amyra dastur

కేరాఫ్ ఫిమేల్ డైరెక్ట‌ర్స్

Updated By ManamMon, 05/21/2018 - 20:48

c/o female directorsచిత్ర ప‌రిశ్ర‌మ‌.. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లాగే స్ప‌ష్టంగా పురుషాధిక్యం ఉన్న ప‌రిశ్ర‌మ‌. తార‌ల విష‌యం ప‌క్క‌న‌పెడితే.. టెక్నీషియ‌న్లలో స్త్రీలు చాలా త‌క్కువ మంది క‌నిపిస్తుంటారు. అందుకు త‌గ్గ‌ట్టే.. 'కెప్టెన్ ఆఫ్ ది షిప్‌'గా భావించే డైరెక్ట‌ర్‌లుగా స్త్రీలు క‌నిపించ‌డం అరుదు. అయిన‌ప్ప‌టికీ.. అడ‌పాద‌డ‌పా కొంత‌మంది ఫిమేల్ డైరెక్ట‌ర్స్ సంద‌డి చేస్తూనే ఉన్నారు. వీరిలో కొంతమంది సంచ‌ల‌న విజ‌యం అందుకున్న‌వారు ఉన్నారు. అలాంటి ఫిమేల్ డైరెక్ట‌ర్స్‌తో త‌రుచుగా సినిమాలు చేస్తూ కొంత‌మంది క‌థానాయిక‌లు వార్త‌ల్లో నిలుస్తున్నారు. వారి వైపు కాస్త దృష్టి సారిస్తే..

దీపికా ప‌దుకొనే

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో అత్య‌థిక పారితోషికం తీసుకుంటున్న క‌థానాయిక దీపికా ప‌దుకొనే. క‌న్న‌డ చిత్రంతో ఈమె కెరీర్ మొద‌లైనా.. ద‌శ, దిశ మారింది మాత్రం బాలీవుడ్ మూవీ 'ఓం శాంతి ఓం'తోనే. నృత్య ద‌ర్శ‌కురాలు ఫ‌రా ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో.. ఆ త‌రువాత దీపికా వెనుతిరిగాల్సిన అవ‌స‌రం రాలేదు. ఈ చిత్రం త‌రువాత కూడా దీపిక 'హ్యాపీ న్యూ ఇయ‌ర్' చిత్రం కోసం ఫ‌రా డైరెక్ష‌న్‌లో నటించారు. అలాగే ర‌జ‌నీకాంత్ కుమార్తె సౌంద‌ర్య రూపొందించిన త‌మిళ చిత్రం 'కోచ‌డైయాన్'లోనూ దీపికా న‌టించారు. 

నిత్యా మీన‌న్

ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ క‌థానాయిక‌గా సంద‌డి చేసిన కేర‌ళ కుట్టి నిత్యా మీన‌న్. క‌న్న‌డ‌లో మిన‌హాయిస్తే.. మిగిలిన అన్ని భాష‌ల్లోనూ మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేశారు నిత్య‌. తెలుగులో ఆమె తొలి చిత్రం 'అలా మొద‌లైంది'.. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ సినిమా త‌రువాత‌ నిత్య ఇక వెనుతిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు. నందిని మ‌రో  చిత్రం 'జ‌బ‌ర్‌ద‌స్త్'లో అతిథి పాత్ర పోషించారు. అలాగే.. అంజ‌నా ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ చిత్రం 'వెప్పమ్‌' (సెగ‌) చేశారు. అదేవిధంగా.. శ్రీ‌ ప్రియ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన త‌మిళ చిత్రం 'మాలిని 22 ప‌ల‌యం కోట్టై' (ఘ‌ట‌న‌)లోనూ న‌టించారు. ఇక మ‌ల‌యాళంలో అంజ‌లీ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'బెంగ‌ళూరు డేస్‌'లోనూ నిత్య సంద‌డి చేశారు. ఇలా.. త‌న కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేశారు నిత్య.

న‌జ్రీయా న‌జీమ్

త‌మిళ అనువాద చిత్రం 'రాజా రాణి'తో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన క‌థానాయిక న‌జ్రీయా న‌జీమ్. మ‌ల‌యాళం, త‌మిళ చిత్రాల్లో సంద‌డి చేసిన న‌జ్రీయాకి.. మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసిన చిత్రాలు న‌టిగా మంచి పేరు తీసుకువ‌చ్చాయి. ముఖ్యంగా న‌జ్రీయా కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన 'బెంగ‌ళూరు డేస్‌'కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది ఫిమేల్ డైరెక్ట‌ర్ అంజ‌లీ మీన‌న్‌నే. సెన్సేష‌న‌ల్ హిట్ అయిన ఈ చిత్రంలో త‌న‌కు జోడీగా న‌టించిన ఫ‌హ‌ద్ ఫాజిల్‌నే నిజ‌జీవితంలో పెళ్ళి చేసుకున్న న‌జ్రీయా.. పెళ్ళ‌య్యాక సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఇటీవ‌లే మ‌ళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన న‌జ్రీయా.. అంజ‌లీ మీన‌న్ చిత్రంతోనే  రీ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. ఆమె క‌థానాయిక‌గా న‌టించిన తొలి చిత్రం 'మ్యాడ్ డాడ్'కి కూడా మ‌హిళా ద‌ర్శ‌కురాలు (రేవ‌తి ఎస్‌.శ‌ర్మ‌) డైరెక్ష‌న్ చేయ‌డం విశేషం.

అలియా భ‌ట్‌

అన‌తికాలంలోనే బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ క‌థానాయిక అలియా భ‌ట్‌. తాజాగా 'రాజీ' చిత్రంతో ఈ ముద్దుగుమ్మ సంద‌డి చేశారు. మేఘ‌నా గుల్జార్ రూపొందించిన ఈ సినిమా.. అలియాకి న‌టిగా మ‌రింత గుర్తింపు తీసుకువ‌చ్చింది. ఈ చిత్రానికి కంటే ముందే 'డియ‌ర్ జింద‌గీ' కోసం మ‌రో మ‌హిళా ద‌ర్శ‌కురాలు గౌరీ షిండేతో క‌లిసి ప‌నిచేశారు అలియా. ప్ర‌స్తుతం మ‌రో మ‌హిళా ద‌ర్శ‌కులు జోయా అఖ్త‌ర్ డైరెక్ష‌న్‌లో 'గ‌ల్లీ బాయ్స్' చిత్రం చేస్తున్నారు.  

అమైరా ద‌స్తూర్

త‌మిళ అనువాద చిత్రం 'అనేకుడు'తో ప‌రిచ‌య‌మైన క‌థానాయిక అమైరా ద‌స్తూర్.  ఈ ఏడాది ఆరంభంలో విడుద‌లైన 'మ‌న‌సుకు న‌చ్చింది' చిత్రంతో ఈ ముద్దుగుమ్మ‌ తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేరుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ సినిమాతోనే సూప‌ర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌కురాలిగా  ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ చిత్రం ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇదే ఏడాది మ‌హిళా ద‌ర్శ‌కులు రూపొందించిన మ‌రో రెండు సినిమాల‌తో అమైరా సంద‌డి చేయ‌నున్నారు. సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ త‌రుణ్‌కు జోడీగా అమైరా న‌టించిన 'రాజు గాడు' చిత్రం జూన్ 1న విడుద‌ల కానుండ‌గా.. లీనా యాద‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'రాజ్మా చావ‌ల్' ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానుంది.                                                   -మ‌ల్లిక్ పైడి

 

 



ఆ హెయిర్ స్టైల్ ఫాలో అయిన అమైరా

Updated By ManamSun, 05/06/2018 - 17:40

amyraaత‌మిళ అనువాద చిత్రం 'అనేకుడు'తో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన అమైరా ద‌స్తూర్‌.. ఆ త‌రువాత మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాతో సంద‌డి చేసింది. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘రాజుగాడు’ పైనే ఆశలు పెట్టుకుంది ఈ అమ్మడు. రాజ్ తరుణ్ హీరోగా అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంతో సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ నెల 11న విడుదల కావలసిన ఈ చిత్రం.. జూన్ 1కి వాయిదా ప‌డింది.

amyraaఇదిలా ఉంటే.. ‘రాజ్మా చావల్’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తోంది అమైరా. లీనా యాదవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ రెబల్ పాత్రలో కనిపించడమే కాకుండా.. ఓ డిఫరెంట్ లుక్‌తో ఆకట్టుకోనుంది ఈ ముద్దుగుమ్మ‌. అందులో భాగంగా.. హాలీవుడ్ నటి రూనీ మారా నటించిన ‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ సినిమాలోని వైవిధ్యమైన హెయిర్ స్టైల్‌ని ఫాలో అవుతోంది అమైరా. ఇదే స‌మ‌యంలో.. సాధారణమైన అమ్మాయి పాత్రలో నటించిన ‘రాజుగాడు’ సినిమా కోసం విగ్ పెట్టుకోవలసిన అవసరం వచ్చింది. మొత్తానికి..  ఒకే స‌మ‌యంలో చేయాల్సిన రెండు సినిమాల కోసం అమైరా లుక్స్‌ విష‌యంలో బాగానే శ్ర‌ద్ధ తీసుకుందన్న‌మాట‌. మరి ఇటు ‘రాజుగాడు’, అటు ‘రాజ్మా చావల్’తో అమైరా ప్రేక్షకులని ఏమాత్రం అల‌రిస్తారో చూడాలి. 



రాజ్ తరుణ్ 'రాజు గాడు' వాయిదా ప‌డింది

Updated By ManamSun, 05/06/2018 - 15:02

rajugaaduయువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్ న‌టించిన తాజా చిత్రం 'రాజుగాడు'. అమైరా ద‌స్తూర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్ర‌సాద్ ఓ కీల‌క పాత్ర పోషించారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంజనా రెడ్డి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. గోపీసుంద‌ర్ స్వ‌ర‌క‌ర్త‌. నిర్మాణ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాని తొలుత మే 11న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా వాయిదా ప‌డింది. జూన్‌ 1న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. కాగా.. ఈ సినిమా ఆడియో లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల‌ మూడవ వారంలో జరుపనున్నారు.

నాగినీడు, రావు రమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి కథ: ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, ఆర్ట్: కృష్ణ మాయ, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్.



కంగ‌నా చిత్రంలో అమైరా ద‌స్తూర్‌

Updated By ManamTue, 03/20/2018 - 16:36

amyraaబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘మెంటల్ హై క్యా’. ఈ చిత్రంతో నేషనల్ అవార్డు గ్రహీత ప్రకాశ్‌ కోవెలమూడి బాలీవుడ్‌లోకి దర్శకుడిగా  అడుగుపెడుతున్నారు. హాస్య ప్ర‌ధానంగా సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌కు కథ, మాటల‌ను ప్రకాశ్‌ సతీమణి కనిక థిల్లాన్ అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలతో.. ఇప్ప‌టికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది ఈ చిత్రం. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావ్‌కు జంటగా అమైరా దస్తూర్ నటించనుందని సమాచారం. ఈ నేపథ్యంలో.. చిత్ర బృందం అమైరాను సంప్రదించినట్టు తెలుస్తోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.



'రాజుగాడు' టీజ‌ర్ వ‌చ్చేసింది

Updated By ManamSun, 03/18/2018 - 15:20

raju gaaduరాజ్ త‌రుణ్‌, అమైరా ద‌స్తూర్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'రాజుగాడు'. రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ధారి. సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ రోజు (ఆదివారం) ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఆద్యంతం వినోద‌భ‌రితంగా ఈ టీజ‌ర్ ఉంది. ఇందులో క్లెప్టోమానియా (త‌న‌కు తెలియ‌కుండానే త‌ను దొంగ‌త‌నం చేసేయ‌డం) అనే విచిత్ర‌మైన వ్యాధి ఉన్న యువ‌కుడి పాత్ర‌లో రాజ్ త‌రుణ్ న‌టిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం మే 11న విడుద‌ల కానుంది.



'మ‌న‌సుకు న‌చ్చింది'..'రేయ్ ఇదే నీ జాగా' ప్రోమో

Updated By ManamSat, 01/06/2018 - 16:22

manasuku nacchindiసందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్, త్రిధా చౌద‌రి హీరోహీరోయిన్లుగా ఘ‌ట్ట‌మ‌నేని మంజుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ చిత్రం 'మ‌న‌సుకు న‌చ్చింది'. ర‌థ‌న్ సంగీత‌మందించిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, ఇందిరా ప్రొడక్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి.  కాగా, ఇటీవ‌ల ఈ చిత్రంలోని 'ప‌రిచ‌య‌ము లేదా', 'ఓ పిల్లా' పాట‌ల‌ను విడుద‌ల చేశారు. వీటికి మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా,  ఈ రోజు (శ‌నివారం) 'రేయ్ ఇదే నీ జాగా' అనే పాట ప్రొమోని విడుద‌ల చేశారు. స్నేహం, ప్రేమ అనే అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 26న విడుద‌ల కానుంది.



'మ‌న‌సుకు న‌చ్చింది'.. 'ఓ పిల్లా' లిరిక‌ల్ వీడియో

Updated By ManamTue, 01/02/2018 - 23:07

manasuku nacchindiసందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్ జంట‌గా ఘ‌ట్ట‌మ‌నేని మంజుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'మ‌న‌సుకు న‌చ్చింది'. ర‌థ‌న్ సంగీతంలో ఇటీవ‌ల విడుద‌ల చేసిన 'ప‌రిచ‌య‌ము లేదా' పాట సంగీత ప్రియుల‌ను ఇప్ప‌టికే అల‌రించింది. కాగా, నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ చిత్రంలోని 'ఓ పిల్లా' అంటూ సాగే మ‌రో పాట టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు.  ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఈ పాట లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. యువ‌త‌ని ఆక‌ట్టుకునేలా ఈ పాట ఉంది. ఈ నెల 26న ఈ సినిమా తెర‌పైకి రానుంది. 



ప‌రిచ‌యం లేదా.. 'మ‌న‌సుకు న‌చ్చింది' ప్రోమో

Updated By ManamSat, 12/23/2017 - 15:57

manasuమంజుల ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన తొలి చిత్రం 'మ‌న‌సుకు న‌చ్చింది'. సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిధా చౌద‌రి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి సంజ‌య్ స్వరూప్‌, పి.కిర‌ణ్ నిర్మాత‌లు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక‌, ఈ రోజు (శ‌నివారం) 'ప‌రిచ‌యం లేదా..' అంటూ సాగే పాట ప్రోమోని మంజుల త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో విడుద‌ల చేశారు. ''ప‌రిచ‌యం లేదా.. నిను క‌ల‌వ‌లేదా.. నువ‌స‌లు తెలీదా.. ఏంటో.. ఈ వింతా..  అల‌వాటే క‌దా నువ్వు కంటిపాప‌కి.. త‌డ‌బాటెందుకు నిను చూడ‌టానికి.. ప‌ద‌వే త‌ల్లి ప‌ద‌మంటూ నను త‌రిమిన‌దే'' అంటూ సాగే సాహిత్యంతో ఈ పాట‌ని విన‌సొంపుగా ట్యూన్ చేశారు సంగీత ద‌ర్శ‌కుడు ర‌థ‌న్‌. ఈ పాట పిక్చ‌రైజేష‌న్ బావుంది. ర‌వి కె.యాద‌వ్ ఛాయాగ్ర‌హ‌ణం కంటికింపుగా ఉంది. కాగా, డిసెంబ‌ర్ 25న ఈ పాటను విడుద‌ల చేయ‌నున్నారు. స్నేహం, ప్రేమ అనే అంశాల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం.. జ‌న‌వ‌రి 26న తెర‌పైకి రానుంది. 



ఆకట్టుకునే 'మ‌న‌సుకు న‌చ్చింది' ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌

Updated By ManamTue, 12/12/2017 - 12:49

manasukuమంజుల ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'మ‌న‌సుకు న‌చ్చింది'. సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిధా చౌద‌రి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, ఇందిరా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మాతలు. ఇటీవ‌ల‌ ప్రీ-లుక్ పోస్టరుని, ప్రీ-లుక్ టీజరుని విడుదల చేసిన యూనిట్.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ని రిలీజ్ చేసింది. 

ప్ర‌కృతి ప్రేమికురాలు అయిన క‌థానాయిక‌ అమైరా ద‌స్త‌ర్‌.. ఆమె స్నేహితుడు సందీప్ కిష‌న్ తో చేసే సంభాష‌ణ‌గా ఈ టీజ‌ర్ రూపొందింది. ప్రీ-లుక్ టీజర్లో హీరో హీరోయిన్స్ కాళ్ళు తప్ప ఏమి చూపించకుండా కేవలం డైలాగ్స్ తో సరిపెట్టారు. కాని ఈ రోజు విడుదలైన టీజర్లో హీరోయిన్ “ప్రతీ మనిషిలో ప్రపంచమంత ప్రేమ ఉంటుందిరా.. కాని 0.1% కూడా బయటకి రావడంలేదు. ఒక్కసారి మన హార్టుతో మనం కనెక్ట్ అయితే ఆ ప్రేమంతా పరిచయమౌతుంది” అని హీరోతో చెప్పే డైలాగ్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. అలాగే హీరో హీరోయిన్లు ఒకరికొకరు “ఐ యామ్ ఇన్ లవ్” అని చెప్పుకోవడం.. అంతలో హీరో “నాకు తెలీకుండా ఎవరితోనే” అని ఉత్సుకతతో అడగడంతో టీజర్ ముగుస్తుంది.

ఈ టీజరులో అందమైన లొకేషన్స్ ని అంతే అందంగా తన కెమెరాలో బంధించారు సినిమాటోగ్రాఫర్  రవియాదవ్. లొకేషన్స్ ఎంత అందంగా ఉన్నాయో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే అందంగా, రొమాంటిక్ గా ఇచ్చారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ర‌థ‌న్. “విజువల్స్ ఎంజాయ్ చేయండి. వాటిని చిత్రీకరిస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసాను. ఇది మీకోసమే” అంటూ ట్వీట్ చేసారు మంజుల. సినిమాని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26, 2018న విడుదల చేయబోతున్నారు.  



రాజ్‌త‌రుణ్‌.. 'రాజుగాడు' ఫ‌స్ట్‌లుక్‌

Updated By ManamWed, 10/18/2017 - 20:57

ప‌క్కింటి కుర్రాడు త‌ర‌హా పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చేరువ‌య్యాడు యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. 'ఉయ్యాల జంపాల‌', 'సినిమా చూపిస్త మామ‌', 'కుమారి 21 ఎఫ్' చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్స్ ని కైవ‌సం చేసుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. ప్ర‌స్తుతం 'రాజుగాడు' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో 'అనేకుడు' ఫేమ్ అమైరా ద‌స్తూర్ క‌థానాయిక‌. ఎకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని దీపావ‌ళి సంద‌ర్భంగా బుధ‌వారం విడుద‌ల చేసారు.

'రాజుగాడు'లో రాజ్‌త‌రుణ్‌ది చిత్ర‌మైన క్యారెక్ట‌ర్‌. త‌న కంట్రోల్‌లో లేని ఓ వ్యాధితో త‌ను బాధ‌ప‌డుతుంటాడు. ఇంత‌కీ అదేమిటంటే.. క్లెప్టోమానియా. అంటే దొంగిలించాల‌నే త‌ప‌న ఉన్న మాన‌సిక రుగ్మ‌త అన్న‌మాట‌. ఇవాళ విడుద‌ల చేసిన‌ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లోనూ ఇదే క‌నిపిస్తుంది. ఓవైపు ప్రియురాలితో కెమిస్ట్రీ పండిస్తూనే.. మ‌రోవైపు క్లెప్టోమానియాతో ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి మొబైల్‌ని కొట్టేస్తున్న ఈ రాజుగాడుని చూస్తే య‌మ డేంజ‌ర్ అనుకోవాల్సిందే. ఈ సినిమా 2018 సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.





Related News