని, తమ పదవీకాలన్నే పొడ గించమని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, పదవీకాల డిమాండ్ వ్యవహారం కీలకంగా మారునుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. 

సమస్యలొస్తాయి...
గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించడంలో భాగంగా ప్రభుత్వం ఒక్కొక్క ఆఫీసర్‌కు మూడు నుంచి నాలుగు గ్రామాలను కేటాయించనుంది. ప్రభుత్వ అధికారులు తమ విధులకు సంబంధించిన పనులకోసం కల వాలంటేనే రోజులు పడుతుంది. అలాంటి మూడు, నాలుగు గ్రామాల బాధ్యతలను వారికి కేటాయిస్తే అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో జాప్యం జరుగుతుందని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకా ధికారులు పాలనలో క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు తలెత్తుతాయని, సమస్యలొస్తాయని పేర్కొంటున్నారు. 

సర్పంచులతోనే ప్రజల్లోకి సంక్షేమం
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8684 మంది సర్పంచులు ప్రభుత్వ నిర్ణయాలకు సహకరిస్తూ... ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నామని సర్పంచుల సంఘం అభిప్రాయపడుతుంది. రైతు బంధు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లు, ఆసరా పింఛన్లు, హరితహారం వంటి కార్యక్రమాలను విజయవం తంగా నిర్వహిస్తున్నామంటున్నారు. గ్రామాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలకు సర్పంచులే గుర్తుకువస్తారని, అలాంటిది ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తే ప్రజలకు సకాలంలో పనులు జరగవని ఆందోళన చెందుతున్నారు. 

పదవీ కాలం పొడగించాలి: సౌదాని
గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రత్యేకాధికారులతో గ్రామపాలన సాధ్యం కాదని, సర్పంచుల పదవీ కాలాన్ని పొడగించాలని తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన యాదవ్ డిమాండ్ చే శారు. ఆయన నాయకత్వంలో కొంత మంది సర్పంచులు పలువురు మంత్రులను కలిసి వినతి పత్రాలను అందజేస్తున్నారు. శనివారం సచివాలయంలో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి తన నివాసంలో కలిసి తమ  సమస్యలను వివరించారు. సర్పంచుల పదవీ కాలం పొడగింపు, వారి సమస్యలను సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూమన యాదవ్ మాట్లాడుతూ... ఐదేండ్ల నుంచి సర్పంచులుగా ప్రజలకు సేవ చేస్తున్నామని, మరింత కొంత కాలం పొడిగిస్తే అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గాల పదవీ కాలం పొడగించినట్టుగానే తమ పదవీకాలాన్ని పొడిగించాలని వారు కోరుతున్నారు. 

స్పెషల్ ఆఫీసర్స్‌ను నియామకం
ఈ నెల 31 నుంచి గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. కానీ బీసీ రిజర్వేషన్ల లెక్క తేలేంతవరకు ఎన్నికలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించాలని శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. ఇందులో భాగంగా ప్రత్యేకాధికారులను నియమించే వివరాలను సేకరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.సురేశ్ చికిత్స బాధ్యత ప్రభుత్వానిదే

Updated By ManamWed, 07/11/2018 - 00:53
 • ఫైర్‌వర్క్స్ బాధితుడికి నిమ్స్‌లో మంత్రి కడియం పరావుర్శ

kadiyamహైదరాబాద్: ‘వరంగల్‌లో జరిగిన ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాద బాధితుడు సురేశ్ చికిత్స బాధ్యత ప్రభుత్వానిదే.. అతడికి మెరుగైన వైద్యం అందించాలి’ అని వైద్యులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సురేశ్‌ను నిమ్స్‌లో మంగళవారం మంత్రి కడియం పరామర్శించారు. సురేశ్‌కు అందుతు న్న చికిత్సను గురించి వైద్యులను అడిగి తెలుసుకు న్నారు. ప్రభుత్వం తరపున అన్ని ఖర్చులు భరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో సురేశ్ చికిత్స విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని నిమ్స్ అధికారులు, వైద్యులకు సూచించారు. అదేవిధంగా మాదాపూర్‌కు చెందిన జయశంకర్ బస్సు ప్రమాదంలో గాయపడిన వారు నిమ్స్‌లోనే వైద్యం తీసుకుంటుం డగా వారిని కూడా మంత్రి కడియం పరామర్శించారు.అండగా ఉంటాం

Updated By ManamMon, 07/09/2018 - 01:19
 • అమెరికాలో వరంగల్ విద్యార్థి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి  

 • మృతదేహం తరలింపునకు ప్రభుత్వ ఖర్చుతో  ఏర్పాట్లు 

 • తల్లిదండ్రులకు అత్యవసర వీసాలు : కడియం, కేటీఆర్

 • దౌత్యాధికారులతో మంత్రుల సంప్రదింపులు

 • భౌతిక కాయం రావడానికి నాలుగైదు రోజుల సమయం

imageహైదరాబాద్: అవెురికాలో దుండగుడి కాల్పుల్లో మరణించిన వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ మృతి పట్ల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఐటీ మంత్రి కేటీఆర్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు బండ ప్రకాశ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న వారి ఇంటికెళ్లి శరత్ తల్లిదండ్రులు రామ్మోహన్, మాలతిలను వారు పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని     ఈ సందర్భంగా కడియం హామీ ఇచ్చారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను వీలైనంత త్వరలో పట్టుకు నేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున భారత దౌత్య అధికారులు, అమెరికా ఎంబసీతో మాట్లాడా మని చెప్పారు. భౌతిక కాయాన్ని తీసు కొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. శరత్ మరణవార్త విన్నవెం టనే సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారని, ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు. అమెరికాలో జరిగిన దురదృష్టకర సంఘటనలో శరత్ మృతిచెందడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శరత్ మరణం గురించి తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఈ కుటుంబానికి అండ గా ఉండాలని, కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు తమను పంపించారని తెలిపారు. శరత్ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వం తరపున అత్యవసర వీసాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అక్కడున్న శరత్ స్నేహితులు ఇక్కడకు రావాలనుకున్నా వారికి కూడా వీసాలు ఏర్పాటు చేస్తామ న్నారు. అమెరికాలో శని, ఆదివారాలు కార్యాలయాల న్నింటికి సెలవులుండడంతో భౌతికకాయం హైదరాబాద్ తీసుకురావడానికి 4, 5 రోజులు పడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, బీజేపీ సీనియర్ నేత, ఎంపీ బండారు దత్తాత్రేయ ఆదివారం శరత్ కుటుంబసభ్యులను పరామర్శించారు. శరత్ మృతదేహాన్ని త్వరగా తెప్పించేందుకు కేంద్రంతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.

పరిగెత్తడంతో వెనుక నుంచి కాల్పులు
మిస్సోరి యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ కన్సాస్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్న శరత్ జేస్ చికెన్ అండ్ ఫిష్ మార్కెట్ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. శరత్ రోజూలానే శుక్రవారం కూడా తాను పని చేసే రెస్టారెంట్‌కు వెళ్లాడు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌లోకి చొరబడ్డ ఓ దుండగుడు కాల్పులు జరిపి శరత్‌ను పొట్టనబెట్టుకున్నాడు. ఉన్నట్టుండి లోపలికి వచ్చిన ఓ దుండగుడు తుపాకీ చూపించి డబ్బులివ్వాలని బెదిరించాడని, ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా కింద పడుకున్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కానీ శరత్ అక్కడ నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తడంతో ఆ దుండగుడు వెనుకవైపు నుంచి ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడన్నారు. దీంతో కుప్పకూలిపోయిన శరత్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.

త్వరలో వస్తాడనుకొంటే...
శరత్ స్వస్థలం వరంగల్ నగరంలోని కరీమాబాద్. తండ్రి రామ్మోహన్ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నారు. రామ్మోహన్ కుటుంబంతో హైదరాబాద్ అమీర్‌పేట లోని ఓ అపార్టుమెంట్‌లో నివసిస్తున్నారు. వీరికి కుమారుడు శరత్, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లోని వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్ నగరంలోనే మూడేండ్లపాటు ఉద్యోగం చేశాడు.  అవెురికాలో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆశయంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మిస్సోరి యూనివర్సిటీలో చేరాడు. జనవరిలోనే అమెరికా వెళ్లిన శరత్ మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్ నగరంలోని జేఎస్ ఫిష్ అండ్ చికెన్ మార్కెట్ వద్ద ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ చేస్తున్నాడు. త్వరలో శరత్ సోదరి పెండ్లి ఉందని, ఆ వేడుకకు రావాలనుకుంటుండగా ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు.

అన్ని రకాలుగా సాయం
శరత్ మృతి పట్ల విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయించడంతో పాటు అతడి కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని ఆమె ట్వీట్ చేశారు. మృతదేహాన్ని త్వరగా భారత్ రప్పించేందుకు అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

‘శరత్’ కోసం విరాళాల వెల్లువ
అమెరికాలో ఓ దుండగుడి కాల్పుల్లో మరణించిన శరత్ కొప్పు మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు చేపట్టిన క్రౌడ్ ఫండింగ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. శరత్ బంధువు రఘు చోడవరం గోఫండ్‌మి అనే పేరుతో ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ ప్రారంభించిన మూడు గంటల వ్యవధిలోనే 25 వేల డాలర్లు (సుమారు రూ.16,75,000)వచ్చాయి. శరత్ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అతడు.. అవసరం ఉన్నవాళ్లకు సాయం చేసేవాడని రఘు చెప్పాడు. కానీ అనుకోకుండా అతని జీవితం ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదని వాపోయాడు. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి కూడా శరత్ మృతి పట్ల సంతాపం తెలిపింది.

దోపిడీకి యత్నించి.. హత్య!
అవెురికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వరంగల్ విద్యార్థి శరత్‌ను కాల్చి చంపింది దోపిడీ దొంగ అని తేలింది. రెస్టారెంట్‌లోకి వచ్చి తుపాకీతో బెదిరించి దోచుకునే ప్రయత్నంలో అతడిని చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి అవెురికాలోని మిస్సోరి రాష్ట్రం కన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన కొప్పు శరత్ (25) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. దీని ఆధారంగానే అవెురికా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.6.7 లక్షల నజరానాను కూడా ప్రకటించారు.టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Updated By ManamSat, 07/07/2018 - 16:52

హైదరాబాద్ : తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి శనివారం సాయంత్రం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 45.79మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో మొదటి స్థానంలో వరంగల్ జిల్లా చివరి స్థానంలో  ఆదిలాబాద్ జిల్లా నిలిచాయి.

రీ కౌంటింగ్‌కు ఈ నెల 8వ తేదీ నుంచి 16వరకూ అవకాశం ఉంది. కాగా ఇంటర్మీడియెట్‌లో అడ్మిషన్ పొందేందుకు ఈ నెల 31 వరకూ సమయం ఉందని, గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే విద్యార్థులు చేరాలని కడియం శ్రీహరి సూచించారు. అలాగే  ప్రయివేట్ యూనివర్శిటీలకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.బదిలీల వెట్‌సైట్

Updated By ManamThu, 06/07/2018 - 23:59
 • ట్రాన్స్‌ఫర్ల ఆన్‌లైన్ సర్వీస్ ప్రారంభించిన కడియం

 • ఈనెల 10వరకు దరఖాస్తుల స్వీకరణ.. 19న బదిలీల సీనియార్టీ తుది జాబితా విడుదల

 • 26 నాటికి పాఠశాలల్లో ఉపాధ్యాయుల చేరిక.. మొదటిరోజే ‘టెక్నికల్’ ఇబ్బందులు

kadiyamsrihariహైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయంలో గురువారం ఉపాధ్యాయ బదిలీ దరఖాస్తుల కోసం ఆన్‌లైన్ సర్వీస్‌ను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభిం చారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఉపాధ్యాయుల బదిలీలను పూర్తిగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు.

 

10 వరకు దరఖాస్తుల స్వీకరణ
పాత పదిజిల్లాల ప్రకారమే.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీఓ నం.16కు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు బదిలీల షెడ్యూల్ గురువారం జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ముద్రిత ప్రతిని ఎంఈఓకు సమర్పించాలి. ఈనెల 9న ఖాళీల జాబితాను అధికారులు వెలువరించనున్నారు. ఈనెల 10, 11తేదీల్లో ఖాళీలపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బదిలీల కోసం వచ్చిన దరఖాస్తుల న పరిశీలన ఉంటుంది. 14వ తేదీన ఖాళీలు సీనియార్టీ జాబితా విడుదల చేస్తారు. 15, 16 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 19న బదిలీల సీనియార్టి తుది జాబితాను ప్రకటిస్తారు. జూన్ 20 నుంచి 23 వరకు ఆన్‌లైన్ ద్వారా వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. 25వ తేదీన బదిలీల ఆర్డర్లను జారీ చేస్తారు. జూన్ 26నాటికి కేటాయించిన పాఠశాలల్లో ఉపాధ్యాయులు చేరాలి.

మొదటి రోజే ఇబ్బందులు..
ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఆన్‌లైన్ ప్రక్రియలో మొదటిరోజే త్రీవ ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలాచోట్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కొన్నింటిని గమనించిన పాఠశాల విద్యాశాఖ సాఫ్ట్‌వేర్ అప్‌డెట్‌కు సిఫారసు చేసింది. ఆన్‌లైన్‌లో ఫారం సబ్‌మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడీ రావాల్సి ఉంటుంది. కానీ ప్రింట్ ఆప్షన్ ఎక్కడా లేదు. ఈ విషయాన్ని గమనించిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్‌ఫర్స్ విభాగాన్ని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని సూచించారు. వీటితో పాటు ఆన్‌లైన్‌లో ప్రజెంట్ కేటగిరీ చూపిస్తే.. ప్రివ్యూలో స్కూల్ అని చూపిస్తోంది. ఎల్.ఎఫ్.ఎల్.హెచ్‌ఎం కేటగిరీ చూపించడం లేదు. అలాగే కొందరివి ఆధార్, ఎంప్లాయ్ ఐడీ నాట్ మ్యాచ్‌డ్ అని చూపిస్తోంది. దీంతో మొదటిరోజే ఉపాధ్యాయులు గందరగోళానికి గురయ్యారు.జూనియర్ కళాశాలలుగా కేజీబీవీలు

Updated By ManamThu, 06/07/2018 - 22:28
 • 84 కస్తూర్భా విద్యాలయాల అప్‌గ్రేడేషన్.. ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

 • అందుబాటులో ఆర్ట్స్, సైన్స్ గ్రూపులు.. ఒక్కో సెక్షన్‌లో 40 మందికి అవకాశం

 • డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

kadiyamహైదరాబాద్: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గురువారం సచివాలయంలో కేజీబీవీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం బాలిక విద్యపై వేసిన సబ్ కమిటీ చైర్మన్‌గా తాను ఇచ్చిన ప్రతిపాదనల మేరకు దేశవ్యాప్తంగా కేజీబీవీలను 8వ తరగతి నుంచి 12 వ తరగతికి పొడిగించాలని కేంద్ర ం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 475 కేజీబీవీలుంటే 84 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామని, వీటిలో అడ్మిషన్లకు గురువారం నుంచే నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. కేంద్ర నియమించిన కమిటీ చైర్మన్‌గా కేజీబీవీలను 12వ తరగతి వరకు పొడగించడం వలన బాల్యవివాహాలు అరికట్టవచ్చని నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం కేజీబీవీలు 6,7,8 తరగతులకే పరిమితమ య్యాయని, దీంతో అందులో చదువు కాగానే పిల్లలకు పెళ్లిల్లు చేస్తున్నారని, కేజీబీవీలను 12వ తరగతి వరకు పొడిగిస్తే ఇంటర్ పూర్తి చేసే నాటికి 18 ఏండ్లు వస్తాయని, తద్వారా బాల్యవివాహాలు అరికట్టవచ్చని కమిటీ సూచించిందని, దీనిని కేంద్రం ఆమోదించినందుకు ధన్యవాదాలన్నారు. కేజీబీవీల్లో ప్రస్తుతం ప్రతి సెక్షన్‌కు 20 మంది విద్యార్థులనే తీసుకుం టున్నారని, దీనిని 40 మందికి పెంచినట్టు తెలిపారు. ఈ కేజీబీవీ జూనియర్ కాలేజీల్లో ఆర్ట్స్, సైన్స్ గ్రూపులు పెట్టాలని కేంద్రానికి సూచించామని, దీనికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవ దేకర్ సూచన ప్రాయంగా అంగీకరించినట్టు తెలిపారు. కేజీబీవీల్లో ఎక్కవగా అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరే ఉన్నవాళ్లు, బాగా వెనుకబడినవాళ్ల పిల్లలుంటారని, వీరికి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లో 25 శాతం రిజర్వేషన్లు కేజీబీవీ విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయినా చాలా మంది కేజీబీవీ విద్యార్థునులకు ఇంటర్‌లో సీట్టు దొరకడం లేదన్నారు. కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ కావడంతో ఈ సమస్య తీరిందన్నారు. ప్రతి మూడు కేజీబీవీ కాలేజీల్లో రెండింటిలో సైన్స్ గ్రూపులు, ఒక కాలేజీలో ఆర్ట్స్ గ్రూప్ పెడుతున్నామన్నారు. 

 రూ. 100 కోట్లు కేటాయింపు
గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, హాస్టళ్లలో విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తూనే 7 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు గల బాలికలకు రుతుస్రావ ఇబ్బందులను తొలగించే విధంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికయ్యే ఖర్చును సీఎం దృష్టికి తెచ్చినప్పుడు ఆయన విద్యాశాఖకు రూ. 100 కోట్లను కేటాయించారని తెలిపారు. కొంత మంది రాజకీయ అసహనంతో ఈ కిట్స్ పథకం కేంద్ర ప్రభుత్వ పథకమంటున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ కిషోర బాటిక స్వాస్త్య యోజన కింద యువతులకు ఆరు రూపాయలకే ఆరు న్యాప్కిన్లు అందిస్తుందన్నారు. తెలంగాణ ఒక్కొక్కరికీ రూ. 1600 ఖర్చుతో ఏడాదికి సరిపడా సరుకులను అందిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల
కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అభినందిస్తున్నారని, కానీ కాంగ్రెస్ నేతల కంటికి ఇవి కనిపించడం లేదని, దీనిని ఉత్తమ్ రాబంధు పథకం అనడంపై మండి పడ్డారు. నాలుగేండ్లుగా వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు చేసింద న్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలివితక్కువగా మాట్లాడొద్దని, ఎదిగిన నాయకత్వం అవగాహనతో మాట్లాడాలని సూచించారు. విద్యా వ్యవస్థను నాశనం చేసినవారే విద్యా వ్యవస్థ నాశనం అయిందనడం విచిత్రంగా ఉందన్నారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలంటారు, నోటిఫికేషన్ ఇవ్వగానే కోర్టుల్లో కేసులు పెడతారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు, దీనికి వారికే పేటెంట్ ఉందని, అందుకే వాళ్లలాగే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా చేస్తుందేమోనని భ్రమలో ఉన్నారని విమర్శించారు. ప్రతి విషయం చిల్లరగా మాట్లాడి నవ్వులపాలు కావద్దని సలహా ఇచ్చారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల అని అది ఎప్పటికీ నిజం కాదన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, కమిషనర్ అధర్ సిన్హా, జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.అడ్మిషన్లకు అనుమతివ్వండి

Updated By ManamWed, 06/06/2018 - 01:39
 • మామునూరు వెటెర్నరీ కాలేజీలో కోర్సు ప్రారంభానికి డిప్యూటీ సీఎం వినతి

 • ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు కల్పిస్తం.. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నం

 • తరుణ్ శ్రీధర్‌కు కడియం విజ్ఞప్తి

kadiyamహైదరాబాద్: వరంగల్ జిల్లా మామునూరులోని వెటర్నరీ కాలేజీలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారం భించేందుకు అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి తరుణ్ శ్రీధర్‌ను కోరారు. ఢిల్లీలో మంగళవారం కడియం శ్రీహరి, ఎంపీలు బండ ప్రకాశ్, ప్రొఫెసర్ సీతారాంనాయక్, ప్రభుత్వ సలహాదారుడు రామచంద్రుడు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ పశువైద్యశాలలో బోధనా సిబ్బంది 15 మంది ఇప్పటికే ఉన్నారని, మరో 85 మందిని నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని త్వరలో భర్తీ చేస్తామన్నారు. కాలేజీ నడపడానికి వీలుగా 24వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాన్ని అద్దెకు తీసుకున్నామని చెప్పారు. వెటర్నరీ యూనివర్సిటీ ఈ కాలేజీలో ల్యాబ్ పరికరాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిందని, వెంటనే తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు, పశుసంవర్థక శాఖకు కొనుగోలు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. కాలేజీకి శాశ్వత భవనం, వసతి గృహ భవనాలకు గతేడాది డిసెంబర్ 11న శంకుస్థాపన చేశామని, పనులు వేగంగా జరుగుతున్నట్టు వివరించారు. ఈ కాలేజీ ఏర్పాటుకు భవనాలు, హాస్టళ్లు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.208 కోట్లను మంజూరు చేసి, ఇప్పటివరకు రూ.109కోట్లు విడుదల చేసిందని చెప్పారు. కాలేజీలో బోధనాసుపత్రి కూడా ఏర్పాటు జరుగుతోందన్నారు. ఈ కాలేజీ ఏర్పాటుతో నేరుగా 250 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, పరోక్షంగా వందలమందికి ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. ఈ సంవత్సరం 50 మంది విద్యార్థులకు అడ్మిషన్ కల్పించేందుకు కావావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. సంబంధిత అనుమతులను వెంటనే ఇవ్వాలని కోరారు.ఉపాధ్యాయ సంఘాలతో డిప్యూటీ సీఎం భేటీ

Updated By ManamFri, 06/01/2018 - 01:36
 • ఒక్కో జేఏసీ నుంచి ఇద్దరు హాజరు

kadiyamహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలతో గురువారం మంత్రుల నివాస సముదాయం లో భేటీ అయ్యారు. ఈ భేటీలో మూడు ఉపాధ్యాయ సం ఘాల జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానంగా బదిలీలు, పదోన్నతులపైనే చర్చ కొనసాగింది. డిప్యూటీ సీ ఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ముందుగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఉపాధ్యాయుల్లో ఆందోళన తగ్గుతుందని ప్రస్తావించారు. దీనికి బదులుగా టీటీజేఏసీ పక్షాన పీర్‌టీయూటీఎస్ బదిలీలు, పదోన్న తులు ఒకేసారి నిర్వహించాలని కోరగా, జాక్టో పక్షాన ఎస్‌టీయూటీఎస్, యూఎస్‌పీసీ పక్షాన టీఎస్‌యూటీఎఫ్ బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఈ భేటీ సందర్భంగా ఒకేసారి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపడితే.. ఏమైనా లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందా.. అనే కోణంలో చర్చ సాగింది. రెండు ఒకేసారి చేపడితే.. లీగల్ సమస్యలు ఎదురయ్యేతే.. బదిలీలు, పదోన్నతులు మొత్తంగా ఆగిపోయే ప్రమాదం ఉందని చర్చకు వచ్చింది. జాక్టో, యూఎస్‌పీసీలు సైతం బదిలీలతో పాటే పదోన్నతులు చేపట్టాలని కోరింది. ఒక్క బదిలీలు చేపడితే.. తదనంతరం పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం పక్కనబెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయంపై శుక్రవారం ఉపాధ్యాయ జేఏసీ సంఘాలు, విద్యాశాఖ కార్యదర్శి, అదనపు డైరెక్టర్లు, అడ్వకేట్ జనరల్‌తో సమావేశమై.. లీగల్ సమస్యల గురించి చర్చిస్తారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని.. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. అనంతరం బదిలీల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

‘ఇంటర్’కు కొత్త పుస్తకాలు
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సంస్కృతం, ఉర్దూ, అరబిక్, హిందీ సవరించిన పాఠ్యపుస్తకాలు, అకాడమిక్ ఆర్గనైజర్‌ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గురువారం నాడు విడుదల చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఐదేళ్లకు ఒకసారి సవరించాల్సిన నిబంధన మేరకు ఈ నాలుగు పాఠ్యపుస్తకాలను ప్రస్తుతం సవరించారు. ఇంటర్ బోర్డులోని కమిటీ పుస్తకాలను సవరించగా, తెలుగు అకాడమీ వీటిని ముద్రించింది.  ఈ కార్యక్రమంలో విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్.ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఇంటర్ జేఏసీ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి, జూనియర్ కాలేజీల సంఘం అధ్యక్షుడు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మంత్రి కడియం వ్యాఖ్యలు సరికావు

Updated By ManamThu, 05/17/2018 - 10:02

kadiyam హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలలపై ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు సరికావని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రైవేట్ పాఠశాలల అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్సూర్ అహ్మద్ జనార్ధన్ రెడ్డి అన్నారు. వెంటనే కడియం శ్రీహరి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 40లక్షల మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నామని, సుమారు 4లక్షల ముందికి ఉపాధిని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ప్రైవేట్ బస్సులు గ్రామాల్లోకి వస్తే వాటి టైర్లలో గాలి తీయండి అంటూ కడియం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన ఆయన ప్రైవేట్ సంస్థలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. 

 ప్రైవేట్ విద్యాసంస్థలపై ఎలాంటి వ్యతిరేకత లేదు

Updated By ManamWed, 05/16/2018 - 11:08

kadiyam హైదరాబాద్: ప్రైవేట్ విద్యా సంస్థలపై తమకు ఏ రకమైన వ్యతిరేక భావం లేదని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కడియం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యాప్తికి, విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు పోటీ పడి పని చేస్తున్నాయని కితాబిచ్చారు.

అయితే ఈనెల 12న‌ భూపాలపల్లి జిల్లాలోని వెంక‌టాపురం మండ‌లంలోని రామానుజాపురం గ్రామంలో జిల్లాలో జరిగిన రైతు బంధు కార్యక్రమానికి వెళ్లిన కడియం అక్కడున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి చూసి, గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అంతటితో ఆగకుండా ప్రైవేట్ పాఠశాలల బస్సులు గ్రామంలోకి వస్తే టైర్లలో గాలి తీసేయాలని అన్నారు. దీనిపై తాజాగా స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, వీటిపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భయాపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు సమర్థవంతంగా నడపడానికి విద్యా శాఖ మంత్రిగా నా పూర్తి సహకారం ఇస్తానని కడియం పేర్కొన్నారు.

 

Related News