kerala

కళ తప్పిన ‘ఓనం’

Updated By ManamSat, 08/25/2018 - 23:26
 • వేడుకలు నిర్వహించుకోని కేరళీయులు.. విషాదవదనంలోనే మలయాళీలు

 • కేరళకు దేశం అండగా ఉంటుంది.. ‘ఓనం’ సందేశంలో ప్రధాని మోదీ

imageతిరువనంతపురం: వరద బీభత్సం నేప థ్యంలో కేరళలో అత్యంత వైభవంగా నిర్వహించే ఓనం పండగ కళ తప్పింది. కొన్ని ప్రాంతాలు మినహా ఎక్కడా కూడా పండగ కళ కనిపించలేదు. వేడుకలు నిర్వహించ లేదు. తామిప్పుడు పెను విషాదంలో ఉన్నామని, సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఇలాంటి పరిస్థితిలో పండగను ఎలా నిర్వహించుకోగలమని పలు వురు ప్రశ్నించారు. కూలిపోయిన ఇళ్లు.. వరద నీరు.. బురదతో నిండిపోయిన రహదారులు.. ఇలా ఎటు చూసి నా భీకర దృశ్యాలు కనిపిస్తు న్నాయని పేర్కొంటున్నారు. 

‘‘మేం ఓనం పండగను ఇలా నిర్వహించుకుంటామని ఎప్పు డూ అనుకోలేదు. ఇప్పుడు మేం అన్ని కోల్పోయి imageపునరా వాస శిబిరంలో తలదాచుకుం టున్నాం. మరోసారి ఇలాంటి దుస్థితి ఎదురు కావొద్దని కోరు కుంటున్నాను’’ అని అలప్పుజాలో ఓ పునరావాస శిబి రంలో ఉంటున్న కుమారి అనే మహిళ పేర్కొన్నారు. తమ లాగా దాదాపు 8 లక్షల మంది శిబిరాల్లోనే ఉంటు న్నారని తెలిసిందని, అలాంటప్పుడు పండగను ఎలా నిర్వహించుకోగలం అని అన్నారు. పలుచోట్ల శిబిరాల్లోనే ఓనం పండగను నిర్వహించారు. పాఠశాలలు, చర్చీలు, మసీదులు అనే తేడా లేకుండా పండగను చేసుకున్నారు.  ఇప్పటి వరకు భారీ వర్షాల మృతుల సంఖ్య  265కు చేరుకుందని అధికారులు తెలిపారు.  భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు దేశం మొత్తం అండగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఓనం పండగ శుభాకాంక్షలు తెలిపారు. వరద బీభత్సాన్ని ఎదుర్కొనేలా కేరళవాసులకు ఓనం పండగ మరింత శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. పెళ్లి నగల డబ్బును వరద బాధితులకు ఇచ్చేసింది

Updated By ManamSat, 08/25/2018 - 11:56

Kerala తిరువనంతపురం: భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ వాసులను ఆదుకునేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు విరాళాలు ఇచ్చి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కొత్త పెళ్లికూతురు తన నగల డబ్బులను వరద బాధితులకు విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది. 

కేరళలోని కొజికోడ్ జిల్లా వటకారకు చెందిన అమృత ఎస్ వేణు బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. సెప్టెంబర్ 15న ఆమె వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక ఆమె నగల కోసం పక్కనపెట్టిన లక్ష రూపాయలను తీసి సీఎం సహాయనిధికి ఇవ్వాలని అమృత నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కాబోయే భర్తకు చెప్పగా.. ఆయన కూడా అంగీకరించారు. దీంతో ఆమె కోరిక మేరకు లక్ష రూపాయల చెక్‌ను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు అమృత తండ్రి కె.కె. వేణు.అందరూ మహాబలి ప్రతిరూపాలే!

Updated By ManamFri, 08/24/2018 - 22:23

imageకేరళలో ఆగస్టు- సెప్టెంబరు మాసాల మధ్య ‘ఓనమ్’ పండుగ వస్తుంది. కేరళ పంచాంగం ప్రకారం ఓనమ్ పండుగ ‘చింగమ్’ మాసంలో వస్తుంది. మహావిష్ణువు దశావతారాల్లో ఒకరైన వామనునికి సంబంధించిన గాథ ఆధారంగా మలయాళీలు ఈ పండుగను జరుపుకుంటారు. హిందూ పురాణగాథల ప్రకారం కశ్యపుని కుమారుడైన బలి చక్రవర్తి ముల్లోకాల్లో దేవతలపై విజయం సాధిస్తాడు. అయితే ఆడినమాట తప్పని మహామహునిగా, ధర్మమూర్తిగా బలిచక్రవర్తి పేరు పొందుతాడు.

బలి చక్రవర్తి చేతిలో ఓడిపోయిన దేవతలు మహావిష్ణువు సహాయాన్ని అర్థిస్తారు. అయితే బలిచక్రవర్తి దానప్రవృత్తిని గురించి తెలిసిన మహావిష్ణువు అతని మీద యుద్ధం చేయడానికి నిరాకరించి, అతని ధర్మనిరతిని పరీక్షించాలని నిర్ణయించుకుం టాడు. బ్రాహ్మణుని రూపంలో వచ్చి మూడడుగుల చోటును దానంగా ఇమ్మంటాడు. వామనుని కోరికను మన్నించిన బలిచక్రవర్తి మూడడుగుల నేలను దానంగా ఇవ్వడానికి సంసిద్ధుడవుతాడు. ఒక అడుగు ఆకాశం మీద, మరొక అడుగు భూమండలం మీద మోపిన వామనుడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాడు, అందుకు జవాబుగా బలి చక్రవర్తి తన శిరస్సును చూపుతాడు. దాంతో బలి చక్రవర్తిని భూమిలోకి తొక్కివేస్తాడు మహావిష్ణువు. ఆడిన మాట తప్పని బలి చక్రవర్తి నిజాయితీని మెచ్చిన మహావి ష్ణువు ఏడాదికి ఒకసారి తాను పాలించిన ప్రజల్ని చూడడానికి బలి చక్రవర్తి తిరిగి తన దేశానికి వచ్చేలా వరమిస్తాడు. బలి చక్రవర్తి తిరిగి వచ్చే సందర్భంగానే కేరళ ప్రజలు ఓనమ్ పండుగను జరుపుకుంటారు. ఓనమ్ పండుగ నేపథ్యమిది. కానీ ఈ ఆగస్టు 27 వచ్చే ఓనమ్ మాత్రం కేరళ ప్రజలకు బలిచక్రవర్తిని పలురూపాల్లో ముందుగానే పరిచయం చేసింది. 

కేరళలో బలి చక్రవర్తి లేదా మహాబలిని ‘మావెలి’ అని పిలుస్తారు. ఈసారి మావెలి ఓనమ్ కంటే కాస్త ముందుగానే కేరళ ప్రజల్ని పలుకరించాడు. బలిష్ఠమైనదేహంతో పెద్ద మీసాలతో కనిపించే బలి చక్రవర్తి రూపం ఈసారి కాస్త సాధారణ మానవరూపాన్ని సంతరించుకుంది. 

భారత నావికా దళానికి చెందిన 321ఫ్లైట్ స్క్వాడ్రన్ విజయ వర్మ రూపంలో వచ్చిన బలి చక్రవర్తి ఒక నిండుగర్భిణిని తన హెలికాప్టర్‌లో తీసుకువెళ్ళి, కొచ్చిన్‌లోని ఒక ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తల్లీబిడ్డలకు విజయ వర్మ రూపంలో బలిచక్రవర్తి ఎప్పటికీ గుర్తుండి పోతాడు. మరోచోట రేజిఛాయన్ రూపంలో బలి చక్రవర్తి దక్షిణ మధ్య కేరళలో వరదధాటికి దారుణంగా దెబ్బతిన్న గ్రామాలకు పడవను నడిపి, ప్రజలకు పాలు, తాగునీరు వంటి అత్యవసర పదార్థాల్ని నిరంతరాయంగా అందించాడు. 

ఇంకోచోట కన్హయా కుమార్ అనే కానిస్టేబుల్ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దక్షిణ కేరళలోని చెరథోని గ్రామంలో క్షణాల్లో కూలిపోబోతున్న వంతెన మీద చిక్కిన బాలుణ్ణి ప్రాణాలకు తెగించి కాపాడాడు. బలిచక్రవర్తి సాహసాల గురించి కేరళ ప్రజలు అనేకానేక కథల్ని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ ధీశాలి వారసులుగా ఇంతటి మహోపద్రవాన్ని గెలిచి, ప్రాణాలతో మిగిలిన వారంతా మరో ఓనమ్ నాటికి తమ సంతోషాన్ని పునరుజ్జీవింప చేస్తారని ఆశిద్దాం. 
- కల్కిమేమేం 700కోట్లు ప్రకటించలేదు: యూఏఈ

Updated By ManamFri, 08/24/2018 - 12:55

Kerala Floodsవరదలతో అల్లాడిన కేరళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ సాయాన్ని ప్రకటించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దాదాపు 700కోట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించగా, ఆ తరువాత ఆ సాయాన్ని కేంద్రం వద్దనడంతో పలు విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఈ ఆర్థిక సాయంపై మరో సంచలనవార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. కేరళకు అందించే ఆర్థిక సాయం నిర్ధిష్ట మొత్తాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని గల్ఫ్ దేశ రాయబారి ప్రకటించారు. కేరళకు అందించాల్సిన విరాళాలపై తమ అంచనా ఇంకా కొనసాగుతోందని అహ్మద్ అల్బన్నా చెప్పినట్లు ఓ పత్రిక ప్రకటించింది.

అయితే కేరళకు అబుదాబి యువరాజు షఏక్ మొహమ్మద్ బిన్ జావేద్ అల్ నహాన్ రూ.700కోట్ల ప్రకటించారని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. కాగా దాదాపు రూ2వేల కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం 600కోట్లు మాత్రమే ఇవ్వగా, గల్ఫ్ దేశం రూ.700కోట్ల భారీ సాయం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. అయితే ఆ తరువాత ఆ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడంతో కేంద్రంపై విమర్శలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో యూఏఈ రాయబారి ఇంకా మేమేం ప్రకటించలేదని చెప్పడం సంచలనంగా మారింది.మా రాష్ట్రంలో వరదలకు తమిళనాడే కారణం: కేరళ

Updated By ManamFri, 08/24/2018 - 08:59

Keralaతిరువనంతపురం: గత కొద్ది రోజులుగా ప్రకృతి చేసిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కేరళ. మానవతప్పిదం వలనే కేరళలో ఇలా వరదలు వచ్చాయని పలువురు భావిస్తుండగా.. తమ రాష్ట్రంలో వరదలకు పక్కనున్న తమిళనాడే కారణమని కేరళ ఆరోపిస్తూ కోర్టుకెక్కింది. తమ రాష్ట్రంలో ఉన్న ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా ఇడుక్కి డ్యామ్‌లో చేరిందని కేరళ పేర్కొంది. ఈ నెల 15న ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో తమ రాష్ట్రాన్ని వరద ముంచెత్తిందని కేరళ ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.

అయితే తమిళనాడు ప్రజలకు నీటిని అందించాలన్న లక్ష్యంతో 150ఏళ్ల క్రితం ముళ్ల పెరియార్ ప్రాజెక్టును కేరళలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తమిళనాడే చూసుకుంటోంది. అయితే ప్రాజెక్ట్ కట్టి చాలా సంవత్సరాలు అవుతుండటంతో దానిని కూల్చివేసి కొత్తది నిర్మించాలని కేరళ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. దీంతో పాటు డ్యామ్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 142 నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరింది. అయితే కేరళ విజ్ఞప్తిని తమిళనాడు పట్టించుకోలేదు. ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం వల్లే ఈ వరదలు ముంచెత్తాయని కేరళ ఆరోపిస్తోంది.సుధామూర్తి వీడియో వైరల్..

Updated By ManamThu, 08/23/2018 - 17:07
sudha murthy

వేలకోట్ల ఆస్తులు ఉన్నా...  సాధారణ జీవితాన్నే ఆమె ఇష్టపడతారు. ఆడంబరాలకు పోకుండా... ఆ డబ్బును సంఘ సేవకు ఉపయోగిస్తుంటారు. ఆమె... ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి, సామాజిక కార్యకర్త సుధామూర్తి. భారీ వర్షాలు, వరదలతో కకావికలం అయిన కర్ణాటకలోని కొడగు, కేరళ వరద బాధితుల కోసం నడుం బిగించారు. 

అయితే అందరిలా సుధామూర్తి... వరద బాధితుల సహాయార్థం నగదు, లేదా ఆహార పదార్థాలు విరాళంగా ఇచ్చి సరిపెట్టుకోలేదు. ఇన్ఫోసిస్ సంస్థ... వరద బాధితులకు దుస్తులు, నిత్యావసర వస్తువులను అందచేస్తోంది. ఇందులో భాగంగా ఆ సంస్థ సిబ్బంది వాటిని ప్యాకింగ్ చేస్తుండగా... మరోవైపు సుధామూర్తి తానే స్వయంగా ప్యాకింగ్ పనుల్లో పాలుపంచుకున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సదానంద గౌడ...సుధామూర్తిని ‘అమ్మ’ అని సంభోదిస్తూ ... ఆ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోకు పెద్ద ఎత్తున లైక్‌లతో పాటు, ఆమె ఔదార్యానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.మీ సాయం మాకొద్దు

Updated By ManamThu, 08/23/2018 - 00:50
 • విదేశీ సాయం తీసుకోబోమన్న భారత్

 • సొంత డబ్బుతోనే కేరళ పునర్నిర్మాణం.. పౌరులు ఇచ్చే విరాళాలకు మాత్రం ఓకే

 • దేశాల ప్రభుత్వాల నుంచి అసలు వద్దు.. యూఏఈ ఇస్తామన్న 700 కోట్లూ అంతే

 • గతంలో యూపీఏ సర్కారుదీ ఇదే నిర్ణయం.. ఉత్తరాఖండ్ వరదల్లో విదేశీ సాయానికి నో

keralaతిరువనంతపురం: ప్రకృతి కన్నెర్ర చేయడంతో వరదల బారిన పడిన కేరళను ఆదుకోడానికి 700 కోట్ల రూపాయల సాయం చేస్తామని యూఏఈ ముందుకొచ్చినా, దాన్ని స్వీకరించడానికి భారత సర్కారు మాత్రం సిద్ధంగా లేదు. ఒక్క యూఏఈ మాత్రమే కాదు.. ఏ దేశ ప్రభుత్వం ఇచ్చినా తాము తీసుకోబోమని ఎన్డీయే సర్కారు స్పష్టం చేసింది. కేరళ పునర్నిర్మాణానికి కేవలం సొంత వనరులు, సొంత ప్రయత్నాల మీదే ఆధారపడాలని నిర్ణయించినట్లు న్యూఢిల్లీ వర్గాలు తెలిపాయి. కేరళలో వచ్చిన భారీ వరదల వల్ల దాదాపు 378 మంది మరణించగా, 11 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. గడిచిన వందేళ్లలో ఇంత తీవ్రస్థాయిలో వరదలు కేరళలో ఎప్పుడూ రాలేదని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తని చెప్పింది. దాంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కాస్త ఎక్కువగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేరళలో సంభవించిన ఉత్పాతాన్ని చూసిన పలు దేశాల ప్రభుత్వాలు ఉదారంగా మళయాళీలను ఆదుకోడానికి ముందుకొచ్చాయి. తాము కూడా ఒక చెయ్యి వేస్తామంటూ స్వచ్ఛందంగా తెలిపాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆయా దేశాలు చేసే ఆర్థిక సాయాన్ని అంగీకరించకూడదని నిర్ణయించింది. వరద పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యం తవుకుందని, అందువల్ల ఎలాంటి సాయం అక్కర్లేదని స్పష్టం చేసింది. అయితే పౌరులు తమంతట తాముగా స్పందించి ఏదైనా సాయం చేస్తామంటే మాత్రం తాము వద్దనబోమని తెలిపింది. అయితే, భారత ప్రభుత్వాలు ఇలా విదేశీ సాయాన్ని తిరస్కరించడం ఇదేమీ మొదటిసారి కాదు. 2013 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రళయం సంభవించినపుడు యూపీఏ ప్రభుత్వం కూడా విదేశీ సాయాన్ని తిరస్కరించింది. అలాగే ఇప్పుడు కూడా తాము విదేశీ ఆర్థిక సాయాన్ని ఆమోదించబోమని మోదీ సర్కారు అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు తెలియజేసింది. ఒకవేళ ఆయా ప్రభుత్వాలు ఏమైనా సాయం చేస్తామని చెబితే.. అందుకు కృతజ్ఞతలు చెబుతూనే సున్నితంగానే సాయం తీసుకోబోమని చెప్పాలన్నారు.

రుణపరిమితి పెంచండి
ఇళ్లు, కార్యాలయాలు, రోడ్లు, వంతెనలు.. ఇలా అన్నీ కుప్పకూలిపోవడంతో భారీగా పునర్నిర్మాణం చేయాల్సి ఉందని, అందువల్ల తాము బహిరంగ మార్కెట్ నుంచి తీసుకోగలిగే రుణ పరిమితిని పెంచాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరుతున్నారు. ఈ మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ప్రస్తుం కేరళ తమ రాష్ట్ర జీడీపీలో 3 శాతాన్ని బయటినుంచి రుణంగా తీసుకోవచ్చు. దాన్ని 4.5 శాతం చేస్తే అదనంగా రూ. 10,500 కోట్లు సమీకరించుకోగలమని కేరళ సర్కారు యోచిస్తోంది.కేరళ విలపిస్తోంది వలవల 

Updated By ManamWed, 08/22/2018 - 03:30

kerala-landslidesప్రకృతి అందాలతో ప్రజ లను కనువిందు చేసే సౌందర్య రాశి కేరళ రాష్ట్రం. భారత దేశానికి నైరుతి మూలన మలబార్ తీరాన కొలువైన రాష్ట్రం కేరళ. తూర్పు, ఈశాన్యాల్లో కర్ణా టక, తమిళనాడు, పశ్చి మాన అరేబియా సము ద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం దీనికి సరి హద్దులు. కేరళ భూభాగంలో పావు వంతు అటవీ ప్రాంతం. ఇటీవలి కాలంలో అడవులను నరకడం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని కేరళ ప్రభుత్వం అడవుల్లో చాలా భాగాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. కేరళలో ఏప్రాంతానికి వెళ్ళినా ప్రకృతి ఒడిలో తేలి యా డుతున్న అనుభూతి కలుగుతుందన్నది పర్యాటకుల అను భవం. కన్యాకుమారి, కోవెలం, అలెప్పీ, కుమారకోం, అలప్పూజ, వెంబనాడ్.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో. కేరళ రాష్ట్రానికి 590 కిలోమీటర్ల పొడవైన విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ఇక్కడి పశ్చిమ కనుమల్లో గల హిల్ స్టేషన్ల లో అపారమైన వృక్షసంపద, వన్యప్రాణులు అందరినీ ఆకర్షి స్తాయి. కనువిందు చేస్తాయి. ఎటుచూసినా గగనాన్ని తల దన్నేలా కనబడే పచ్చనిచెట్లు, చేయి పైకెత్తి అందుకోవచ్చ న్నంత దగ్గరలో తెల్లని మబ్బులూ, కళ్ళు తిరిగేలా చేసే లోతైన లోయలూ, ప్రకృతి కాంతకు పచ్చని చీరకట్టినట్లు కని పించే తేయాకు తోటలూ, నారికేళ వన సౌందర్యంతో హొయలొలకించే కేరళ ప్రకృతి సోయగాల వీక్షణకు నిజంగానే రెండుకళ్ళు చాలవు. ప్రకృతి సౌందర్యాన్ని, అహ్లాదకర వాతావరణాన్ని అందంగా, అద్భుతంగా ఆ స్వాదించాలంటే భారతదేశం మొత్తంలో అందుకు త గిన ప్రదేశం కేరళ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. అలాంటి అనూభూతిని మరెక్కడా ఆస్వాదించలేం. 

దక్షిణ భారతంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒకటిగా పరిగణించే కేరళ, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టా న్నను సరించి 1956 నవంబర్ ఒకటిన పూర్తిస్థాయి రాష్ట్రంగా ఆవిర్భవించింది. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యతా శాతం కలిగిన, అత్యంత ఆరోగ్యకరమైన రాష్ట్రం కేరళ. కేరళ అనగానే ముందుగా ఎవరికైనా కొబ్బరిచెట్లు, తేయాకు తోటలే గుర్తుకువస్తాయి. మళయాళంలో ‘కేర’ అంటే కొబ్బరిచెట్లు. ‘ఆళం’ అంటే భూమి - ఈరెండింటి కలయిక ద్వారా ‘కేరళం’ ఏర్పడిందని కొందరు అంటారు. అంటే, కొబ్బరి చెట్లనేల అన్న మాట. కేరళ రాజధాని తిరువనంతపురం. దీని విస్తీర్ణం 38,863 చదరపు కిలో మీటర్లు. కేరళ రాష్ట్రంలో జిల్లాలు 14 ఉన్నాయి. దేశంలోని మొత్తం వృక్షజాతిలో నాలుగో వంతు అంటే, సుమారు పదివేల జాతులు కేరళలో ఉన్నాయి. నాలుగు వేల పూలరకాల్లో 1272 రకాల పూల జాతులు కేరళ సొంతం. సుమారు వెయ్యి రకాల ఔషధ మొక్కలు అక్కడ సాగవుతున్నాయని ఆయా రంగాల నిపుణులు చెబుతున్నారు. ఎత్తైన కొండలు, లోతైన లోయలు కేరళలోనే కనిపిస్తాయి. తూర్పు వైపునకు ప్రవహించే మూడు నదులూ, పశ్చిమ దిక్కుకు ప్రవహించే పద్నాలుగు నదులూ ఇక్కడి నుండే ప్రారంభమవుతాయి. ఇంకా ఇలాంటి అనేక ప్రత్యేకతలతో, ప్రకృతి అందాల పుట్టినిల్లుగా ప్రసిద్ధి గాంచి, అత్యద్భుత ప్రకృతి సోయగాలతో పరవశింపజేసే మళయాల సీమ ఇప్పుడు అనూహ్యమైన జల దిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. ప్రకృతి విల య తాండవానికి వందలాది మంది బలైపొయ్యారు. వేలాది మంది ప్రజలు క్షతగాత్రులయ్యారు. లక్షలాది మంది జనం నిరాశ్రయులయ్యారు. గత పదిరోజులకు పైగా నిర్విరామంగా కురుస్తున్న వానలకు ఆ అందాల సీమ ఇప్పుడు మరు భూమిని తలపిస్తోంది.

1924 తరువాత ఇంత భారీస్థాయిలో వర్షాలు కుర వడం ఇదే ప్రథమం. 1924 వరదలు అప్పట్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి బీభత్సం సృష్టించాయి. అప్పటి వర్షపా తం 3348 మిల్లీమీటర్లని పాత లెక్కలు చెబుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షా లకు కొచ్చిన్ విమానాశ్రయాన్నే మూసి వేశారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి భారీ ప్రకృతి విపత్తుకు ప్రధాన కారణం గత ఇరవై ఏళ్ళుగా కొనసాగుతున్న పర్యా వరణ విధ్వంసమేనని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ పరంగా పశ్చిమ కనుమలు అతి సున్నితమైన ప్రాంతాలు. వీటిని పరిరక్షించు కోవాలని పర్యావరణ వేత్తలు మొత్తుకున్నారు. కానీ ప్రభు త్వాలు వారి మాటను పెడచెవిన పెట్టడం వల్ల కనుమల ప్రాంతం విధ్వంసానికి గురైంది. ఆ ప్రాంతాల్లో చెట్ల నరికి వేత, కట్టడాల నిర్మాణం విచ్చలవిడిగా సాగింది. దీంతో కొండలపై నుంచి ప్రవాహవేగం అనూహ్యంగా పెరిగి పోయింది. ఈకారణం వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం వల్ల అపారమైన నష్టం సంభవిస్తోంది. పశ్చిమ కనుమల్లో పర్యావరణ రద్దీ పెరగడంవల్ల సున్నిత ప్రాంతాల్లో కాంక్రీటు నిర్మాణాలు చేపట్టారు. దీనివల్ల నీటిని నిల్వచేసు కునే సామర్ధ్యాన్ని కొండప్రాంతాలు కోల్పోయాయి. ఆ ప్రాం తాలలో పెరిగిన జనాభాకు అనుగుణంగా అడవులను నరికి నివాస గృహాలు కట్టారు. కేరళలో ఇప్పుడు సంభవిస్తున్న విపత్తుకు ఇదికూడా ఒకకారణం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కేరళలో గతపదేళ్ళ నుంచి ఇసుక మాఫియా కూడా విధ్వంసకాండలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇసుక అక్రమ రవాణాకోసం నదీ గర్భాలను తవ్వివేయడంవల్ల వరద నీటిని నిల్వ చేసుకునే తమ సహజ స్వభావాన్ని నదీప్రాంతాలు కోల్పోయాయి. దీంతో ప్రవాహవేగం పెరిగి నదీ జలాలు జనావాసాలపై విరుచుకు పడుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా వాతావరణంలో పెరుగుతున్న కర్బ న ఉద్గారాలు, వాతావరణ మార్పులు కూడా ఈ వరదలు, విపత్తులకు కారణమవుతున్నాయి. ఏదిఏమైనా, కేరళ ప్రజలకు జరిగిన నష్టం అపారం. వారి హృదయావేదన అనంతం. ఇంతటి మహా విపత్తు నుంచి కోలుకోడానికి యావద్దేశ ప్రజలూ ముందుకు రావాలి. ఉదారంగా ఆదుకోవాలి. అప్పుడే బాధితులు ఈదుర్ఘటన ప్రభావం నుంచి త్వరగా బయట పడగలుగుతారు. ఆర్ధికంగానూ, మానసికంగానూ కోలుకోగలుగుతారు. సాటి దేశవాసుల సానుభూతి, సహకారాలు కూడా తమకు ఉన్నా యన్న తృప్తే వారికి గొప్ప ఓదార్పు. అందుకని, ప్రకృతి ప్రకోపానికి గురైన మన కేరళ సోదరులను ఆదుకోడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఎవరిశక్తిమేర వారు ఉదారంగా విరాళాలిచ్చి తోడ్పడవలసిందిగా వినమ్రంగా  విజ్ఞప్తి చేస్తున్నాను.
యండి.ఉస్మాన్ ఖాన్ 
సీనియర్ జర్నలిస్టు  కోలుకునేందుకు పదేళ్లపైనే

Updated By ManamWed, 08/22/2018 - 01:18
 • కేరళలో జలప్రళయం విలయం.. 90 వేల కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం

 • కొట్టుకుపోయిన వందల వంతెనలు.. వేల హెక్టార్లలో పంటల నష్టం.. 

 • నిలువునా కూలిన వాణిజ్య తోటలు.. లక్ష వరకు భవనాలు విధ్వంసం: నిపుణులు

 • పునర్నిర్మాణానికి వృత్తి నిపుణులు కావాలి: అల్ఫోన్స్

 • కేంద్రానికి కేరళ సీఎం విజయన్ విజ్ఞప్తి 

keralaతిరువనంతపురం: వరదలతో కనీవినీ ఎరుగని.. అంచనాకు అందని నష్టాన్ని చవి చూసిన కేరళ పూర్వ వైభవాన్ని పొందాలంటే కనీసం దశాబ్ద కాలం  పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నవారికి ఆహార పదార్థాలు సరఫరా చేయడం, అక్కడ కనీస వసతులు కల్పించడం ప్రభుత్వానికి తొలి సమస్యగా ఉంది. రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఎర్నాకులం, త్రిస్సూర్, పఠాన్‌మిట్టం, అలప్పుజ, కొల్లాం జిల్లాలో తీవ్రత అలాగే కొనసాగుతోందని, ఈ జిల్లాల్లో పూర్తిభాగం వరద నీటితోనే నిండిపోయి ఉన్నాయని చెబుతున్నారు. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. భవనాలు, నిర్మాణాలన్నీ ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతాల్లో భవనాలు, నిర్మాణాలను తిరిగి పునరుద్ధరించాలంటే కనీసం పదేళ్లు పడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 90,000 కిలోమీటర్ల మేర రహదారులు నాశనమయ్యాయని అధికారులు వెల్లడించారు. వందల కొద్దీ వంతెనలు వరదలో కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు లక్ష భవనాలు ధ్వంసమయ్యాయి. లక్షల టన్నుల పంట పాడైపోయింది. లక్షల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. విధ్వంసానికి గురైన కేరళను పునరద్ధరించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అత్యంత క్లిష్టమైన పని అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభిప్రాయపడటం గమనార్హం. అయితే వరదల కారణంగా ఇప్పటికే సుమారు పది లక్షల మంది వరకు  ప్రజలు పునరావాస సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం తమ లక్ష్యమని, ప్రజల క్షేమమే తమ తొలి ప్రాధాన్యమని విజయన్ వెల్లడించారు. గత రెండు రోజులుగా వరదలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆహారం, నీరు లేక ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని కాపాడి సహాయక సామాగ్రి అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. డ్రోన్ల ద్వారా నీటిలో చిక్కుకున్న వారిని గుర్తించి కాపాడుతున్నారు. వరదలు తగ్గినప్పటికీ ఇప్పుడు వ్యాధుల వ్యాప్తి ప్రభుత్వానికి సవాలుగా మారింది. అంటువ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

కేరళకు పంపే వస్తువులకు జీఎస్టీ నో
వరద బీభత్సం వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన నేపథ్యంలో కేరళ వరదలను తీవ్రమైన ప్రకృతి విపత్తుగా పరిగణిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మరిన్నినిధులు విడుదల చేసే అవకాశం ఉంది. కాగా వరద బాధితుల సహాయార్థం కేరళకు పంపించే వివిధ రకాల వస్తువులపై ప్రాథమిక సరుకుల పన్ను(బీసీడీ), సమీకృత వస్తు, సేవల పన్ను (ఐజీఎస్టీ) నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.  ఈ ఏడాది డిసెంబరు 31 వరకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు.. ‘‘కేరళకు భారత్ మొత్తం అండగా నిలుస్తుంది. కేరళ వరద బాధితుల కోసం పంపించే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఐజీఎస్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చిందని’ ఆయన ట్వీట్ చేశారు.

కేరళ నిర్మాణానికి నిపుణులు కావాలి: కేంద్ర మంత్రి
 కేరళ ప్రజలకు సహాయం చేసేందుకు ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, చెక్క పని చేసే వారు కావాలని కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ అన్నారు. వరదల కారణంగా విధ్వంసమైన పరిస్థితులను చక్కదిద్దేందుకు వందల, వేల మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు అవసరం పడుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రానికి సాంకేతిక నిపుణులైన వారి సాయం ఎంతో అవసరమని తెలిపారు. తమకు బట్టలు, ఆహారం అవసరం లేదని.. కేరళలో తిరిగి పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు సాంకేతిక నైపుణ్యం గల వారు వచ్చి సహాయం చేయాలని అభ్యర్థించారు. లక్షలాది మంది ప్రజలు పునరావాస శిబిరాల్లో ఉంటున్నారని ఆల్ఫోన్స్ తెలిపారు. జిల్లా కలెక్టర్లు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తూ సహాయక శిబిరాల్లోని ప్రజలకు ఆహారం అందేలా చేస్తున్నారని చెప్పారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని ఆల్ఫోన్స్ కొనియాడారు. అసలైన హీరోలు మత్స్యకారులు అని ఆయన వరదల్లో సహాయం అందిస్తున్న స్థానిక జాలర్లను పొగిడారు. దాదాపు 600 పడవలతో వారు ప్రజలను కాపాడుతున్నారని తెలిపారు. అళప్పుజా, త్రిస్సూర్, ఎర్నాకుళంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా వరద నీటిలో చిక్కుకుని తిండి లేకుండా ఇళ్లలోనే ఉండిపోయారు.

373కు చేరిన మృతుల సంఖ్య
కేరళలో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి అంటే మే 30 నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 373కు చేరుకుందని అధికారులు తెలిపారు. మరో 32 మంది ఆచూకీ తెలియడం లేదు.  వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రాణ నష్టం సంభవించిందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ) వెల్లడించింది. వర్షాల ప్రభావం 54 లక్షల మందిపై పడిందని, వీరిలో 12.47 లక్షలమంది 5,645 పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని తెలిపింది. సహాయ చర్యల నిమిత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్ 59 సహాయ బృందాలు, 207 బోట్లను పంపిందని తెలిపింది. అలాగే.. సైన్యం కూడా 24 బృందాలను సహాయ చర్యల్లో దించిందని, 104 బోట్ల ద్వారా బాధితులను ఆదుకుంటున్నారని తెలిపింది. భారత నౌకాదళం 9 హెలికాప్టర్లు, రెండు చిన్న విమానాలు, 94 బోట్ల ద్వారా, తీర ప్రాంత గస్తీదళం( కోస్ట్‌గార్డ్) 36 బృందాలను, 22 హెలికాప్టర్లు, 23 చిన్నపాటి విమానాలను రంగంలోకి దింపిందని, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 10 బృందాలు, బీఎస్‌ఎఫ్‌కు చెందిన మూడు కంపెనీల బలగాలు అంటే 300 మంది సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని ఎన్‌డీఎంఏ తెలిపింది. 

కోచి విమానాశ్రయానికి 220 కోట్ల నష్టం
వరదల్లో మునిగిపోవడంతో కోచిలోని కోచి అంతర్జాతీయ విమానాశ్రయానికి రూ.220 కోట్ల నష్టం సంభవించిందని సీఐఏఎల్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న 2.5 కిలోమీటర్ల ప్రహరీ, రన్‌వే, టాక్సీబే పూర్తిగా దెబ్బతిన్నాయని, విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాపులు నీట మునిగాయని, ఎయిర్‌పోర్టులోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ వైరింగ్ వ్యవస్థ దెబ్బతిన్నదని, రన్‌వేపై ఉండే లైట్లు చెడిపోయాయని తెలిపారు. 

2,600 కోట్లు ఇవ్వండి
కేంద్రానికి సీఎం పినరయి విజయన్ విజ్ఞప్తి

ప్రత్యేక ప్యాకేజీ కింద కేరళకు తక్షణం రూ.2,600కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. అలాగే.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కూడా తక్షణమే ప్రారంభించాలని సూచించారు. మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేరళకు ఉన్న రుణ పరిమితిని పెంచాలని ప్రధానిని కలిసి అడుగుతానని తెలిపారు. కేరళలో 14 జిల్లాలు ఉండగా.. 13 జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, రోడ్లు, నీటి సరఫరా వ్యవస్థ, విద్యుత్ వంటి మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. వీటిని పునర్నిర్మించేందుకు అధికమొత్తంలో పెట్టుబడులు కావాల్సిన అవసరం ఉందన్నారు. 

90 ఏళ్లలో తొలిసారి భారీ వర్షాలు..
వరదలు వెల్లువెత్తిన కేరళలో కేవలం 20 రోజుల్లో 771 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణశాఖ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. గత 87 ఏళ్లలో ఇంత అధిక వర్షపాతం కేరళలో నమోదు కావడం ఇదే మొదటిసారి. 1931వ సంవత్సరంలో కేరళలో 1132 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 87 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళలో భారీవర్షం కురిసిందని వాతావరణశాఖ అధికారి పులక్ గుహత్ కుర్తా చెప్పారు.  అత్యధికంగా ఇడుక్కీ జిల్లాలో 1419 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1907లో ఇడుక్కీ జిల్లాలో 1387 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణశాఖ రికార్డులు చెపుతున్నాయి. ఇడుక్కీ జిల్లాలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఆరురోజుల పాటు 200 మిల్లీమీటర్ల మేర భారీ వర్షం కురవడంతో వరదనీరు పోటెత్తి గ్రామాలను ముంచెత్తింది. 

కాఫీ తోటలు నేలమట్టం
Chengannurకేరళ వరదలు పొరుగునున్న కర్ణాటకలోని కూర్గ్ కాఫీ తోటలను కూడా సర్వనాశనం చేసేశాయి. కర్ణాటకకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కేసీ కల్లప్ప తాను జీవితకాలంలో సంపాదించిన మొత్తంతో మడికెరి సమీపంలోని ముక్కొడ్లు గ్రామంలో నాలుగెకరాల భూమి కొన్నారు. అక్కడ కష్టపడి మొత్తం చదును చేసుకుని ఎనిమిదేళ్ల కాలంలో కాఫీ తోట పెంచారు. సరిగ్గా ఈ ఏడాది దాని ఫలాలు ఆయన అందుకోవాల్సి ఉంది. అంతలో ఉన్నట్టుండి ఆగస్టు 16వతేదీ అర్ధరాత్రి భారీ వరదల కారణంగా పెద్ద కొండచరియ విరిగిపడి ఆయన తోట మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. ఇప్పుడు కనీసం తన తోట సరిహద్దులేవో కూడా తెలిసే పరిస్థితి లేదని, తన కళ్లముందు అంతా అంధకారం మిగిలిందని కల్లప్ప వాపోతున్నారు. ఆయనొక్కరే కాదు.. చాలామంది కాఫీ తోటల యజమానులది ఇదే పరిస్థితి. కాఫీ తోటల్లో అంతరపంటలుగా మిరియాలు, యాలకులు కూడా వేస్తారు. అవి కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కూర్గ్ ప్రాంతంలో దాదాపు 5వేల ఎకరాలలో కాఫీతోటలు దారుణంగా దెబ్బతిన్నాయని కూర్గ్ ప్లాంటర్స్ క్లబ్ ప్రతినిధి కేసీ బొప్పన్న చెప్పారు. కూర్గ్, చికమగళూరు, హసన్ తదితర జిల్లాల్లో ఎక్కువగా కాఫీ పండిస్తుండగా.. ఈ అన్నిచోట్లా 50%కు పైగా ఉత్పత్తి తగ్గిందని కాఫీ పరిశ్రమ నిపుణులు చెప్పారు. భారీ వర్షాల వల్ల కాఫీ గింజలు పడిపోయాయని, దానివల్ల వాటికి ఫంగస్ వ్యాధులు వచ్చి పనికిరాకుండా పోయాయని కర్ణాటక కాఫీ పెంపకందారుల సంఘం సభయుడు వినయ్ చెంగప్ప తెలిపారు. ఇప్పటికే ధరలు పడిపోవడం, కూలీల కొరత, వేతనాలు పెరగడం లాంటి సమస్యలతో పరిశ్రమ అల్లాడుతుండగా ఇప్పుడు వర్షాలు, వరదలు మరింత నష్టం తెచ్చిపెట్టాయి. దీనికి తోడు రోడ్లు, వంతెనలు, కూలీల క్వార్టర్లు పడిపోవడంతో మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి.కేరళ.. కేరళ.. డోన్డ్ వర్రీ కేరళ

Updated By ManamTue, 08/21/2018 - 10:01

AR Rahmanగత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయ్యింది. దాదాపు 400మందికి పైగా మరణించగా.. వేలసంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం వరుణుడు అక్కడ కొన్ని ప్రదేశాల్లో కాస్త కరుణించగా.. ఎవరి ఇంటికి వారు చేరుకుంటున్నారు. మరోవైపు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కేరళవాసులకు దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి సామాన్యులు వరకు సాయం అందుతోంది. ఈ నేపథ్యంలో కేరళ వాసుల కోసం ఒక ప్రత్యేక గీతాన్ని ఆలపించి తన కార్యక్రమానికి వచ్చిన అందరికీ స్పృహను కలిగించారు సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్.

ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో ఏఆర్ రెహమాన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుండగా.. కాదల్ దేశమ్(ప్రేమ దేశం) కోసం తను కంపోజ్ చేసిన ముస్తఫా.. ముస్తాఫా పాటను కేరళ వాసులకు అనువదించారు. ‘‘కేరళ కేరళ డోన్డ్ వర్రీ కేరళ.. కాలమ్ నామ్ తోళన్ కేరళ(కాలం మన నేస్తం కేరళ)’’ అంటూ ఏఆర్ రెహమాన్ అక్కడున్న అందరిలో కేరళ గురించి స్పృహను కలిగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల హార్మోని విత్ ఏఆర్ రెహమాన్ అనే వెబ్ సిరీస్‌లో కేరళపై తనకున్న అభిమానాన్ని రెహమాన్ తెలిపారు. తన తండ్రి అక్కడ ఎన్నో చిత్రాలకు పనిచేశారని, అందుకే ఆ రాష్ట్రం తనకు ఎంతో స్పెషల్ అని రెహమాన్ పేర్కొన్నారు.

Related News