trs

తుది దశకు ప్రజాకూటమి చర్చలు..

Updated By ManamSun, 11/11/2018 - 19:10
 • కోదండరాం, రమణతో ఉత్తమ్ చర్చలు

 • భాగస్వామ్య పక్షాలతో ముగిసిన కాంగ్రెస్ చర్చలు

 • టీజేఎస్ కార్యాలయంలో మూడు పార్టీల నేతలు భేటీ 

TJS office, Uttam Kumar reddy, L Ramana, Kodanda Ram, TRS, KCRహైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం తుది దశకు చేరుకుంది. సీట్ల సర్దుబాటుపై అసంతృప్తి వ్యక్తం చేసిన భాగస్వామ్య పక్షాలను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెలంగాణ జనసమితి (టీజేఎస్) కార్యాలయంలో ఆ పార్టీ నేత కోదండరాం, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి జరిపిన చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా ఉత్తమ్, కోదండరాం, రమణ మీడియాతో మాట్లాడారు. 

టీఆర్ఎస్‌కు వణుకు పుట్టింది..
ఎన్నికల్లో ప్రజాకూటమి గెలిస్తే కోదండరాం నేతృత్వంలో చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు చేస్తామని ఎల్ రమణ స్పష్టం చేశారు. ఎవరూ ఊహించని విధంగా కూటమి ఏర్పడిందని ఆయన అన్నారు. ఊహించని రాజకీయ ప్రకంపనలు వచ్చాయని చెప్పారు. వార్‌వన్ సైడ్ అన్న టీఆర్ఎస్‌కు వణుకు పుట్టిందన్నారు. 

అసంతృప్తులకు రాబోయే ప్రభుత్వంలో ప్రాధాన్యత..
ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది నోటిఫికేషన్ కంటే ముందే ప్రకటిస్తామని ఉత్తమ్ చెప్పారు. అన్ని పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాయని అన్నారు. అసంతృప్తులకు రాబోయే ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మా కూటమి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కూటమిగానే ఎన్నికలకు వెళ్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. టీజేఎస్‌కు మెదక్, దుబ్బాక, మల్కాజిగిరి, వర్ధన్న పేట, సిద్దిపేట, జనగాం సీట్లను ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుక్కి మిర్యాలగూడ సీటు ఇస్తే వరంగల్ ఈస్ట్ నుంచి టీజేఎస్ పోటీ చేస్తుందన్నారు. అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. 

కోదండరాం పాత్ర కీలకం..
తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర కీలకమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. ఉద్యమ ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన చెప్పారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులంతా నిరాశతో ఉన్నారని ఉత్తమ్ చెప్పారు. హరగోపాల్, విమలక్క, గద్దర్ లాంటి ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారు. అమరవీరుల త్యాగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మరించిందని ఉత్తమ్ విమర్శించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ కుమ్మక్కై ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల్ని, మైనార్టీలను మోసం చేసే కుట్రలో ముందస్తుకు వెళ్లారని మండిపడ్డారు. బీజేపీ-టీఆర్ఎస్ స్నేహం ఎంపీ ఎన్నికల్లో బయటకొస్తుందని ఉత్తమ్ చెప్పారు. రేపే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ 

Updated By ManamSun, 11/11/2018 - 17:19
 • 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

 • ఈ నెల 19వరకు నామినేషన్లు.. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ

 • డిసెంబర్ 7న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు

Telangana Elections, Telangana Elections notification, TRS, Anjani kumarహైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22 వరకు ఉంది. కాగా, డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా సీటీ పోలీసు కమిషనర్, అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచి నామినేషన్ల ఉపసంహరణ వరకు ఆయా ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలో ఎక్కడా కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది కలిసి తిరగరాదని హెచ్చరించారు. ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీపీ హెచ్చరించారు. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు ప్రజాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. 'కారు వేగాన్ని ఆపొద్దు.. డ్రైవర్‌ను మార్చొద్దు'

Updated By ManamSun, 11/11/2018 - 14:58

KTR, Gujarati people, TRS, Telangana elections హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్‌లో భారీ సంఖ్యలో గుజరాతీలు చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాలకు దూరంగా ఉండే గుజరాత్ సమాజ్.. టీఆర్ఎస్‌కు మద్దతు పలకడం శుభపరిణామంగా పేర్కొన్నారు. తెలంగాణ వస్తే స్థానికేతరుల్ని తరిమేస్తారని భయపెట్టారని, నాలుగేళ్లలో హైదరాబాద్‌లో నాలుగు నిమిషాలు కూడా కర్ఫ్యూ రాలేదన్నారు. తెలంగాణలో విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించామని చెప్పారు. కేసీఆర్ శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చారని, కరెంటు సమస్యను పూర్తిగా పరిష్కరించారని కేటీఆర్ తెలిపారు. రాబేయో రోజుల్లో ఇతర రాష్ట్రాలకు కరెంటు అమ్మే స్థితికి తెలంగాణ చేరుకుంటుందని ఆయన చెప్పారు. తాగు నీటి సమస్యను పరిష్కరించామన్నారు. హైదరాబాద్‌లో రెండు భారీ రిజర్వాయర్లు కడుతున్నామని తెలిపారు. తెలంగాణలో ఐ పాస్ విధానం గుజరాత్ కన్నా మెరుగ్గా ఉందని చెప్పారు. 

టీఆర్ఎస్ గుర్తు కారు... ఆ కారు వేగంగా వెళ్తోందన్నారు. కారు వేగాన్ని ఆపొద్దని.. డ్రైవర్‌ను మార్చొద్దని కేటీఆర్ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే గుజరాత్ సమాజ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో గుజరాతీ పారిశ్రామికవేత్త తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ టీఆర్ఎస్‌కు ఓట్లేయమని చెప్పాలని కోరారు. హైదరాబాద్ అందరిదీ.. దేశం కూడా మనందరిదన్నారు. గతంలో జరిగిన అభివృద్ధిని టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చుకుని ఓట్లేయండని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఐదు లక్షల సీసీ కెమెరాలు అమర్చామని, మరో ఐదు లక్షల సీసీ కెమెరాలు అమరుస్తామని చెప్పారు. త్వరలో పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం అందుబాటులోకి వస్తే నేరాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కమాండ్ సెంటర్ దేశానికే ఆదర్శం కాబోతోందని, ఎన్నికల తర్వాత పక్కాగా ఏర్పడేది కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వమేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ టీఆర్‌ఎస్సే రావాలి: మోహన్ బాబు

Updated By ManamSun, 11/11/2018 - 12:57

Mohan Babuహైదరాబాద్: తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో ఆలయ అర్చకులు, సిబ్బందికి ఆదివారం ఆయన వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మోహన్ బాబు.. మళ్లీ మీరే రావాలని కోరుకుంటున్నా అంటూ చెప్పారు. అనంతరం ఆలయ సిబ్బంది, అర్చకుల తరఫున స్వరూపానందేంద్ర స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.జూబ్లీహిల్స్ టికెట్ మాగంటికి ఇవ్వొద్దు..

Updated By ManamSat, 11/10/2018 - 14:39
 • ‘మాగంటి హటావో...జూబ్లీహిల్స్ బచావో’

Indrasena protest against Jubilee Hills TRS condidate Maganti Gopinath

హైదరాబాద్ : టీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఆయనకు టికెట్ ఇవ్వొద్దని, నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాగంటి గోపీనాథ్‌కు టికెట్ ఇస్తే తాను బలవర్మరణానికి పాల్పడతానంటూ యూసఫ్‌గూడలో తెలంగాణ ఉద్యమకారుడు ఇంద్రసేన శనివారం ఆందోళన చేపట్టారు.

‘మాగంటి హటావో...జూబ్లీహిల్స్ బచావో’ అంటూ పెట్రోల్ బాటిల్ దగ్గర పెట్టుకుని, తన ఇంట్లో తలుపులు వేసుకుని ఇంద్రసేన నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఇంద్రసేనను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.వికారాబాద్‌లో టీఆర్‌ఎస్ నేత దారుణ హత్య

Updated By ManamTue, 11/06/2018 - 09:13

TRS Leaderవికారాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. టీఆర్‌ఎస్ నాయకుడు ఫిరంగి నారాయణపై రాళ్లతో దాడి చేసి, కత్తులతో నరికి చంపారు ప్రత్యర్థులు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై దాడి చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ వర్గీయులపై దాడి చేశారు టీఆర్‌ఎస్ నాయకులు. దీంతో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలవ్వగా.. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యర్థుల గొడవలతో సుల్తానాపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. రాజకీయ విబేధాలే హత్యకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.నిరసన సెగలు 

Updated By ManamMon, 11/05/2018 - 06:32
 • టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారాలను అడుగడుగునా అడ్డుకుంటున్న ప్రజలు

 • ప్రశ్నిస్తూ నేతలను నిలదీస్తున్న జనసమూహాలు

 • మంత్రులు, సీనియర్లకూ తప్పని నిలదీతలు

 • ఆదివారం ఒక్కరోజే పలువురు నేతలకు చుక్కెదురు

 • గ్యాదరి కిశోర్, మదన్‌లాల్, దాసరి మనోహర్‌కు చేదు అనుభవాలు

 • నష్ట నివారణ కోసం రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్లు

trsహైదరాబాద్: ముందస్తు ఎన్నికల బరిలోకి ముందే దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థులకు నిరసన సెగలు అంటుకుంటున్నాయి. నాలుగేండ్ల కాలంలో ఏం చేశా రంటూ ప్రచారానికి వస్తున్న నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్ధానాల అమలుపై ప్రశ్నిస్తున్నారు. మంత్రులకూ, సీనియర్లకు కూడా ఇవి ఎదురవుతూండడం గమనార్హం. తమ గెలుపు నల్లేరుమీద నడకే అనుకుంటున్న వారిపై కూడా ప్రజలు తిరుగబడుతూండడంతో టఎన్నికవారు కూడా ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గ్యాదరి కిశోర్‌ను ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నాలుగేండ్లు ఏం చేయకుండా ఎందుకొచ్చావంటూ తిరగబడ్డారు. మాటామాటా పెరిగి టీఆర్‌ఎస్ శ్రేణులు కూడా ఎదురుదాడికి దిగాయి. దానితో ఘర్షణ  చోటు చేసుకుంది. అనునిత్యం ఇట్లాంటి నిలదీతలు అత్యధిక మంది అధికార పార్టీ అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. తమ ఊర్లకు రావొద్దని ప్రజలు అభ్యర్ధులను తరిమికొడున్నారు. ఇంటింటి ప్రచారం కోసం వస్తున్న వారిని తీవ్రంగా ప్రశ్నలు సంధిస్తూండడంతో ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసుకుని తిరుగబాట పడుతున్నారు.  స్పీకర్ మధుసూదనాచారి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్, ఈటల రాజేందర్‌కు కూడా జనం తిరుగుబాటు తప్పలేదు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కూడా నిరసన సెగలు అంటుకున్నాయి.  కొత్తగూడెంలో జలగం వెంకట్రావు, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మానకొండూరులో రసమయి బాలకిషన్, తుంగతుర్తిలో గాదరి కిశోర్, నకిరేకల్ లో వేముల వీరేశం, వైరాలో మదన్‌లాల్ ,  మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్,  స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్యపై జనం తిరగబడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల, ఇబ్రహీంపట్టణంలో కిషన్‌రెడ్డి, మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి, వేములవాడలో చెన్నమనేని రమేష్‌పై కూడా జనం అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యధికులైన సిట్టింగ్‌లు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి రోజు నాలుగైదు నియోజక వర్గాల్లో అభ్యర్దులపై జనం నిరసన గళం వినబడుతుంది. కూటమి అభ్యర్ధులను ప్రకటించక ముందే సిట్టింగ్‌లపై జనం నిరసన వ్యయ్తం చేయడం, గ్రామాలకు రావొద్దని అడ్డుకోవడంతో ఉదృక్త వాతావరణం నెలకొంటుంది. అత్యధికులైన సిట్టింగ్‌లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయని కారణంగానే ప్రజా నిరసన వ్యక్తమ వుతుందని టీఆర్‌ఎస్ అధిష్టానం గుర్తించి నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుడుతుంది. జనం నుండి నిరసనలపై నీళ్లు చల్లడానికి వ్యూహాత్మక రాజకీయ కార్యాచరణ రూపొందిం చుకుంటున్నారు. అత్యధిక నియోజక వర్గాల్లో  ట్రబుల్ షూటర్లను రంగంలోకి దింపుతున్నారు. 'కరెంట్ చార్జీలు తగ్గిస్తాం.. మెగా డీఎస్సీ'

Updated By ManamSat, 11/03/2018 - 18:21

Power, power project, Uttam Kumar Reddy, KCR, TRS, TPCC chiefనల్గొండ: కేసీఆర్ పాలనలో విద్యాసంస్థలకు ఎన్నో అవమానాలు జరిగాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తనిఖీల పేరుతో విద్యాసంస్థలపై దాడులు చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే విద్యాసంస్థలకు కరెంట్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 20వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కు తమిళ సంఘాల మద్దతు

Updated By ManamSat, 11/03/2018 - 00:24
 • ఎంపీ కవితను కలిసిన సంఘాల ప్రతినిధులు

trsహైదరాబాద్: గులాబి పార్టీపై ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా...తెలంగాణలోని తమిళ సమాజం టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ తమిళ్ సంఘం, మొదలియార్ సంఘం, మొదలియార్ ఎడ్యుకేషనల్ సొసైటీల ప్రతినిధి బృందం శుక్రవారం నిజామాబాద్ ఎంపీ కవితను కలిసి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. తెలంగాణాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను వారు ప్రశంసించారు. అయితే, ఇతర రాష్ట్రాల ప్రజల క్షేమం కోసం తీసుకుంటున్న చొరవకు ఆనందంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపి, టీఆర్‌ఎస్ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించుకున్నట్లే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మొదలియార్‌లను బిసి.డి గ్రూప్‌లో కొనసాగుతున్నారని, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఉన్న మొదలియార్‌లను కూడా బిసి.డి  కేటగిరిలోకి మార్చాలని కోరారు. భవిష్యత్తులో మొదలియార్‌లను  ఓబీసీ కేటగిరీ లోకి మార్చెలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంపీ కవిత ను కోరారు. అనంతరం ఎంపీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ తమిళ్ సంగం అధ్యక్షులు సాయి కాంత్, జాయింట్ సెక్రటరీ మారన్, సభ్యులు శ్రావణ్ సేతురామ్, విజయ వల్లి, మొదలియార్ అసోసియేషన్, మొదలియార్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సికింద్రాబాద్ అధ్యక్షులు ఏఎస్ జయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సీఎస్ సుధాకర్, ఉపాధ్యక్షులు ఎస్. కె సత్య కుమార్ ఏ.బి నందగోపాల్, దివాన్ బహదూర్ పద్మారావు మొదలియార్ మనుమరాలు మైథిలి జయచంద్రన్, ఏ. బి నగేష్, విజయ్ మోహన్, ఏ.హెచ్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Updated By ManamFri, 11/02/2018 - 20:23

Komati Reddy Venkata Reddy, TRS, KCR, Congress partyహైదరాబాద్: టీఆర్ఎస్ తనను చంపాలని ప్రయత్నిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులను హతమార్చి, తరువాత తనను చంపేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. గడపగడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా నల్గొండలోని 13వ వార్డులో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ వారి కుటుంబానికే పరిమితమైందని విమర్శించారు. ఎవరి బతుకులను వారే మార్చుకోవాలని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. 

Related News