bse

రికార్డుల రన్‌కు బ్రేక్

Updated By ManamFri, 08/24/2018 - 23:50

bseముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ శుక్రవారం సుమారు 85 పాయింట్లు కోల్పోయి 38,251.80 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడు సెషన్లలో  లాభపడుతూ వచ్చిన సెన్సెక్స్ శుక్రవారం లాభాల స్వీకరణకు తలొగ్గింది. ప్రపంచ మార్కెట్లలోని అప్రమత్త ధోరణి ఇక్కడా ప్రభావం చూపింది. అయితే, వారం వారీగా చూస్తే ‘సెన్సెక్స్’, ‘నిఫ్టీ’లు రెండూ వరుసగా ఐదో వారంలోనూ లాభాలతో ముగిసినట్లయింది. స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్ శుక్రవారం దెబ్బతింది. ఇది ప్రపంచ మార్కెట్లలోని బలహీన ధోరణికి చాలా వరకు అనుగుణంగా ఉందని చెప్పవచ్చు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి.  రెండు దేశాల మధ్య చర్చలు ఏ విధమైన గణనీయమైన పురోగతి సాధించకుండానే ముగిశాయి. ‘సెన్సెక్స్’ 38,366.79 వద్ద అత్యధిక స్థాయిలో మొదలై ఉదయం ట్రేడ్‌లో ఇన్వెస్టర్ల కొనుగోళ్ళు కొనసాగడంతో 38,429.50కి పురోగమించిం ది. కానీ, అన్ని రకాల షేర్లలోను లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో రికార్డు స్థాయిల నుంచి అది 38,172.77కి దిగిరాక తప్పలేదు. చివరకు అది 84.96 పాయింట్ల నష్టంతో  38.251.80 వద్ద స్థిరపడింది. గత నాలుగు సెషన్లలో ‘సెన్సెక్స్’ 673.20 పాయింట్లు లాభపడింది. గురువారంనాడు అది ఆల్-టైమ్ అత్యధిక స్థాయి 38,336.76 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా రికార్డు స్థాయి నుంచి కిందకు దిగినా కీలకమైన 11,550 స్థాయికి ఎగువన ముగియగలిగింది. అది 25.65 పాయింట్లు నష్టపోయి 11,557.10 వద్ద ముగిసింది. శుక్రవారం సెషన్‌లో అది 11,532 నుంచి 11,604.60 మధ్య ఊగిసలాడింది. గురువారంనాడు అది నూతన జీవితకాల గరిష్ఠ స్థాయి 11,582.75 వద్ద ముగిసింది. దేశీయ మదుపు సంస్థలు గురువారం రూ. 142 కోట్ల విలువ చేసే షేర్లను కొనగా, విదేశీ మదుపు సంస్థలు కూడా రూ. 433.21 కోట్ల విలువ చేసే షేర్లను సమీకరించు కున్నాయని తాత్కాలిక డాటా సూచించింది.ఆశావాదంతో ఆరోహణ

Updated By ManamWed, 08/22/2018 - 00:54
  • ఆశావాదంతో ఆరోహణ రికార్డు స్థాయిల్లో ముగిసిన సూచీలు

bseముంబై: స్టాక్ మార్కెట్లకు గీటురాయిగా భావించే ‘సెన్సెక్స్’, ‘నిఫ్టీ’లు మంగళవారం వరుసగా మూడో సెషన్‌లోనూ ఆరోహణను కొనసాగించాయి. లాభపడింది స్వల్పమే అయినా, నూతన గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్ల కొనుగోళ్ళు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ఆశావాదం మార్కెట్లకు ఊతమిచ్చాయి.  బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 7 పాయింట్లు పెరిగి 38,285.75 పాయింట్ల నూతన శిఖరంపై ముగిసింది. మునుపటి (సోమవారంనాటి) 38,278.75 పాయింట్ల అధిక ముగింపు రికార్డును అధిగమించింది. ‘సెన్సెక్స్’ ఇంట్రా-డేలో  ఒక దశలో 38,402.96 పాయింట్ల జీవిత కాల అత్యధిక స్థాయిని తాకింది. సోమవారం ఇంట్రా-డేలో అది 38,340.69 పాయింట్ల అధిక స్థాయిని తాకింది. ఇక మంగళవారం అది 38,213.87 పాయింట్ల కనిష్ఠ స్థాయిని కూడా చూసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 19.15 పాయింట్ల లాభంతో 11,570.90 తాజా అధిక స్థాయి వద్ద ముగిసింది. ఇంతకుముందు (సోమవారం) దాని ముగింపు రికార్డు స్థాయి 11,551.75 పాయింట్లుగా ఉంది. ‘నిఫ్టీ’ మంగళవారం ఇంట్రా-డేలో 11,581.75 పాయింట్లను తాకింది. ఆ విధంగా అది సోమవారం నాటి 11,565.30 పాయింట్ల రికార్డును బద్దలు కొట్టింది. డే ట్రేడ్‌లో సూచి 11,539.60 పాయింట్ల కనిష్ఠ స్థితిని చూసింది. 

దేశీయ మదుపు సంస్థల నిర్విరామ కొనుగోళ్ళు, ప్రపంచ మార్కెట్లలోని సానుకూల సెంటిమెంట్ దేశీయ మార్కెట్లు తాజా అత్యధిక స్థాయిలను అందుకునేందుకు సాయపడ్డాయని బ్రోకర్లు చెప్పారు. అమెరికా, చైనా వాణిజ్య చర్చలపై దృష్టి పెట్టిన ఇన్వెస్టర్లు వాటి సానుకూల ఫలితంపై ఆశావాదంతో ఉన్నారు. ఆ రెండింటి మధ్య సాగుతున్న సుంకాల యుద్ధం కొంత కాలంగా ప్రపంచ మార్కెట్లను అస్థిమితం చేస్తున్నాయి. ఈ రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య మంగళ, బుధవారాల్లో జరుగనున్న చర్చలు మార్కెట్ సెంటిమెంట్ల మెరుగుదలకు దారితీశాయని బ్రోకర్లు అన్నారు. కోల్ ఇండియాలో కొద్ది వాటాను విక్రయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు సూచించడంతో ఆ కంపెనీ షేర్  ధర మంగళవారం 2.59 శాతం పెరిగి రూ. 291.55 వద్ద ముగిసింది. ఒక రకమైన చర్మ వ్యాధి చికిత్సకు ఉపయోగించే లోషన్‌కు అమెరికా ఆహార, ఔషధ ప్రాధికార సంస్థ నుంచి తుది ఆమోదం లభించిందని లుపిన్ ప్రకటించడంతో మంగళవారం దాని షేర్  ధర 2.23 శాతం పెరిగింది. దేశీయ మదుపు సంస్థలు సోమవారం రూ. 593.22 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 483.04 కోట్ల విలువ చేసే షేర్లను  విక్రయించారని తాత్కాలిక డాటా సూచించింది. చైనా దిగుమతులపై అమెరికా విధించిన 16 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలు ఈ వారంలో అమలులోకి రావలసి ఉంది. వాటిని అమలులోకి తెస్తే అంతకుఅంత తామూ సుంకాలు విధిస్తామని చైనా హెచ్చరించింది. కాగా, బక్రీద్ సందర్భంగా బుధవారంనాడు బి.ఎస్.ఇ, ఎన్.ఎస్.ఇలకు సెలవు ప్రకటించారు.రికార్డు స్థాయిలకు స్టాక్ మార్కెట్లు

Updated By ManamMon, 08/20/2018 - 22:14
  • నూతన శిఖరాలపై సెన్సెక్స్, నిఫ్టీలు

bseముంబై: భారతీయ ఈక్విటీలు సోమవారం వరుసగా రెండవ సెషన్‌లో ‘బుల్ రన్’ కొనసాగించాయి. ఫలితంగా, ‘సెన్సెక్స్’ 38,278, ‘నిఫ్టీ’ 11,552 స్థాయిలను తాకాయి. యంత్రాలు, యంత్ర పరికరాలు, లోహాలు, మోటారు వాహనాల రంగాల షేర్లలో ముమ్మర కొనుగోళ్ళు, ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు సూచీల పెరుగుదలకు దోహదపడ్డాయి. అమెరికా-చైనాలు ఈ వారంలో వాణిజ్య చర్చలకు సమాయత్తమవుతున్నాయి. ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఆశావాదంతో కొనసాగింది. ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయి రూ. 70.40 నుంచి కోలుకుంటోంది. సోమవారం ఇంట్రా-డేలో ఒక దశలో అది రూ. 69.60గా ఉంది. ఈ అంశాలన్నీ కీలక సూచీలకు ఊతమిచ్చాయి. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ సోమవారం (ఇంట్రా-డేలో) 38,340.69 పాయింట్ల ఆల్-టైమ్ అత్యధిక స్థాయిని తాకింది. ఆగస్టు 9న నెలకొల్పిన మునుపటి 38,076.23 పాయింట్ల రికార్డును బద్దలుకొట్టింది. చివరకు అది 330.87 పాయిం ట్ల లాభంతో నూతన ముగింపు శిఖరం 38,278.75 వద్ద స్థిరపడింది. ఆగస్టు 3న ‘సెన్సెక్స్’ 391 పాయింట్లు లాభ పడింది. ఆ తర్వాత ఒకే రోజులో అత్యధిక పాయింట్ల లాభాన్ని ఈ సోమవారం నమోదు చేసింది. ‘సెన్సెక్స్’ ఆగస్టు 9న నమోదు చేసిన 38,024.37 పాయింట్ల మును పటి ముగింపు రికార్డును మెరుగుపరచుకుంది. బి.ఎస్.ఇ గీటురాయి ‘సెన్సెక్స్’ శుక్రవారం ఇంతకుముందు సెషన్‌లో 284.32 పాయింట్లు లాభపడింది. 

విస్తృతమైనదిగా భావించే నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా 11,500 స్థాయిని దాటి, ‘బుల్ రన్’ కొనసాగించగలిగింది. ‘నిఫ్టీ’ మొదటిసారిగా 11,565.30 (ఇంట్రా-డే) నూతన శిఖరాన్ని తాకింది. అంతిమంగా, 81 పాయింట్ల లాభంతో 11,551.75 పాయింట్ల నూతన శిఖర స్థాయి వద్ద ముగిసింది. అది ఆ విధంగా, ఆగస్టు 17 నాఇకి 11,470.75 పాయింట్ల మునుపటి సెషన్ రికార్డును బద్దలు కొట్టింది. అది ఆగస్టు 9 నాటి మునుపటి ఇంట్రా-డే 11,495.20 పాయింట్ల రికార్డును కూడా బద్దలు కొట్టింది. ‘‘ఊతంగా నిలిచిన గ్లోబల్ మార్కెట్లు, సానుకూల స్థానిక సంకేతాలతో మార్కెట్లు నూతన అత్యధిక రికార్డును తాకి, అర శాతం పైగా లాభపడ్డాయి. ఇదీ అదీ అని కాకుండా, అనేక రంగాల షేర్ల కొనుగోలు పట్ల ఆసక్తి వ్యక్తమైనప్పటికీ, రెండు ప్రధాన దిగ్గజాలు రిలయన్స్, ఎల్ అండ్ టిలు ఇండెక్స్ పెరుగుదలలో సగం పైగా భాగానికి దోహదపడ్డాయి. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు చర్చల ద్వారా వాణిజ్య యుద్ధ అంశాలను పరిష్కరించుకునేందుకు అంగీకరించిన పరిణామం పట్ల మనవాటితోపాటు ప్రపంచ మార్కెట్లలో కూడా సంతోషం వెల్లివిరిసింది’’ అని రెలిగేర్ బ్రోకింగ్ అధ్యక్షుడు జయంత్ మాంగ్లిక్ అన్నారు. దేశీయంగా కంపెనీలు ప్రకటించిన త్రైమాసిక ఫలితా లు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించడంపట్ల రేకెత్తిన ఆందోళనలను అవి కొంత వరకు తగ్గించగలిగాయని ఆయన అన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తాజాగా నిధులను ప్రవహింపజేయడం కూడా ర్యాలీకి మద్దతుగా నిలిచి, రెండు సూచీలను నూతన అధిక స్థాయిలను తీసుకెళ్ళగలిగాయి. దేశీయ మదుపు సంస్థలు శుక్రవారం రూ. 151.89 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కూడా రూ. 147.31 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారని తాత్కాలిక డాటా సూచించింది.కలవరపరచిన రూపాయి, లైరాలు

Updated By ManamFri, 08/17/2018 - 06:26
  • దెబ్బతిన్న సెంటిమెంట్‌తో క్షీణించిన సూచీలు

bseముంబై: క్షీణిస్తున్న రూపాయి, టర్కీ ఫినాన్షియల్ సంక్షోభం ఈక్విటీల నుంచి వెనక్కి తగ్గేట్లు పురికొల్పడం, నిస్తేజంగా ఉన్న స్థూల డాటా, మదుపరులలో అంతంత మాత్రంగా ఉన్న విశ్వాసాన్ని కూడా దెబ్బతీయడంతో స్టాక్ మార్కెట్ సూచీలు గురువారంనాడు  నష్టాలను చవిచూశాయి.  బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 188 పాయింట్లకు పైగా క్షీణించి 37,663.56 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 50.05 పాయింట్లు కోల్పోయి, 11,400 స్థాయి దిగువకు జారింది. ఇక (ఇంట్రా-డే)లో రూపాయి విలువ డాలరుతో మారకంలో గతంలో ఎన్నడూ ఎరుగనంతగా రూ. 70.40కి క్షీణించింది. విదేశీ ఫండ్ల నిధులు స్థిరంగా తరలిపోతూండడం అందుకు కారణం. టర్కీ కరెన్సీ సంక్షోభ ఫలితంగా, ఆసియాలోని ఇతర మార్కెట్ల నుంచి బలహీనంగా ఉన్న సంకేతాలు, చైనాలో ఆర్థిక మందగమనం ఏర్పడవచ్చనే భయాలు దలాల్ స్ట్రీట్‌లో సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయని బ్రోకర్లు చెప్పారు. దేశ వాణిజ్య లోటు జూలైలో దాదాపు ఐదేళ్ళ గరిష్ఠ స్థాయి 18 బిలియన్ అవెురికన్ డాలర్లకు పెరగడంతో ట్రేడింగ్‌లో ఉత్సాహం మరింత సన్నగిల్లింది. బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ 37,796.01 వద్ద తక్కువ స్థాయిలో మొదలై, మరింత దిగువకు 37,634.43కి పడిపోయింది. కానీ, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ షేర్లలో ర్యాలీ సూచీకి మళ్ళీ ఊతమిచ్చింది. అంతిమంగా సూచి 188.44 పాయింట్ల నష్టంతో 37,663.56 వద్ద ముగిసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్లు  బుధవారంనాడు మూతపడ్డాయి. 

ఎన్.ఎస్.ఇ ‘నిఫ్టీ’ గురువారం సెషన్‌లో చాలా భాగం నష్టాల్లోనే ట్రేడయింది. గణనీయమైన 11,400 స్థాయికన్నా కిందకు దిగి 11,366.25 కనిష్ఠ స్థితిని చూసింది. తర్వాత, స్వల్పంగా కోలుకుని, నష్టాలను 50.05 పాయింట్లకు పరిమితం చేసుకుని, 11,385.05 వద్ద ముగిసింది. కాగా, విదేశీ మదుపు సంస్థలు మంగళవారం రూ. 378.84 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 391.47 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు తాత్కాలిక డాటా వెల్లడించింది.సద్దుమణగిన భయాలతో మళ్లీ సూచీల

Updated By ManamWed, 08/15/2018 - 00:43

sensexముంబై: వరుసగా రెండు సెషన్ల నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలైన ‘సెన్సెక్స్’, ‘నిఫ్టీ’లు పాత స్థితిని తిరిగి సంతరించుకున్నాయి. ప్రధానంగా ఫినాన్షియల్, హెల్త్‌కేర్, ఐటీ షేర్లలో కొనుగోళ్ళు సూచీల ఆరోహణకు ఆలంబనగా నిలిచాయి. జూలైలో రిటైల్, టోకు ద్రవ్యోల్బణాలు రెండూ మితంగా ఉండడం, ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లను కలవరపరచిన టర్కిష్ లైరా కొంత రికవరవడం రెండూ మార్కెట్లలో పాల్గొనేవారికి నిబ్బరాన్ని ఇచ్చాయి. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 207 పాయింట్లకు పైగా పెరిగి 37,852 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 11,400 స్థాయికి ఎగువన స్థిరపడింది. 

పెరిగిన ఈక్విటీలు-తగ్గిన రూపాయి
స్టాక్ మార్కెట్లలో ఈక్విటీలు పెరిగితే, దానికి భిన్నంగా డాలరుతో మారకం విలువలో భారతీయ రూపాయి మొదటిసారిగా రూ. 70 కన్నా క్షీణించింది. ప్రపంచ మార్కెట్లలో పరిణామాల నేపథ్యంలో, అది ఒక దశలో రూ. 70.09కి పడిపోయింది. రూపాయి ఇంత ఘోరంగా పతనమవడం చరిత్రలో ఇదే మొదటిసారి. కాగా, టర్కిష్ లైరా సంక్షోభ ముప్పు సమసినట్లు కనిపించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తిరిగి స్థయిర్యాన్ని సంతరించుకుంటున్నట్లుగా కనిపించాయి. ఆరంభ ట్రేడ్‌లో డాలరుతో మారకం విలువలో రికార్డు స్థాయిలో కనిష్ఠ స్థితిని చూసిన టర్కిష్ కరెన్సీ, టర్కీ కేంద్ర బ్యాంక్ జోక్యం తర్వాత, కొంత బలపడింది. 

దేశీయ మదుపు సంస్థల అవిచ్ఛిన్న కొనుగోళ్ళు, కొన్ని లాభదాయక కంపెనీలు ప్రకటించిన మొదటి త్రైమాసిక ఫలితాలు చెప్పుకోతగినవిగా ఉండడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు దోహదపడ్డాయి. ఇటీవల దెబ్బతిన్న షేర్లు కొన్ని సరసమైన ధరకు లభిస్తూండడంతో కొనుగోళ్ళకు నోచుకున్నాయి. ఈ రకమైన కొనుగోళ్ళతో ‘సెన్సెక్స్’ 37,932.40 స్థాయిని తాకింది. తర్వాత, లాభాల స్వీకరణతో కొన్ని పాయింట్లను కోల్పోయింది. చివరకు 207.10 పాయింట్ల లాభంతో 37,852 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో ‘సెన్సెక్స్’ 379.47 పాయింట్లను కోల్పోయింది. ‘నిఫ్టీ’ కూడా ఒక దశలో 11,452.45 స్థితిని చూసి, చివరకు 79.35 పాయింట్ల లాభంతో 11,435.10 వద్ద ముగిసింది. దేశీయ మదుపు సంస్థలు సోమవారం రూ. 216.29 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 971.86 కోట్ల విలువ చేసే షేర్లను విక్ర యించారని తాత్కాలి డాటా సూచించింది.

నేడు సెలవు
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశీయ స్టాక్  ఎక్చ్సేంజీలకు బుధవారం సెలవు. బక్కచిక్కిన రూపాయితో బెంబేలు

Updated By ManamTue, 08/14/2018 - 00:37
  • దేశీయ స్టాక్‌మార్కెట్‌ను తాకిన టర్కీ సంక్షోభ ప్రకంపనలు

  • వరుసగా రెండో సెషన్‌లో నష్టాల్లో సూచీలు

stock-marketముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ సోమవారం వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలను నమోదు చేసి, 224 పాయింట్లకు పైగా క్షీణించి, దాదాపు రెండు వారాల కనిష్ఠ స్థాయి 37,645కి పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరీ క్షీణించడం, టర్కిష్ ఫినాన్షియల్ సంక్షోభం ఇన్వెస్టర్లను కలవరపెట్టడంతో ప్రధానంగా ఫినాన్షియల్ సంస్థల షేర్లు భారీయెుత్తున అమ్మకాలకు లోనయ్యాయి. విస్తృతమైనదిగా భావించే నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా 73.75 పాయింట్లు కోల్పోయి 11,355.75 వద్ద ముగిసింది. 

రూపాయి విలవిల
అవెురికన్ డాలరుతో భారతీయ రూపాయి మారకం విలువ మునుపెన్న డూ ఎరుగనంతగా (ఇంట్రా-డేలో) రూ. 69.85కి క్షీణించింది. ప్రపంచ మార్కెట్ల సంకేతాల ననుసరించి నడిచింది. డాలరుతో టర్కిష్ లైరా మారకం విలువ నిర్విరామంగా క్షీణిస్తూ పోవడంతో ఫినాన్షియల్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల విభాగాలు తీవ్ర అమ్మకాల తాకిడిని చూశాయి. సురక్షిత మదుపు నెలవుల కోసం డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ‘‘అవెురికా-టర్కీల మధ్య రేగిన ఉద్రిక్తతలు ప్రపంచ ఫినాన్షియల్ మార్కెట్లను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. దాని ప్రకంపనల ప్రభావం దేశీయ మార్కెట్‌ను కూడా తాకింది. జూన్ నెలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7 శాతంగా ఉండి ఆశావాదాన్ని రేకెత్తించినప్పటికీ, బలహీనంగా ఉన్న ప్రపంచ సంకేతాలు, క్షీణిస్తూ వచ్చిన భారతీయ రుపాయి ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయి. అయితే, కంపెనీల ఆదాయాల్లో వృద్ధి పునరుద్ధరణ, తగ్గుతున్న చమురు ధరలు, మెరుగుపడుతున్న దేశీయ స్థూల ఆర్థికాంశాలు, విదేశీ మదుపు సంస్థలు తిరిగి  కొనుగోళ్ళు జరుపుతూండడం, మార్కెట్ మరింత పతనం కాకుండా చాలా వరకు అడ్డుకట్ట వేశాయి’’ అని జియోజీత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. ‘సెన్సెక్స్’ 37,693.19 వద్ద తక్కువ స్థాయిలో మొదలై, అమ్మకాలు తీవ్రతరమవడంతో  కిందకు జారడాన్ని కొనసాగించి 37,559.26 పాయింట్ల కనిష్ఠ స్థాయిని చూసింది. కానీ, కొన్ని విలువైన షేర్లు తక్కువ ధరకు లభిస్తూండడంతో సాగిన కొనుగోళ్ళు, నష్టాలను తగ్గించుకునేందుకు కొందరు చేసిన కొనుగోళ్ళతో స్వల్పంగా రికవరయింది. చివరకు, 224.33 పాయింట్ల నష్టంతో 37,644.90 వద్ద ముగిసింది. మునుపటి సెషన్‌లో ‘సెన్సెక్స్’ 155.14 పాయింట్లు కోల్పోయింది. ‘నిఫ్టీ’ 10,400 స్థాయి నుంచి కిందకు దిగి చివరకు 73.75 పాయింట్ల నష్టంతో 11,355.75 వద్ద ముగిసింది. విదేశీ ఫండ్లు శుక్రవారం రూ. 510.66 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 457.83 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశాయని తాత్కాలిక డాటా వెల్లడించింది. రూపాయి పతనం వల్ల టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ సంస్థల షేర్లు మాత్రం సానుకూల స్థితిలో ముగిశాయి.లాభాల స్వీకరణతో సడలిన సూచీలు

Updated By ManamFri, 08/10/2018 - 22:35

bseముంబై: వరుసగా రికార్డులు నెలకొల్పుతూ వచ్చిన సెషన్ల తర్వాత బుల్స్ కొద్దిగా ఊపిరి పీల్చుకోవడంతో, ఈక్విటీ సూచీలు గురువారంనాడు స్థిరపడిన జీవితకాల అత్యధిక స్థాయిల నుంచి శుక్రవారం కొద్దిగా సడలాయి. టర్కిష్ కరెన్సీ లైరా కుప్పకూలిన తాలూకు పర్యవసానాలు ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించి, రిస్క్ తీసుకునే ధోరణికి అడ్డుకట్టవేశాయి. ఇటీవల పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం, దానికితోడు నిరుత్సాహపరచిన ఎస్.బి.ఐ ఫలితాలు ట్రేడింగ్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని బ్రోకర్లు చెప్పారు. ‘సెన్సెక్స్’ ప్యాక్‌లో ఎస్.బి.ఐ పెద్ద లూజర్‌గా నిలిచింది. మొండి బాకీలు పెరగడం వల్ల బ్యాంక్ జూన్ త్రైమాసికానికి భారీ మొత్తంలో రూ. 4,876 కోట్ల నష్టాన్ని ప్రకటించిన తర్వాత, బ్యాంక్ షేర్ ధర 3.79 శాతం క్షీణించింది. అవెురికన్ డాలరుతో మారకం విలువలో టర్కిష్ లైరా 12 శాతం పతనమవడంతో గ్లోబల్ ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లు అల్లల్లాడాయి. అది ప్రవర్థమాన ఆర్థిక వ్యవస్థల స్థూల స్థిరత్వంపై ఆందోళనలను రేకెత్తించింది. 

బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 38,050.07 వద్ద మొదలైన తర్వాత, వేగంగా 38,000 స్థాయి దిగువకు జారింది. అంతిమంగా అది 155.14 పాయింట్ల నష్టంతో 37,869.23 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా 41.20 పాయింట్లు కోల్పోయి, 11,429.50 వద్ద ముగిసింది. అయితే, రెండు సూచీలు వరుసగా మూడవ వారంలో లాభాలతో ముగిశాయి. బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ 313.07 పాయింట్ల పెరుగుదలను నమోదు చేయగా, ‘నిఫ్టీ’ ఈ వారంలో 68.70 పాయింట్లు పురోగమించింది. కాగా, దేశీయ మదుపు సంస్థలు గురువారం రూ. 85.39 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 370.68 కోట్ల విలువ చేసే ఈక్విటీలను కొనుగోలు చేశారని తాత్కాలిక డాటా వెల్లడించింది. ‘‘కొద్ది రోజులుగా వరుసగా ర్యాలీని వీక్షిస్తూ వచ్చిన తర్వాత, బుల్స్ ఊపిరి పీల్చుకోవడంతో, ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉండడంతో, లాభాలు బుక్ చేసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. దేశీయ పారిశ్రామికోత్పత్తి డాటాపై సానుకూల అంచనాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి నిధుల రాక పెరగడం మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేసే అంశాలకు తోడు కానున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ, చమురు ధరల్లో చోటుచేసుకుంటున్న తీవ్ర హెచ్చు తగ్గుల నేపథ్యంలో రానున్న రిటైల్, టోకు ద్రవ్యోల్బణ డాటా కోసం ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మొండి బాకీలకు పెరుగుతున్న కేటాయింపులు సృష్టించిన కలవరంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు క్షీణించాయి’’ అని జియోజీత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ చెప్పారు.సెన్సెక్స్ @ 38,024

Updated By ManamThu, 08/09/2018 - 23:22
  • దలాల్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న బుల్ రన్

sensexముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ మొదటిసారిగా 38,000 స్థాయిని మించి దూసుకెళ్ళింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ గురువారం ఐదో రోజు కూడా రికార్డుల ఉధృతిని కొనసాగించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి విజయ గాధ చుట్టూ అల్లుకున్న ఆశావాదం ముందు ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు దూది పింజల్లా ఎగిరిపోవడం కొనసాగింది. బ్యాంకింగ్ షేర్లు గురువారం కూడా రాణించాయి. ‘సెన్సెక్స్’ గైనర్ల జాబితాలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈక్విటీల పట్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ చెక్కుచెదరలేదనడానికి అవిచ్ఛిన్నంగా సాగిన విదేశీ, దేశీయ ఫండ్ల నగదు ప్రవాహాలే నిదర్శనం. కంపెనీలు ప్రకటిస్తున్న రాబడులు బలోపేతంగా ఉండడం కొనుగోళ్ళకు ప్రోత్సాహం లభించింది. అవెురికా దిగుమతులపై చైనా ప్రతీకార సుంకాలు ప్రకటించడంతో విదేశీ మార్కెట్లు మిశ్రమంగా సాగాయి.

అయితే, వాషింగ్టన్, బీజింగ్‌ల మధ్య తాజాగా వాణిజ్య యుద్ధ తీవ్రత పెరిగినా దలాల్ స్ట్రీట్ దాన్ని పట్టించుకోలేదు. ఆరోహణను కొనసాగించింది. బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ 38,000 పాయింట్ల అత్యున్నత శిఖరాన్ని తాకింది. అంతేకాదు. దాన్ని దాటి ముందుకెళ్ళిన స్థితిలో ముగిసింది. సెషన్ పొడుగూతా అది గ్రీన్‌లోనే కొనసాగింది. చివరకు అది136.81 పాయింట్ల లాభంతో 38,024.37 వద్ద ముగిసింది. అలా బుధవారంనాటి  37,887.56 స్థాయి ముగింపు రికార్డును బద్దలు కొట్టింది. ‘సెన్సెక్స్’ 37,000 స్థాయి శిఖరాన్ని జూలై 26న అధిరోహించింది.  అక్కడ నుంచి 38,000 పాయింట్ల శిఖరాన్ని చేరడానికి సున్నిత సూచికి 11 సెషన్లు పట్టింది. 

విస్తృతమైనదిగా భావించే  ‘నిఫ్టీ’ 20.70 పాయింట్లు పెరిగి, 11,470.70 వద్ద ముగిసింది. అది అలా బుధవారంనాటి 11,450 అత్యధిక స్థాయిని దాటింది. సెషన్ చివర్లో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి టెలికాం, మన్నికైన వినియోగ వస్తువులు, ఆరోగ్య రక్షణ, యంత్రాలు, యంత్ర పరికరాల తయారీ, చమురు, గ్యాస్ రంగ షేర్లు సెషన్ చివర్లో 1.31 శాతం తగ్గాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బుధవారం రూ. 568.63 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ మదుపు సంస్థలు రూ. 30.25 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశాయని తాత్కాలిక డాటా సూచించింది.

ఆగని కయ్యం
తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేరొండంటా అన్న రీతిలో వ్యవహరిస్తున్న అవెురికా, చైనాల మధ్య కయ్యం మళ్ళీ పెచ్చుమీరింది. అవెురికా దిగుమతులపై సుమారు 16 బిలియన్ డాలర్ల విలువైన ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించడంతో ఏషియన్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అవెురికా స్టాక్ మార్కెట్ సూచీలు  చాలా వరకు బుధవారం తగ్గిన స్థాయిలో ముగిశాయి.నూతన శిఖరాలపై సూచీలు

Updated By ManamWed, 08/08/2018 - 22:08

bseముంబై: స్టాక్ మార్కెట్ స్థితికి గీటురాళ్ళుగా భావించే సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం నూతన జీవితకాల అత్యధిక స్థాయిలను తాకాయి. మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ల కొనుగోలు పట్ల మదుపరులు అదేపనిగా ఆసక్తి కనబరుస్తూపోవడం దానికి ప్రధాన కారణం కాగా, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి వనరుగా ఇండియా వహించే పాత్రను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రత్యేకించి చెప్పడం, మొత్తం మీద స్థూల కొనుగోళ్ళ గతికి వేగాన్ని ఇచ్చింది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 221.76 పాయింట్లు పెరిగి నూతన శిఖరం 37,887.56 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ వరుసగా నాల్గో సెషన్‌లోనూ రికార్డులు నెలకొల్పుతూ, మొదటిసారిగా 11,400 ఎగువన ముగిసింది. 

ఐ.ఎం.ఎఫ్ ప్రశంసలతో పరవళ్ళు
రానున్న కొద్ది దశాబ్దాలపాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇండియాయే ప్రధాన ఆలంబన కానుందని ఐ.ఎం.ఎఫ్ వెల్లడించడంతో సెంటిమెంట్ బలం పుంజుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంతవరకు చైనా ఏ విధంగా ఇరుసుగా నిలుస్తూ వచ్చిందో, ఇండియా అదే పాత్ర వహించబోతోందని ఐ.ఎం.ఎఫ్ ప్రశంసలు కురిపించింది. అందుకు, భారతదేశంలో వ్యవస్థాపరమైన సంస్కరణలు మరిన్ని అవసరమని కూడా సూచించింది. విదేశీ మదుపు సంస్థల నిధులు స్థిరంగా ప్రవహించడం, దేశీయ మదుపు సంస్థలు తాజా విడత కొనుగోళ్ళకు దిగడం ర్యాలీని పెంపొందించాయని బ్రోకర్లు చెప్పారు. మొదటి త్రైమాసిక రాబడులు ప్రోత్సాహకరంగా ఉండడం, ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ధోరణి, అవెురికాలో షేర్లు తాజా ఆల్-టైమ్ అధిక స్థాయిలకు చేరువ కావడం కూడా సెంటిమెంట్‌కు బలాన్ని చేకూర్చిందని వారు చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ భారీ కొనుగోళ్ళను వీక్షించింది. అది 2.85 శాతం పెరిగి, కొత్త అత్యధిక స్థాయి రూ. 1,217.25 వద్ద ముగిసింది. బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ అప్రమత్త ధోరణితో ఆరంభమైన తర్వాత, వేగం పుంజుకుని 37,931.42 స్థాయిని అందుకుంది. చివరకు 221.76 పాయింట్ల లాభంతో 37,887.56 వద్ద ముగిసింది. ఆ విధంగా, అది ఆగస్టు 6 నాటి 37,691.89 పాయింట్ల పూర్వ ముగింపు రికార్డును బద్దలు కొట్టింది. విస్తృతమైనదిగా భావించే ‘నిఫ్టీ’ కూడా 60.55 పాయింట్లు లాభపడి 11,450కి చేరింది. మంగళవారం నాటి గరిష్ఠ స్థాయి 11,389.45 రికార్డును అధిగమించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మంగళవారం రూ. 314.83 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 319.90 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయని తాత్కాలిక డాటా వెల్లడించింది. లాభాల స్వీకరణతో ఒడుదొడుకులు

Updated By ManamTue, 08/07/2018 - 23:07

bseముంబై: స్టాక్ మార్కెట్ మంగళవారం ఆద్యంతం ఒడుదొడుకులతో సాగింది. మార్కెట్‌కు గీటురాయిగా భావించే బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ రికార్డు స్థాయిల నుంచి వెనక్కి తగ్గి ఇంచుమించు బల్లపరుపు స్థితిలో 37,665.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవలి ర్యాలీ తర్వాత, బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్లలో చోటుచేసుకున్న లాభాల స్వీకరణతో ‘సెన్సెక్స్’ సోమవారం కన్నా కొద్ది తక్కువ స్థితిలో ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ మాత్రం వరుసగా మూడో సెషన్‌లోనూ రికార్డుల పరంపరను కొనసాగించింది. తాజా అత్యధిక స్థాయి 11,389.45 వద్ద ముగిసింది. స్వల్పంగా 2.35 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇంట్రా-డేలో అది 11,359.70 కనిష్ఠ, 11,428.95 గరిష్ఠ స్థాయిలను తాకింది. ప్రోత్సాహకర కార్పొరేట్ ఫలితాలు, చమురు కంపెనీల షేర్ల ధరల పెరుగుదలతో గ్లోబల్ మార్కెట్లు లాభాలను నమోదు చేసినా, దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఆటుపోట్లను చూశాయి. అత్యధిక స్థాయిలో మొదలైన ‘సెన్సెక్స్’ ఆరోహణ కొనసాగించి ఆరంభ ట్రేడ్‌లో 37,876.87 తాజా జీవిత కాల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, లాభాల స్వీకరణతో కుంగి 26.09 పాయింట్ల నష్టంతో, చివరకు 37,665.80 వద్ద ముగిసింది. విడతలుగా సాగిన కొనుగోళ్ళు, అమ్మకాలతో ‘సెన్సెక్స్’ సుమారు 300 పాయింట్లు తగ్గడం, పెరగడం చేసింది.

Related News