rana

యారీ.. ఓకే!

Updated By ManamSun, 11/11/2018 - 07:48

vijay‘నం.1 యారీ విత్ రానా’.. ఇది రానా టీవీలో హోస్ట్ చేస్తున్న చాట్ షో. ఈ షోకు పెద్ద పరిచయం అక్కర్లేదు.. కానీ పెద్దగా చర్చల్లోకి రాని షో.. సైలెంట్‌గా సాగుతున్న షో! అన్నీ తానై రానా నడిపిస్తున్న షో!! 

గెస్టులు వాళ్లే!
గతంలో తెలుగు బుల్లితెరపై ఎప్పుడూ ఇలాంటి షో ప్రసారం కాకపోయినప్పటికీ కొత్త పంథాలో కాకుండా రెగ్యులర్ షోల తరహాలోనే ఈ షో సాగుతోంది. తొలి సీజన్‌లో వచ్చిన అతిథులే ఎక్కువగా రిపీట్ అవుతుండడంతో.. నిజంగా చెప్పాలంటే ‘నం.1 యారీ’ చప్పగానే సాగుతోంది. తొలి సీజన్‌లో కాస్త హైప్ వచ్చినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవలేదు. ముఖ్యంగా రెండో సీజన్‌కి తగిన మైలేజ్ ఇవ్వలేదని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నాడు. హై-ఫై లైఫ్ స్టైల్, సెలబ్రిటీ లైఫ్ స్టైల్ అంటే అందరికీ ఆసక్తి ఉన్నప్పటికీ ప్రేక్షకుల నాడిని రానా షో ఇప్పటివరకూ ఆశించిన రీతిలో పట్టుకోలేక పోయింది. అంటే ప్రేక్షకులకు మనమేం చెప్పినా, చూపినా చూసేస్తారన్న.. టేకిట్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ ఈ షోలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రానా యాంకరింగ్ ఎనర్జిటిక్‌గా ఉందనడంలో సందేహం లేదు. అదే సమయంలో యాటిట్యూడ్ ఎక్కువ డోస్‌లో ఉందని షో చూస్తున్నంతసేపు అనిపించక మానదు. షోకు అతిథులుగా వచ్చిన వారిని రానా డామినేట్ చేసేయడం మరో డ్రాబ్యాక్. ఇక నాగచైతన్య వంటి గెస్టులు మాట్లాడుతున్నప్పుడు రానా పదేపదే జోక్యం చేసుకుని తనే ఎక్కువ మాట్లాడుతున్నారు. దాంతో ‘నం.1 యారీ’ వన్ మ్యాన్ షోగా కనిపిస్తోంది. గెస్టు, హోస్టు రెండూ తానే అనిపించుకొనే స్థాయిలో బుల్లితెరపై రానా సందడి చేసేస్తున్నారు.

బోల్డ్ థింగ్స్
ఇక ఈ షోలో భాగంగా అతిథులతో వ్యక్తిగత రహస్యాలు చెప్పించే పనిని రానా అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్నారు. స్వీట్ నథింగ్స్‌ను ఫ్రాంక్‌గా, బోల్డ్‌గా నోరు విప్పేలా చేయడంలో రానా యాంకరింగ్ సూపర్ అనిపించుకుంటోంది. తన ‘ఈజ్’తో రానా షోలో అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ తరచూ కొన్ని కుటుంబాలే అంటే మోహన్‌బాబు, రామానాయుడు, అక్కినేని, నందమూరి ఇలా కొన్ని కుటుంబాలకు చెందిన సెలబ్రిటీలే పదేపదే షోకు రావడం కాస్త రొటీన్‌గా, బోరింగ్ ఇంప్రెషన్ ఇస్తోంది. తొలి సీజన్‌లో మాదిరిగానే ఈ రెండో సీజన్‌లోనూ మొదట విజయ్ దేవరకొండ కనిపించేసరికి ప్రేక్షకులకు కొత్తదనమనే ఫీలింగ్ రావడం లేదు. పైపెచ్చు హిందీలోని ‘కాఫీ విత్ కరణ్’ వంటి షోలకు ఇది అచ్చుగుద్దినట్టు కాపీలా ఉండడంతో హిందీ ప్రోగ్రాంలు చూసేవారికి రానా షో షరా మామూలుగా అనిపించక తప్పదు. కరణ్ జోహర్ హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ షోలో కూడా పదేపదే కొంతమంది ప్రముఖ కుటుంబాలకు చెందిన నటులే అతిథులుగా వస్తుంటారు. 

కన్నడలో హిట్
‘నం.1 యారీ విత్ శివణ్ణ’ పేరుతో కన్నడ టీవీలోనూ ప్రసారమవుతున్న ఈ షోకు అక్కడ రేటింగులు బాగానే ఉన్నాయి. ప్రముఖ కన్నడ నటీనటులంతా శివరాజ్ కుమార్‌తో బాగానే చిందులేస్తూ, ఎంటర్‌టైన్‌మెంట్ పండిస్తున్నారు. పైపెచ్చు కిచ్చా సుదీప్ వంటి కన్నడ సూపర్‌స్టార్‌లు కూడా ఈ షోలో ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొంటుండ డంతో శివణ్ణ షో అక్కడ సూపర్ హిట్. కానీ రానా షో మాత్రం ‘అలా సాగుతోంది అంతే’ అనే స్థాయిలో ఉంది.. ముఖ్యంగా గెస్టుల కొరత ఉందేమో అనేలా తెలుగు యారీ బండి లాక్కొస్తున్నట్టు సగటు వీక్షకుడు భావిస్తున్నాడు. 
భార్గవి కరణం
 శర్వానంద్ ప్లేస్‌లో రానా..?

Updated By ManamThu, 11/01/2018 - 12:10

Sharwanand, Rana‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల తదుపరి చిత్రాన్ని శర్వానంద్‌తో తెరకెక్కించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి ‘విరాట పర్వం1992’ అనే టైటిల్‌ కూడా ఫిక్స్ అయ్యిందని, ఇందులో శర్వానంద్ సరసన సాయి పల్లవి ఫైనల్ అయ్యిందని టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి శర్వానంద్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో ఈ చిత్రం నుంచి శర్వానంద్ తప్పుకున్నాడట. దీంతో ఈ స్థానంలో దర్శకుడు రానాను సంప్రదించాడని సమాచారం. ఇక ఇందులో నటించేందుకు రానా ఆసక్తి చూపినట్లు సమాచారం. అలాగే హీరోయిన్‌గా సాయి పల్లవినే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.నానా పాటేకర్ ఔట్.. రానా ఇన్?

Updated By ManamWed, 10/24/2018 - 00:06

imageదేశవ్యాప్తంగా మీటూ ప్రకంపనలు కొనసాగుతున్నా యి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇది తీవ్రస్థాయిలో ఉంది. తమపై వచ్చిన ఆరోపణల కారణంగా కొందరు నటీనటులు తమంతట తామే సినిమాల నుంచి తప్పుకుంటున్నారు. మరికొందరి ని చిత్ర యూనిట్ తొలగిస్తోంది. ముఖ్యంగా ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రంపై ఆ ప్రభావం ఎక్కువ గా కనిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నానా పటేకర్, దర్శకుడు సాజిద్‌ఖాన్‌లను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించటంతో కొత్తవారిని వెతికే పనిలో ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే దర్శకుడిగా ఫర్హాద్ సంజినీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నానా పటేకర్ స్థానంలో రానా దగ్గుబాటి నటించనున్నారని సమాచారం. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది.‘బిగ్‌బాస్ 3’ హోస్ట్‌గా ఆ ముగ్గురిలో ఒకరు..?

Updated By ManamWed, 10/03/2018 - 10:03
Allu Arjun, Rana, Vijay Devarakonda

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆక్టటుకున్న రియాలిటీ షోలలో ‘బిగ్‌బాగ్’ ఒకటి. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యతలుగా వారి వారి స్టైల్‌లలో అందరినీ ఆకట్టుకున్నారు. కాగా తెలుగు ప్రేక్షకుల్లో ఈ షోకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా త్వరలోనే మూడో సీజన్‌ను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో హోస్ట్‌గా ఎవరు వస్తారా..? అని ఇటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వారిలో అల్లు అర్జున్, రానా, విజయ్ దేవరకొండ ఉన్నారు. కాగా వీరిలో రానాకు ఇప్పటికే ఒక షోకు హోస్ట్‌గా చేసిన అనుభవం ఉంది. అంతేకాదు అవార్డు ఫంక్షన్‌లలోనూ తన వ్యాఖ్యానంతో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో రానా వస్తే ఈ షోకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అనుకుంటున్నారట. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. యూత్‌లో అతడికి మంచి క్రేజ్ ఉంది. బిగ్‌బాస్‌ను ఆదరించేవారిలో యూత్ ఎక్కువగా ఉండటంతో విజయ్ దేవరకొండ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక వీరితో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ రేస్‌లో ఉన్నట్లు సమాచారం. సినిమాలలో అందరినీ మెప్పించే అల్లు అర్జున్‌ ఇంతవరకు ఏ షోకు హోస్ట్‌గా చేయలేదు. కానీ అతడికి ఉన్న క్రేజ్ అసాధారణం. అతడు హోస్ట్‌గా చేస్తే చూడాలని అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు అప్పట్లో బిగ్‌బాస్ రెండో సీజన్‌‌కు కూడా అల్లు అర్జున్‌ను వ్యాఖ్యాతగా వ్యవహరించమని నిర్వాహకులు అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో చేస్తే ఈ షోకు క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారట. చూడాలి మరి ‘బిగ్‌బాస్ 3’గా మొత్తానికి ఎవరిని ఫిక్స్ చేస్తారో..!‘ఏఎన్నార్‌’ స్వయంగా దిగివచ్చిరా?

Updated By ManamThu, 09/20/2018 - 17:38
ntr

‘ఎన్టీఆర్’ బయోపిక్ మీద రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. గతవారం ఎన్టీ రామారావు గెటప్‌లో ఉన్న బాలయ్య ఫస్ట్ లుక్, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా ‘లుక్’ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గురువారం ‘ఏఎన్నార్‌’ జయంతి సందర్బంగా ‘ఎన్టీఆర్’ బయో పిక్‌లో ఏఎన్నార్ క్యారెక్టర్‌‌‌లో నటిస్తున్న సుమంత్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే ‘ఏఎన్నార్‌’ స్వయంగా ఎన్టీఆర్ బయోపిక్ కోసమే దిగి వచ్చారా అనే అనుభూతి కలుగుతోంది. ఈ లుక్స్ అన్నింటిని  చూస్తుంటే ‘ఎన్టీఆర్’ బయోపిక్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

చదవండి:

 అచ్చు ‘అక్కినేని’లాగే.. ఆకట్టుకుంటున్న సుమంత్కలిసొచ్చిన మామా అల్లుడు

Updated By ManamThu, 09/13/2018 - 11:01

Chandrababu, Ranaవినాయక చవితి సందర్భంగా నందమూరి అభిమానులకు యన్‌టిఆర్ టీమ్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటివరకు ఎన్టీఆర్, చంద్రబాబులకు సంబంధించి విడివిడి లుక్‌లు బయటకి రాగా.. తాజాగా వారిద్దరు కలిసి ఉన్న ఓ లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో చంద్రబాబునాయుడుపై ఎన్టీఆర్ చేయి వేసి ప్రేమగా మాట్లాడుతున్నట్లు ఉంది. ఇక ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో విద్యాబాలన్, ప్రకాశ్ రాజ్, కైకాల సత్యనారాయణ, నరేశ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనుండగా.. కీరవాణి సంగీతం అందించాడు. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.చంద్రబాబుగా రానా.. ఫస్ట్‌లుక్ రిలీజ్

Updated By ManamWed, 09/12/2018 - 14:49

Rana ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. ఇందులో రానా, ఏపీ సీఎం, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబునాయుడు పాత్రలో నటిస్తున్నాడు. వినాయకచవితి సందర్భంగా అతడికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. అందులో అచ్చు చంద్రబాబును పోలి ఉండి, అందరినీ ఆకట్టుకుంటున్నాడు రానా. కాగా చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరిగా మంజిమా మోహన్ నటించనుంది. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.C/O కంచరపాలెం రివ్యూ

Updated By ManamFri, 09/07/2018 - 13:23
C/O Kancharapalem

చేసే ప్ర‌య‌త్నంలో నిజాయ‌తీ.. చెప్పాల‌నుకున్న దాన్ని సూటిగా, హ‌త్తుకునేలా ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు దాన్ని రీచ్ ఎక్కువ‌గా ఉంటుంది. అందుకు ప‌రిస్థితులు కూడా కూడి వ‌స్తాయి. ఇప్ప‌డు `కేరాఫ్ కంచ‌ర‌పాలెం` సినిమా విష‌యంలో అదే జ‌రుగుతుది. ద‌ర్శ‌కుడు వెంక‌టేశ్ మ‌హా ఓ మెయిన్ పాయింట్‌ను బేస్ చేసుకుని చివ‌రి వ‌ర‌కు రివీల్ చేయ‌కుండా నాలుగు జంట‌ల క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రించిన ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం. ఇంత‌కు కంచ‌ర‌పాలెంలో వెంక‌టేశ్ మ‌హా ఏం చెప్పాడు? అత‌ను చెప్పాల‌నుకున్న విష‌య‌మేంటి? అనే సంగ‌తుల‌ను తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం. 
నటీనటులు: సుబ్బారావు, రాధా బెస్సి,కార్తీక్‌ రత్నం, ప్రణీత పట్నాయక్‌,  మోహన్‌ భగత్‌, ప్రవీణ పరుచూరి,  కేశవ కర్రి, నిత్యశ్రీ గోరు తదితరులు.
బ్యాన‌ర్‌: సురేశ్‌ ప్రొడక్షన్స్‌  
సమర్పణ: రానా దగ్గుబాటి 
నిర్మాత: విజయ ప్రవీణ పరుచూరి 
దర్శకత్వం: వెంకటేశ్‌ మహా 
సంగీతం: స్వీకర్‌ అగస్థి 
కూర్పు: రవితేజ 
ఛాయాగ్రహణం: వరుణ్‌ చపేకర్‌, ఆదిత్య జవ్వాది 

క‌థ:
గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్‌లో అటెండ‌ర్‌గా ప‌నిచేసే రాజు(సుబ్బారావు)కి 49 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి కాదు. అదే ఆపీస్‌లో పెద్ద ఆఫీస‌ర్‌గా వ‌చ్చిన 42 రాధ‌(రాధా బెస్సి)కి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి ప్రేమ పుడుతుంది. అయితే అప్ప‌టికే రాధ‌కు ఇర‌వై యేళ్ల కూతురుంటుంది. త‌న కుటుంబం త‌న‌ను త‌ప్పుగా అనుకుంటుందేమోన‌ని, లోకం త‌న‌ను ఏమ‌నుకుంటుందోన‌ని రాజు ఆలోచ‌న‌లో ఉంటారు. 
ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దివే సుంద‌రం(కేశ‌వ కర్రి), త‌న క్లాస్ మేట్ సునీత‌(నిత్య‌శ్రీ గోరు)ని ఇష్ట‌ప‌డ‌తాడు. ముందు సుంద‌రంతో సునీత మాట్లాడ‌దు. సుంద‌రం తండ్రి బొమ్మ‌లు చేస్తుంటాడు. వినాయ‌క చ‌వితికి తండ్రి చేసి వినాయ‌కుడి బొమ్మ‌కు దండం పెట్టుకున్న రోజున సుంద‌రంతో సునీత మాట్లాడుతుంది. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో సునీత ఊరు విడిచి పెట్టి వెళ్లిపోతుంది. అప్పుడు సుంద‌రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు. ఆ నిర్ణ‌యం అత‌ని జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? జోసెఫ్‌(కార్తీక్ ర‌త్నం) అనాథ‌, అమ్మోరు అనే వ్య‌క్తి చెప్పిన వాళ్ల‌ని కొడుతూ చిన్న చిత‌కా ప‌నులు చేస్తుంటాడు. ఓ గొడ‌వ‌లో భార్గ‌వితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. గొడ‌వ‌తో ప్రారంభ‌మైన ఇద్ద‌రి ప‌రిచ‌యం ప్రేమ‌కు దారి తీస్తుంది. మ‌రి వీరి ప్రేమకు అడ్డుప‌డే విష‌యాలేంటి? వైన్ షాప్‌లో ప‌నిచేసే గ‌డ్డం(మోహ‌న్ భ‌గ‌త్‌).. స‌లీమా అనే ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె వేశ్య అని తెలిసినా పెళ్లిచేసుకోవాల‌నుకుంటాడు. చివ‌ర‌కు వారి జీవితం ఎలాంటి మ‌లుపు తిరిగింది? నాలుగు జీవితాలకు మెయిన్ పాయింట్ ఏంటోతెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:
నటీనటుల విషయానికి వస్తే.. నాలుగు జంటల్లో రాజు, రాధ జోడికి ఎక్కువ మార్కులు వేయాల్సిందే. ముఖ్యంగా సినిమాలో సందర్భానుసారం వచ్చే కామెడీ అంతా రాజు పాత్ర కారణంగా వచ్చిందే. పెళ్లి కానీ రాజు పాత్రలో సుబ్బారావు .. భర్త చనిపోయి కూతురున్నా మళ్లీ పెళ్లి చేసుకోవాలనే తల్లి పాత్రలో రాధ బెస్సి.. వేశ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే గడ్డం పాత్రలో మోహన్ భగత్.. ప్రేమించిన వాడి కోసం పరితపించే సలీమా పాత్రలో ప్రవీణ పరుచూరి, అనాథ అయిన జోసెఫ్ ప్రేమ కోసం బుద్ధిమంతుడిగా మారిపోతే.. ప్రేమించినా కులం కోసం ప్రేమను వదులుకునే బ్రాహ్మణ యువతి భార్గవిగా ప్రవీణ పట్నాయక్ చక్కగా నటించారు. వీరు తప్ప మరొకరు ఈ పాత్రలు చేయలేరనేంత చక్కగా నటించారు. వీరు నటన పరంగా సినిమాకు ఎంత ప్లస్ అయ్యారో అంతే మైనస్ కూడా ఉంది. ఆడియెన్ కొత్త ముఖాలను కనెక్ట్ చేసుకుని సినిమా చూడాలనుకోడు.. ఒకవేళ అలా అనుకోవాలంటే అందరూ కొత్తవాళ్లే కావడంత సినిమాకు సమయం పడుతుంది. ఇక దర్శకుడు వెంకటేశ్ మహా సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ప్రతి పాత్రను, సన్నివేశాన్ని నేటివిటీకి దగ్గరగా చిత్రీకరించాడు.  వరుణ్ చపేకర్, ఆదిత్య జవ్వాది కెమెరా వర్క్ కారణంగా ప్రేక్షకుడు ఆ నేటివిటీని ఫీల్ అవుతాడు. స్వీకర్ అగస్థి సంగీతం, నేపథ్య సంగీతం మెచ్చుకునేలా ఉంది. ఇలాంటి క‌థ‌, క‌థనాన్ని న‌మ్మి సినిమాను నిర్మించిన నిర్మాత విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి, సినిమాను ప్రేక్ష‌కుల‌కు చేర‌వేయ‌డానికి ముందుకు వ‌చ్చిన సురేశ్ ప్రొడ‌క్షన్స్ అభినందనీయులు. సినిమాలో ద‌ర్శ‌కుడు చెప్పిన పాయింట్‌లో కొత్త‌దనం లేదు. అయితే తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. స్లో నెరేష‌న్ వంటివి మిన‌హా సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. 
కేరాఫ్ కంచ‌ర‌పాలెం... కాన్సెప్ట్ పాత‌దే.. అయితే ప్ర‌య‌త్న‌మే కొత్త‌ది
రేటింగ్: 3/5‘ఆదాయి’గా అమలా.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్

Updated By ManamWed, 09/05/2018 - 15:03

Aadai

సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న కథలను ఎంచుకుంటున్న అమలా పాల్.. ‘మేయాధా మన్’ ఫేం రత్నకుమార్ దర్శకత్వంలో ‘ఆదాయి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను టాలీవుడ్ హీరో రానా విడుదల చేయగా.. అందులో అమలాపాల్ భయపడుతూ ఏడుస్తున్నట్లుగా ఉంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై ఫస్ట్‌లుక్‌తో అంచనాలను పెంచేసింది అమలాపాల్. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆ హిట్ చిత్రాన్ని రానా వదులుకున్నాడట

Updated By ManamWed, 09/05/2018 - 09:30

Rana Daggubatiకెరీర్ ప్రారంభం నుంచి విభిన్న పాత్రలు ఎంచుకుంటూ పలు భాషల్లో దూసుకుపోతున్న రానా ఓ హిట్ సినిమాను వదులుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ‘C/O కంచరపాలెం’ అనే చిత్రాన్ని రానా డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. ఈ మూవీ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ప్రమోషన్లో పాల్గొన్న రానా, తాను వదులుకున్న హిట్ చిత్రాన్ని తెలిపాడు.

ఇంతకు ఆ చిత్రం ఏంటని అనుకుంటున్నారా.. ‘పటాస్’. కల్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ కథను ముందు అనిల్ రావిపూడి రానాకు వినిపించారట. అయితే అప్పుడు బాహుబలి కమిట్‌మెంట్స్ ఉండటం వలన ఈ చిత్రాన్ని చేయలేనని చెప్పాడట. ఆ తరువాత అనిల్, కల్యాణ్ రామ్‌ను కలవడం, ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం, విడుదలయ్యాక హిట్ అవ్వడం.. ఇలా అన్నీ జరిగిపోయాయి. కాగా ఈ చిత్రం తమిళ్‌లో ‘మొట్ట శివ కెట్ట శివ’, కన్నడలో ‘పటాకి’, బెంగాళిలో ‘ఏసీపీ రుద్ర: ఆన్ డ్యూటీ’ అనే పేర్లతో రీమేక్ అయిన విషయం తెలిసిందే.

Related News