mahesh babu

మహేశ్ అతిథి పాత్ర

Updated By ManamThu, 11/15/2018 - 14:24

Mahesh Babuఈ మధ్యన తన చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. త్వరలో మిగిలిన హీరోలతో చిన్న సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రొడక్షన్ వ్యవహారాలను నమ్రత చూసుకుంటోంది. అందులో భాగంగా మొదటి చిత్రంగా ఓ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించాలని ఆమె అనుకుంటున్నారట.

ఇక అందులో 30నిమిషాల పాటు కనిపించే కీలక పాత్రను మహేశ్‌ చేత చేయిస్తే బావుంటుందని నమ్రత భావిస్తున్నారట. తాము నిర్మించే చిత్రమే కాబట్టి అందులో అతిథి పాత్రలో నటించేందుకు మహేశ్ ఒప్పుకుంటున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా మహేశ్ ప్రస్తుతం మహర్షి అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఆ మూవీతో ప్రారంభం కానున్న మహేశ్ మల్టీఫ్లెక్స్..!

Updated By ManamWed, 11/14/2018 - 15:20
Mahesh Babu

‘ఏఎమ్‌బీ సినిమాస్’ పేరుతో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు మల్టీఫ్లెక్స్ బిజినెస్‌ను ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఆయన ఈ మల్టీఫ్లెక్స్‌లను ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ సమీపంలో ఇప్పటికే నిర్మాణం కూడా పూర్తైంది. ఇక ఈ థియేటర్‌లో మొదట ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌’ను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన అది వాయిదా పడగా.. తాజాగా రజనీకాంత్ 2.O చిత్రంతో ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మల్టీఫెక్స్ ప్రారంభోత్సవానికి రజనీ కాంత్ అతిథిగా వస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.భారీ రేటుకు మహేశ్ ‘మహర్షి’ డిజిటల్ రైట్స్..?

Updated By ManamMon, 11/12/2018 - 12:55

Mahesh Babuమహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ భారీ రేటుకు కొనుగోలు చేయగా.. తాజాగా ఈ మూవీ డిజిటిల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిజిటల్ రైట్స్ 12కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ 22 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, పీవీపీ ఎంటర్‌టైన్‌మెంట్స్, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇష్టం లేకుండానే ‘పోకిరి’లో నటించా

Updated By ManamMon, 11/12/2018 - 11:47

Ileanaసూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ‘పోకిరి’ ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ చిత్రంలో తాను ఇష్టం లేకుండానే నటించానని గోవా బ్యూటీ ఇలియానా చెప్పుకొచ్చింది. 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా.. ఈ సినిమా చేయకూడదని తాను అనుకున్నానని, ఆ సమయంలో మహేశ్ సోదరి మంజుల తనను ఒప్పించారని చెప్పింది. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని తాను అసలు ఊహించలేదని, అంతేకాకుండా తన సినీ కెరీర్‌కు ఆ చిత్రం చాలా ఉపయోగపడిందని వెల్లడించింది. ఆ తరువాత ఇష్టపడి చేసిన కొన్ని సినిమాలు నిరాశ పరిచాయని తెలిపింది. కాగా దేవుడు చేసిన మనుషులు తరువాత టాలీవుడ్‌కు దూరమైన ఇలియానా దాదాపు 6సంవత్సరాల తరువాత రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనితో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.మంత్రులపై అభ్యంతరకర పోస్టులు.. మహేశ్‌బాబు అరెస్ట్

Updated By ManamThu, 11/08/2018 - 09:28

Ministersకడప: సోషల్ మీడియా రోజురోజుకు విస్తరిస్తున్న ఈ హైటెక్ కాలంలో పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రముఖులపై అభ్యంతరకర పోస్టులు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో తాజాగా ఏపీ మంత్రులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు మహేశ్ బాబు కడప జిల్లా సింహాద్రిపురం మండలం చెర్లోపల్లికి చెందిన వాడిగా పోలీసులు తెలిపారు. మంత్రులు ఆదినారాయణ రెడ్డి, లోకేశ్‌లపై మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్టులు చేయగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని.. కోర్టు ముందు హాజరుపరిచారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు.మహేశ్‌కు థ్యాంక్స్ చెప్పిన శంకర్

Updated By ManamTue, 11/06/2018 - 09:55

Mahesh Babu, Shankarటాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు కోలీవుడ్ స్టార్ డైరక్టర్ శంకర్ ధన్యవాదాలు తెలిపాడు. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘2.O’ ట్రైలర్ ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్‌ను చూసిన ప్రతి ఒక్కరు వావ్ అంటున్నారు. ఈ క్రమంలో మహేశ్ బాబు కూడా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించాడు.

‘‘అదిరిపోయే విజువల్స్, అద్భుతమైన కాన్సెప్ట్. థియేటర్లో చిట్టిని చూసేందుకు వెయిట్ చేస్తున్నా. శంకర్, రజనీ సర్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, 2.O టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్’’ అంటూ మహేశ్ ట్వీట్ చేశాడు. దీనికి శంకర్ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్యు మహేశ్ గారు. మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘2.O’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 మహేశ్ కోసం విలేజ్ సెట్

Updated By ManamFri, 11/02/2018 - 01:36

imageమహేశ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహర్షి’. అశ్వినీదత్, దిల్‌రాజు, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యు.ఎస్ లో షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకోనుంది. హైదరాబా ద్‌లో జరగబోయే షెడ్యూల్ కోసం ఓ భారీ విలేజ్ సెట్‌ను నిర్మిస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో మహేశ్, అల్లరి నరేశ్, పూజా హెగ్డే సహా ప్రధాన తారాగణం నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేస్తున్నారు. మహేశ్ నటిస్తున్న 25వ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కొత్త వ్యాపారం...

Updated By ManamMon, 10/29/2018 - 23:06

imageటాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా క్రేజ్ ఉన్న మహేశ్ బాబు సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్‌లో కూడా నటిస్తుంటారు. ఎక్కువ కమర్షియల్ యాడ్స్‌లో నటించే తెలుగు హీరో కూడా మహేశ్ బాబు కావడం విశేషం. ఇప్పుడు మహేశ్ కొత్తగా థియేటర్స్ బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నారు. ఏషియన్ సినిమాస్ భాస్వామ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ ప్రారంభించిన మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ మల్టీప్లెక్స్‌కి ఎ.ఎం.బి అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 8న దీన్ని ప్రారంభించనున్నారు. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ హీరోలుగా నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాతో మహేష్ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది.మహేశ్ చారిటీ ఈవెంట్ క్యాన్సిల్..?

Updated By ManamWed, 10/24/2018 - 15:05

Mahesh Babuఈ నెల 27న అమెరికాలోని మారియట్ మార్కిస్‌లో జరగబోయే ఓ చారిటీ ఈవెంట్‌కు సూపర్‌స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా హజరు అవ్వనున్న విషయం తెలిసిందే. గ్రామమ్ ఫౌండేషన్, హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందట. ఈ ప్రోగ్రామ్‌కు దాదాపు 100 ఎన్నారై కుటుంబాలు వస్తాయని నిర్వాహకులు అంచనా వేశారు. అయితే ఇప్పుడు అంతమంది రాలేదట. దీంతో టికెట్ ధరను రూ.2వేల డాలర్ల నుంచి రూ.450డాలర్లకు తగ్గించినా.. పెద్దగా ప్రయోజనం లేకపోయిందట. దీంతో ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మహర్షి’ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం మహేశ్ బాబు న్యూయార్క్‌లో ఉన్న విషయం తెలిసిందే.వైరల్‌గా మహేశ్ లుక్.. వావ్ అంటోన్న ఫ్యాన్స్

Updated By ManamWed, 10/24/2018 - 09:13

Mahesh Babuవంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో జరుగుతుండగా.. అక్కడ చిత్రీకరణలో మహేశ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. వాటిలో మహేశ్ లుక్ అదిరిపోగా.. వావ్ అంటూ ఆయన అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News