kadiyam srihari

పిల్లలకు కళల పట్ల అవగాహన

Updated By ManamThu, 08/23/2018 - 02:27
 • ఆట బాలోత్సవ్ బ్రోచర్‌ను విడుదల చేసిన మంత్రి కడియం 

kadiyamహైదరాబాద్: పిల్లలకు చదువుతో పాటు వివిధ కళల పట్ల అవగాహన కల్పించేందుకు ఆట బాలోత్సవ్ ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మంత్రి తన నివాస సముదాయంలో ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం సంయుక్తంగా నవంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఆట బాలోత్సవ్ బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొనడం పిల్లలకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ ఉత్సవాల్లో దేశంలోని 10 రాష్ట్రాల పిల్లలు కళాకారులు పాల్గొంటున్నాయని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 24 అంశాలు, 54 విభాగాల్లో వివిధ కార్యక్రమాలను రూపొందించినట్టు చెప్పారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రతిఒక్కరికీ సర్టిఫికెట్‌ను అందిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు, పిల్లలకు భోజన వసతి కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు సర్వోత్తమరెడ్డి, బి.కమలాకర్‌రావు, రంగాచార్యులు, జనార్దన్, పేర్లి దాసు, హరి కోటి, కెఎస్.నాయుడు, సుధాకర్, చక్రవర్తి, శిరీష, మురళి, యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.దివ్యాంగుల సంక్షేమానికే ప్రాధాన్యత

Updated By ManamWed, 08/15/2018 - 00:43
 • ఉపకరణాల పంపిణీలో మంత్రి కడియం

kadiyamహైదరాబాద్: సంక్షేమంలో మొదటి ప్రాధాన్యత దివ్యాంగులకే ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. సిఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 500రూపాయల పెన్షన్ వస్తుంటే...తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దానిని 1500 చేసిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన దివ్యాంగులకు నేడు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ఉపకరణాలను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పంపిణీ చేశారు. దివ్యాంగుల పరిస్థితులను తెలిపిన వాసుదేవరెడ్డిని కార్పొరేషన్‌కు చైర్మన్ చేయడం మంచి పరిణామమని అన్నారు. వచ్చే మూడు నెలల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దివ్యాంగులందరికీ ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ఉపకరణాలు ఇచ్చేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చైర్మన్ వాసుదేవరెడ్డికి సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లకు 3 నుంచి 4 శాతానికి పెంచారని, విద్యలో 4నుంచి5 శాతానికి, ఆర్థిక మద్దతు పథకాలలో 5శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఉపముఖ్యమంత్రి  అన్నారు. అదేవిధంగా కార్పొరేషన్‌కు 100 కోట్ల రూపాయలు సిఎం కేసీఆర్ కేటాయించారన్నారు. దివ్యాంగుల కోసం హాస్టళ్లు, పక్కా భవనాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగులకు ఇచ్చే రుణాల్లో 20శాతం బ్యాంకు లింక్ ఉండటం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో వీరిని చాలా ఇబ్బందులు పెడుతున్నాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా వంద శాతం సబ్సిడితో దివ్యాంగులకు రుణాలు ఇవ్వాలని సిఎం కేసీఆర్‌కు తను విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ సేకరించాలని చైర్మన్‌కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాం నాయక్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ ఆమ్రపాలి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.నేటి నుంచి బర్రెల పంపిణీ

Updated By ManamSat, 08/11/2018 - 04:10
 • రూ. 1500 కోట్ల బడ్జెట్.. ఒక్కో దానికి రూ.80 వేల ధర

 • ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ.. బీసీలు, ఇతరులకు 50 శాతం

 • అదనంగా రవాణాకు రూ.5వేలు.. బీమాతో పాటు 300 కిలోల దాణా

 • అవగాహన లేమితో ఆసక్తి చూపని పాడిరైతులు

tsహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమంతో పాటు ఆర్థికం గా అభివృద్ధి చెందేందుకు ప్రతిష్టా త్మకంగా పాడి బర్రెల పంపిణీ కార్య క్రమాన్ని చేపట్టింది. ఈ పథకాన్ని శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని ముల్కనూరులో డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వంద మందికి పాడి బర్రెలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని పాల సహకార సంఘాల్లోని సభ్యులకు రూ.1500కోట్ల వ్యయంతో పాడిబర్రెలను సబ్సిడీపై పంపిణీ చేయనుంది. ఫలితంగా విజయ డెయిరీ పరిధిలోని 63,304 మంది సభ్యులు, ముల్కనూరు మహిళా డెయిరీలో 19,307 మంది, కరీంనగర్ డెయిరీలో 57,206 మంది, మదర్ డెయిరీలో 43,006 మందికి సబ్సిడీ బర్రెలు అందనున్నాయి. అయితే ఒక్కో పాడి బర్రెకు రూ.80వేలను ధరగా నిర్ణయించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 75శాతం, బీసీలు, ఇతరులకు 50శాతం సబ్సిడీని ప్రభుత్వం చెల్లించనుంది.

బర్రెలకు బీమా..
ప్రభుత్వం ఒక్కో బర్రె ధరను రూ.80వేలుగా నిర్ణయించింది. ఈ ధరకు మేలురకమైన బర్రెలు ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయి. స్థానికంగా తెలంగాణ ప్రాంతంలో ఉండే బర్రెలు రోజుకు నాలుగు లీటర్లకు మించి ఇచ్చే పరిస్థితి లేదు. అంత డబ్బు పెట్టి స్థానికంగా దొరికే బర్రెలు తీసుకుంటే.. ప్రయోజనం ఉండదు. దీంతో రైతులు ఎక్కువగా పాలిచ్చే హరియాణ, ముర్రా జాతి వంటి మేలు రకాలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపుతారు. గతంలో కొంతమంది పాడి రైతులు అధిక పాల దిగుబడినిచ్చే మేలు జాతి పాడిబర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చా రు. అక్కడి వాతావరణ పరిస్థితులకు.. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తేడా ఉండడంతో అధికశాతం బర్రెలు మృత్యువాతపడ్డాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోసారి ఆ బర్రెల వైపు చూసేందుకు పాడి రైతులు ఆసక్తి చూపలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పాడిగేదెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో బర్రెలు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేవనే భావనతో చాలామంది వెనకడుగు వేశారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఒక్కో బర్రెకు యూనిట్ కాస్ట్‌లో మూడేండ్ల పాటు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 300 కిలోల దాణాను ప్రభుత్వం ఇవ్వనుంది. రైతులు కోరుకున్న ప్రాంతంలో ఎంచుకున్న పాడి బర్రెను కొనుగోలు చేసి ఇచ్చే విధంగా అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. అంతేకాకుండా ఒక్క పాడి బర్రెకు రూ.5వేల చొప్పున రవాణా కోసం అదనంగా చెల్లిస్తోంది.

రూ.40 వేలు చెల్లించలేకే..
- సామ నిర్మల, నల్లగొండ

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పాడి బర్లకు రూ.40 వేలు కట్టాలని జెప్పిండ్రు. పేపర్లనేమో ఉచితంగా పంపిణీ జేస్తమని రాసిండ్రు. అయినా ఒక్క దానికి రూ.40 వేలు యాడదెచ్చి కట్టాలె. అప్పోసప్పో తెచ్చి కడ్దామంటే.. అయి బతుకుతయో లేదో తెల్వదు. పోయినసారి ఊళ్ల అట్లనే తెచ్చిన బర్లు సచ్చినయ్. బర్రె సస్తే.. అప్పు మీద పడ్తదని ఈసారి పైసలు కట్టలేదు.పీహెచ్‌డీ ప్రవేశాలకు ఒకే విధానం 

Updated By ManamThu, 08/09/2018 - 04:31
 • బయోమెట్రిక్‌తో విద్యలో నాణ్యత.. కామన్ అకాడమిక్ క్యాలెండర్ పాటించాలి

 • యూనివర్సిటీల పనితీరుపై గవర్నర్ సంతృప్తి.. కాలేజీల్లో మహిళల భద్రతకు చర్యలు

 • వీసీల కాన్ఫరెన్స్‌లో గవర్నర్ నరసింహన్.. భేషుగ్గా పనిచేస్తున్నారని కడియంకు కితాబు

Governor Narasimhanహైదరాబాద్: పీహెచ్‌డీ అడ్మిషన్ల విషయంలో గందర గోళం లేకుండా యూజీసీ నిబం ధనలను పాటించాలని, పరిశోధక కోర్సును నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా ఉపకులపతులు చూడాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. విశ్వ విద్యాలయాల గతేడాది పనితీరుపై బుధవారం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 14 యూనివర్సిటీల ఉపకు లపతులు, రిజిస్ట్రార్లు, అధికారులతో గవర్నర్ సమావే శమయ్యారు. అక్టోబర్‌లో గవర్నర్ నేతృత్వంలో నిర్వ హించిన సమావేశంలో చెప్పిన వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాదికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకుని.. విశ్వవి ద్యాలయాలను పటిష్టం చేసేందుకు వీసీలకు దిశానిర్ధేశ నం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు, పరీక్ష లు, ఫలితాలు ఒకే విధానంలో జరిగేందుకు వీలుగా కామన్ క్యాలెండర్‌ను అమలు చేయాలన్నారు. యూని వర్సిటీలు, కాలేజీ విద్యలో నాణ్యతను పెంచేందుకు బయోమెట్రిక్‌ను కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన కొత్త కోర్సుల ను అధ్యయనం చేసి ఏర్పాటు చేయాలని, అవసరం లేని కోర్సులను తీసేయాలని చెప్పారు. యూని వర్సిటీలు, కాలేజీల్లో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వీసీలకు సూచించారు. ఉన్నత విద్యను పటిష్ట పరిచేందుకు డిప్యూటీ సీఎం కడియం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని, దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయని శ్రీహరిని గవర్నర్ కొనియాడారు. స్వతహాగా ఆయన అధ్యాపకుడని, ఏవైనా కథలు చెబితే.. ఆయన వెంటనే పట్టేస్తారని తెలిపారు.రాష్ట్రంలో కంటి జబ్బులుండొద్దు

Updated By ManamFri, 08/03/2018 - 01:10
 • కంటి వెలుగుపై సమీక్షలో కడియం

kadiyamవరంగల్: కంటి జబ్బులు లేని రాష్ట్రంగా తెలంగాణణు తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకు ఈ నెల 15 నుంచి చేపట్టబోయే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిజేయాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో భేటీ అయిన మంత్రి, కంటి వెలుగు, హరితహారం, రైతు బీమా కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. గ్రామాల్లో రోజుకు 250, పట్టణాల్లో 300ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని ఇందుకు అవసరమయ్యే రూ.51.71 కోట్ల నిధులను కూడా విడుదల చేశామని వివరించారు. జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలోని 31 జిల్లాలకు ఈ నిధులను కేటాయించామని తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైతే ఆపరేషన్ చేయాలని, అద్దాలు పంపిణీ చేయాలని సూచించారు. 15న కార్యక్రమ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనేక పథకాలు ఏకకాలంలో చేపడుతున్నందున అధికారులపై పని ఒత్తిడి పెరిగినా, ప్రజా సంక్షేమం దృష్ట్యా సహనంతో పన్జేయాలన్నారు. రాష్ట్రంలో 799 ఫీల్డ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, అర్బన్ జిల్లాలో 19, రూరల్ జిల్లాలో 24 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.మెుక్కే రక్ష

Updated By ManamThu, 08/02/2018 - 00:38
 • ద్యమంలా మొక్కలు నాటాలి

 • నాటిన వాటిని రక్షించుకోవాలి

 • హరితహారం సామాజిక ఉద్యమం: కడియంఉ

kadiyamsrihariహైదరాబాద్: హరితహారం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో బెస్తం చెరువు వద్ద 10ఎకరాల స్థలంలో మొక్కలు నాటి నాల్గవ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం 24 శాతమే ఉందని, దీనిని 33 శాతానికి పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హరిత తెలంగాణ కావాలంటే, మన రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే, వానలు రావాలంటే, హరితహారంలో అందరూ భాగస్వామ్యమై పెద్దఎత్తున మొక్కలు నాటాలన్నారు,  తెలంగాణను హరిత తెలంగాణ చేసే ఉద్దేశ్యంతో రూపొందించిన పథకంలో భాగంగా 230కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నాల్గవ విడతలో 40కోట్ల మొక్కలు నాటే లక్ష్యం నిర్థేశించారన్నారు. ఇందులో వరంగల్ ఉమ్మడి జిల్లాలో 5కోట్ల మొక్కలు నాటాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే కొండా సురేఖ, జిల్లా అటవీశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.

మొక్కే శ్రీరామ రక్ష: మహేందర్ రెడ్డి
ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఉద్యమంలా మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మొక్కే పర్యావరణానికి శ్రీరామ రక్ష అని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాకేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ కళాశాలలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం హరితహారం కార్యక్రమం చేపట్టి 10 వేల మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, రాష్ట్రంలో అడవులు పూర్తిగా అంతరించి పోతున్నాయని, చెట్లను అధికంగా నాటితేనే మంచి వాతావరణాన్ని సంపాదించుకుంటామని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్రంలో 24 శాతం మాత్రమే అడవులున్నాయని ఆయన తెలిపారు. వాటిని 33 శాతం వరకు తీసుకెళ్లేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. 

పర్యావరణ రక్షణకు పాటుపడాలి: జగదీష్‌రెడ్డి
భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నాల్గవ విడుత హరితహారంలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం పాల శీతలీకరణ కేంద్రంలో మంత్రి మొక్కలు నాటి హరితహారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయ లని, మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. ఈ సంవత్సరం 2 కోట్ల మొక్కలు నాటుతున్నామని, పాఠశాలలో మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు.  ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, తదితరులు పాల్గొన్నారు. 

పెంపకంపై మక్కువ చూపాలి: స్మిత సబర్వాల్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగవ విడత హరితహారాన్ని  ఉద్యమంగా స్వీకరించాలని  సిఎం కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్  అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లాలో ఆమె పర్యటించారు. స్థానిక పోలీస్ హెడ్ క్వాటర్‌లో చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటి ఆవరణంలో ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీస్ కమిషన్ విబి కమలాషన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శశాంక్, ఆర్‌డివో రాజాగౌడ్, ఆర్‌ఐ మల్లేశం పాల్గొని మొక్కలు నాటారు.

ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలి: తుమ్మల
రాష్ట్రాన్ని పచ్చని తెలంగాణగా తిర్చిదిద్దడమే హరిత హారం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మంత్ర రఘునాధపాలెం మండలం దానవాయిగూడెంలోని గురుకుల పాఠశాలలో 4వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయున మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్చందంగా, ఉత్సాహంగా భాగస్వాములు కావాలి అని అన్నారు. నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చూడాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్‌సి కార్పొరేషన్ పిడమర్తి రవి, రాష్ట్ర శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయుణ, ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలిసు తప్సీర్ ఇక్బాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.5 లక్షల మంది విద్యార్థులకు అన్నం

Updated By ManamSun, 07/29/2018 - 02:24
 • పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, బీఈడీ, డీఈడీ, మోడల్ జూనియర్ కాలేజీల్లో అమలు

 • కడియం నేతృత్వంలోని కమిటీ చర్చ.. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా సరఫరా

 • ఆగస్టు 3న సమావేశంలో తుదిరూపు

kadiyamహైదరాబాద్: మరొక బృహత్తర పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ, దేశంలోనే తెలంగాణ శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ పథకాన్ని కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేయడానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం ప్రారంఛించాలని నిర్ణయించిన విషయం విదితమే. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్, మోడల్ జూనియర్ కాలేజీలు, బీఈడీ, డీఈడీ కాలేజీల్లోని దాదాపు 5 లక్షల మందికి అందించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించేటందుకు శనివారం డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నే తృత్వంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజనం అత్యంత నాణ్యంగా, పౌష్టిక విలువలతో అందించేందుకు మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులను కోరింది.

కమిటీ అడిగిన ప్రతిపాదనలు...

 •     ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కావల్సిన సరుకులన్నీ అందిస్తే సరఫరా చేయడం. 
 •     సరుకులన్నీ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారానే సమకూర్చి భోజనం అందించడం 
 •     పులిహోర, బ్లాక్ రైస్, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జల వంటి విభిన్న తృణ ధాన్యాలతో కూడిన భోజనాన్ని అందించడంపై ప్రతిపాదనలు ఇవ్వాలని అడిగింది.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో అన్ని కాలేజీలకు మధ్యాహ్న సమయానికి భోజనం అందే విధంగా కావల్సిన కిచెన్లు ఏర్పాటు చేసుకోవాలని, మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రులు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌తో పాటు కాలేజీలకు దగ్గరగా ఉన్న మెస్సులు, హోటళ్ల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించడంపై కూడా చర్చించి, ఈ వివరాలు పూర్తిస్థాయిలో తెప్పించుకుని వచ్చే సమావేశంలో కూలంకుశంగా చర్చించాలని నిర్ణయించారు. ఆగస్టు 3వ తేదీ మరోసారి సచివాలయంలో ఈ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి అక్షయపాత్ర ఫౌండేషన్ తగిన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ జాయింట్ డైరెక్టర్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.అంబేద్కర్ లేకుంటే నేను లేను

Updated By ManamSun, 07/29/2018 - 01:29
 • ఆయన ఆశయాల సాధనకే గురుకులాలు

 • ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి

kadiyamహైదరాబాద్: అంబేద్కర్ లేకుంటే తాను లేనని మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇవాళ నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆంధ్రా బ్యాంక్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ 3వ ఆల్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్‌కు మంత్రి కడియం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమం ఫలించింది అంబేద్కర్ వల్లనే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లే సాధ్యమైందన్నారు. అంబేద్కర్ ఆశయాల మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. అందరికీ విద్యనందించాలనే అంబేద్కర్ ఆశయంతోనే రాష్ట్రంలో అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ‘దళితులు ఎదిగిన తర్వాత కూడా వారిపై దాడులు జరుగుతున్నాయి. అత్యాచార నిరోధ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నది. ముందస్తు బెయిల్ అవసరం లేదన్న సుప్రీం కోర్టు తీర్పుపై దళితులు రోడ్డెక్కారు. పీఓఏ చట్టాన్ని కాపాడటం కోసం అనేక మంది దళితులు చనిపోయారు. కేంద్రం వెంటనే పీఓఏ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకురావాలి. పీఓఏ చట్టాన్ని బలోపేతం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తుంది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పీఓఏ చట్టం కాపాడడాన్ని సీరియస్గా తీసుకోవాలి. పేదలకు లబ్ది చేకూరాలని బ్యాంకులను జాతీయం చేశారు. బ్యాంకుల జాతీయ లక్ష్యం నెరవేరడం లేదు. పేదలకు బ్యాంకులు చేరువగా లేవు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొడుతున్నారు. పేదవాడికి పదివేలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. బ్యాంకుల వైఖరి వల్లే పేదవాళ్ల కోసం పెట్టిన ప్రభుత్వ ఆర్థిక సహకార పథకాలు వారికి అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ బ్యాంకులను పేదలకు దగ్గరగా తీసుకెళ్లాలి..‘ అని మంత్రి పేర్కొన్నారు.

కేటీఆర్‌తో ప్రకాష్‌రాజ్ భేటీ
prakasrajతెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సినీ నటుడు ప్రకాష్‌రాజ్ శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి అంశంపై ప్రకాశ్‌రాజ్ కేటీఆర్‌తో చర్చించారు. ఈ గ్రామాన్ని ప్రకాష్‌రాజ్ దత్తత తీసు కున్న విషయం తెలిసిందే. గ్రామానికి కేటాయించిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు ప్రకాష్‌రాజ్ తెలిపారు. కొండారెడ్డి పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేద్దామని కేటీఆర్ తెలిపినట్టుగా పేర్కొన్నారు.మెడల్ కొట్టు... ఉద్యోగం పట్టు

Updated By ManamSat, 07/28/2018 - 23:34
 • క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వ నజరానా: శాట్స్ చైర్మన్ 

kadiyamహైదరాబాద్: తెలంగాణలోని క్రీడాకారులని ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని శాట్స్ చైర్మన్ అల్లీపూరం వెంకటెశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ దీనికి సంబంధించి ఒక జీఓను విడుదల చేసిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కొరుతూ జీఓ ఇచ్చిందని చెప్పారు. జీఓ విడుదలకు సంబందించి జీఓ శాట్స్ చైర్మన్ అల్లీపూరం వెంకటెశ్వర్ రె డ్డి శనివారం సీఎం కేసీఆర్...సీఎస్ ఎస్‌కే జోసీకి కృతజ్ఞతలు తెలిపారు.  సీఎం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.తక్షణమే ఏర్పాటు చేయండి 

Updated By ManamFri, 07/27/2018 - 00:54
 • గిరిజన విశ్వవిద్యాలయంపై కేంద్ర మంత్రికి కడియం విజ్ఞప్తి

 • విభజన హామీలన్నీ నిక్కచ్చిగా అమలు చేయాలె

 • ఏపీకీ న్యాయం జరగాలె.. తెలంగాణకూ చేయాలె.. రాష్ట్రానికి ఇస్తామన్న ఏ విద్యాలయమూ ఇవ్వలే

 • కాంగ్రెసోళ్లు కూడా వీటిపై డిమాండ్ చేయాలె.. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

kadiyamన్యూఢిల్లీ: విభజన చట్టం ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గురువారం కడియం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... విభజన చట్టం ప్రకారం ఏపీకి న్యాయం జరగాలి, తెలంగాణకు న్యాయం చేయాలని కోరామన్నారు. హైకోర్టు విభజన, బయ్యారం స్టీల్ ప్లాంట్, విద్యాసంస్థలు ఏవీ కేంద్రం పట్టించుకోవడం లేదనీ వివరించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, అయితే తెలంగాణకు సంపూర్ణ న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఫలాలు రాష్ట్రానికి ఇవ్వాలని కోరామని తెలియజేశారు. హైదరాబాద్ కు ఐఐఎం ఇవ్వాలని కోరినా ఇంతవరకు ఏమీ చెప్పలేదని, దానిపై కూడా తేల్చి చెప్పాలని విన్నవించామన్నారు. సోనియా ఇస్తే కాదు, తెలంగాణ ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని స్పష్టం చేశారు. నూతన జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు కావాలని అడిగామని, 14 జిల్లాల్లో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు లేవని, కొత్తగా మంజూరు చేయాలని చెప్పామని, ఈ సంవత్సరం ఇస్తామని కేంద్రమంత్రి హమీ ఇచ్చారని తెలిపారు. నాలుగు సంవత్సరాలు గడుసున్నా తెలంగాణ లో ఒక్క విద్యా సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ఉప ముఖ్యమంత్రి గుర్తుచేశారు. త్రిపుల్ ఐటి ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, గణిత శాస్త్రం కోసం విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్ హెదరాబాదులో ఏర్పాటు చేయాలని కోరామనీ,  మ్యాథ్స్ లో అడ్వాన్స్ బోధనలో మెరుగు పడేలా ఇది ఉపయోగపడుతుందని చెప్పారమన్నారు. కరీంనగర్ లో ఐఐఐటీ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. త్వరగా విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని 12 వ తరగతి వరకు పొడిగించాలని కేంద్రమంత్రిని కోరామని,  పేద విద్యార్థుల చదువు కోసం 12వ తరగతి వరకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి కడియం వినతిపత్రాలను అందజేశారు. తెలంగాణ ఉద్యమం ప్రజల్లో రగిలించి కేసీఆర్ ముందుకు తీసుకెళ్లారో... దాన్ని స్పూర్తిగా తీసుకొని ఏపీ హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించి.. విభజన హామీల అమలుకు కేంద్రాన్ని డిమాండ్ చేయాలని, రాహుల్, సోనియాపై ఆ బాధ్యత ఉందని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో పార్లమెంటు సభ్యులు బి. వినోద్, జే. సంతోష్ కుమార్, బాల్క సుమన్, రాజ్య సభ సభ్యులు బండ ప్రకాష్, బడుగు లింగయ్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్. మందా జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.

Related News