bhoomika

అలాంటి పాత్ర‌ల‌ను ఇంకా క్రియేట్ చేయాలి

Updated By ManamMon, 09/10/2018 - 14:27

Bhoomikaహీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న న‌టి భూమిక విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స‌మంత, ఆది పినిశెట్టి, రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `యు ట‌ర్న్‌` చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు భూమిక‌. ఈ సినిమా గురించి భూమిక మాట్లాడుతూ ``స‌మంత న‌టించిన `ఈగ‌` సినిమా చూశాను. త‌న‌లో మంచి ఎనర్జీ ఉంది. `యు ట‌ర్న్‌` మాతృక‌ను చూశాను. దాని డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌కుమారే తెలుగు, త‌మిళంలో డైరెక్ట్ చేశారు. ఆయ‌న చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయాను. ఇలాంటి పాత్ర‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయ‌నేలేదు. న‌టిగా ఇలాంటి పాత్ర‌ల‌ను చేయాల్సి ఉంది. పాత్ర నిడివి కంటే పాత్ర ప్రాముఖ్య‌త ఎలా ఉందో చూసుకుంటాను. నేను గ‌తంలో మ‌హిళా ప్రాధాన్య‌త చిత్రాల్లో న‌టించాను. అలాంటి చిత్రాలు మ‌రిన్ని రావాలి. మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ను క్రియేట్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది`` అన్నారు. 



‘యాత్ర’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..?

Updated By ManamTue, 07/03/2018 - 13:29

YSRదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌ను వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్సార్‌గా కనిపించనుండగా.. జగపతిబాబు, సుహాసిని, అనసూయ, భూమిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.



సెవెన్త్ వండ‌ర్స్ ( స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌)

Updated By ManamThu, 05/03/2018 - 18:38

7th'రంగ‌స్థ‌లం'.. తెలుగు నాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న తాజా చిత్రం పేరిది. 1980ల నాటి గ్రామీణ వాతావ‌ర‌ణంతో.. అక్క‌డి రాజ‌కీయాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా.. ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ప్ర‌తిభ‌ని మ‌రోసారి చాటింది. అంతేగాకుండా.. ఆయ‌న కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 7వ చిత్రం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఏడో చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఇలానే సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. కెరీర్ బెస్ట్ హిట్‌గా నిల‌వ‌డ‌మో.. ట‌ర్నింగ్ పాయింట్‌గా నిల‌వ‌డ‌మో జ‌రిగిన సంద‌ర్భాలున్నాయి. అలాగే వారి కెరీర్‌లో మంచి విజ‌యాలు అందించ‌డ‌మో జ‌రిగింది.  ఓ సారి ఆ ప్ర‌ముఖుల 7వ సినిమాల‌ వైపు దృష్టి పెడితే..

నంద‌మూరి తార‌క రామారావు
న‌ట సార్వ‌భౌముడు ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానంలోనే కాదు, తెలుగు సినిమా చరిత్ర‌లోనూ 'పాతాళ భైర‌వి'ది చెర‌గ‌ని స్థానం. ఈ సినిమాలో తోట రాముడు పాత్ర‌లో ఆయ‌న చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. కె.వి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. న‌టుడిగా ఈ సినిమా.. ఎన్టీఆర్‌కు ఏడ‌వ చిత్రం.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు
మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కెరీర్‌లో 'బాల‌రాజు' చిత్రం ప్ర‌త్యేకం. ఈ సినిమాతో న‌టుడిగా ఏఎన్నార్ స్థాయి మ‌రింత పెరిగింది.  విజ‌య‌వాడ‌లో ఏడాది పాటు ఆడిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద ప‌లు రికార్డుల్ని సృష్టించింది. ఈ సినిమా.. త‌న‌ కెరీర్‌లో ఏడ‌వ చిత్రం కావ‌డం విశేషం.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌
ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల‌లో 'ఖుషి' ఒక‌టి. ఆడియో ప‌రంగానూ.. సినిమా ప‌రంగానూ అనేక సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం.. ప‌వ‌న్ ఇమేజ్‌ను అమాంతం ఎన్నో రెట్లు పెంచింది.  అలాంటి 'ఖుషి'.. ప‌వ‌న్ కెరీర్‌లో ఏడ‌వ సినిమా కావ‌డం విశేషం.

మ‌హేశ్ బాబు, భూమిక‌, గుణ‌శేఖ‌ర్‌
'ఒక్క‌డు'.. మ‌హేశ్ బాబు కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిన చిత్రం పేరిది. అప్ప‌టివ‌ర‌కు మ‌హేశ్‌కున్న ఇమేజ్‌ను పూర్తిగా మార్చివేయ‌డ‌మే కాకుండా.. రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను మూట‌గ‌ట్టుకుంది. మ‌హేశ్‌కు స్టార్ డ‌మ్ తీసుకువ‌చ్చిన ఈ సినిమా.. ఆయ‌న కెరీర్‌లో ఏడ‌వ చిత్రం. అలాగే క‌థానాయిక భూమిక‌, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్‌లోనూ ఇది ఏడో చిత్రం కావ‌డం విశేషం.

ఎన్టీఆర్‌
తాత‌య్య ఎన్టీఆర్‌కు ఏడ‌వ చిత్రం 'పాతాళ భైర‌వి' ఏ విధంగానైతే ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిందో.. అలాగే మ‌న‌వ‌డు ఎన్టీఆర్‌కు కూడా అత‌ని ఏడో చిత్రం మంచి బ్రేక్‌ను అందించిన సినిమా కావ‌డం యాదృచ్ఛిక‌మైనా ఓ విశేషంగానే చెప్పుకోవాలి. ఇంత‌కీ ఆ చిత్ర‌మేమిటంటే.. 'సింహాద్రి'. తార‌క్ ద‌శ‌ను, దిశ‌ను మార్చివేసిన ఈ సినిమా.. అప్ప‌ట్లో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచింది.

రాజ‌మౌళి
'బాహుబ‌లి' సిరీస్‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తిభాపాట‌వాలు ఖండాంత‌రాలు దాటినా.. ఆయ‌న కెరీర్‌ను కీల‌క మలుపు తిప్పిన సినిమా మాత్రం 'మ‌గ‌ధీర' అనే చెప్పాలి.  జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కూడా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా ముందుందని చాటి చెప్పిన ఈ చిత్రం.. ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి స్థాయిని అమాంతం పెంచింది. అలాంటి 'మ‌గ‌ధీర‌'.. రాజ‌మౌళి కెరీర్‌లో ఏడో చిత్రం కావ‌డం విశేషం.

శ్రియ‌
కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా.. ఆడ‌పాద‌డ‌పా అభిన‌యానికి పాత్ర‌ల్లోనూ క‌నిపించి మెప్పించిన క‌థానాయిక శ్రియ‌. 'సంతోషం'తో తొలి హిట్‌ను అందుకున్న శ్రియ‌.. బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది మాత్రం చిరంజీవి హీరోగా న‌టించిన 'ఠాగూర్' సినిమాతోనే. న‌టిగా ఆమెకిది ఏడో చిత్రం కావ‌డం విశేషం.

స‌మంత‌
తొలి చిత్రం 'ఏమాయ చేసావె'తోనే విజ‌యం అందుకున్న స‌మంత‌కి.. క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన‌ 'దూకుడు'నే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అప్ప‌టికే ఆరు సినిమాల్లో న‌టించిన స‌మంత‌కు ఇది ఏడో సినిమా. మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో సౌత్ క్వీన్‌గా నిలిచిన స‌మంత‌కు.. ఆ క్ల‌బ్‌లో తొలిసారిగా స్థాన‌మిచ్చిన చిత్రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

శ్రుతి హాస‌న్‌
లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న‌య‌గా ప‌రిచ‌య‌మైన శ్రుతి హాస‌న్‌కు తెలుగు, హిందీ, త‌మిళ్‌.. ఇలా మూడు భాష‌ల్లో చేసిన మొద‌టి ఆరు సినిమాలు వ‌రుస‌గా ప‌రాజ‌యాల‌నే అందించాయి. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జోడీగా నటించిన 'గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రం.. క‌థానాయిక‌గా ఆమె న‌టించిన ఏడో సినిమాగా విడుద‌లై ఆమెకు క‌మ‌ర్షియ‌ల్‌గా ఘ‌న‌విజ‌యాన్ని అందించింది. దీంతో.. 7 అనేది శ్రుతి ల‌క్కీ నెంబ‌ర్‌గా మారింది. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో త‌న ఫాలోవ‌ర్లు 7 మిలియ‌న్లకి చేరుకున్నాక‌.. 7 త‌న ల‌క్కీ నెంబ‌ర్ అంటూ మ‌రోసారి ప్ర‌స్తావించింది శ్రుతి.

వీరితో పాటు.. వెంక‌టేశ్ (శ్రీ‌నివాస క‌ళ్యాణం), రామ్ చ‌ర‌ణ్ (ఎవ‌డు), నాగ‌చైత‌న్య (మ‌నం), అనుష్క (ల‌క్ష్యం), కృష్ణ‌వంశీ (మురారి), పూరీ జ‌గ‌న్నాథ్ (అమ్మ‌ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి), వి.వి.వినాయ‌క్ (లక్ష్మీ), ఎ.క‌రుణాక‌ర‌న్ (డార్లింగ్‌), దిల్ రాజు (కొత్త బంగారు లోకం), త్రివిక్ర‌మ్ (స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి) వంటి సినీ ప్ర‌ముఖుల‌కు కూడా వారి వారి ఏడో చిత్రాలు మంచి విజ‌యాలు అందించ‌డం విశేషం. ఏదేమైనా.. మ‌న సినీ ప్ర‌ముఖుల్లో చాలా మందికి ఏడో సినిమాలు 'సెవెన్త్ వండ‌ర్‌'గా నిల‌వ‌డం ప్ర‌త్యేక‌మైన విష‌యంగానే చెప్పుకోవాలి.                                                                                    -మ‌ల్లిక్ పైడి



భూమిక.. ఓ దెయ్యం

Updated By ManamThu, 03/22/2018 - 03:29

BHOOMIKAకన్నడలో విజయం సాధించిన ‘యూ టర్న్’ చిత్రాన్ని తెలుగులో సమంత రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు నేటివిటీకి, తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పవన్‌కుమార్. ఈ సినిమాలో సమంత ఓ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తుండగా, భూమిక దెయ్యం పాత్రలో కనిపిస్తుందట. కథ ప్రకారం భూమిక పోషించే పాత్ర చాలా చిన్నదైనప్పటికీ కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఈ కన్నడ రీమేక్‌పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. 



'స‌వ్య‌సాచి'.. ఫ‌స్ట్ పంచ్ అదిరింది

Updated By ManamFri, 03/16/2018 - 12:42

savyasachi''రెండు చేతుల్ని స‌మ‌ర్థంగా, శ‌క్తిమంతంగా వాడే వాళ్ళ‌ని స‌వ్య‌సాచి అంటారు. మ‌హాభార‌తంలో అర్జునుడి ఐదో పేరు స‌వ్య‌సాచి. ఎందుకంటే.. అర్జునుడు రెండు చేతుల‌తో ఒకే వేగంతో విలువిద్య ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌డు. అలాగే మా చిత్రంలో కూడా క‌థానాయ‌కుడు త‌న‌ రెండు చేతుల్ని స‌మ‌ర్థ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ను, ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొంటాడు. అదెలాగ‌న్న‌ది తెలుసుకోవాలంటే 'స‌వ్య‌సాచి' చూడాల్సిందే'' అంటున్నారు చందు మొండేటి.

'కార్తికేయ‌', 'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంతమైన చిత్రాల త‌రువాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్ర‌మిది. నాగ‌చైత‌న్య టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఈ రోజు (శుక్ర‌వారం) విడుద‌లైంది. సినిమా థీమ్‌ను ఈ పోస్ట‌ర్‌లో చెప్పే ప్ర‌య‌త్నం క‌నిపించింది. కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ మూవీ జూన్ 14న తెర‌పైకి రానుంది.



'స‌వ్య‌సాచి' ఎప్పుడంటే..

Updated By ManamSun, 02/18/2018 - 15:48

savya sachi'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయకుడు నాగ‌చైత‌న్య‌, ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం 'స‌వ్య‌సాచి'. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ద్వి శ‌తాధిక చిత్రాల స్వ‌ర‌క‌ర్త ఎం.ఎం.కీర‌వాణి బాణీలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల తేది గురించి టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే.. మార్చి నెలాఖ‌రుక‌ల్లా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకోనున్న ఈ మూవీని మే 24న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారని తెలిసింది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది.



 స‌మంత చిత్రంలో భారీ తారాగ‌ణం

Updated By ManamThu, 01/25/2018 - 22:31

samanthaక‌న్న‌డంలో విజ‌యం సాధించిన 'యు-ట‌ర్న్' చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ సినిమాని మాతృక ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ తెర‌కెక్కించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో స‌మంతకి స‌పోర్ట్‌గా మంచి తారాగ‌ణ‌మే సంద‌డి చేయ‌నుంద‌ని తెలుస్తోంది. స‌మంత జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో.. పోలీస్ ఆఫీస‌ర్‌గా ఆది పినిశెట్టి న‌టించ‌నుండ‌గా.. స‌మంత బాయ్ ఫ్రెండ్‌గా రాహుల్ ర‌వీంద్ర‌న్ (స‌మంతకి డ‌బ్బింగ్ చెప్పే చిన్మ‌యికి భ‌ర్త‌) న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌థ‌లో కీల‌క‌మైన అతిథి పాత్ర‌ల్లో సీనియ‌ర్ హీరోయిన్స్ శ్రియ‌, భూమిక క‌నిపించ‌నున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు అధికారికంగా వెలుగులోకి వ‌స్తాయి.



 'ఎం.సి.ఎ' 8 రోజుల క‌లెక్ష‌న్స్‌

Updated By ManamFri, 12/29/2017 - 17:53

mcaమిడిల్ క్లాస్ అబ్బాయ్‌గా నాని సంద‌డి చేసిన చిత్రం 'ఎం.సి.ఎ'. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో భూమిక ఓ కీల‌క పాత్ర పోషించింది. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌కుడు. కాగా, గ‌త గురువారం విడుద‌లైన ఈ సినిమా 8 రోజుల‌కిగానూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.30.1 కోట్ల షేర్ రాబ‌ట్టుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షేర్ రూ.24.95 కోట్ల వ‌ర‌కు ఉంద‌ని స‌మాచార‌మ్‌. థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ రూ.30 కోట్లు ఉన్న ఈ సినిమా.. బ్రేక్ ఈవెన్ అయ్యింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ..  వ‌సూళ్ల ప‌రంగా దూసుకుపోతున్న ఈ సినిమాతో నాని ఖాతాలో మ‌రో విజ‌యం చేరిన‌ట్ల‌య్యింది.



'స‌వ్య‌సాచి'కి అక్క‌గా భూమిక‌

Updated By ManamThu, 12/28/2017 - 17:11

bhoomika'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత నాగ‌చైత‌న్య‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మాధ‌వ‌న్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రం.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సీనియ‌ర్ క‌థానాయిక భూమిక ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపించాయి. భూమిక కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది కూడా. కాగా, ఈ సినిమాలో చైతుకి అక్క పాత్ర‌లో భూమిక న‌టించ‌నుంద‌ని తెలిసింది. ఈ పాత్రే సినిమాలో కీల‌క మ‌లుపుల‌కి కార‌ణ‌మ‌వుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు.



'స‌వ్య‌సాచి'లో భూమిక?

Updated By ManamSat, 12/23/2017 - 18:16

bhoomikaభూమికా చావ్లా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్.. ఇలా ఈ ముగ్గురు అగ్ర క‌థానాయ‌కుల ఏడో చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించ‌డ‌మే కాకుండా... వారంద‌రికి క‌లిసొచ్చిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది భూమిక‌. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల‌తోనూ మెప్పించింది. తాజాగా 'ఎం.సి.ఎ'లో నానికి వ‌దిన‌గా న‌టించిన భూమిక‌కి ఆ చిత్రం మంచి పేరే తీసుకువ‌చ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య క‌థానాయకుడిగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో 'స‌వ్య‌సాచి' రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భూమిక ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ‌న‌టుడు మాధ‌వ‌న్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. మాధ‌వ‌న్‌కి జోడీగా భూమిక క‌నిపించ‌నుంద‌ని స‌మాచార‌మ్‌.

కాగా, భూమిక‌ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసింది నాగార్జున‌నే.  నాగ్ నిర్మించిన‌ 'యువ‌కుడు' చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన భూమిక‌.. ఆ చిత్రంలో సుమంత్‌కి జోడీగా న‌టించింది. ఆ త‌రువాత నాగ్‌తో 'స్నేహ‌మంటే ఇదేరా' చేసిన భూమిక‌.. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం విశేషం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువడుతుంది.





Related News