Chandrababu Naidu

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

Updated By ManamTue, 09/18/2018 - 12:25

AP Government likely to issue notification for 20,000 jobsఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న  20 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇరవై వేలకు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.బాబ్లీ, అరెస్ట్ వారెంట్‌పై చంద్రబాబు ప్రకటన

Updated By ManamMon, 09/17/2018 - 18:35

Chandrababu naidu, AP CM, Babli issue, Arrest warrant, AP assemblyఅమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాబ్లీ అంశం, అరెస్ట్ వారెంట్‌పై అసెంబ్లీలో ప్రకటన విడుదల చేశారు. అరెస్ట్ వారెంట్‌పై చర్చిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. సానుభూతి కోసం తాను ప్రయత్నిస్తున్నానని విమర్శిస్తారా? అని మండిపడ్డారు. అరెస్ట్ వారెంట్లు పంపించి డ్రామా ఆడుతున్నారని అంటారా? అని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. నాకు సానుభూతి అవసరం లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.

మరోవైపు రాష్ట్ర మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులతో సోమవారం చంద్రబాబు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్లీ ఎపిసోడ్, వారెంట్ల జారీ అంశంపై చంద్రబాబు చర్చించారు. గతంలో ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు, వారెంట్లు ఏమైనా వచ్చాయా ? అని సీఎం అధికారులను ఆరా తీశారు. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు వెళ్దామని చంద్రబాబు అనగా.. ప్రత్యామ్నాయాలు పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు సూచించినట్టు సమాచారం. ఎంపీనా..? ఎమ్మెల్యేనా..? అధిష్టానమే డిసైడ్ చేస్తుంది 

Updated By ManamMon, 09/17/2018 - 14:42

Ashok Gajapati Rajuఅమరావతి: తాను ఎంపీగా వెళ్లాలా..? లేక ఎమ్మెల్యేగా..? పోటీ చేయాలా అన్నది అధిష్టానమే నిర్ణయిస్తుందని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అనంతరం అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. తనకైతే ఎంపీగా బరిలో నిలవాలనుందని, తన కుమార్తె ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఏమీ చెప్పలేనని అన్నారు.

బాబ్లీ ఘనటలో ధర్మాబాద్ పోలీసులు టీడీపీ నేతలతో దారుణంగా వ్యవహరించారని, ఐదు రోజులు తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ రైతు హక్కుల కోసం టీడీపీ పోరాటం చేసిందని అశోక్ గజపతి రాజు అన్నారు. జాతీయ పార్టీలన్నీ ప్రజలకు దూరం అవుతున్నాయని, బీజేపీ ప్రజలకు న్యాయం చేయలేకపోయిందని చెప్పారు. ఇక తండ్రి పాలన తెస్తానని జగన్ చెబితే నమస్కారం పెడతామని, వైఎస్ఆర్ లాంటి దారుణ పాలన ఎవరికీ అవసరం లేదని అశోక్ గజపతిరాజు అన్నారు.తాడిపత్రి ఘటనపై చంద్రబాబు సీరియస్

Updated By ManamMon, 09/17/2018 - 11:42

Chandrababu Naiduఅనంతపురం: గత రెండు రోజులుగా తాడిపత్రి మండలం చిన్న పొడమలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఈ వివాదంలో అధికార పార్టీ నేతల తీరుపైనా అసంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే ప్రస్తుత పరిస్థితిపై ఇంటలిజెన్స్ చీఫ్‌ను అడిగి చంద్రబాబు వివరాలను తెలుసుకున్నారు.

మరోవైపు ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలంటూ ఎంపీ జేసీ పట్టుబట్టారు. దీంతో ఆక్టోబస్ సిబ్బంది రంగంలోకి దిగింది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రబోధానంద శిష్యులను ఆశ్రమం నుంచి తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే ఆశ్రమం వదిలి వెళ్లేది లేదని శిష్యులు చెబుతుండటంతో ఆశ్రమంలోకి గ్యాస్ వదిలి వారిని తరలించానలి పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.'రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేస్తా'

Updated By ManamSat, 09/15/2018 - 17:53

Chandrababu Naidu, North Telangana, Srikakulam district, Narendra modiశ్రీకాకుళం: రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన  శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చిన్నసాన ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఎచ్చెర్ల అంబేడ్కర్‌ వర్సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. విశాఖ రైల్వేజోన్‌ ఇవ్వరు.. పోలవరానికి నిధులు సైతం ఇవ్వరని మండిపడ్డారు. జనవరిలో ఎన్నికలొస్తాయని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలెందుకని విమర్శించారు. లాలూచీ రాజకీయాలు చేయడమే వీళ్ల పనిగా చంద్రబాబు ఆరోపించారు. ఉత్తర తెలంగాణ కోసమే బాబ్లీ పోరాటం చేశానని చెప్పారు.

కేసులు పెట్టమని చెప్పి ఇప్పుడు నోటీసులు పంపించారని దుయ్యబట్టారు. రాజకీయ దురద్దేశంతోనే బాబ్లీ నోటీసులు పంపారని మండిపడ్డారు. ఎనిమిదేళ్ల తరువాత నోటీసులు రావడానికి కారణం ఏమిటి? అని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. తామే గెలుస్తామని ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు సర్వే చేయించుకున్నాడని, ఏ అనుభవం ఉందని ప్రజలు జగన్‌ను గెలిపిస్తారని ధ్వజమెత్తారు. 2050 నాటికి మనమే నెంబర్‌వన్‌గా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, అశోక్‌గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.‘ఫ్యాన్’ స్పీడ్, ‘కారు’ జోరు

Updated By ManamSat, 09/15/2018 - 12:25
  • జగన్‌కు జై కొట్టిన ఏపీ ప్రజలు

  • తెలంగాణలో మళ్లీ సీఎం కేసీఆరే...

  •  ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వేలో వెల్లడి

YSR Congress president ys jagan as the next chief minister in ap!

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలు హాట్ టాఫిక్‌గా మారగా, మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కితున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే ముఖ్యమంత్రి పదవికి ఎవరు దక్కించుకుంటారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. దీంతో సర్వేలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఓ వైపు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే అంటూ .... మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కే ప్రజలు మళ్లీ పట్టం కడతారని, ఇక ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే ముఖ్యమంత్రి పీఠం దక్కనున్నట్లు ఈ సర్వేలో తేలింది. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వేలో వెల్లడి అయింది. అంతేకాకుండా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కంటే వైఎస్ జగన్‌కే ప్రజాదరణ ఎక్కువ ఉన్నట్లు సర్వే పేర్కొంది.

జగన్‌కే జై కొట్టారు...

india today Survey predicts victory for YSRCP in Ap

ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని సర్వే ద్వారా స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే  వైఎస్ జగన్‌ మోహ న్‌రెడ్డికి 43%, చంద్రబాబు నాయుడుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతు ప్రకటించారు.  సెప్టెంబర్ 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 10,650 మంది అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్‌లో ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై చర్చ జరిగింది.

సర్వే పాజిటివ్‌గా రావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం ఈ సర్వే ఫలితాలను కొట్టిపారేసింది. రాబోయే ఎన్నికల్లో కూడా తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ ట్రెండ్ ఎన్నికల వరకూ కొనసాగుతుందో లేదో చూడాలంటే ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చేవరకూ వేచి చూడాల్సిందే. 

కేసీఆర్‌కే మళ్లీ పట్టం

kcr will be back in telangana cm

తెలంగాణలో మళ్లీ గులాబీ గుభాళించనుంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టనున్నట్లు ఈ సర్వేలో తేలింది.  తెలంగాణ అసెంబ్లీని ఎనిమిది నెలల ముందుగానే రద్దు చేసి ముందస్తుకు సిద్ధమైన కేసీఆర్‌ కారులో దూసుకుపోతున్నారు. తదుపరి సీఎంగా కేసీఆర్‌కు 43 శాతం మంది మద్దతు తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌కు 18శాతం మంది మొగ్గు చూపారు. తెలంగాణలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలో జరిగిన ఈ సర్వేలో మొత్తం 7,110మంది పాల్గొన్నారు.

పడిపోయిన ‘స్వామి’ గ్రాఫ్

kumaraswamy

ఇక కర్ణాటక గద్దెనెక్కి నాలుగు నెలలు కాకముందే ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి కుమారస్వామి గ్రాఫ్ తగ్గిపోయింది. జేడీఎస్-కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుపై 23 శాతం బాగుందని, 28 బాగోలేదని, 35శాతం మంది ఏమాత్రం బాగోలేదని కర్ణాటక ప్రజలు నిర్మొహమాటంగా వెల్లడించారు.చంద్రబాబు, శివాజీపై జీవీఎల్ ఫైర్..

Updated By ManamFri, 09/14/2018 - 19:20

GVL Narasimha Rao, Actor Shivaji, AP CM, Chandrababu Naidu, Non Bailable warrant హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీ నటుడు శివాజీపై బీజేపీ నేత రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాన్ బెయిలబుల్ వారంటు జారీ కావడంతో చంద్రబాబు మరో డ్రామాకు తెర తీశారని మండిపడ్డారు. చంద్రబాబుని ఏ1, ఏ2 అని పిలుస్తారని భయమా? ఒక దొంగ డ్రామాకు తెరతీశారని జీవీఎల్ విమర్శించారు. దొంగ సింపతీ కోసం బాబు తెగ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అదొక న్యాయ ప్రక్రియ మాత్రమేనని, న్యాయంనుంచి ఎవరు తప్పించుకోలేరని హితవు పలికారు. చంద్రబాబుపై బీజేపీ కక్ష సాధింపు అవసరం లేదని, ప్రజలే అతనికి బుద్ధి చెప్తారన్నారు. పీడీ అకౌంట్స్ విషయంలో ఎంక్విరీ చేస్తే బాబు అవినీతి బాగోతం అంతా బయటకు వస్తుందని చెప్పారు.

నోటీస్‌లు చూసి బాబు భయపడే రకం కాదని, దాన్ని పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపోరాటం చేయ్యాలి తప్ప.. న్యాయవ్యవస్థపై బురద చల్లడం సరికాదని తెలిపారు. గతంలో 22 నోటీసులు ఇచ్చినా స్పందన లేదని చెప్పారు. అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. అదో న్యాయ ప్రక్రియని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని డ్యూయెట్‌లు పాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ హయాంలోనే చాలా ఇబ్బంది పడ్డారని విమర్శలు గుప్పించారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌పై బాబుకు ఎప్పుడు చిత్త శుద్ధి లేదని, నీటి కోసం పోరాడటం ఏంటి? అని ప్రశ్నించారు. సినీ నటుడు శివాజీకి వేషాలు లేకపోవడం వల్లే ప్యాకేజీ తీసుకొని డ్రామాలు ఆడుతున్నారని జీవీఎల్ మండిపడ్డారు.ఎవరికీ భయపడేది లేదు: చంద్రబాబు

Updated By ManamFri, 09/14/2018 - 17:33
chandrababu naidu reacts on non bailable arrest warrant

కర్నూలు : బాబ్లీ ప్రాజెక్ట్ వివాదంలో నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందనే ఉద్దేశ్యంతో నిరసన తెలపడానికే మేము బాబ్లీ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లాం. అయితే ఉమ్మడి సమైక్య రాష్ట్ర సరిహద్దులోనే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పని చేసినా ప్రజల కోసమే పని చేశానే తప్ప, ఎలాంటి తప్పు చేయలేదని, ఇలాంటి కేసులకు భయపడేది లేదని చంద్రబాబు అన్నారు.

‘నేను ఎక్కడా ఎలాంటి నేరాలు, ఘోరాలు చేయలేదు. దేనికీ భయపడేది లేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు నోటీసులు, అరెస్టులు అంటున్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసమే పనిచేశా. తెలుగు జాతికి నష్టం వస్తుందని బాబ్లీ ప్రాజెక్ట్‌పై పోరాడాను. ప్రజా హితం కోసం, ప్రజల కోసం నిరంతరం పని చేస్తుంది. కేసు గురించి న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’అని ఆయన పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద జలసిరికి చంద్రబాబు నాయుడు శుక్రవారం హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. నాగావళి-వంశధార ప్రాజెక్టులను అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు.ఆ రోజు రాత్రి నరకం అనుభవించాం: నామా

Updated By ManamFri, 09/14/2018 - 14:27
  • తెలంగాణ సరిహద్దులోనే అరెస్ట్ చేశారు

  • ఒకే గదిలో 80మందిని బంధించారు

  • తెలంగాణ ప్రజల కోసమే ఆందోళన చేశాం

  • రాష్ట్రం ఎడారిగా మారకూడదనే

Nama nageswara rao

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయడాన్ని తెలంగాణ టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కోసమే అప్పుడు తాము ఆందోళన చేశామన్నారు. 

మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ...‘బీజేపీ కావాలనే కుట్రలు చేస్తోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సమయంలో బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లినప్పడు .... తెలంగాణ సరిహద్దులోనే మమ్మల్ని అరెస్ట్ చేశారు.  బాబ్లీ చూపించబోం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా మహిళా నేతల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారు.

ఒకే గదిలో 80మంది నేతలను బంధించారు. ఆ రోజు రాత్రి అక్కడ నరకం అనుభవించాం. మంచినీళ్లు కాదుకదా... టాయ్‌లెట్లు లేవు. మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎనిమిదేళ్ల తర్వాత వారెంట్ జారీ చేయడం దారుణం. బీజేపీ కుట్రకు ఇది నిదర్శనం. బాబ్లీ కేసులో నాకు ఇంతవరకూ ఒక్క నోటీసు కూడా రాలేదు’ అని అన్నారు.

కేసులకు భయపడం: పెద్దిరెడ్డి
నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌పై న్యాయపరంగా ఎదుర్కొంటామని పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా వారెంట్‌ను రద్దు చేసి, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  బీజేపీ ప్రభుత్వం చొరవతోనే చంద్రబాబుకు వారెంట్ జారీ చేశారని అన్నారు. మహాకూటమికి భయపడి కేసీఆర్, మోదీ కుమ్మక్కు అయ్యారని పెద్దిరెడ్డి ఆరోపించారు. అలాగే గత ఎనిమిదేళ్లలో ఎలాంటి నోటీసులు పంపలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా స్పందించాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆధారాలుంటే బయటపెట్టండి: పురందేశ్వరి

Updated By ManamFri, 09/14/2018 - 13:10
chandrababu arrest warrent-purandeswari

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంపై బీజేపీ మహిళా నేత పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబు వారెంట్‌తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. పురందేశ్వరి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ... కోర్టు సాధారణ ప్రక్రియలో భాగంగానే చంద్రబాబుకు వారెంట్ ఇచ్చిందన్నారు.

అన్నింటికీ కేంద్రామే కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసత్య ప్రచారాలు చేయడం సరికాదని, అన్నింటినీ తమ పార్టీకి ఆపాదించడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీకి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. అరెస్ట్ వారెంట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలని ఆమె సూచించారు.

సానుభూతి కోసమే టీడీపీ డ్రామాలు: కన్నా
అమరావతి: ప్రజల సానుభూతి కోసమే టీడీపీ డ్రామాలు ఆడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ముద్దాయిగా ఉన్న వ్యక్తి కోర్టుకు గైర్హాజరు అయితే నాన్‌ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేస్తారన్నారు. చంద్రబాబు విచారణకు హాజరు కాకుండా కోర్టును అగౌరవపరుస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

Related News