trs

కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

Updated By ManamFri, 11/16/2018 - 15:52
  • మంచిర్యాల టికెట్ ఇవ్వలేదని అసంతృప్తి

  • కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన గడ్డం అరవింద్ రెడ్డి 

  • కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేసినా టికెట్ దక్కలేదని ఆవేదన 

Gaddam Aravind reddy, TRS, Congress, Telangana assembly elections, Prajakutami హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలు పార్టీల నేతలు టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. తాము ఆశించిన స్థానాల్లో టికెట్ ఇవ్వడం లేదని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతుంటే.. మహాకూటమి కారణంగా తమ పార్టీలోని అందరి నేతలకు టికెట్లు ఇవ్వలేక ఆయా పార్టీల అధినేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు పార్టీ టికెట్ దక్కని ఆశావహులంతా ఒక పార్టీ నుంచి మరో పార్టీలో మారిపోయి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే  గడ్డం అరవింద్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో తన అనుచరులతో కలిసి అరవింద్ రెడ్డి చేరారు. తాను ఆశించిన మంచిర్యాల టికెట్‌ను కాంగ్రెస్ తనకు ఇవ్వలేదనే అసంతృప్తితోనే అరవింద్.. హస్తం వీడి కారు ఎక్కేశారు. 

Gaddam Aravind reddy, TRS, Congress, Telangana assembly elections, Prajakutami గురువారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను అరవింద్ రెడ్డి కలిసి తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిపిన మరుసటి రోజే ఆయనలో టీఆర్ఎస్‌లో చేరడం కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేసింది. ‘‘నాలుగేళ్లగా మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి ఎంతగానో కృషిచేశాను. కానీ, కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది’’ అని అరవింద్ వాపోయారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన అరవింద్ రెడ్డి.. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన సంగతి విదితమే.  రేవంత్ రెడ్డివి చిల్లర వేషాలు..

Updated By ManamThu, 11/15/2018 - 17:15
MP Seetaram Naik slams revanth reddy

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిల్లర వేషాలు వస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన అన్నారు. ఎంపీ సీతారాం నాయక్ గురువారం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ... ‘రేవంత్ రెడ్డి ఏంటో అందరికీ తెలుసు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ పార్టీలో చేరే ఆ ఇద్దరి ఎంపీల పేర్లు చెప్పాలి. టీఆర్ఎస్‌ కోసం పనిచేసే వాళ్లను ఆత్మరక్షణలో పడేసే గేమ్స్ ఆడొద్దు.

భవిష్యత్‌లో ఇలాంటి వార్తలు...ప్రచారం చేస్తే వారిపై కేసులు పెడతాను. నేను టీఆర్ఎస్ వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అలాంటి వార్తలు వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. మీడియాలో వస్తున్న వార్తలు ఒకసారి ఆలోచించి రాయాలి. నేను ప్రొఫెసర్‌గా పనిచేశాను. మహబూబాబాద్ నుంచి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని గెలిచాను. 26లక్షలమంది లంబాడీలు ఇక్కడ ఉన్నారు. లంబాడీలు ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రచారం చేస్తున్నాను. అందులో భాగంగా కొడంగల్ వెళ్లాను’ అని తెలిపారు. రాజీనామా చేయలేదు, రేవంత్ దుష్ప్రచారం..

Updated By ManamThu, 11/15/2018 - 16:49

Chevella MP Konda Vishweshwar Reddy given clarity over resign to TRSహైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ  కొండా విశ్వేశ్వరరెడ్డి గురువారం టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలు గురువారం కలకలం రేపాయి. దీంతో తన రాజీనామాపై ఆయన గురువారం క్లారిటీ ఇచ్చారు. తాను టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. తాను కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిసి వచ్చినట్లు చెప్పారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు పార్టీ మారే ఆలోచనే లేదని చెప్పుకొచ్చారు.

కాగా టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన రేపాయి. అంతేకాకుండా చేవెళ్ల ఎంపీ  కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, ఆ లేఖను కేసీఆర్‌కు పంపినట్లు వచ్చిన వార్తలు మీడియాలో హల్‌హల్ చేశాయి. దీంతో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తన రాజీనామా వార్తలను కొట్టిపారేశారు.

మరోవైపు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కూడా టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెబుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఎంపీ సీతారాం నాయక్ అనూహ్యంగా గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.'కాంగ్రెస్‌లో కోవర్టులున్నారు'

Updated By ManamThu, 11/15/2018 - 15:31

Congress Party, Kyama Mallesh, TRS, Congress, DCC president, Dasoju Sravan, KCRహైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీ టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు ప్రజాకూటమి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో సీట్ల సర్దుబాటు కారణంగా పార్టీ టికెట్ దక్కని ఆశావహులంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాము పోటీ చేయాలనుకున్న స్థానాల్లో మరో పార్టీ నేతలకు సీట్లను కేటాయించడంతో సొంత పార్టీలోని టికెట్ దక్కని నేతలంతా గుర్రుగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేత, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టులున్నారని ఆయన విమర్శించారు. సీట్ల కేటాయింపుల్లో యాదవులు, కుర్మలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 

రూ. 10 కోట్లు తీసుకొని దానం నాగేందర్‌పై బలహీన అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కు టికెట్ ఇచ్చారని మల్లేశ్ విమర్శించారు. భక్త చరణ్‌దాస్ ఒక నియోజకవర్గానికి రూ.3 కోట్లు అడిగినట్టు చెబుతున్న ఓ ఆడియో టేప్‌ను మల్లేశ్ విడుదల చేశారు. స్ర్కీనింగ్ కమిటీ వ్యవహారం కంచే చేనుమేసినట్లుందని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను విమర్శించే కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలన్నారు. ఇబ్రహీంపట్నం సీటు కోసం భక్తచరణ్ దాస్ కొడుకు సాగర్ రూ.3 కోట్లు అడిగారని మల్లేశ్ ఆరోపించారు. మొత్తం ఆస్తుల విలువ 22.60కోట్లు

Updated By ManamThu, 11/15/2018 - 10:41
KCR

హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు గానూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలతో కూడిన ప్రమాణ పత్రాన్ని ఆయన సమర్పించారు. అందులో కేసీఆర్ ఆస్తుల విలువ రూ.22.60కోట్లుగా పేర్కొన్నారు.

అందులో తన భార్య శోభ పేరిట రూ.93వేల నగదు, 2.2కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఈ నాలుగేళ్లలో దాదాపు 17ఎకరాల వ్యవసాయ భూమిని ఆయన కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. తనపై మొత్తం 64కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, రెండు కేసుల్లో సమన్లు అంది విచారణలో ఉన్నాయని వివరించారు. ఇక గతంతో పోలీస్తే ఇప్పుడు కేసీఆర్‌కు అప్పులు మరో కోటి పెరిగి.. రూ.8.88కోట్లకు చేరాయి. వాటిలో కుమారుడు కేటీఆర్‌కు రూ.82లక్షలు, కోడలు శైలిమకు రూ.24.65లక్షల అప్పు చెల్లించాల్సి ఉందని వివరించారు. ఇక బంజారాహిల్స్, తీగలగుట్టపల్లిలో తనకు రెండు నివాసాలు ఉన్నాయని, సొంత కారు లేదని వివరించారు. కాగా 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆస్తుల విలువను రూ.15.15కోట్లుగా చూపిన విషయం తెలిసిందే.

అఫిడవిట్‌లో కేసీఆర్ సమర్పించిన వివరాలు
నగదు:రూ.2,40,000
బ్యాంకు డిపాజిట్లు: రూ.4,25, 61, 452
కుటుంబ డిపాజిట్లు: రూ.1,38,12,494
కేసీఆర్ బంగారం: 7.5 తులాలు
శోభ(కేసీఆర్ భార్య) బంగారం: 2.2 కిలోలు, విలువైన వజ్రాలు
వ్యవసాయ భూమి: దాదపు 54.21 ఎకరాలు(విలువ: రూ.6.50కోట్లు)
వ్యవసాయేతర భూమి: 2.04 ఎకరాలు(విలువ: రూ.60లక్షలు)
పెట్టుబడులు:
తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్: రూ.55లక్షలు
తెలంగాణ పబ్లికేషన్స్: రూ.4,16,25,000
నివాస భవనాలు:
బంజారాహిల్స్ నందినగర్, తీగలగుట్టపల్లి(కరీంనగర్)
అప్పులు: రూ.8,8847,570 కోట్లు
కేసులు: 64, విచారణలో ఉన్నవి: 2.కేసీఆర్.. చేతనైతే ఎంపీలను ఆపుకో..!

Updated By ManamWed, 11/14/2018 - 18:40
  • టీఆర్ఎస్ అధినేతకు రేవంత్ సవాల్ 

  • ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పై నిప్పులు

  • కొడంగల్‌లో రేవంత్ అనే హైటెన్షన్ వైరు అడ్డంగా ఉంది

  • నువ్వే డైరెక్ట్‌గా రా.. కొడంగల్‌లో తేల్చుకుందాం..

  • 19న 50వేల మందితో నామినేషన్ వేస్తున్నా..

Kodangal, Revanth Reddy, KCR, TRS, Two MPsకొడంగల్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా వేగంగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్ ఒకవైపు జోరుగా ప్రచారంలో దూసుకెళ్తుంటే.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజాకూటమిగా ఏర్పడిన అన్ని పార్టీలు ఏకమై కేసీఆర్‌ను గద్దె దించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొడంగల్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కొడంగల్ ప్రచారంలో పాల్గొన్న రేవంత్ టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. తొందరలోనే టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ చేరుతున్నారంటూ బాంబు పేల్చారు. కొడంగల్ చుట్టుపక్కల ఉండే ఎంపీలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని.. కేసీఆర్ నీకు చేతనైతే మీ ఎంపీలు ఆపుకో అని సవాల్ విసిరారు.

రేవంత్ అనే హైటెన్షన్ వైరు ఇక్కడ..
కొడంగల్ ప్రజలతో ఆడుకుందాం అనుకునే వాళ్లు ఎవరూ బతికి బట్టకట్టరని రేవంత్ హెచ్చరించారు. కొడంగల్‌కు రేవంత్ అనే హైటెన్షన్ వైరు అడ్డంగా ఉందన్నారు. హరీశ్ లాంటి గుంట నక్కలు వచ్చిన కొడంగల్‌ను ఏమి చేయలేరని ధ్వజమెత్తారు. కొడంగల్ మీదికి కేసీఆర్ తోడేళ్ల గుంపును పంపుతున్నారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ రెండు కళ్లు తెరవడానికే మధ్యాహ్నం అవుతుందని, ఇక మూడో కన్ను ఎప్పుడు తెరుస్తాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మూటలు.. ముఠాలు కాదు. నువ్వే డైరెక్టర్‌గా రా.. కొడంగల్‌లో తేల్చుకుందామని సవాల్ విసిరారు. తాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు 50వేల మందితో నామినేషన్ వేస్తున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు. మీ దీవెనలతో యుద్ధానికి పోతున్నా

Updated By ManamWed, 11/14/2018 - 12:15

KCRసిద్ధిపేట: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ నామినేషన్ వేయనున్న రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోనాయిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు కేసీఆర్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..  ‘‘ఇక్కడ పూజలు చేసే ఉద్యమానికి బయల్దేరాను. రైతులకు అప్పులు లేని తెలంగాణే బంగారు తెలంగాణ. వచ్చే ఏడాది కాళేశ్వరం నీళ్లతో దేవుడి పాదాలు కడుగుతాం. వంద సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటాం. దేశంలో 24గంట విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. మీ దీవెనలతో యుద్ధానికి పోతున్నా’’ అని తెలిపారు. కాగా మధ్యాహ్నం 2.30గంటలకు కేసీఆర్ గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే.ఇవాళ నామినేషన్ వేయనున్న కేసీఆర్

Updated By ManamWed, 11/14/2018 - 08:58

KCRగజ్వేల్: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఉదయం హెలికాప్టర్‌లో కోనాయిపల్లికి చేరుకోనున్న కేసీఆర్, వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో తన నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా భారీగా కార్యకర్తలు కేసీఆర్‌తో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

కాగా 1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ దాఖలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇవాళే నీటిపారుదల శాఖ అపద్ధర్మ మంత్రి హరీశ్ రావు కూడా సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. కాగా డిసెంబర్‌ 7వ తేదిన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు రానున్నాయి.మన్నె గోవర్థన్‌ రెడ్డికి అస్వస్థత

Updated By ManamTue, 11/13/2018 - 15:30
TRS leader Manne Govardhan Reddy hospitalized

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... టికెట్ ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఓ వైపు అభ్యర్థులకు బీఫారంలు పంపిణీ చేసినా...టీఆర్‌ఎస్‌లో ‘ఖైరతాబాద్’ సీటు దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఖైరతాబాద్ టికెట్ మన్నె గోవర్థన్ రెడ్డికి ఇవ్వాలంటూ ... అతని అనుచరులు గత రెండు రోజులుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్ ముట్టడికి వెళుతున్న మన్నె గోవర్ధన్ రెడ్డిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. 

ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో మన్నె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటీన సిటీ న్యూరో సెంటర్ హాస్పటల్‌కు తరలించారు. మరోవైపు మన్నే అనుచరులు హాస్పటల్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త... తల బద్ధలు కొట్టుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలాగే ఖైరతాబాద్ వద్ద సెల్ టవర్ ఎక్కి మన్నె అనుచరులు నిరసన తెలుపుతున్నారు. 

అంతకు ముందు తెలంగాణ భవన్ ఎదుట మన్నె అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భైఠాయించి నిరసన తెలపగా, పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్థిచెప్పి అక్కడ నుంచి పంపించివేశారు. కాగా ఖైరతాబాద్ టికెట్..రేసులో దానం నాగేందర్, మన్నె గోవర్దన్ రెడ్డి, దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు బొడిగె శోభ రాజీనామా..?

Updated By ManamTue, 11/13/2018 - 12:03

Bodige Shobhaహైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరికొన్ని స్థానాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ సారి తనకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితులు కనిపించ పోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఉన్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ కేటాయించాలని ఇప్పటికే కేసీఆర్‌ను ఎన్నోసార్లు ఆమె కోరినప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో రాజీనామా చేసేందుకు శోభ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ తరఫున ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై సోమవారం తన అనుచరులతో సమావేశమైన శోభ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తన రాజకీయ భవిష్యత్‌పై ఆమె మంగళవారం కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related News