Rishabh Pant

ధోనీకి అసలైన వారసుడు పంత్

Updated By ManamSat, 11/10/2018 - 05:50
  • మాజీ వికెట్ కీపర్ విజయ్ దహియా

rishabh-pantన్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోంది. అయితే డైనమిక్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ జాబితాలో ముందున్నాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఈ లెజెండ్ స్థానాన్ని భర్తీ చేయడానికి సెలెక్టర్లు నానా తంటాలు పడుతున్నారు. భుజం నొప్పి గాయం వల్ల వృద్ధిమాన్ సాహ దూరం కావడంతో పార్థివ్ పటేల్, దినేష్ కార్తీక్‌లకు సెలెక్టర్లు చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ వారిద్దరూ ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే ధోనీకి సరైన వారసుడు రిషబ్ పంత్ అని మాజీ వికెట్ కీపర్ విజయ్ దహియా అభిప్రాయపడ్డారు. ‘భారత జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే వాళ్లు ఆల్ రౌండర్ వికెట్ కీపర్ కోసం చూస్తున్నట్టుంది. పార్థివ్ పటేల్, దినేష్ కార్తీక్‌లకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ టెస్టుల్లో లభించిన అవకాశాన్ని రిషబ్ పంత్ సద్వినియోగం చేసుకున్నాడు. అతను మ్యాచ్ విన్నర్‌లా ఆడుతున్నాడు. పంత్ రూపంలో మనకు ఓ మంచి అవకాశం లభించింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను అంతకంతకు మెరుగైన ఆటను ప్రదర్శిస్తున్నాడు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడు. ఎంత ఎక్కువ అవకాశాలు అతనికిస్తే అంత మెరుగ్గా తయారవుతాడు. ఒకవేళ టెస్టు జట్టుకు సెలెక్టర్లు సాహా వైపు మొగ్గు చూపుతారేమో. కానీ నాకైతే అన్ని ఫార్మాట్లలో ధోనీకి పంత్ సరైన వారసుడని అనిపిస్తోంది’ దహియా అన్నారు.367 పరుగులకు టీమిండియా ఆలౌట్

Updated By ManamSun, 10/14/2018 - 12:38
  • వెస్టిండీస్‌పై 56 పరుగుల ఆధిక్యం

India vs West Indies: WI restrict India to 367, trail by 56 runs

హైదరాబాద్ : ఉప్పల్ టెస్ట్‌లో టీమిండియా 367 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 308/4 పరుగులు ఓవర్ నైట్ స్కోర్‌తో ఆదివారం ఉదయం బరిలోకి దిగిన టీమిండియా మరో 59 పరుగులు మాత్రమే చేసి, ఆలౌటైంది.

భారీ స్కోర్ చేసేందుకు టీమిండియా ఆటగాళ్లు ప్రయత్నించినప్పటికీ విండీస్ బౌలర్లు కట్టడి చేయడంతో స్వల్ప ఆధిక్యం మాత్రమే సాధించగలిగారు. మరోవైపు రిషబ్ పంత్ కూడా తృటిలో సెంచరీ అవకాశాన్ని మిస్ అయ్యాడు. 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గాబ్రియేల్ బౌలింగ్‌లో పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగటంతో టీమిండియా 350 పరుగులు చేసింది. ఇక విండీస్ బౌలర్లు హౌల్టర్ అయిదు, గాబ్రియెల్ మూడు, వారికన్ రెండు వికెట్లు తీశారు.చివరి మ్యాచ్‌లోనూ తప్పని ఓటమి

Updated By ManamWed, 09/12/2018 - 00:36
  • రాహుల్, పంత్ సెంచరీలు వృథా

  • 4-1తో సిరీస్ ఇంగ్లాండ్ వశం

panthలండన్: ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి ఐదో టెస్టులో కూడా భారత్‌కు ఓటమితప్పలేదు. 464 లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 345 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐతు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇంగ్లాండ్ 4-1తో సొంతం చేసుకుంది. భారత జట్టులో అసాధరణ  పోరాటం చేసిన రాహుల్ (149), రిషభ్ పంత్ (114) శతకాలు వృథా అయ్యాయి.  చివరి మ్యాచ్‌లో భారత్ 118 పరుగులతో ఓటమిపాలెంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ కు మూడు వికెట్లు దక్కాయి. మంగళవారం జరిగిన ఐదో రోజు ఆటలో ఓపెనర్ రాహుల్‌తో పాటు ఆరో డౌన్‌లో వచ్చిన యువ సంచలనం రిషభ్ పంత్ ఆసాధరణ ఆటతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ ఈజీగా మ్యాచ్‌ను గెలుచుకుంటుందనే సమయంలో వీరు కీలకమైన బ్యాటింగ్‌తో మ్యాచ్ రూపురేఖలను తారుమారు చేశారు. మ్యాచ్‌లో ఉత్కంఠతను నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకపడి సునాయాసంగా పరుగులను రాబట్టుకుంటూ స్కోరుబోర్డును పరిగెత్తిం చారు.  

అయితే చివరికి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 224 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్‌తో 149 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరుకున్నాడు. పంత్‌తో కలిసి ఆరో వికెట్‌కు 204 పరుగుల కీలకమైన భాగస్వా మ్యాన్ని నెలకొల్పాడు. మంగళవారం 58/3 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 120 పరుగుల వద్ద రహానే (37) వికెట్‌ను చేజార్చుకుంది. తర్వాత వచ్చిన హనుమా విహారి (0) ఖాతా తెరువకుండానే ఔటయ్యాడు. దీం తో భారత్ 121 పరు గులకే ఐదు వికెట్లు కోల్పోయి పీక్లతు కష్టాల్లో పడింది. అయితే ఈ సమ యంలో క్రీజులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో కలిసి ఓపె నర్ రాహుల్ మ్యాచ్‌ను ముందుకు సాగించాడు. వీరిద్దరు మరో వికెట్ పడ కుండా జాగ్రత్తగా ఆడుతు పరుగులను రాబట్టుకున్నారు. ఇద్దరు పోటీ పడి బౌండరీలు బాదుతూ ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఈ క్రమంలోనే రాహుల్ 118 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పంత్ కూడా అర్ధ శతకం బాదాడు. ప్రత్యర్థి కెప్టెన్ ఈ జంటను విడదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కలేదు. పంత్  వేగంగా ఆడుతూ సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ తన కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకొన్నాడు. మరోవైపు వీరు ఆరో వికెట్‌కు 200 పరుగులు పూర్తి చేసుకున్నారు. అయితే చివరికి రాహుల్‌ను 149 పరుగుల వద్ద రషీద్ ఔట్ చేశాడు. తర్వాత కొద్ది సేపటికే పంత్ కూడా 146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 114 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. తర్వాత భారత్ 94.3 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌటైపోయింది.భారత్ బ్యాటింగ్.. రిషబ్ ఎంట్రీ.. 

Updated By ManamSat, 08/18/2018 - 15:44
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 

  • ఆరంభమైన భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు

  • టెస్టుల్లోకి ఆరంగేట్రం చేసిన రిషబ్ పంత్ 

India vs England, 3rd Test Day 1, England opt to bowl, Rishabh Pantనాటింగ్‌హామ్‌: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ఇక్కడ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు ఆరంభమైంది. తొలుత టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్ జే రూట్‌ బౌలింగ్ ఎంచుకొని కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మూడో టెస్టు ద్వారా భారత యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ 291వ ఆటగాడిగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టాస్‌ వేయడానికి ముందు సహచర ఆటగాళ్ల సమక్షంలో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. పంత్‌‌కు టెస్టు క్యాప్‌ను అందించాడు. వరుసగా రెండు టెస్టుల్లో పరాజయం చవిచూసిన భారత జట్టు మూడో టెస్టులో జట్టులో మార్పులతో బరిలోకి దిగుతోంది.

చైనామన్ బౌలర్ కులదీప్ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాకు తుదిజట్టులో చోటు దక్కగా, మురళీ విజయ్ స్థానంలో ఓపెనర్‌గా శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్‌ పంత్‌‌కు చోటు దక్కింది. మరోవైపు రెండు టెస్టుల్లో వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇంగ్లండ్ జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లండ్ తుది జట్టులోకి బెన్ స్టోక్స్‌‌కు తిరిగి చోటు లభించింది. ఇప్పటికే రెండు టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో టెస్టులోనూ ఇంగ్లండ్ విజయం సాధిస్తే సిరీస్‌ను ఖాయం చేసుకున్నట్టే అవుతుంది. ఒకవేళ మూడో టెస్టులో భారత్ గెలిస్తే.. సిరీస్‌ను దక్కించుకునేందుకు మరో అవకాశం ఉంటుంది. నిర్ణయాత్మక ఈ టెస్టులోనైనా భారత్ గెలిచి సిరీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంటుందో లేదో చూడాలి.  

జట్లు:
భారత్: శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చతేశ్వర పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా. 

ఇంగ్లండ్: అలిస్టర్ కుక్, కీటన్ జెన్నింగ్స్, జోయ్ రూట్ (కెప్టెన్), ఒలై పోప్, జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్), జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, అడిల్ రషీద్, స్టార్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.ముంబై విలవిల.. ఢిల్లీ గెలుపు.. 

Updated By ManamSun, 05/20/2018 - 20:20
  • 11 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డేవిల్స్ గెలుపు.. ఢిల్లీ స్పిన్నర్ల ధాటికి ముంబై విలవిల.. 

IPL 2018, Delhi daredevils, Mumbai Indians, Rishabh Pant న్యూఢిల్లీ: ఐపీఎల్‌-11సీజన్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది. ఢిల్లీ బౌలర్ల స్పిన్నింగ్ ధాటికి ముంబై బ్యాట్స్‌మన్ చేతులేత్తేశారు.  

ఈ సీజన్‌లో  ఢిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ కథ ముగిసింది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ వరుసగా చేతులెత్తేశారు. లూయిస్ 7(48) మినహా ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేక చేతులేత్తేశారు. కట్టింగ్ (37), హర్దీక్ పాండ్యా (27), కెప్టెన్ రోహిత్ శర్మ (11) పరుగులు చేయగా మిగిలిన ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమై ఒకరితరువాత మరొకరు పెవిలియన్ బాటపట్టారు. ఢిల్లీ బౌలర్లలో సందీప్‌, అమిత్ మిశ్రా, హర్షల్ పటేల్ తలో మూడు వికెట్లు తీసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌ రేసులో ముంబై ఇండియన్స్‌ లక్ష్యం నెరవేరలేదు. ఈ మ్యాచ్‌లో ఓటమితో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

రెచ్చిపోయిన రిషబ్ పంత్.. హాఫ్ సెంచరీ
అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. దీంతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ ఓపెనర్లలో పృథ్వీ షా (12) రనౌట్ కాగా, మ్యాక్స్‌వెల్ (22) బుమ్రా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం (6) పరుగులకే మార్కండే బౌలింగ్‌లో హర్దీక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత వచ్చిన రిషబ్ పంత్, విజయ్ శంకర్ దూకుడుగా ఆడుతూ స్కోరులో వేగాన్ని పెంచారు. అందివచ్చిన బంతులను ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. రిషబ్ పంత్ (44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్) విజృంభించి 64 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఒక దశలో హర్దిక్ పాండ్య బౌలింగ్‌ రూపంలో పంత్ దూకుడుకు బ్రేక్ పడటంతో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి క్రీజునుంచి నిష్ర్కమించాడు. విజయ్ శంకర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్) 43 పరుగులు, అభిషేక్ శర్మ (15) పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో హర్దీక్ పాండ్యా, బుమ్రా, మార్కండే తలో వికెట్ తీసుకున్నారు.మంబై లక్ష్యం 175 పరుగులు

Updated By ManamSun, 05/20/2018 - 18:08
  • రెచ్చిపోయిన రిషబ్ పంత్.. హాఫ్ సెంచరీ పూర్తి

IPL 2018, Delhi daredevils, Mumbai Indians, Rishabh Pantన్యూఢిల్లీ: ఐపీఎల్‌-11సీజన్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. దీంతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ ఓపెనర్లలో పృథ్వీ షా (12) రనౌట్ కాగా, మ్యాక్స్‌వెల్ (22) బుమ్రా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం (6) పరుగులకే మార్కండే బౌలింగ్‌లో హర్దీక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

ఆ తరువాత వచ్చిన రిషబ్ పంత్, విజయ్ శంకర్ దూకుడుగా ఆడుతూ స్కోరులో వేగాన్ని పెంచారు. అందివచ్చిన బంతులను ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. రిషబ్ పంత్ (44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్) విజృంభించి 64 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఒక దశలో హర్దిక్ పాండ్య బౌలింగ్‌ రూపంలో పంత్ దూకుడుకు బ్రేక్ పడటంతో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి క్రీజునుంచి నిష్ర్కమించాడు. విజయ్ శంకర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్) 43 పరుగులు, అభిషేక్ శర్మ (15) పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో హర్దీక్ పాండ్యా, బుమ్రా, మార్కండే తలో వికెట్ తీసుకున్నారు.

Related News