bse

రూపాయి నిరాశ... మార్కెట్లకు ప్రయాస

Updated By ManamMon, 09/17/2018 - 22:23
  • వీడని ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలు

  • రెండు సెషన్లలో గడించిన లాభాలకు బ్రేక్ 

  • సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా కోల్పోగా నిఫ్టీ 38వేల దిగువన ముగిసింది

bseముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి సోమవారం 505 పాయింట్లు పతనమై 38,000 స్థాయి దిగువకు జారింది. ‘సెన్సెక్స్’ రెండు సెషన్లలో గడించిన లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ కరెన్సీ తీవ్రంగా పతనమవకుండా నిరోధించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించినప్పటికీ, కొనసాగుతున్న రూపాయి కష్టాలు, ప్రపంచ వాణిజ్య యుద్ధ కలతలు ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురికొల్పాయి. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ)  50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా 137 పాయింట్లకు పైగా కోల్పోయి 11,400 స్థాయికి దిగువన ముగిసింది. ఫినాన్షియల్ సంస్థలు హెచ్.డి.ఎఫ్.సి లిమిటెడ్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్‌లు  ఈ సెషన్‌లో మార్కెట్లను వెనక్కిలాగి పట్టిన ప్రధాన షేర్లయ్యాయి. కీలక సూచీలను వాటి కీలక స్థాయిల నుంచి కిందకు దింపాయి. అమెరికా-చైనాల మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధంతో  ఏషియన్, యూరోపియన్ మార్కెట్లు మందగొడిగా సాగడం దేశీయ స్టాక్ మార్కెట్లలో జాగరూకతకు దారితీసింది. కరెంట్ అకౌంట్ లోటు విస్తృతిని అరికట్టేందుకు, రూపాయి పతనాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం శుక్రవారం కొన్ని చర్యలను ప్రకటించింది. మసాలా బాండ్లపై విత్‌హోల్డింగ్ పన్ను తొలగింపు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సడలింపు, అప్రధానమైన వస్తువుల దిగుమతులపై ఆంక్షలు వంటివి వాటిలో ఉన్నాయి. 

దెబ్బతిన్న రూపాయి
భారతీయ కరెన్సీ మరోసారి రూ. 72 స్థాయిని అధిగమించి, అమెరికన్ డాలర్‌తో మారకం విలువ రూ. 72.69 (ఇంట్రా-డే)కి పడిపోయింది. ‘‘అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత పెచ్చుమీరడానికి అవకాశం ఉందనే వార్త మార్కెట్లకు మింగుడుపడలేదు. రూపాయిలో బలహీనత మార్కెట్‌ను మరింత కుంగదీసింది. చాలా రంగాల సూచీలు గీటురాయి ‘సెన్సెక్స్’కి అనుగుణంగానే సాగి, దిగువ స్థాయిల్లో ముగిశాయి. ప్రస్తుతం మార్కెట్లు ప్రపంచ రాగాలకు అనుగుణంగా నర్తనమాడుతున్నాయి. ఈ పరిస్థితిలో అంత త్వరగా మార్పు వస్తుందని మేం అనుకోవడం లేదు..’’ అని ఒక విశ్లేషకుడు అన్నారు. బి.ఎస్.ఇ  ‘సెన్సెక్స్’ 38,027.81 వద్ద మొదలై, వేగంగా 38000 స్థాయి దిగువకు జారింది. ఇటీవల పెరిగిన వాటితో సహా, వివిధ రంగాల షేర్లలో చోటుచేసుకున్న అమ్మకాలతో 37,548.93 పాయింట్ల కనిష్ఠ స్థితిని చూసింది. చివరకు 505.13 పాయింట్ల నష్టంతో, 37,585.51 వద్ద ముగిసింది. 

మార్కెట్ విలువ ఢమాల్ 
బి.ఎస్.ఇలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారంనాడు రూ. 1,14,676 కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. షేర్ల సంఖ్యతో షేర్ల విలువను గుణించగా వచ్చే మొత్తాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. గత రెండు సెషన్లలో  ‘సెన్సెక్స్’ 677.51 పాయింట్లు లాభపడింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ కూడా 11,366.90 కనిష్ఠ స్థితిని చూసి, చివరకు 137.45 పాయింట్ల నష్టంతో, 11,377.75 వద్ద ముగిసింది. కాగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు శుక్రవారం రూ. 1,090.56 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 115.14 కోట్ల విలువ చేసే కొనుగోళ్ళు జరిపాయని తాత్కాలిక డాటా సూచించింది. 

తగ్గని చమురు ధరలు
ప్రపంచ మార్కెట్లలో అధికంగా ఉన్న ముడి చమురు ధరలు కూడా ఇక్కడి సెంటిమెంట్లను కుంగదీశాయి. చమురుకు అంతర్జాతీయ గీటురాయిగా భావించే బ్రెంట్ క్రూడ్ ధర పీపాకు 78.60 వద్ద కోట్ అవుతోంది. డబ్ల్యు.టి.ఐ క్రూడ్  పీపాకు 69.48 డాలర్లుగా కోట్ అవుతోంది. ప్రపంచ మార్కెట్లను తలదన్నుతూ సాగిన భారతదేశపు స్టాక్ మార్కెట్ ఆరోహణకు తెరపడినట్లేనని ప్రపంచ ఫినాన్షియల్ సర్వీసుల కంపెనీ గోల్డ్‌మ్యాన్ శాక్స్ నివేదికలు కూడా మదుపరుల సెంటిమెంట్లపై నీళ్ళు చల్లాయి. స్థిరాస్తులు, విద్యుత్, మౌలిక వసతుల రంగాల సూచీలు మాత్రం మిగిలిన వాటికి భిన్నంగా సోమవారం 1.36 శాతం పెరుగుదలను చూశాయి.తేరుకున్న మార్కెట్లు

Updated By ManamWed, 09/12/2018 - 22:33
  • గణేశ చతుర్థి కారణంగా గురువారం స్టాక్ ఎక్స్చేంజీలకు సెలవు

bseముంబై: రెండు రోజుల పతన ధోరణిని రివర్స్ చేస్తూ, ఈక్విటీ సూచీలు బుధవారం కోలుకుని పైకి ఎగబాకిన ధోరణిని కనబరచాయి. ఇటీవల దెబ్బతిన్న ఎఫ్.ఎం.సి.జి, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. రూపాయి కూడా కొంత తెప్పరిల్లడం మార్కెట్‌కు ఊరట నిచ్చింది. దేశీయ కరెన్సీ ‘‘నిర్హేతుకమైన స్థాయిలకు’’ తరిగిపోకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సెంటిమెంట్ బలపడింది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారాంతంలో సమీక్షించనున్నారని వార్తలొచ్చాయి. సానుకూల స్థితిలో మొదలైన బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి ( బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ మధ్యాహ్న ట్రేడ్‌లో మరింత పుంజుకుని, చివరకు 304.83 పాయింట్ల లాభంతో 37,717.96 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా 82.40 పాయింట్లు పెరిగి 11,369.90 వద్ద ముగిసింది. 

తెప్పరిల్లిన రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థితి రూ. 72.91 (ఇంట్రా-డే) నుంచి కోలుకుని మధ్యాహ్న ట్రేడ్‌లో రూ. 71.86కు కాస్త బలపడింది. భారతదేశపు ఎగుమతులు ఆగస్టులో 19.21 శాతం వృద్ధి చెంది 27.84 బిలియన్ డాలర్లకు చేరాయని డాటా సూచించడం రూపాయికి శుభ సూచకం అయింది. రూపాయి మంగళవారం రూ. 72.69కి క్షీణించిన సంగతి తెలిసిందే. రూపాయి ‘‘నిర్హేతుకమైన స్థాయిలకు’’ క్షీణించకుండా చూసేందుకు, ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అన్ని చర్యలు తీసుకుంటాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ చెప్పారు. దేశీయ మదుపు సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళతో బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ ఒక దశలో 37,752.58 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. ఇంట్రా-డేలో అది 37,342 పాయింట్ల కనిష్ఠ స్థాయిని కూడా చూసింది. ప్రపంచ వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల ఆశావాదాన్ని చెల్లాచెదురు చేయడంతో  ‘సెన్సెక్స్’ గత రెండు సెషన్లలో సుమారు 977 పాయింట్లు పతనమైంది. తీవ్ర హెచ్చు తగ్గులను చూసిన సెషన్‌లో ఎన్.ఎస్.ఇ ‘నిఫ్టీ’ కీలకమైన 11,300 స్థాయిని తిరిగి అందుకుంది. అది 82.40 పాయింట్లు లాభపడి 11,369.90 వద్  ముగిసింది. ఇంట్రా-డేలో అది 11,250.20 నుంచి 11,380.75 మధ్య ఊగిసలాడింది. సడలిన ముడి చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ ధర పీపాకు 79 డాలర్ల స్థాయిని దాటిన తర్వాత కొంత చల్లారింది.  ముడి చమురు ధరలు కాస్త సడలాయి. ఆసియాలోని చాలా భాగం ఇతర మార్కెట్లలో వరుసగా ఆరవ సెషన్‌లోనూ నష్టాలు కొనసాగగా, యూరోపియన్ మార్కెట్లు మాత్రం అధిక స్థితిలోనే ఆరంభమయ్యాయి. దేశీయ మదుపు సంస్థలు మంగళవారం రూ. 749.62 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 1,454.36 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారని తాత్కాలిక డాటా సూచించింది.మార్కెట్లలో భారీ పతనం

Updated By ManamTue, 09/11/2018 - 22:21
  • సెన్సెక్స్ 509 పాయింట్లు క్రాష్.. 11,300 దిగువకు నిఫ్టీ

bseముంబై: స్టాక్ మార్కెట్‌కు గీటురాయిగా భావించే బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ మంగళవారం 509 పాయింట్లు పతనమై 37,413.13 పాయింట్ల వద్ద ముగిసింది. బి.ఎస్.ఇ సున్నిత సూచి ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం ఒక నెల పైచిలుకు రోజుల్లో ఇదే మొదటిసారి. తీవ్రతరమవుతున్న ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలు పెరగడంతో వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువుల (ఎఫ్.ఎం. సి.జి), లోహాలు, మోటారు వాహనాలు, ఫినాన్షియల్ రంగ షేర్లు భారీ అమ్మకాలకు లోనయ్యాయి. .ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ వరుసగా రెండోరోజు మంగళవారం నాడు 1 శాతంపైగా క్షీణించింది. మధ్యా హ్నా ట్రేడ్‌లో రూపాయి మునుపెన్నడూ ఎరుగనంతగా రూ. 72.73 స్థాయికి పడిపోవడంతో స్టాక్ మార్కెట్లు దిగువ గతిలో సాగాయి. స్టాక్ మార్కెట్లు మంగళవారం బేర్ల గుప్పిట్లోనే మొదలయ్యాయి. ఏషియన్ ట్రేడ్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో స్టాక్ మార్కెట్‌లో లాభాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపో యాయి. ఆగస్టు 2 (37,165.16) తర్వాత ‘సెన్సెక్స్’కు ఇదే (37,413.13) కనిష్ఠ ముగింపు. ‘సెన్సెక్స్’ సోమవారం 467.65 పాయింట్లు కోల్పోయింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 150.60 పాయింట్లు పతనమై 11,300 మైలురాయికి దిగువన 11,287.50 స్థాయి వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో అది 11,274 నుంచి 11,479.40 మధ్య ఊగిసలాడింది. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతోపాటు,  పెరుగుతున్న ముడి చమురు ధరలు, కనివిని ఎరుగని అధమ స్థాయిలకు పతనమవుతున్న రూపాయి, విస్తృతమవుతున్న వాణిజ్య లోటు దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్లు దెబ్బతినడానికి ప్రధాన కారణాలని ఒక బ్రోకర్ చెప్పారు. 

వడ్డీ రేటు ప్రభావం
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేటును మరికాస్త పెంచవచ్చనే అంచనాలున్నాయి. అదే జరిగితే డాలర్ మరింత పటిష్టపడుతుందని మదుపరులు భావించారు. ప్రవర్థమాన మార్కెట్లలోని విదేశీ ఫండ్లు అమ్మ కాలను వేగవంతం చేయడానికి ఇది కారణమైంది. ఇది కూడా సెంటిమెంట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని బ్రోకర్లు చెప్పారు. మార్కెట్లో నష్టాలు విస్తృతంగా నమోదయ్యాయి. బి.ఎస్.ఇలో 1841 కంపెనీల షేర్లు తగ్గగా, 874 కంపెనీల షేర్లు కొద్దిగా పెరిగాయి. ఈక్విటీ విభాగంలో మొత్తం టర్నోవరు రూ. 3,059.03 కోట్లుగా ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సోమవారం రూ. 841.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు కూడా రూ. 289.66 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయని తాత్కాలిక డాటా సూచించింది. మార్కెట్లను కుంగదీసిన వాణిజ్య ఉద్రిక్తతలు

Updated By ManamMon, 09/10/2018 - 22:32

bseముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం 1 శాతం పైగా నష్టపోయి మూడు వారాల కనిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీలు క్షీణించాయి. రూపాయి మరింత క్షీణించి డాలర్‌తో మారకం విలువలో డే-ట్రేడ్‌లో మునుపెన్నడూ లేనతంగా రూ. 72.67కి పడిపోయింది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 467.65 పాయింట్లు నష్టపోయి, మూడు వారాల కనిష్ఠ స్థాయి 37,922.17 వద్ద ముగిసింది. ఈ మార్చి 16న అది 509.54 పాయింట్లు కోల్పోయింది. తిరిగి ఒకే రోజులో ‘సెన్సెక్స్’ అంత ఎక్కువ స్థాయిలో పాయింట్లను నష్టపోవడం సోమవారం (సెప్టెంబర్ 10న) సంభవించింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కీలకమైన 11,500 స్థాయికన్నా కిందకు పడిపోయి 151 పాయింట్లు కోల్పోయింది. అది 11,438.10 వద్ద ముగిసింది. ఆగస్టు 16 తర్వా త, అది అంత తక్కువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. సోమవారం ఇంట్రా-డేలో అది 11,427.30 కనిష్ఠ స్థితిని చూసింది. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఘర్షణ పెచ్చుమీరవచ్చనే భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మొత్తం చైనా దిగుమతులన్నింటిపైనా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారంనాడు హెచ్చరించారు. అమెరికా కొత్తగా ఎటువంటి చర్యలు తీసుకున్నా అంతకు అంత చర్యలు తీసుకునేందుకు తామూ వెనుకాడేది లేదని చైనా ప్రకటించింది. ఈ రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమైతే అది ప్రవర్థమాన మార్కెట్లపై ప్రభావం చూపుతుందనే భయాలు వ్యాపించాయి. 

మూడ్‌ను దెబ్బతీసిన మూడీస్
రూపాయి బలహీనపడుతూండడం భారతీయ కంపెనీలకు ‘‘క్రెడిట్ నెగిటివ్’’గా పరిణమిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొనడంతో కూడా సెంటిమెంట్ దెబ్బతింది. రూపాయలలో రాబడులను జనరేట్ చేస్తూ, తమ కార్యకలాపాలకు నిధుల కోసం మాత్రం అమెరికా డాలర్ల రుణంపై ఆధారపడే భారతీయ కంపెనీలు చిక్కులు ఎదుర్కోవలసి రావచ్చని ఆ సంస్థ తెలిపింది. భారతీయ రూపాయి 2018లో ఇంతవరకు 13 శాతం క్షీణించింది. సోమవారం అది రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కోలుకోవ డానికి ముందు రూ. 72.67కి పడిపోయింది. అమెరికాలో ఉద్యోగా ల డాటా పటిష్టంగా ఉండడంతో డాలర్  మరింత బలపడింది. మరోపక్క ముడి చమురు ధరలు భగ్గమంటూనే ఉన్నాయి. 

పెరుగుతున్న వ్యత్యాసం
భారతదేశపు కరెంట్ అకౌంట్ లోటు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో 15.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ లోటు 2017-18 ఆర్థిక సంవత్సరం అదే త్రైమాసికంలో 15 బిలియన్ డాలర్లుగా ఉంది.మార్కెట్లో ఉత్సాహం

Updated By ManamFri, 09/07/2018 - 22:15

bseముంబై: ఈక్విటీ గీటురాళ్ళు వరుసగా రెండో సెషన్‌లో శుక్రవారం తమ స్థితిని చక్కదిద్దుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఓ మోస్తరు కోలుకోగా, మోటారు వాహనాల కంపెనీల షేర్లలో ర్యాలీ సూచీలను ఆరోహణ క్రమంలో నడిపించింది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 147.01 పాయింట్లు పెరిగి 38,389.82 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 52.20 పాయింట్లు లాభపడి 11,589.10కి చేరింది. వారం ప్రాతిపదికన చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీల రెండింటి ఆరు వారాల విజయ పరంపరకు బ్రేక్ పడింది. వారం మొత్తంమీద చూస్తే సెన్సెక్స్ 255.25 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 91.40 పాయింట్లు కోల్పోయింది. 

ప్రభుత్వ నిర్ణయంతో ఆనందం
ప్రత్యామ్నాయ ఇంధనాలపై నడిచే ఎలక్ట్రిక్  వాహనాలు, ఆటోమొబైల్స్‌ను పర్మిట్ అవసరాల నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన వెంటనే ఆటోమొబైల్స్ షేర్లు బాగా పెరిగాయి. సెన్సెక్స్ ప్యాక్‌లో  హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటోలు టాప్ గైనర్లుగా నిలిచాయి. 

కాస్త కోలుకున్న రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు బలపడి ఇంట్రా-డేలో రూ. 71.70గా ఉంది. రూపాయి మారకం విలువ గురువారంనాడు రూ. 71.99 వద్ద కుదుటపడడానికి ముందు జీవిత కాల కనిష్ఠ స్థాయి రూ. 72.11కు పడిపోయింది. రూపాయి విలువ క్షీణించడం, ముడి చమురు ధరలు పెరగడంతో గత కొద్ది సెషన్లలో దాదాపు 880 పాయింట్లు పతనమైన తర్వాత, సెన్సెక్స్ గత రెండు రోజుల్లో తిరిగి లాభపడడం ప్రారంభించింది. సరసమైన ధరలకు లభిస్తున్న విలువైన షేర్లు కొనుగోలుకు నోచుకోవడం మార్కెట్ల పెరుగుదలకు కారణమైంది. హెచ్చు స్థాయిలో ప్రారంభమైన బి.ఎస్.ఇ సెన్సెక్స్ చివరలో ముమ్మరంగా సాగిన కొనుగోళ్ళతో 38,421.56 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 147.01 పాయింట్ల లాభంతో 38,389.82 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో అది 38,067.22 కనిష్ఠ స్థితిని కూడా చూసింది. నిఫ్టీ ఇంట్రా-డేలో 11,603 గరిష్ఠ స్థాయిని తాకింది. దేశీయ మదుపు సంస్థలు గురువారం రూ. 611.98 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 455 కోట్ల విలువ చేసే ఈక్విటీలను విక్రయించారని తాత్కాలిక డాటా సూచించింది.మార్కెట్లలో ‘రిలీఫ్ ర్యాలీ’

Updated By ManamThu, 09/06/2018 - 22:13

bseముంబై: వరుసగా ఆరు సెషన్లలో నష్టాలు చవిచూసిన మార్కెట్లు గురువారం పటిష్టమైన పునరాగమనాన్ని ప్రదర్శించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 72 స్థాయిని మించి క్షీణించినప్పటికీ, ఇటీవల దెబ్బతిన్న హెల్త్‌కేర్, ఎనర్జీ, విద్యుత్ రంగ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 224.50 పాయింట్లు పుంజుకుని 38,242.81 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 59.95 పాయింట్లు లాభపడి 11,536.90 వద్ద ముగిసింది. ఇటీవలి కాలంలో దెబ్బతిన్న చౌకకు లభిస్తున్న విలువైన షేర్లను మదుపరులు సెషన్ చివరలో కొనుగోలు చేయడంతో సూచీలు చాలా వరకు లాభపడ్డాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సన్ ఫార్మా షేర్లు ఎక్కువ ఆదరణకు నోచుకున్నాయి. మార్కెట్ విడతల వారీగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చింది. ప్రత్యేకించి కొన్ని షేర్లలో లావాదేవీలు ముమ్మరంగా సాగాయి. బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ 37,912.50 నుంచి 38,320.96 మధ్య ఊగిసలాడింది. గత ఆరు సెషన్లలో ‘సెన్సెక్స్’ 878.32 పాయింట్లు కోల్పోయింది. ‘నిఫ్టీ’ కూడా కీలకమైన 11,500 స్థాయిని తిరిగి అందుకుంది. ఇంట్రా-డేలో 11,436.05 కనిష్ఠ స్థితిని చూసిన ‘నిఫ్టీ’ 11.536.90 వద్ద ముగియడానికి ముందు 11,562.25 గరిష్ఠ స్థాయిని తాకింది. దేశీయ మదుపు సంస్థలు బుధవారం రూ. 176.95 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 383.67 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారని తాత్కాలిక డాటా సూచించింది.విస్తరించిన నష్టాలు

Updated By ManamWed, 09/05/2018 - 22:03

bseముంబై: బలహీనపడిన రూపాయి, ప్రవర్థమాన మార్కెట్ అసెట్ల విస్తృత అమ్మకాలు రిస్క్ తీసుకునే ధోరణిని కట్టడి చేయడంతో ‘సెన్సెక్స్’ బుధవారం వరుసగా ఆరో సెషన్‌లోనూ పతనాన్ని చూసింది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 139.61 పాయింట్లు క్షీణించి రెండు వారాల కనిష్ఠ స్థాయి 38,018.31 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 43.35 పాయింట్లు నష్టపోయి 11,476.95 వద్ద ముగిసింది. ‘సెన్సెక్స్’ ఆరు సెషన్లలో 878.32 పాయింట్లు కోల్పోయింది. గత ఆరు నెలల్లో మొదటిసారిగా అది వరుసగా నష్టాలను చవిచూస్తూ వస్తోంది. ‘సెన్సెక్స్’ బుధవారం కొద్ది హెచ్చు స్థితిలోనే ప్రారంభమై ఆరంభ ట్రేడ్‌లో 38,250.61ని తాకింది. కానీ, వెంటనే 38000 స్థాయి దిగువకు పడిపోయింది. అది 38,018.31 వద్ద ముగియడానికి ముందు 37,774.42 కనిష్ఠ స్థితిని చూసింది. ‘నిఫ్టీ’  కూడా 10,400 స్థాయి దిగువకు పడిపోయి 11,393.85 కనిష్ఠ స్థితిని చూసింది. చివరకు నష్టాన్ని 43.35 పాయింట్లకు పరిమి తం చేసుకుని 11,476.95 వద్ద ముగిసింది. దేశీయ మదుపు సంస్థలు మంగళవారం రూ. 21.41 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 32.64 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు తాత్కాలిక డాటా సూచించింది. 

కోలుకోని రూపాయి
దేశీయంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రా-డేలో తాజా రికార్డు కనిష్ఠ స్థాయి రూ. 71.96కు పడిపోయింది. బాండ్ ప్రతిఫలాలు పెరుగుతూండడం డాలర్ బలపడడానికి తోడ్పడింది. 

నిరుత్సాహపరచిన సేవల రంగం 
నూతన వ్యాపార ఆర్డర్లు తరిగిపోవడంతో భారతదేశపు సర్వీసుల రంగ కార్యకలాపాలు జూలైలో ఉన్న 21 నెలల పతాక స్థాయి నుంచి ఆగస్టులో పడిపోయాయని నెలవారీ నివేదిక ఒకటి వెల్లడించడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత కుంగదీసింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ వ్యాపార కార్యకలాపాల సూచి జూలై నాటి 54.2 నుంచి ఆగస్టులో 51.5కి తగ్గింది. కొత్త పనుల ఆర్డర్లలో వృద్ధి మూడు నెలల కనిష్ఠ స్థాయిలో ఉందని వెల్లడైంది.రూపాయి కష్టాలు మార్కెట్‌కు నష్టాలు

Updated By ManamTue, 09/04/2018 - 22:35

Sensexముంబై: ఈక్విటీ గీటురాయి ‘సెన్సెక్స్’ పతనం వరుసగా ఐదో సెషన్‌లో మంగళవారంనాడు కూడా కొనసాగింది.  మూడు నెలల కాలంలో ‘సెన్సెక్స్’ ఇలా వరుసగా ఇన్ని రోజులు నష్టాలను మూటగట్టుకుంటూపోవడం ఇదే మొదటిసారి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, క్షీణిస్తున్న రూపాయి, కొనసాగుతున్న ప్రపంచ వాణిజ్య ఘర్షణల రూపంలో అనేక వైపుల నుంచి ఆందోళనలు కమ్ముకోవడంతో స్టాక్ మార్కెట్లలో నిరాశ అలముకుంది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 155 పాయింట్లు నష్టపోయి, రెండు వారాల కాలంలో, బలహీనమైన ముగింపు (38,157.92)ను నమోదు చేసింది. ప్రధానంగా మన్నికైన వినియోగ వస్తువులు, ఫినాన్షియల్, బ్యాంకుల రంగ షేర్లలో విస్తృతంగా అమ్మకాలు చోటుచేసుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా వరుసగా రెండో సెషన్‌లో 62 పాయింట్లకు పైగా నష్టపోయి 11,520.30 వద్ద ముగిసింది. మంగళవారం అది పెద్ద పెరుగుదలను చూడలేదు. ఇంట్రా-డేలో అది 11,496.85 నుంచి 11,602.55 మధ్య ఊగిసలాడింది. విదేశీ ఫండ్ల పెట్టుబడులు స్థిరంగా తరలిపోతూండడం, ముడి చమురులు ధరలు పెరిగిపోతున్న ఫలితంగా పెరుగుతున్న కరెంట్ అకౌంట్ లోటు (ఎగుమతులకన్నా దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడం) దేశీయ కరెన్సీ క్షీణించిపోవడానికి దారితీస్తూండడం ఇన్వెస్టర్లను కలవరపెట్టడం ఆపలేదు. 

పడిపోతున్న రూపాయి
కాగా డాలర్‌తో ఇంట్రా-డేలో రూపాయి విలువ సరికొత్త కనిష్ఠ స్థాయి రూ. 71.57కి క్షీణించింది. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఆవేశకావేషాల ప్రకటనలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సెంటిమెంట్లను మరింత దెబ్బతీశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వినియోగ వస్తువులు, పి.ఎస్.యులు, మౌలిక వసతులు, రియల్టీ, ఎఫ్.ఎం.సి.జి, టెలికాం, ప్రజోపయోగ సర్వీసులు, విద్యుత్, లోహాలు, మోటారు వాహనాలు, ఆరోగ్య రక్షణ, బ్యాంకింగ్, చమురు, ఇంధన వాయువు, యంత్రాలు, యంత్ర పరికరాలు, ఫినాన్స్‌తో సహా దాదాపుగా అన్ని రంగాల్లోనూ ముమ్మర అమ్మకాలను వీక్షించాయి. ఆరంభ ట్రేడ్‌లో బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ 206.04 పాయింట్లు పెరిగి 38,518.56 స్థాయిని తాకింది. కానీ, తర్వాత చోటుచేసుకున్న అమ్మకాలతో ఆ లాభాలన్నింటినీ కోల్పోయింది. గత నాలుగు సెషన్లలో ‘సెన్సెక్స్’ 584.11 పాయింట్లను కోల్పోయింది. 

ఆందోళన పెంచిన ‘అమ్రీ’
భారతీయ సెక్యూరిటీలు, ఎక్చ్సేంజి బోర్డు (‘సెబి’) మీ వినియోగదారు గురించి తెలుసుకోండి (కెవైసీ) నిబంధనలు కొత్త వాటిని రూపొందించింది. వాటిని కనుక సవరించకపోతే, 75 బిలియన్ డాలర్ల మేరకు ఉన్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల మొత్తం స్వల్ప కాలంలోనే దేశం నుంచి తరలిపోవడాన్ని చూస్తామని, కెవైసీ కొత్త నిబంధనల తక్షణ ప్రభావం అదే అవుతుందని అసెట్ మేనేజ్‌మెంట్ రౌండ్‌టేబుల్ ఆఫ్ ఇండియా (‘అమ్రీ’) అనే ఇన్వెస్టర్ లాబీ గ్రూప్ హెచ్చరించడంతో సెంటిమెంట్ బలహీనపడింది. విదేశీ ఫండ్లు షేర్లను అమ్మేసుకుని సొమ్ము చేసుకోవడం ఎక్కువైంది. షేర్లు, రూపాయిపైన కూడా అది తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఆ సంస్థ హెచ్చరించింది. 

‘సెబి’ అభ్యంతరం
అయితే, ‘సెబి’ దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ‘‘‘సెబి’ 2018 ఏప్రిల్‌లో జారీ చేసిన సర్క్యులర్ వల్ల 75 బిలియన్ డాలర్ల ఎఫ్.పి.ఐ మదుపు మొత్తం దేశం నుంచి తరలిపోతుందని పేర్కొనడం అర్ధరహితం, అత్యంత బాధ్యతారహితం’’ అని ‘సెబి’ మంగళవారంనాడు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సోమవారం రూ. 21.13 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు కూడా రూ. 542.12 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయని తాత్కాలిక డాటా తెలిపింది. 

దడ పుట్టిస్తున్న ముడి చమురు ధర
భారీ వర్షాలతో కూడిన పెను గాలులు సంభవించవచ్చనే హె చ్చరికలతో గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో రెండు చమురు ప్లాట్ ఫారాలను ఖాళీ చేయించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో చ మురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 1.74 శాతం పెరిగి పీపాకు 79.51 డాలర్లకు చేరుకుంది. డబ్ల్యు.టి.ఐ ధర 2.05 శాతం పెరిగింది.చిన్నబోయిన సూచీలు

Updated By ManamMon, 09/03/2018 - 22:34

Sensex_Catch_ముంబై: సోమవారం సెషన్ చివరలో చోటుచేసుకున్న అమ్మకాలతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 333 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ క్షీణిస్తూపోవడం, పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలపై వేధిస్తున్న ఆందోళనలతో ‘‘సెన్సెక్స్’’ వరుసగా నాల్గో సెషన్‌లో నష్టాలను నమోదు చేసింది. వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువులు, రియల్టీ, విద్యుచ్ఛక్తి, బ్యాంకింగ్ రంగ షేర్లు సెషన్ చివర్లో విస్తృత అమ్మకాలకు లోనయ్యాయి. 

పెరుగుతున్న చమురు ధరలు
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు చమురు సరఫరాలను దెబ్బతీయవచ్చనే భయాలతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. అయితే, గుడ్లిలో మెల్లలా ధర పెరుగుదల ఇప్పటికీ పరిమితంగానే ఉంది. ఇరాన్ కారణంగా సరఫరాలో ఏర్పడే వెలితిని సౌదీ అరేబియా, రష్యా, అమెరికాల సరఫరాలు తీర్చగలవనే ఆశాభావం కూడా ఉంది. బి.ఎస్.ఇ ‘‘సెన్సెక్స్’’ సానుకూల ధోరణితో ప్రారంభమై ఆరంభ ట్రేడ్‌లో 289 పాయింట్లు పెరిగి 38,934.35 స్థాయిని తాకింది. మొదటి త్రైమాసిక జి.డి.పి డాటా బాగుండడం, రూపాయి కొంత రికవరవడం మార్కెట్‌కు టానిక్‌లా పనిచేసింది. కానీ, చివరలో చోటుచేసుకున్న అమ్మకాలతో ఆ లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. వస్తూత్పత్తి కార్యకలాపాలు ఆగస్టులో మందగించినట్లు నివేదిక రావడంతో ‘‘సెన్సెక్స్’’ 38,270.01 కనిష్ఠ స్థితిని చూసింది. చివరకు ‘‘సెన్సెక్స్’’ 332.55 పాయింట్ల భారీ నష్టంతో 38,312.52 వద్ద ముగిసింది. గత మూడు సెషన్లలో ‘‘సెన్సెక్స్’’ 251.56 పాయింట్లను కోల్పోయింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 98.15 పాయింట్లు కోల్పోయి 10,600 దిగువన ముగిసింది. అది 11,567.40 నుంచి 11,751.80 మధ్య ఊగిసలాడి చివరకు 11,582.35 వద్ద ముగిసింది. రెండు సూచీలు ఒకే రోజులో ఇంత ఎక్కువగా పాయింట్లను నష్టపోవడం ఆగస్టు 2 తర్వాత ఇదే మొదటిసారి. ఆగస్టు 2న ‘‘సెన్సెక్స్’’ 356.46 పాయింట్లు కోల్పోగా, ‘నిఫ్టీ’ 101.50 పాయింట్లు నష్టపోయింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు శుక్రవారంనాడు రూ. 212.81 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 171.92 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు తాత్కాలిక డాటా సూచించింది. 

చితికిపోతున్న రూపాయి
డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ సోమవారం నాడు నూతన జీవిత కాల కనిష్ఠ స్థాయి రూ. 71.21కి పడిపోయింది. ఇది స్థూల ఆర్థికవ్యవస్థపై కొత్త గుబులును రేకెత్తించింది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా దేశ వస్తూత్పత్తి రంగ కార్యకలాపాలు ఆగస్టులో వరుసగా రెండో నెలలో సడలినట్లు నెలవారీ నివేదిక ఒకటి వెల్లడించింది. చైనాపై నూతన సుంకాలు విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  గత వారం ప్రకటించిన తర్వాత, ప్రపంచ వాణిజ్య యుద్ధ స్థితిగతులకు సంబంధించిన పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌

Updated By ManamMon, 08/27/2018 - 09:51

Chandrababuముంబై: రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లో సోమవారం లిస్టింగ్ చేశారు. ఈ ఉదయం 9.15 గంటలకు గంట కొట్టి బాండ్ల లిస్టింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కాగా రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌పై బాండ్లను జారీ చేయగా కేవలం గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. అవే బీఎస్‌ఈలో సోమవారం లిస్టింగ్‌ అయ్యాయి. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌కుమార్‌, ఏపీ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. వారిలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, టీసీఎస్‌ సీఈవో చంద్రశేఖరన్‌, మంగళం బిర్లా సహా తదితరులు ఉన్నారు. 

Related News