rana

హారర్ చిత్రంలో రానా

Updated By ManamThu, 03/15/2018 - 21:30

rana‘బాహుబలి’లో భల్లాలదేవగా అందరినీ మెప్పించాడు యువ నటుడు రానా దగ్గుబాటి. అందుకే ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న సినిమాలన్నింటిల్లోనూ.. ఏదో ఒక ప్రత్యేకతను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రానా. ఓ వైపు రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ‘1945’ చేస్తున్న ఈ యంగ్ హీరో.. మ‌రో వైపు మలయాళ చిత్రం ‘రాజా మార్తాండ వర్మ’లో టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. అలాగే ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘హథీ మేరే సాథీ’ అనే హిందీ చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం రాబిన్ హుడ్‌ టైగర్ నాగేశ్వరరావు బ‌యోపిక్ చేస్తున్నాడు.

వీటితో పాటు.. ఓ హారర్ చిత్రంలో నటించడానికి కూడా రానా ఆస‌క్తి చూపిస్తున్నాడట. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధార్థ్, ఆండ్రియా జంట‌గా ‘గృహం’ అనే హార‌ర్‌ సినిమాను తెర‌కెక్కించిన‌ మిలింద్ రావ్ ద‌ర్శ‌క‌త్వంలో రానా ఓ హారర్ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయని ఫిలింనగర్ వర్గాల టాక్.రానా.. నెల రోజులు అడ‌వుల్లోనే

Updated By ManamTue, 03/06/2018 - 21:10

rana'బాహుబ‌లి' సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ న‌టుడు రానా. ప్ర‌స్తుతం ఆయ‌న చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. వాటిలో బ‌హుభాషా చిత్రం 'హాథీ మేరే సాథీ' ఒక‌టి. 1971లో వ‌చ్చిన అదే పేరు గ‌ల హిందీ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని జంగిల్ ఐలాండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని రానా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలియ‌జేశారు. ''థాయ్‌లాండ్ జంగిల్ ఐలాండ్ నుంచి హ‌లో చెబుతున్నా. రాబోయే నెల రోజుల పాటు అడ‌వుల్లోనే షూటింగ్‌తో బిజీగా ఉండబోతున్నాను'' అంటూ రానా ట్వీటారు.  త‌మిళ ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది దీపావ‌ళికి తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.రానా 'మార్తాండ వ‌ర్మ' ప్రారంభ‌మైంది

Updated By ManamMon, 01/29/2018 - 22:01

ranaన‌టుడిగా రానా ప్ర‌యాణం మొద‌లై ఎనిమిదేళ్లు పూర్తి కావ‌స్తోంది. ఈ ఎనిమిదేళ్ళ‌లో న‌టుడిగా చాలానే ప‌రిణ‌తి సాధించారు ఈ ద‌గ్గుబాటి వారి వార‌సుడు. త‌న‌కు న‌చ్చిన‌, న‌ప్పే పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ.. కేవ‌లం తెలుగు సినిమాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ్‌, హిందీ చిత్రాలు కూడా చేస్తూ ముందుకెళుతున్నారు రానా. 'బాహుబ‌లి' చిత్రాల‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా.. తాజాగా ఓ మ‌ల‌యాళ చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. కె.మ‌ధు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మ‌ల‌యాళ చిత్రం.. ట్రావెన్ కోర్ రాజు మార్తాండ వ‌ర్మ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోంది. 1729 - 1758 వ‌ర‌కు అంటే 29 సంవ‌త్స‌రాల పాటు ట్రావెన్‌కోర్ ప్రాంతాన్ని ప‌రిపాలించిన చ‌క్ర‌వ‌ర్తిగా మార్తాండ వ‌ర్మ చ‌రిత్ర‌లో నిలిచారు. మ‌రి అలాంటి చ‌క్ర‌వ‌ర్తి క‌థ‌తో తెర‌కెక్కుతున్న సినిమాతో.. మాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న రానా.. అక్క‌డి సినీ చ‌రిత్ర‌లో త‌న‌దైన సంత‌కం చేస్తారేమో చూడాలి. 
 రానా జ‌స్ట్ ఫ్రెండ్: ర‌కుల్‌

Updated By ManamSat, 01/27/2018 - 21:05

rakul, ranaసెల‌బ్రిటీల విషయంలో పుకార్లు సహజమే. అందులోనూ.. సినిమా నటీనటుల గురించి ప్రేమ వ్య‌వ‌హారాల పేరిట వ‌చ్చే పుకార్లు మరింత స‌హ‌జం. గ‌త కొంత‌కాలంగా ఇలాంటి పుకార్లు.. రానా, రకుల్ ప్రీత్ సింగ్ చుట్టూ షికారు చేస్తున్నాయి.  వీటికి తాజాగా ర‌కుల్ స్పందించింది. ''ప్రేమ వ్య‌వ‌హారానికి సంబంధించిన పుకార్లు.. మా (రకుల్‌, రానా) దాకా వచ్చాయి. అయితే.. వాటిని త‌లచుకుని మేం న‌వ్వి ఊరుకున్నాం. రానాకి, నాకు మ‌ధ్య ఉండేది.. స్నేహ బంధం మాత్ర‌మే. హైదరాబాద్‌లో మా ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే ఉంటాయి. అందుకే నాకు ఏ చిన్న‌ అవసరం వచ్చినా.. రానా ముందుంటాడు. నాకు ఈ సిటీలో ఉన్న 15 నుంచి 20 మంది స్నేహితులలో రానా ఒకడు. అయితే.. మా స్నేహితుల బృందంలో ఇంకా ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఒంట‌రిగా ఉన్నాము. అందువ‌ల్లే కలిసి కొంత సమయం గడుపుతుంటాం. అది చూసి.. మా మ‌ధ్య ల‌వ్ ఎఫైర్ ఉంద‌ని పొర‌పాటు ప‌డిఉంటే.. దానికి ఏమీ చేయలేం క‌దా’' అని వివ‌ర‌ణ ఇచ్చింది రకుల్‌.

ఇదిలా ఉంటే.. రకుల్ కథానాయికగా నటించిన హిందీ సినిమా ‘అయ్యారీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా న‌టించిన ఈ సినిమాకి నీరజ్‌ పాండే దర్శక‌త్వం వ‌హించారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుద‌ల కానుంది. త‌మిళంలో సూర్య‌, కార్తీతో సినిమాలు చేస్తోంది రకుల్ .భల్లాలదేవుడి కొత్త ఫ్రెండ్‌ను చూశారా..?

Updated By ManamTue, 12/26/2017 - 10:27

భల్లాలదేవుడి జట్టులోకి కొత్త ఫ్రెండ్ వచ్చాడు. ఇంకేముంది ఆ ఫ్రెండ్‌తో ఫొటో తీసుకొని అతడిని అందరికీ పరిచయం చేశాడు రానా. ఇంతకు ఎవరా ఫ్రెండ్ అనుకుంటున్నారా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్.
Rana, Allu Ayaan

క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌ ఫ్యామిలీతో లంచ్‌ను చేశాడు రానా. ఈ సందర్భంగా అల్లు అయాన్‌ను తన ఒడిలో కూర్చొబెట్టుకొని సెల్ఫీ తీసుకున్నాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.., "క్రిస్మస్ లంచ్‌లో జూనియర్ బన్నీతో నేను. ఇదంతా చూస్తుంటే నా స్నేహితులు చాలా యంగ్‌గా తయారవుతున్నారు" అంటూ రానా కామెంట్ పెట్టాడు . ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.


 
 ప్ర‌వీణ్ స‌త్తారు.. '3 క‌జిన్స్‌'?

Updated By ManamThu, 12/07/2017 - 15:58

praveen'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు. త్వ‌ర‌లోనే సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌ని ఆయ‌న తెర‌కెక్కించ‌నున్నారు. అలాగే నితిన్ హోమ్ బేన‌ర్ శ్రేష్ట్ మూవీస్‌లోనూ ఓ సినిమా చేయ‌బోతున్నారు ప్ర‌వీణ్. ఇటీవ‌లే దీని గురించి నితిన్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, '3 క‌జిన్స్' అనే పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయ‌కులు న‌టించ‌నున్నార‌ని స‌మాచార‌మ్‌. ఇప్ప‌టికే నితిన్‌, రానా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యార‌ని.. మ‌రో హీరోగా నారా రోహిత్‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది.   దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.తాజా షెడ్యూల్‌లో రానా చిత్రం

Updated By ManamTue, 11/28/2017 - 16:35

rana'బాహుబ‌లి' సిరీస్‌లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించి మెప్పించిన రానా.. ఇటీవ‌లే 'నేనే రాజు నేనే మంత్రి'తో క‌థానాయ‌కుడిగా విజ‌యాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ‘క్షణం’ డైరెక్టర్ రవికాంత్ పెరెపు డైరెక్షన్‌లో రానా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్‌తో పాటు కన్నడ తారలు శ్రద్ధ శ్రీనాథ్, సంయుక్త హోర్నాడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవ‌ల‌ ఈ మూవీ సెకండ్‌ షెడ్యూల్.. హైదరాబాద్‌లో మొదలైంది. సంయుక్త హోర్నాడ్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రకాష్ రాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉలవచారు బిరియాని’ (2014) సినిమాతో సంయుక్త తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే తెలుగులో మొదటిసారి నటిస్తున్న శ్రద్ధ శ్రీనాథ్.. మ‌ల‌యాళ 'ప్రేమ‌మ్' ఫేమ్ నివిన్ పౌలీ న‌టించిన‌ త‌మిళ చిత్రం ‘రిచీ’లో హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల కానుంది.

 అమరావతిలో ‘పద్మావతి’ సందడి

Updated By ManamSun, 11/19/2017 - 20:44

deepika padukone, rana, vijaywadaనవ్యాంధ్ర రాజధాని అమరావతిలో బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనె సందడి చేసింది. టాలీవుడ్ యువ హీరో రానాతో కలిసి హల్‌చల్ చేసింది. విజయవాడలో జరిగిన సోషల్ మీడియా సమ్మిట్‌లో ఇరువురు నటులు పాల్గొని అభిమానుల్ని అలరించారు. ఈ సందర్భంగా రానా, దీపికలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకముందు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో గన్నవరం చేరుకున్న దీపికను ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు.రాజ్‌త‌రుణ్‌తో 'అలా ఎలా' ద‌ర్శ‌కుడు

Updated By ManamWed, 10/18/2017 - 13:08

2014, న‌వంబ‌ర్ 28న  చిన్న చిత్రంగా విడుద‌లై స‌ర్‌ఫ్రైజ్ హిట్‌గా నిలిచింది 'అలా ఎలా?' మూవీ. 'కుమారి 21 ఎఫ్‌'తో క్రేజీ హీరోయిన్‌గా మారిన హెబ్బా ప‌టేల్‌.. ఈ సినిమాతోనే తెలుగులో తొలి అడుగులు వేసింది. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. 'అలా ఎలా?' త‌రువాత అనీష్ కృష్ణ నుంచి మ‌రో సినిమా రాలేదు. మ‌ధ్య‌లో రానాతో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించిన‌ప్ప‌టికీ.. అది వ‌ర్క‌వుట్ కాలేదు.

కాగా, హ్యాట్రిక్ హీరో రాజ్ త‌రుణ్‌తో అనీష్ కృష్ణ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. అనీష్‌కి క‌లిసొచ్చిన న‌వంబ‌ర్ నెల‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచార‌మ్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

Related News