Neevevaro

‘నీవెవ‌రో’ మూవీ రివ్యూ

Updated By ManamFri, 08/24/2018 - 14:32
Neevevaro

నిర్మాణ సంస్థ‌:  కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎంవీవీ సినిమా
న‌టీన‌టులు: ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్, వెన్నెల‌కిషోర్‌, తుల‌సి, శివాజీరాజా, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌న్‌, సప్త‌గిరి, ఆద‌ర్శ్, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు
సంగీతం: అచ్చు రాజామ‌ణి, ప్ర‌స‌న్
ర‌చ‌న‌, స‌మ‌ర్ప‌ణ‌:  కోన వెంక‌ట్‌
నిర్మాత‌:  ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌
ద‌ర్శ‌క‌త్వం:  హ‌రినాథ్‌
కెమెరా: సాయిశ్రీరామ్‌
క‌ళ‌: చిన్నా
కూర్పు: ప్ర‌దీప్ ఇ.రాఘ‌వ్‌
పోరాటాలు: వెంక‌ట్‌
విడుద‌ల తేదీ: 24.08.18

కొత్త క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని, వాటి కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డి మంచి ప్రాడెక్ట్ ని ప్రేక్ష‌కుల‌కు ఇవ్వాల‌న్న కాంక్ష మంచిదే. కేవ‌లం డ‌బ్బుల కోస‌మే సినిమాలు చేయ‌కుండా, ప్యాష‌న్‌తో సినిమాలు చేయ‌డ‌మూ మంచిదే. అలా మంచి పని చేస్తున్నారు ఆది పినిశెట్టి. ర‌విరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అయి పుష్క‌రం అవుతున్న సంద‌ర్భంగా మ‌ర‌లా హీరోగా ఆయ‌న న‌టించిన తెలుగు సినిమా `నీవెవ‌రో`. ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పించింది అనేది తెలుసుకోవాలంటే చ‌దివేయండి.

క‌థ‌:
అంద‌రిలాగే ఆరోగ్యంతో పుట్టిన కల్యాణ్ ( ఆది పినిశెట్టి) త‌న 15వ ఏట క‌ళ్లు పోగొట్టుకుంటాడు ఓ ప్ర‌మాదంలో. పోయింది క‌ళ్లే గానీ, సెల్ప్ కాన్ఫిడెన్స్ కాద‌న్న‌ది అత‌ని అభిప్రాయం. ఎవ‌రైనా అత‌ని ప‌ట్ల సానుభూతి చూపిస్తే అత‌నికి న‌చ్చ‌దు. అలాంటిది వెన్నెల (తాప్సీ) అత‌నికి అనుకోకుండా ద‌గ్గ‌ర‌వుతుంది. అను (రితికా) ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ప్ర‌య‌త్నించినా.. అందులోనూ ఏదో ఒక సానుభూతి అత‌నికి క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో క‌ల్యాణ్ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అత‌నికి చూపు తిరిగి వ‌స్తుంది. వెన్నెల తండ్రి తిల‌క్ వ‌చ్చి క‌ల్యాణ్ క‌లుస్తాడు. ఓ సంద‌ర్భంలో తిల‌క్ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అత‌న్ని గుర్తుప‌ట్టిన క‌ల్యాణ్ అది హ‌త్య అని తెలుసుకుంటాడు. ఆ హ‌త్య తాలూకు కూపీ లాగుతుంటే అత‌నికి వెన్నెల నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డుతుంది. ఇంత‌కీ వెన్నెల ఎవ‌రు? క‌ల్యాణ్ తెలుసుకున్న కొత్త నిజం ఏంటి?  వెన్నెల మెడ‌లో మూడు ముళ్లు వేశాడా?   లేకుంటే అనును పెళ్లి చేసుకున్నాడా అనేది ఆస‌క్తిక‌రం. 

ప్ల‌స్ పాయింట్స్
- న‌టీన‌టుల న‌ట‌న‌
- సంగీతం
- కెమెరా
- ఆర్ట్

మైన‌స్ పాయింట్లు
- క‌థ‌, క‌థ‌నం
- నెమ్మ‌దిగా సాగిన స్క్రీన్‌ప్లే
- సాగ‌దీత స‌న్నివేశాలు

Neevevaro

స‌మీక్ష‌
రీమేక్‌లు అన్నీ పండ‌వు. అన్నీ మెప్పించ‌వు. కానీ కొన్ని మాత్రం బావుంటాయి. అలా బావుంటుంద‌నుకుని కోన వెంక‌ట్ తెర‌కెక్కించిన సినిమా `నీవెవ‌రో`. త‌మిళంలో స‌క్సెస్ అయిన `అదే క‌న్‌గ‌ళ్‌` చిత్రానికి రీమేక్ ఇది. తెలుగు ఆడియ‌న్స్ టేస్ట్ కు త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేశారు. ఆది పినిశెట్టి చూపు లేకుండా, చూపు క‌లిగిన కుర్రాడిగా బాగా న‌టించాడు. తాప్సీ స‌హజంగా న‌టించింది. త‌న పాత్ర ప‌రిధిలో రితిక‌, స‌త్య కృష్ణ‌, తుల‌సి, శ్రీకాంత్ అయ్యంగార్‌, శివాజీరాజా, వెన్నెల కిశోర్‌, స‌ప్త‌గిరి.. అంద‌రూ మెప్పించారు. చాన్నాళ్ల త‌ర్వాత స‌ప్త‌గిరికి మంచి పాత్ర ప‌డ్డ‌ట్ట‌నిపించింది. న‌టీన‌టుల ప‌రంగా సినిమా ప‌క్కాగా బావుంది. కాక‌పోతే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విష‌యంలోనే ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకోవాల్సింది. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు చాలా ఉన్న‌ట్ట‌నిపించాయి. ఎడిట‌ర్ కొన్ని వేల గంట‌లు రూమ్‌లో కూర్చుని సినిమాను ఈ షేప్‌కు తెచ్చార‌ని అంతా తెగ‌పొగిడారు. మ‌రికొన్ని గంట‌లు ఎడిటింగ్ మీద దృష్టి పెట్టి ఉంటే బావుండేది. ఆర్ట్, కాస్ట్యూమ్స్, కెమెరా వ‌ర్క్ బావుంది. ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాస్త అటూ, ఇటూ త‌డ‌బ‌డ్డ‌ట్టు అనిపిస్తుంది. రీరికార్డింగ్ అక్క‌డ‌క్క‌డా అస‌లు అత‌క‌లేదు. ఎమోష‌న్స్ కొన్ని చోట్ల స‌రిగా పండ‌లేదు. అక్క‌డ‌క్క‌డా లాజిక్ కూడా మిస్ అయిన‌ట్టు అనిపించింది. మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ కి మాత్రం క‌నెక్ట్ అయ్యే సినిమా.
రేటింగ్: 2/5
బాట‌మ్ లైన్‌:  న‌త్త న‌డ‌క‌న‌.. `నీవెవ‌రో`.



‘నీవెవరో’కు సెన్సార్ పూర్తి

Updated By ManamTue, 08/21/2018 - 15:19

Neevevaroఆది హీరోగా హరినాథ్ తెరకెక్కించిన చిత్రం ‘నీవెవరో’. ఆగష్టు 24న ప్రేక్ష్కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తైంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రంలో ఆది అంధుడి పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన తాప్సీ, రితికా సింగ్ నటించారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ శ్యామ్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.



లిప్‌లాక్‌లకు సిద్ధ‌మా తాప్సీ

Updated By ManamTue, 08/14/2018 - 11:26

Taapseeద‌క్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఇమేజ్‌ను సంపాదించుకున్న కొద్ది మంది హీరోయిన్స్‌లో తాప్సీ ఒక‌రు. ఈ అమ్మ‌డు ఇప్పుడు ఓ త‌మిళ చిత్రంలో న‌టించ‌బోతుంది. ఇంత‌కు ఆ సినిమా ఏదో కాదు.. తెలుగు విజ‌య‌వంత‌మైన `ఆర్‌.ఎక్స్ 100`. ల‌వ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా..క‌ల్ట్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్, ఘాటైన లిప్‌లాక్‌లు కూడా ఉన్నాయి. పెర్ఫామెన్స్ ప‌రంగా తాప్సీ ఎక్క‌డా త‌గ్గ‌దు. ఆ విష‌యం తెలిసిందే. మ‌రి బోల్డ్ సీన్స్‌, లిప్‌లాక్స్‌లో తాప్సీ ఎలా న‌టిస్తుంద‌నేదే ఇప్పుడు విష‌యం. ఈ చిత్రంలో హీరోగా ఆది పిని శెట్టి న‌టించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ నుండి సినిమా సెట్స్‌కి వెళుతుంది. ఆది, తాప్సీ క‌లిసి న‌టించ‌బోయే మూడో చిత్ర‌మిది. 



‘నీవెవరో’కు విడుదల తేది ఖరారు

Updated By ManamWed, 08/01/2018 - 13:23

Neevevaroఆది పినిశెట్టి హీరోగా హరినాథ్ తెరకెక్కించిన చిత్రం ‘నీవెవరో’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి విడుదల తేదీని ఖరారు చేశారు. ఆగష్టు 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్, ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

కన్నడ చిత్రం ‘కంగల్‌’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది అంధుడి పాత్రలో కనిపించనుండగా.. ఆయన సరసన తాప్సీ, రితికా సింగ్ నటించారు. కోనవెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసేన్ సంగీతం అందిస్తున్నాడు. 



నీవెవరో ఫస్ట్‌లుక్ విడుదల

Updated By ManamFri, 07/06/2018 - 00:59

imageఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తోన్న చిత్రం  ‘నీవెవరో’.  కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు.

ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ ‘‘ముందు నుండి వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే నిర్మాణ సంస్థల్లో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా బ్యానర్‌లు ముందుంటున్నాయి. ఈ సంస్థలు మళ్లీ చేసిన నీవెవరో అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌లు ఈ సినిమాలో నటించడం సినిమా పెద్ద ఎసెట్. సినిమా తప్పకుండా ఎంగేజింగ్ థ్రిల్లర్ అవుతుంది’’  అన్నారు.

నిర్మాతలు కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ని విడుదల చేసి మా యూనిట్‌ను అభినందించిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివగారికి థాంక్స్. దర్శకుడు హరినాథ్ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఆది పినిశెట్టి మంచి బ్రేక్ ఇచ్చే మూవీగా ఇది నిలుస్తుంది. తాప్సీ, రితికా సింగ్ ఇలా ప్రతి ఒక క్యారెక్టర్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే మిగతా వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు



ఆది మూవీ టైటిల్‌ చెప్పేసిన నాని

Updated By ManamThu, 05/24/2018 - 12:50

neevevaro ‘లవర్స్’ ఫేం హరి నాథ్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్‌ను తాజాగా నాచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. ‘నీవెవరో’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సరసన తాప్సీ, రితికా కనిపించనున్నారు. కాగా పోస్టర్‌లో హీరో మధ్యలో ఉండగా.. అటు, ఇటు హీరోయిన్లు ఉన్నట్లు చేసిన డిజైన్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని ఎమ్‌వీవీ సత్యనారాయణ, కోనా వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఫ్రసన్ సంగీతాన్ని అందించనున్నాడు. 
 

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   





Related News