sensex

ఆశావాదంతో ఆరోహణ

Updated By ManamWed, 08/22/2018 - 00:54
  • ఆశావాదంతో ఆరోహణ రికార్డు స్థాయిల్లో ముగిసిన సూచీలు

bseముంబై: స్టాక్ మార్కెట్లకు గీటురాయిగా భావించే ‘సెన్సెక్స్’, ‘నిఫ్టీ’లు మంగళవారం వరుసగా మూడో సెషన్‌లోనూ ఆరోహణను కొనసాగించాయి. లాభపడింది స్వల్పమే అయినా, నూతన గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్ల కొనుగోళ్ళు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ఆశావాదం మార్కెట్లకు ఊతమిచ్చాయి.  బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 7 పాయింట్లు పెరిగి 38,285.75 పాయింట్ల నూతన శిఖరంపై ముగిసింది. మునుపటి (సోమవారంనాటి) 38,278.75 పాయింట్ల అధిక ముగింపు రికార్డును అధిగమించింది. ‘సెన్సెక్స్’ ఇంట్రా-డేలో  ఒక దశలో 38,402.96 పాయింట్ల జీవిత కాల అత్యధిక స్థాయిని తాకింది. సోమవారం ఇంట్రా-డేలో అది 38,340.69 పాయింట్ల అధిక స్థాయిని తాకింది. ఇక మంగళవారం అది 38,213.87 పాయింట్ల కనిష్ఠ స్థాయిని కూడా చూసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 19.15 పాయింట్ల లాభంతో 11,570.90 తాజా అధిక స్థాయి వద్ద ముగిసింది. ఇంతకుముందు (సోమవారం) దాని ముగింపు రికార్డు స్థాయి 11,551.75 పాయింట్లుగా ఉంది. ‘నిఫ్టీ’ మంగళవారం ఇంట్రా-డేలో 11,581.75 పాయింట్లను తాకింది. ఆ విధంగా అది సోమవారం నాటి 11,565.30 పాయింట్ల రికార్డును బద్దలు కొట్టింది. డే ట్రేడ్‌లో సూచి 11,539.60 పాయింట్ల కనిష్ఠ స్థితిని చూసింది. 

దేశీయ మదుపు సంస్థల నిర్విరామ కొనుగోళ్ళు, ప్రపంచ మార్కెట్లలోని సానుకూల సెంటిమెంట్ దేశీయ మార్కెట్లు తాజా అత్యధిక స్థాయిలను అందుకునేందుకు సాయపడ్డాయని బ్రోకర్లు చెప్పారు. అమెరికా, చైనా వాణిజ్య చర్చలపై దృష్టి పెట్టిన ఇన్వెస్టర్లు వాటి సానుకూల ఫలితంపై ఆశావాదంతో ఉన్నారు. ఆ రెండింటి మధ్య సాగుతున్న సుంకాల యుద్ధం కొంత కాలంగా ప్రపంచ మార్కెట్లను అస్థిమితం చేస్తున్నాయి. ఈ రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య మంగళ, బుధవారాల్లో జరుగనున్న చర్చలు మార్కెట్ సెంటిమెంట్ల మెరుగుదలకు దారితీశాయని బ్రోకర్లు అన్నారు. కోల్ ఇండియాలో కొద్ది వాటాను విక్రయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు సూచించడంతో ఆ కంపెనీ షేర్  ధర మంగళవారం 2.59 శాతం పెరిగి రూ. 291.55 వద్ద ముగిసింది. ఒక రకమైన చర్మ వ్యాధి చికిత్సకు ఉపయోగించే లోషన్‌కు అమెరికా ఆహార, ఔషధ ప్రాధికార సంస్థ నుంచి తుది ఆమోదం లభించిందని లుపిన్ ప్రకటించడంతో మంగళవారం దాని షేర్  ధర 2.23 శాతం పెరిగింది. దేశీయ మదుపు సంస్థలు సోమవారం రూ. 593.22 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 483.04 కోట్ల విలువ చేసే షేర్లను  విక్రయించారని తాత్కాలిక డాటా సూచించింది. చైనా దిగుమతులపై అమెరికా విధించిన 16 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలు ఈ వారంలో అమలులోకి రావలసి ఉంది. వాటిని అమలులోకి తెస్తే అంతకుఅంత తామూ సుంకాలు విధిస్తామని చైనా హెచ్చరించింది. కాగా, బక్రీద్ సందర్భంగా బుధవారంనాడు బి.ఎస్.ఇ, ఎన్.ఎస్.ఇలకు సెలవు ప్రకటించారు.కలవరపరచిన రూపాయి, లైరాలు

Updated By ManamFri, 08/17/2018 - 06:26
  • దెబ్బతిన్న సెంటిమెంట్‌తో క్షీణించిన సూచీలు

bseముంబై: క్షీణిస్తున్న రూపాయి, టర్కీ ఫినాన్షియల్ సంక్షోభం ఈక్విటీల నుంచి వెనక్కి తగ్గేట్లు పురికొల్పడం, నిస్తేజంగా ఉన్న స్థూల డాటా, మదుపరులలో అంతంత మాత్రంగా ఉన్న విశ్వాసాన్ని కూడా దెబ్బతీయడంతో స్టాక్ మార్కెట్ సూచీలు గురువారంనాడు  నష్టాలను చవిచూశాయి.  బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 188 పాయింట్లకు పైగా క్షీణించి 37,663.56 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 50.05 పాయింట్లు కోల్పోయి, 11,400 స్థాయి దిగువకు జారింది. ఇక (ఇంట్రా-డే)లో రూపాయి విలువ డాలరుతో మారకంలో గతంలో ఎన్నడూ ఎరుగనంతగా రూ. 70.40కి క్షీణించింది. విదేశీ ఫండ్ల నిధులు స్థిరంగా తరలిపోతూండడం అందుకు కారణం. టర్కీ కరెన్సీ సంక్షోభ ఫలితంగా, ఆసియాలోని ఇతర మార్కెట్ల నుంచి బలహీనంగా ఉన్న సంకేతాలు, చైనాలో ఆర్థిక మందగమనం ఏర్పడవచ్చనే భయాలు దలాల్ స్ట్రీట్‌లో సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయని బ్రోకర్లు చెప్పారు. దేశ వాణిజ్య లోటు జూలైలో దాదాపు ఐదేళ్ళ గరిష్ఠ స్థాయి 18 బిలియన్ అవెురికన్ డాలర్లకు పెరగడంతో ట్రేడింగ్‌లో ఉత్సాహం మరింత సన్నగిల్లింది. బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ 37,796.01 వద్ద తక్కువ స్థాయిలో మొదలై, మరింత దిగువకు 37,634.43కి పడిపోయింది. కానీ, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ షేర్లలో ర్యాలీ సూచీకి మళ్ళీ ఊతమిచ్చింది. అంతిమంగా సూచి 188.44 పాయింట్ల నష్టంతో 37,663.56 వద్ద ముగిసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్లు  బుధవారంనాడు మూతపడ్డాయి. 

ఎన్.ఎస్.ఇ ‘నిఫ్టీ’ గురువారం సెషన్‌లో చాలా భాగం నష్టాల్లోనే ట్రేడయింది. గణనీయమైన 11,400 స్థాయికన్నా కిందకు దిగి 11,366.25 కనిష్ఠ స్థితిని చూసింది. తర్వాత, స్వల్పంగా కోలుకుని, నష్టాలను 50.05 పాయింట్లకు పరిమితం చేసుకుని, 11,385.05 వద్ద ముగిసింది. కాగా, విదేశీ మదుపు సంస్థలు మంగళవారం రూ. 378.84 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 391.47 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు తాత్కాలిక డాటా వెల్లడించింది.సద్దుమణగిన భయాలతో మళ్లీ సూచీల

Updated By ManamWed, 08/15/2018 - 00:43

sensexముంబై: వరుసగా రెండు సెషన్ల నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలైన ‘సెన్సెక్స్’, ‘నిఫ్టీ’లు పాత స్థితిని తిరిగి సంతరించుకున్నాయి. ప్రధానంగా ఫినాన్షియల్, హెల్త్‌కేర్, ఐటీ షేర్లలో కొనుగోళ్ళు సూచీల ఆరోహణకు ఆలంబనగా నిలిచాయి. జూలైలో రిటైల్, టోకు ద్రవ్యోల్బణాలు రెండూ మితంగా ఉండడం, ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లను కలవరపరచిన టర్కిష్ లైరా కొంత రికవరవడం రెండూ మార్కెట్లలో పాల్గొనేవారికి నిబ్బరాన్ని ఇచ్చాయి. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 207 పాయింట్లకు పైగా పెరిగి 37,852 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 11,400 స్థాయికి ఎగువన స్థిరపడింది. 

పెరిగిన ఈక్విటీలు-తగ్గిన రూపాయి
స్టాక్ మార్కెట్లలో ఈక్విటీలు పెరిగితే, దానికి భిన్నంగా డాలరుతో మారకం విలువలో భారతీయ రూపాయి మొదటిసారిగా రూ. 70 కన్నా క్షీణించింది. ప్రపంచ మార్కెట్లలో పరిణామాల నేపథ్యంలో, అది ఒక దశలో రూ. 70.09కి పడిపోయింది. రూపాయి ఇంత ఘోరంగా పతనమవడం చరిత్రలో ఇదే మొదటిసారి. కాగా, టర్కిష్ లైరా సంక్షోభ ముప్పు సమసినట్లు కనిపించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తిరిగి స్థయిర్యాన్ని సంతరించుకుంటున్నట్లుగా కనిపించాయి. ఆరంభ ట్రేడ్‌లో డాలరుతో మారకం విలువలో రికార్డు స్థాయిలో కనిష్ఠ స్థితిని చూసిన టర్కిష్ కరెన్సీ, టర్కీ కేంద్ర బ్యాంక్ జోక్యం తర్వాత, కొంత బలపడింది. 

దేశీయ మదుపు సంస్థల అవిచ్ఛిన్న కొనుగోళ్ళు, కొన్ని లాభదాయక కంపెనీలు ప్రకటించిన మొదటి త్రైమాసిక ఫలితాలు చెప్పుకోతగినవిగా ఉండడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు దోహదపడ్డాయి. ఇటీవల దెబ్బతిన్న షేర్లు కొన్ని సరసమైన ధరకు లభిస్తూండడంతో కొనుగోళ్ళకు నోచుకున్నాయి. ఈ రకమైన కొనుగోళ్ళతో ‘సెన్సెక్స్’ 37,932.40 స్థాయిని తాకింది. తర్వాత, లాభాల స్వీకరణతో కొన్ని పాయింట్లను కోల్పోయింది. చివరకు 207.10 పాయింట్ల లాభంతో 37,852 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో ‘సెన్సెక్స్’ 379.47 పాయింట్లను కోల్పోయింది. ‘నిఫ్టీ’ కూడా ఒక దశలో 11,452.45 స్థితిని చూసి, చివరకు 79.35 పాయింట్ల లాభంతో 11,435.10 వద్ద ముగిసింది. దేశీయ మదుపు సంస్థలు సోమవారం రూ. 216.29 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 971.86 కోట్ల విలువ చేసే షేర్లను విక్ర యించారని తాత్కాలి డాటా సూచించింది.

నేడు సెలవు
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశీయ స్టాక్  ఎక్చ్సేంజీలకు బుధవారం సెలవు. సెన్సెక్స్ @ 38,024

Updated By ManamThu, 08/09/2018 - 23:22
  • దలాల్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న బుల్ రన్

sensexముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ మొదటిసారిగా 38,000 స్థాయిని మించి దూసుకెళ్ళింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ గురువారం ఐదో రోజు కూడా రికార్డుల ఉధృతిని కొనసాగించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి విజయ గాధ చుట్టూ అల్లుకున్న ఆశావాదం ముందు ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు దూది పింజల్లా ఎగిరిపోవడం కొనసాగింది. బ్యాంకింగ్ షేర్లు గురువారం కూడా రాణించాయి. ‘సెన్సెక్స్’ గైనర్ల జాబితాలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈక్విటీల పట్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ చెక్కుచెదరలేదనడానికి అవిచ్ఛిన్నంగా సాగిన విదేశీ, దేశీయ ఫండ్ల నగదు ప్రవాహాలే నిదర్శనం. కంపెనీలు ప్రకటిస్తున్న రాబడులు బలోపేతంగా ఉండడం కొనుగోళ్ళకు ప్రోత్సాహం లభించింది. అవెురికా దిగుమతులపై చైనా ప్రతీకార సుంకాలు ప్రకటించడంతో విదేశీ మార్కెట్లు మిశ్రమంగా సాగాయి.

అయితే, వాషింగ్టన్, బీజింగ్‌ల మధ్య తాజాగా వాణిజ్య యుద్ధ తీవ్రత పెరిగినా దలాల్ స్ట్రీట్ దాన్ని పట్టించుకోలేదు. ఆరోహణను కొనసాగించింది. బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ 38,000 పాయింట్ల అత్యున్నత శిఖరాన్ని తాకింది. అంతేకాదు. దాన్ని దాటి ముందుకెళ్ళిన స్థితిలో ముగిసింది. సెషన్ పొడుగూతా అది గ్రీన్‌లోనే కొనసాగింది. చివరకు అది136.81 పాయింట్ల లాభంతో 38,024.37 వద్ద ముగిసింది. అలా బుధవారంనాటి  37,887.56 స్థాయి ముగింపు రికార్డును బద్దలు కొట్టింది. ‘సెన్సెక్స్’ 37,000 స్థాయి శిఖరాన్ని జూలై 26న అధిరోహించింది.  అక్కడ నుంచి 38,000 పాయింట్ల శిఖరాన్ని చేరడానికి సున్నిత సూచికి 11 సెషన్లు పట్టింది. 

విస్తృతమైనదిగా భావించే  ‘నిఫ్టీ’ 20.70 పాయింట్లు పెరిగి, 11,470.70 వద్ద ముగిసింది. అది అలా బుధవారంనాటి 11,450 అత్యధిక స్థాయిని దాటింది. సెషన్ చివర్లో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి టెలికాం, మన్నికైన వినియోగ వస్తువులు, ఆరోగ్య రక్షణ, యంత్రాలు, యంత్ర పరికరాల తయారీ, చమురు, గ్యాస్ రంగ షేర్లు సెషన్ చివర్లో 1.31 శాతం తగ్గాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బుధవారం రూ. 568.63 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ మదుపు సంస్థలు రూ. 30.25 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశాయని తాత్కాలిక డాటా సూచించింది.

ఆగని కయ్యం
తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేరొండంటా అన్న రీతిలో వ్యవహరిస్తున్న అవెురికా, చైనాల మధ్య కయ్యం మళ్ళీ పెచ్చుమీరింది. అవెురికా దిగుమతులపై సుమారు 16 బిలియన్ డాలర్ల విలువైన ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించడంతో ఏషియన్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అవెురికా స్టాక్ మార్కెట్ సూచీలు  చాలా వరకు బుధవారం తగ్గిన స్థాయిలో ముగిశాయి.మందకొడిగానే మార్కెట్లు

Updated By ManamThu, 07/19/2018 - 23:35
  • మరింత చిక్కిన రూపాయి.. అందరి దృష్టీ అవిశ్వాసం పైనే

Sensexముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండవ రోజు వెనక్కి తగ్గాయి. జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్.డి.ఎ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగనుండడంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరించారు. రూపాయి బలహీనత మరోసారి బయటపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ ఇంట్రా-డే ట్రేడ్‌లో రూ. 69కి మించి పతనమవడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. కొనుగోళ్ళకు పురికొల్పగల స్పష్టమైన అంశాలు కొరవడ్డాయని బ్రోకర్లు చెప్పారు. తొలి లాభాలను వదిలేసుకుంటూ, 22.21 పాయింట్ల తగ్గుదలతో బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ 36,351.23 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 23.35 పాయింట్లు త గ్గి 10,957.10 వద్ద ముగిసింది. మితిమీరిన విలువలతో కూడిన స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం కొనసాగింది. నాలుగేళ్ళ క్రితం ఎన్.డి.ఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ రేపు చర్చకు చేపట్టనుంది. హెచ్చు స్థాయిలో ప్రారంభమైన ‘సెన్సెక్స్’ 36,515.58 పాయింట్లను తాకింది. మధ్యాహ్న ట్రేడ్‌లో తగ్గి 36,279.33 కి పడిపోయింది. చివరకు 22.21 పాయింట్ల నష్టంతో 36,351.23 వద్ద స్థిరపడింది. అలాగే, ‘నిఫ్టీ’ ఇంట్రా-డేలో 10,935.45 నుంచి 11,006.50 మధ్య ఊగిసలాడి చివరకు 10,957.10 వద్ద ముగిసింది. దేశీయ మదుపు సంస్థలు బుధవారం రూ. 111.01 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 95.68 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారని స్టాక్ ఎక్చ్సేంజిలు విడుదల చేసిన తాత్కాలిక డాటా వెల్లడించింది. ‘‘మార్కెట్లు ప్రతికూల మొగ్గుతో రేంజ్ బౌండ్‌గా ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ పెరుగుదల, కొనసాగుతున్న వాణిజ్య వాగ్వాదంతో రూపాయి బలహీనపడింది. ప్రపంచ సంకేతాలు దేశీయ మార్కెట్  గమన దశకు స్పష్టమైన మద్దతు ఇవ్వడం లేదు. అవెురికా, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలు మదుపరులను ఎటూ తోచుకోనీయడం లేదు. రూపాయి మారకం విలువ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతూండడంతో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు ఆశించినంతగా రాణించలేకపోతున్నాయి. ప్రభుత్వ పునర్ మూలధనీకరణ చర్యల వార్తలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు మాత్రం పెరిగాయి’’ అని జియోజీత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు.ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 

Updated By ManamTue, 06/26/2018 - 12:06

Markets open flat, trading under pressure, Sensex, Niftyముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో ఈక్వెటీ మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధంపై అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భయంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. ఈ రోజు ఉదయం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో బీసీఈ సెన్సెక్స్ ఆరంభంలో 114 పాయింట్లు నష్టపోయి 35,355.72 ట్రేడింగ్‌లో కొనసాగుతోంది. అటు నిఫ్టి కూడా నిఫ్టీ 13.6 పాయింట్ల నష్టంతో 10776.05 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక ఐటీ, పారిశ్రామిక, ఇతర రంగాల్లో టాప్ సెన్సెక్స్ గెయినర్స్ కోల్ ఇండియా (2.95 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (1.59 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (1.36 శాతం) కొనసాగుతుండగా, టాటా మోటార్స్ (2.24 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.31 శాతం), ఐసీఐసీఐ బ్యాంకు (1.30 శాతం) మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. టెలికం రంగం బీఎస్ఈ మార్కెట్ల సూచీలు 0.76 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు పడిపోయి రూ. 68.20  వద్ద ట్రేడ్ అవుతోంది. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Updated By ManamTue, 06/12/2018 - 18:35

Sensex, ends 209 points, global cuesముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన కీలక భేటీ సక్సెస్ కావడంతో మదుపర్లు కొనుగోళ్ల వైపు ఆసక్తి కనబర్చారు. దీంతో నేటి మార్కెట్‌ 209.05పాయింట్లు మేర లాభపడగా.. నిఫ్టీ సూచీ కూడా 56 పాయింట్లు మేర లాభపడింది. ఈ రోజు ఉదయం  40 పాయింట్ల లాభంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం ప్రాంతంలో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇరు దేశాధినేతల మధ్య భేటీ విజయవంతం కావడం ప్రధానంగా మార్కెట్‌ సెంటిమెంట్‌కు బాగా కలిసొచ్చింది.

దీంతో దేశీయ సూచీలు ఆద్యంతం లాభాల్లోనే దూసుకెళ్లాయి. నిఫ్టీ 10,800 వద్ద బెంచ్‌ మార్క్‌ను నిలబెట్టుకుంది. సెన్సెక్స్‌ 209.05 పాయింట్లు లాభపడి 35,692.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 10,842.85 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లుపిన్‌, డా.రెడ్డీస్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ల్యాండ్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా లాభాలను పండించాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హిందాల్కో, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Updated By ManamMon, 06/11/2018 - 16:43

sensex, Nifty wipe off, gains in late selloff, end nearly flatముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతోనే ముగిశాయి. మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపడంతో మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 39.80పాయింట్లు లాభ పడగా.. నిఫ్టీ 19.30 పాయింట్లు లాభపడింది. ఈ రోజు ఉదయం సెన్సెక్స్‌ 29 పాయింట్ల లాభంతో 35,472 వద్ద ఆరంభం కాగా, బ్యాంకు, తదితర రంగాలకు సానుకూల ప్రభావంతో సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో దూసుకెళ్లింది. అటు నిఫ్టీ కూడా 10,800పాయింట్ల పైనే ట్రేడింగ్‌ను కొనసాగించింది. చివరిలో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపడంతో ఒత్తిడికి లోనైన సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.

మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 39.80 పాయింట్లు లాభపడి 35,483.47 మార్క్ వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 19.30పాయింట్లు లాభపడి 10,786.95వద్ద ముగిసింది. ఇక భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, డా.రెడ్డీస్‌ షేర్లు లాభాలు పండించగా, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఫ్లాట్‌‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Updated By ManamWed, 05/23/2018 - 10:37

Sensex, under pressure, global weakness; SBI, Cipla zoom 5% ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో బుధవారం దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 51 పాయింట్ల నష్టంతో 34,600 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 10,512 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు చమురు ధరలు పెరగడం, దేశీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌ ఆరంభం నుంచే మదుపర్లు దృష్టిపెట్టగా, ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న సూచీలు స్వల్ప నష్టాల్లో సాగుతున్నాయి. ఇక ఎస్‌బీఐ, టాటామోటార్స్‌ ఎన్టీపీసీ షేర్లు లాభాలు పండిస్తుండగా టాటాస్టీల్‌, ఇండస్‌ఇండస్‌ బ్యాంక్‌, రెడ్డీస్‌ల్యాబ్స్‌ తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు కరెన్సీ మార్కెట్‌లో రూపాయి 0.09 పైసల లాభంతో ప్రారంభమైంది.కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్: లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Updated By ManamTue, 05/15/2018 - 10:22

Sensex, Nifty, Tuesday, Karnataka election results ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఫలితాల ప్రభావం మంగళవారం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. కన్నడ ఓట్ల లెక్కింపుపై మదుపర్లు దృష్టిపెట్టడంతో స్టాక్‌మార్కెట్లలో మార్పులు హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది. ప్రీ ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమై అంతలోనే భారీ లాభాలబాటలో పయనించాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 35,707 వద్ద, నిఫ్టీ 32పాయింట్ల లాభంతో 10,839 వద్ద ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు ఫ్లాట్‌గానే ఉన్నాయి. ముఖ్యంగా మైనింగ్‌ షేర్లు నష్టపోతున్నాయి. ఈ రోజు ఉదయం 9.15 గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4 పాయింట్లు నష్టపోయి 35,552 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 10,794 వద్ద ట్రేడ్ అయింది.

ఇక పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, గెయిల్‌,  టాటా స్టీల్‌, టైటన్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3-1 శాతం  లాభపడుతుండగా,   టాటా మోటార్స్‌, ఇన్ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, ఐషర్‌, హెచ్‌పీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సిప్లా నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండటంతో ఒకవేళ బీజేపీ గెలిస్తే దేశీయ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Related News