mehreen

‘నోటా’కు రిలీజ్ డేట్ ఫిక్స్..?

Updated By ManamFri, 09/07/2018 - 12:26

NOTAసెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ విడుదలకు డేట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ 4వ తేదిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. దసరా రోజుల్లో అటు తెలుగు, ఇటు తమిళ్‌లో గట్టి పోటీగా ఉండటం వలన ఈ సినిమాను ముందుగానే విడుదల చేయడం మంచిదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సాధారణ యువకుడిగా, ముఖ్యమంత్రిగా కనిపించనున్న విషయం తెలిసిందే.బెల్లంకొండ సరసన మరో హీరోయిన్

Updated By ManamMon, 08/20/2018 - 12:55

Srinivas, Mehreenబెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌‌‌‌‌గా నటిస్తుండగా.. తాజాగా మరో ముద్దుగుమ్మ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. కృష్ణగాడి వీరప్రేమ గాథ, రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన మెహ్రీన్ ఈ చిత్రంలో భాగమైంది. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. అందులో ఆదివారం జాయిన్ అయ్యింది మెహ్రీన్. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది.‘ఎఫ్-2’లో పాల్గొన్న వరుణ్

Updated By ManamThu, 07/05/2018 - 10:48

f2 వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్-2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ గురువారం ప్రారంభమైంది. అందులో వరుణ్ తేజ్, హాస్యనటుడు ప్రియదర్శి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నిర్మాతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన్న తమన్నా నటిస్తుండగా.. వరుణ్ సరసన మెహ్రీన్ కనిపించనుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోసారి వివరణ ఇచ్చిన మెహ్రీన్

Updated By ManamTue, 07/03/2018 - 15:26

Mehreen పంతం ప్రమోషనల్‌ ఈవెంట్‌లో హీరోయిన్ల వ్యభిచారంపై మెహ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసిందంటూ ఇటీవల ఓ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా.. దాన్ని ఆ బ్యూటీ ఖండించింది. అసలు నేను ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ చేసింది మెహ్రీన్.

‘‘ఆ వార్త మొత్తం అబద్ధం. దానిపై నేను ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నాకు మీడియాతో మంచి అనుబంధం ఉంది, వాళ్లు కూడా నాతో బావుంటారు. నిజానికి ఇటీవల జరిగిన పంతం ప్రమోషనల్ కార్యక్రమానికి వైరల్ ఫీవర్ రావడంతో నేను హాజరుకాలేదు. ఆ సమయంలో ముంబైలో ఉన్నా.

యూఎస్‌లో ఏం జరిగిందో మరోసారి నిజం చెప్తున్నా. నా కుటుంబంతో కలిసి వీకెండ్ హాలీడే కోసం వాంకోవర్ నుంచి లాగ్ వెగాస్‌కు వెళ్లాను. ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నన్ను తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్‌గా గుర్తించారు. ఆ తరువాత ఇక్కడ ప్రయాణించడానికి కారణాలేంటి అని అడిగారు. ఆ సమయంలో వారు సెక్స్ స్కాండల్ గురించి చెప్పగా.. నేను మొదటిసారి వారి వద్దనే దాని గురించి విన్నాను. ఆ తరువాత నాకు, దానికి సంబంధం లేదని తెలుసుకున్న వారు క్షమాపణలు చెప్పి, మరోసారి ఇబ్బంది పడకుండా చేశాడు. దీని గురించి మరొకరు అవాస్తవాలు ప్రచురించకూడదనే ఉద్దేశ్యంతోనే మొదట నేనే బహిర్గతపరిచాను. ఆ సమయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. అయితే దీనిపై కొంతమంది చెడుగా రాయడం నన్ను బాధించింది. ఈ స్కాండల్‌లో ఉన్న వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారనే నేను నమ్ముతున్నా.

తెలుగు ప్రేక్షకుల కోసం నేను ఇంకా కష్టపడుతూ, నా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకే ప్రయత్నిస్తా. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం నాతో మంచిగా ఉంటుంది. దాన్ని చెడగొట్టుకునే ఉద్దేశం నాకు లేదు. ఇక ఈ విషయం గురించి నేను చెప్పే చివరి మాటలు ఇవే. ఇకపై నన్ను సంప్రదించకుండా, నేను చెప్పిన మాటలు అంటూ ఇష్టపూర్వకంగా రాయకండి’’ అని మీడియాను కోరుతున్నా అని మెహ్రీన్ తెలిపింది.

 మెహ‌రీన్‌ని ఇబ్బంది పెట్టిన ప్ర‌యాణీకుడు

Updated By ManamSat, 06/30/2018 - 09:05

mehreen తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న మెహ‌రీన్ కౌర్‌.. నోటా చిత్రంతో త‌మిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. విజ‌య్ దేవ‌ర కొండ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. జ్ఞాన‌వేల్ రాజా నిర్మాత‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం మెహ‌రీన్ చెన్నై వెళ్లాల్సి వ‌చ్చింది. కానీ ఫ్లైట్ టిక్కెట్ దొర‌క‌లేదు. నిర్మాత రైల్ టికెట్ అరెంజ్ చేశాడు. అయితే మెహ‌రీన్ బుక్ చేసుకున్న టికెట్‌లో ఓ ప్ర‌యాణీకుడు మందు కొట్టేసి ప‌డుకొనేశాడ‌ట‌. అత‌న్ని చూసిన మెహ‌రీన్ భ‌యంతో నిర్మాత‌కు ఫోన్ చేసి విష‌యాన్ని వివ‌రించింద‌ట‌. దాంతో నిర్మాత మెహ‌రీన్‌కి కారుని ఏర్పాటు చేసి చెన్నై వ‌చ్చే ఏర్పాటు చేశాడ‌ట‌. ఇలా ప్ర‌యాణీకులు తార‌ల‌ను ఇబ్బంది పెట్ట‌డం రైల్లోనే కాదు.. విమానాల్లో కూడా జ‌రుగుతుంది. కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది

Updated By ManamMon, 06/25/2018 - 10:28

Pantham యాక్షన్ హీరో గోపిచంద్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మెహ్రీన్ నటించింది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ‘‘కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది. ధర్మం వైపు నిలబడాలో, అధర్మం వైపు నిలబడాలో నిర్ణయం అప్పుడే తీసుకోవాలి’’, ‘‘పదవుండి చేస్తే పనిమంతుడు అంటారు. లేకుండా చేస్తే శ్రీమంతుడు అంటారు’’, ‘‘ఒక్కరికి మంచి జరగాలంటే ఫైల్ మీద పదిమంది సంతకాలు పెట్టే పద్దతి మారితే కానీ సామాన్యుడికి ఏ సాయం అందదు’’, ‘‘అవినీతి చేసిన ఓ నాయకుడిని అరెస్ట్ చేస్తే మాత్రం బంద్‌లు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కరు రోడ్డుకెక్కేస్తారు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్‌ను రా’’ అనే డైలాగ్‌లు అందరినీ మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌లతో సినిమాపై ఆసక్తిని పెంచిన గోపిచంద్ ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేశాడు. ఇక ఈ చిత్రాన్ని రాధామోహన్ నిర్మించగా.. గోపిసుందర్ సంగీతం అందించాడు.గోపిచంద్ ‘పంతం’ పెద్ద హిట్ కావాలి: మంత్రి 

Updated By ManamFri, 06/22/2018 - 12:43
pantham

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'పంతం'. ఎన్నో హిట్‌ చిత్రాలకు వర్క్‌ చేసిన ప్రముఖ రచయిత కె. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై అభిరుచి గల నిర్మాత కె.కె. రాధామోహన్‌ 'పంతం' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మిస్తున్నారు. హిట్‌ చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విజయవాడలో అశేష ప్రేక్షకాభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జూన్‌ 21న జరిగింది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'పంతం' చిత్రం జూలై 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మినిస్ట‌ర్ దేవినేని ఉమామహేశ్వర్‌రావు, ఎఫ్‌.డి.సి.చైర్మన్‌ అంబికా కృష్ణ, దేవినేని అవినాశ్‌, దేవినేని చందు, ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, గోపీచంద్‌ మలినేని, రత్నకుమార్‌, భాస్కర భట్ల, సంపత్‌ నంది, బాబీ, మెహరీన్‌, గోపీసుందర్‌, ప్రసాద్‌ మూరెళ్ల తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కార్య‌క్ర‌మానికి విచ్చేసిన దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేయ‌గా.. ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ తొలి ఆడియో సీడీని అందుకున్నారు. 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..  ''గోపీచంద్‌ను చూడగానే నాకు టి.కృష్ణగారు గుర్తుకు వచ్చారు. 1983-85 మధ్యలో కృష్ణగారు తెలుగుజాతి గర్వపడే సినిమాలు చేశారు. ఆయన తీసిన సినిమాలను నేటి సినిమా రంగం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన తెరకెక్కించిన ‘నేటి భారతం’, ‘రేపటి పౌరులు’, ‘వందేమాతరం’, ‘దేవాలయం’, ‘ప్రతిఘటన’ అద్భుతాలు. ఇప్పుడు గోపీచంద్‌ పంతం పట్టి సమాజాన్ని పీడించే సమస్యలను తన సినిమాలో చూపిస్తున్నారు. తన తండ్రిని స్ఫూర్తిని తీసుకుని గోపిచంద్ ఈతరం బ్యానర్‌ను బ్రతికించాలని కోరుతున్నాను. ఈ సినిమా డైరెక్టర్‌ చక్రవర్తిని, నిర్మాత రాధామోహన్‌గారిని, కెమెరామన్‌ ప్రసాద్‌ మూరెళ్ల, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ సహా ఎంటైర్‌ యూనిట్‌కి అభినందనలు. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి'' అంటూ ఆకాంక్షించారు. 

అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌.డి.సి చైర్మన్‌ అంబికా కృష్ణ మాట్లాడుతూ.. '' గోపీచంద్‌ గత ఆడియో ఫంక్షన్‌కి నేను వెళ్లినప్పుడు ఆంధ్రాలో ఓ షెడ్యూల్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలని కోరాను. సరేనని అప్పుడు మాట ఇచ్చిన గోపిచంద్ అన్న మాట ప్రకారమే ఆయన ఓ షెడ్యూల్‌ను వైజాగ్‌లో చిత్రీకరించారు. ఇదే పంతంతో మిగిలిన హీరోలు ఒకొక్క షెడ్యూల్‌ చేసినా ఇక్కడున్న వారికి అన్నం దొరుకుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే రాధామోహన్ మంచి నిర్మాత. ఓ బాధ్యత గల వ్యక్తి. చక్రవర్తి రూపంలో పెద్ద డైరెక్టర్‌ ఇండస్ట్రీకి రాబోతున్నాడు. ఈ సినిమా యూనిట్‌కు అభినందనలు'' అన్నారు. 

హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ.. ''ఈ సినిమా స్టార్ట్‌ కావడానికి ఇద్దరు వ్యక్తులు ముఖ్య కారణం. వారే ప్రసాద్‌ మూరెళ్ల.. రైటర్‌ రమేశ్‌ రెడ్డి. 'ఓ కుర్రాడి వద్ద మంచి కథ ఉంది. మీరు వినండి' అని వారు అనడంతో కథ విన్నాను. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే కథ బాగా నచ్చింది. 'కథ బాగా చెప్పావ్‌.. బాగా తీస్తావా?' అని అడిగాను. ఆరోజు ఏమైనా ఫీల్‌ అయ్యాడో ఏమో కానీ.. 'లేదు సార్‌.. అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను' అని అన్నాడు. చెప్పినట్లే అద్భుతంగా తీశాడు. నా 25 సినిమాల్లో ‘యజ్ఞం’ సినిమాలో మంచి మెసేజ్‌ ఉంటుంది. అలాంటి సినిమా ‘పంతం’. ఓ స్ట్రాంగ్‌ మెసేజ్‌ చెప్పగలిగానని నాకు తృప్తిగా ఉన్నాను. నాన్న చేసిన సినిమాల రేంజ్‌లో ఉంటుందని నేను చెప్పలేను. కానీ ఆ టింజ్‌ ఈ సినిమాలో ఉంటుంది. చాలా మంచి కథ. మేకింగ్‌లో రాధామోహన్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఆయన జెన్యూన్‌ ప్రొడ్యూసర్‌. గోపీసుందర్‌గారు అద్బుతమైన మ్యూజిక్‌ డైరెక్టర్‌. చాలా పెద్ద సంగీత దర్శకుడు. పాటలే కాదు.. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉంటుందనే నమ్మకం ఉంది. మెహరీన్‌ చాలా బాగా చేసింది. డేడికేటెడ్‌ నటి. తను ఇంకా మంచి సినిమాలు చేస్తుంది. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌'' అంటూ అన్నారు.

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. ''గోపీచంద్‌ 25వ చిత్రం. ప్రెస్టీజియస్‌ మూవీని నిర్మించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్‌. చక్రవర్తిగారు కథను చెప్పగానే నచ్చింది. చెప్పినట్లు చక్కగా తెరకెక్కించారు. గోపీసుందర్‌గారు బ్రహ్మాండమైన మ్యూజిక్‌ అందిచారు. ప్రసాద్‌ మూరెళ్లగారు, ఎ.ఎస్‌.ప్రకాశ్‌గారు, గోపీసుందర్‌గారు చక్కగా సపోర్ట్‌ చేశారు. అనుకున్న ప్లానింగ్‌లో సినిమాను పూర్తి చేసి జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మనదేశాన్ని పీడించే సమస్యను ఆధారంగా చేసుకుని సినిమాను చేశాం. చిన్న మెసేజ్‌తో పాటు కమర్షియల్‌ విలువలతో చేసిన సినిమా ఇది'' అన్నారు. 

చిత్ర దర్శకుడు కె.చక్రవర్తి మాట్లాడుతూ.., నేను ఒక యాక్షన్‌ సీన్‌ను రాసుకుంటే దానికి వందకు డెబ్బై మార్కులుంటే.. గోపీచంద్‌గారు యాక్ట్‌ చేసిన తర్వాత సీన్‌కు వందకు రెండు వందల మార్కులు వస్తాయి. ఈ సినిమాలో గోపిచంద్‌ను చూసే వారికి గూజ్‌బామ్స్‌ వస్తాయి. ఆయన డైలాగ్‌ చెబితే అంత మాన్లీగా ఉంటుంది. కొత్త దర్శకుడైనా నాకు 25వ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు‌. గోపీసుందర్‌ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చారు. భాస్కరభట్లగారు మంచి సాహిత్యాన్ని అందించారు. ప్రసాద్‌ మూరెళ్లగారు ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. ఆయన లేకంటే ఈ ప్రాజెక్ట్‌ సాధ్యమయ్యేది కాదు. అలాగే నా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌'' అంటూ చెప్పారు. ఇక హీరోయిన్ మెహ్రీన్, సంగీత దర్శకుడు గోపి సుందర్ తదితరులు మాట్లాడుతూ సినిమా అందరినీ మెప్పిస్తుందని అన్నారు.‘పంతం’ ఆడియో లాంచ్‌ ఎప్పుడంటే..!

Updated By ManamTue, 06/19/2018 - 13:54

pantham  గోపిచంద్ హీరోగా చక్రి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పంతం’. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా ఆడియో విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. జూన్ 21న విజయవాడలో పంతం ఆడియో వేడుక జరగనుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మెహ్రీన్ నటించింది. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు. జూలై 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు

Updated By ManamTue, 06/05/2018 - 11:25
Pantham

గోపిచంద్ హీరోగా చక్రవర్తి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పంతం’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఫుల్ యాక్షన్‌ సీన్స్‌తో వచ్చిన ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో గోపిచంద్ కొత్త లుక్‌లో కనిపించగా, గోపిసుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మెహ్రీన్ నటించగా, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, సంపత్, షాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్‌పై రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ‘ఎఫ్2’కి ముహుర్తం ఫిక్స‌యింది

Updated By ManamSun, 05/06/2018 - 22:48

f2విక్ట‌రీ వెంకటేశ్, మెగాహీరో వరుణ్‌తేజ్ క‌లిసి నటించ‌నున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇదిలా ఉంటే.. జూన్ మొదటివారంలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. అలాగే అదే నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. మంచి మెసేజ్‌తో పాటు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అనిల్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్స్‌గా నటించ‌నున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి.

Related News