Chandrababu Naidu

ఏసీబీని ఇంకా పటిష్టం చేస్తాం: చంద్రబాబు

Updated By ManamSat, 11/17/2018 - 18:15
  • హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్‌తో ఏపీ సీఎం భేటీ

Chandrababu naidu, ACB, CBI, High court Chief justice, Radhakrishanఅమరావతి: హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. చీఫ్ జస్టిస్, హైకోర్టు న్యాయమూర్తులు శనివారం రాజధాన పర్యటనకు వచ్చారు. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణాలను న్యాయమూర్తులు పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులతో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో హైకోర్టు భవన నిర్మాణం, హైకోర్టు తరలింపుపై వారితో సీఎం చర్చించారు.

సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ భ్రష్టు పట్టిందన్నారు. వాళ్లలో వాళ్లే అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. సీబీఐ విషయంలో రాష్ట్ర నిర్ణయానికి ఇతర రాష్ట్రాలు మద్దతు తెలపడం మంచి పరిణామంగా ఆయన పేర్కొన్నారు. సీబీఐ కంటే మన ఏసీబీ చాలా పటిష్టంగా ఉందన్నారు. ఏసీబీని ఇంకా పటిష్టం చేస్తామని చెప్పారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం చేసే తప్పులను నిలదీసినట్టు అవుతుందని పునరుద్ఘాటించారు. జనవరి నాటికి అమరావతిలో హైకోర్టు భవనం సిద్ధమవుతుందని చంద్రబాబు తెలిపారు.  
 



ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్ట్ చేయాలి

Updated By ManamSat, 11/17/2018 - 14:04
CPI, CPM demands arrest of TDP MLA chintamaneni Prabhakar

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న వామపక్షాలు  విజయవాడలో ధర్నా చేపట్టనున్నాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. ‘చింతమనేని ప్రభాకర్ అరాచకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారకులు.

నాలుగున్నరేళ్లుగా చింతమనేని అరాచకాలను చంద్రబాబు సమర్థిస్తూనే ఉన్నారు. మహిళా తహసిల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేసినా చర్యలు తీసుకోకపోవడంతో అతడి ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.



టీడీపీకి 3 పదవులు.. నాకు మంత్రి పదవి!

Updated By ManamFri, 11/16/2018 - 20:29
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్య

TDP, 3 posts, minister post, Revuri prakash reddy, TRS, TDP ticket, Chandrababu naidu, KCR, Telangana assembly electionsవరంగల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే టీడీపీకి 3 మంత్రి పదవులు దక్కనున్నాయనీ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. అలా జరిగితే తాను మంత్రి కావడం తథ్యమని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని విమర్శించారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి ఏ పాటిదో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

వరంగల్‌ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు రేవూరికి టీడీపీ టికెట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో చేసిన పనులను చెప్పుకునే దమ్ములేక చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించకుండా టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల వారిగా కూటమి తరపున సమన్వయ కమిటీలు పనిచేస్తాయని రేవూరి తెలిపారు. 



చంద్రబాబు గజగజలాడుతున్నారు..

Updated By ManamFri, 11/16/2018 - 17:49
Chandrababu Naidu fears CBI, says Ambati rambabu

విజయవాడ : ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై చేసిన హత్యాయత్నం కుట్ర బయటకు వస్తుందనే సీబీఐని సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...‘అనుకూల పత్రికలు ఉన్నాయని చెడు నిర్ణయాలు తీసుకుని మంచిగా వీరుడిని శూరుడిని అని  రాయించుకుంటే సరిపోతుందా. ఏదైనా కేసులో హైకోర్టు సీబీఐ విచారణ చేయాలని నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదు.

సీబీఐపై ప్రభుత్వ నిర్ణయంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జగన్‌పై దాడి కేసులో సీబీఐ విచారణ జరుగుతుందేమో అని ముందుగానే జాగ్రత్త పడ్డారు. జగన్‌పై దాడి కేసులో సీబీఐ విచారణ జరిగితే తాను ఇరుక్కుంటారని భయంతోనే ఈ నిర్ణయం. జగన్‌పై దాడిలో కర్త కర్మ క్రియ చంద్రబాబే. అందుకే భయం. నాలుగేళ్లుగా లక్షల కోట్లు అవినీతి చేశారు అందుకే సీబీఐ పేరెత్తితే చంద్రబాబు గజగజలాడుతున్నారు. తప్పు చేశారు కనుకే విచారణలకు భయపడుతున్నారు. ఏ విచారణకైనా సిద్ధమనే ధైర్యం చంద్రబాబు లేదు.

ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా శిక్ష తప్పదు. ఓటుకు నోటు కేసులో పట్టుపడ్డప్పుడు నీ ధైర్యం ఏ పాటిదో రాష్ట్ర ప్రజలు చూసారు. రాజధాని నిర్మాణం పేరుతో భారీ అవినీతికి, దోపిడీకి చంద్రబాబు పాల్పడ్డారు. ఎన్నికలలో ఎన్ని కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేసినా అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.  ఏ విచారణకు అయినా మేము సిద్ధం అనే ధైర్యం చంద్ర బాబు, లోకేశ్‌కు ఉందా?. జీవోలను అడ్డుపెట్టుకుని బయట పడాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వ్యవస్థల్ని గౌరవించ లేనివాడు సీఎంగా అనర్హుడు.’ అని వ్యాఖ్యానించారు.



చంద్రబాబును సమర్థించిన మమతా

Updated By ManamFri, 11/16/2018 - 14:30
Chandrababu Naidu has done the right thing says mamatha

కోల్‌కతా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమర్థించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాన్ని ఏపీ సర్కార్ ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీనిపై మమతా శుక్రవారమిక్కడ మాట్లాడుతూ... చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డడారు. 

కాగా ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తన అధికారులను వినియోగించుకునేందుకు సీబీఐకి సమ్మతి అవసరం. అయితే గత కొంతకాలంగా సీబీఐ ప్రతిష్ట మసకబారుతూ వస్తుండటంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర రంగ ఉద్యోగులపై దాడి చేసే అవకాశం సీబీఐకి ఉండదు. ఇక ఈ నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఏపీ సంచలన నిర్ణయం తరువాత సీబీఐ పాత్రను ఏసీబీ పోషించే అవకాశం ఉంది.
 



ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Updated By ManamFri, 11/16/2018 - 09:35

Chandrababu Naidu, AP Governmentఅమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ సంస్థ ప్రమేయం రాష్ట్రంలో అవసరం లేదని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమ్మతి ఉత్తర్వును ఉపసంహరించుకుంది.

కాగా ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తన అధికారులను వినియోగించుకునేందుకు సీబీఐకి సమ్మతి అవసరం. అయితే గత కొంతకాలంగా సీబీఐ ప్రతిష్ఠ మసకబారుతూ వస్తుండటంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర రంగ ఉద్యోగులపై దాడి చేసే అవకాశం సీబీఐకి ఉండదు. ఇక ఈ నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఏపీ సంచలన నిర్ణయం తరువాత సీబీఐ పాత్రను ఏసీబీ పోషించే అవకాశం ఉంది.



బీజేపీ నమ్మించి మోసం చేసింది

Updated By ManamThu, 11/15/2018 - 19:30
chandrababu naidu

విశాఖ: భారతీయ జనతా పార్టీపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు గురువారం విశాఖలో మాట్లాడుతూ...సీబీఐని అవినీతిమయం చేసి భ్రష్టుపట్టించారని, సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల తీవ్ర సమస్యలు వచ్చాయని, రూపాయి విలువ పడిపోయిందని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. 

దేశాన్ని కాపాడుకోవాలనే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేస్తున్నామని చెప్పారు. తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం.. విభజన హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెబుతోందని, ప్రజలంతా మెచ్చేలా అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.



చంద్రబాబుతో నటి మంజు భార్గవి భేటీ

Updated By ManamTue, 11/13/2018 - 20:04
Actress Manju Bhargavi meets ap cm chandrababu naidu

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సినీనటి మంజు భార్గవి కలిశారు.  ఆమె త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇందుకు సంబంధించి మంజు భార్గవి ...ఏపీ సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మంజు భార్గవి అనగానే గుర్తొచ్చే సినిమా ‘శంకరాభరణం’. ఆ చిత్రం ద్వారా ఆమె తెలుగులో నటిగా మంచి పేరు సంపాదించారు. అంతేకాకుండా శాస్త్రీయ నృత్యకళాకారిణి అయిన ఆమె...ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. 



జగన్ కేసులో చంద్రబాబుకు నోటీసులు

Updated By ManamTue, 11/13/2018 - 14:05

YS Jagan Attack case: High court issues notice to chandrababu naiduహైదరాబాద్ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో హైకోర్టు ఎనిమిదిమందికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ ఠాకూర్, తెలంగాణ డీజీపీ సహా ఎనిమిది మంది నోటీసులు అందుకున్నారు. 

ఇందుకు సంబంధించి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దాదాపు గంటన్నర పాటు కోర్టులో వాదనలు జరిగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయిస్తేనే... వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మరోవైపు సిట్ విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు సూచించింది.



చంద్రబాబును కలిసిన కామినేని

Updated By ManamMon, 11/12/2018 - 14:48
kamineni srinivas met chandrababu naidu in amaravati

అమరావతి : మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. కాగా ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేసిన అనంతరం మంత్రులుగా ఉన్న బీజేపీ నేతలు కామినేని, మాణిక్యాలరావు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత నుంచి కామినేని శ్రీనవాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే కలిదిండిలో ఓ కళాశాలను ప్రభుత్వ టేకాఫ్ చేస్తూ జీవో ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు కామినేని శ్రీనివాస్ తెలిపారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని, ఓ కళాశాల పనిమీదే చంద్రబాబుతో భేటీ అయినట్లు ఆయన పేర్కొన్నారు.





Related News