banned

ఫేస్‌బుక్ నుంచి ఆ యాప్ ఔట్

Updated By ManamThu, 08/23/2018 - 13:09

Facebookలీకుల ఆరోపణలు వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తాజాగా తమ ఫ్లాట్‌ఫాం నుంచి మరో థర్డ్ పార్టీ యాప్‌ను నిషేధించింది. మై పర్సనాలిటీ పేరుతో ఉన్న ఈ యాప్‌ వలన దాదాపు 40లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటా తప్పుదారి పట్టే ప్రమాదం ఉందని తెలిపిన ఫేస్‌బుక్, దానిని తొలగిస్తున్నట్లు గురువారం వెల్లడించింది. 2012 నుంచి ఈ యాప్ ఫేస్‌బుక్‌లో ఉన్నట్లు ఆ సంస్థలోని ఓ అధికారి తెలిపారు.

మై పర్సనాలిటీ యాప్ వలన యూజర్ల సమాచారాన్ని ఇతర కంపెనీలతో పంచుకున్నట్లు విచారణలో తేలింది. దీనికి సంబంధించిన ఆయా యూజర్లకు సమాచారాన్ని తెలియజేశాం. ఈ యూజర్ల ఫ్రెండ్స్ సమాచారాన్ని కూడా దుర్వినియోగం చేశారా లేదా అన్న విషయంపై ఇంకా తెలియరాలేదు. వారిది కూడా దుర్వినియోగం అయిందని తెలిస్తే వెంటనే సమాచారం ఇస్తాం అంటూ ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అయితే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కా తరువాత అనుమానాస్పదంగా ఉన్న సుమారు 400 యాప్స్‌ను ఫేస్‌బుక్ తొలగించిన విషయం తెలిసిందే.గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‌లు అవుట్

Updated By ManamTue, 03/06/2018 - 14:34

googleతమ పాలసీలను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలతో పది యాప్స్‌ను తన ప్లే స్టోర్ నుంచి గూగుల్ సంస్థ తొలగించేసింది. అందులో ఇటీవల వైరల్‌గా మారిన సారా(Sarah) మెస్సేజింగ్ యాప్ కూడా ఉంది. దాంతో పాటు సీఎం ఇన్‌స్టాల్లర్, యూట్యూబ్‌ నుంచి వీడియోలు డౌన్‌లోడ్ చేసుకునే ట్యూబ్‌మెట్, నచ్చిన టీవీ షోను చూసుకునేందుకు వీలు కల్పించే పాప్‌కార్న్ టైమ్, యాడ్ బ్లాక్ యాప్‌లైన యాడ్‌అవే, లక్కీ పాచర్.. గ్రూవ్‌షార్క్, అమేజాన్ అండర్ గ్రౌండ్, పీఎస్ఎక్స్4డ్రాయిడ్, రష్ పోకర్‌లను తమ ప్లే స్టోర్ నుంచి తీసేసింది గూగుల్. ఇవన్నీ తమ పాలసీలను ఉల్లంఘిస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది.నిషిద్ధమని తెలిసీ వాడకం

Updated By ManamSat, 10/21/2017 - 14:22
  • యథేచ్ఛగా నిషేధిత కేన్సర్ ఔషధ వినియోగం

  • అక్రమంగా ఒసిమెర్టినిబ్ అనే మందు సరఫరా

  • ప్రైవేటు వైద్యులే కాదు.. ప్రభుత్వ డాక్టర్లు కూడా

  • ఆన్‌లైన్‌లోనూ అక్రమంగా అమ్మకాల జోరు

  • బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి దిగుమతి

  • బ్రాండును బట్టి ధర లక్ష రూపాయలకు పైమాటే

cancer drug హైదరాబాద్, అక్టోబరు 21: అది ప్రాణాంతక కేన్సర్‌ను నయం చేసే ఔషధం. కానీ, భారత   మార్కెట్లో దానిపై నిషేధం ఉంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దానిని   నిషేధించింది. అయినా సరే, అది ఇక్కడ దొరుకుతోంది. నిషేధం ఉందని తెలిసినా వైద్యులు   యథేచ్ఛగా దానిని రోగులకు ఇచ్చేస్తున్నారు. ప్రైవేటు డాక్టర్లు రాస్తే సరే.. కానీ, ప్రభుత్వ   వైద్యులూ ఆ నిషేధిత మందును ప్రిస్క్రైబ్ చేయడం ఇక్కడ  ట్విస్టు. బయట మాత్రమే కాదు..   మామూలు వస్తువుల్లాగే ఆన్‌లైన్‌లోనూ ఈ ఔషధం దొరికేస్తోంది. ఎక్కువగా ఊపిరితిత్తుల   కేన్సర్‌ చికిత్స (ఇతర కేన్సర్లపైనా అది పోరాడుతుంది) కోసం వినియోగించే ఒసిమెర్టినిబ్  మెసిలేట్‌ అనే ఔషధం విదేశాల్లో వినియోగంలో ఉన్నా భారత ప్రభుత్వం దానిని  ఆమోదించలేదు. అయినా కానీ, పొరుగుదేశం బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి దానిని పలువురు వ్యాపారస్తులు అక్రమ మార్గాల్లో తెప్పించుకుని సరఫరా చేస్తున్నారు. ఔషధ కొనుగోలుదారుడిగా వెళ్లి ఆ కేన్సర్ మందును ఇవ్వాల్సిందిగా ఓ సరఫరాదారును అడగ్గా.. ‘‘ఒసిమెర్టినిబ్‌ను భారత్‌లో తయారు చేయట్లేదు. దానిని మేం కేవలం దిగుమతి చేసుకుంటున్నాం. ఆస్ట్రాజెనికా అనే బహుళజాతి సంస్థ టాగ్రిసో పేరిట ఉత్పత్తి చేస్తున్న ఆ ఔషధాన్ని విక్రయిస్తున్నాం. 30 టాబ్లెట్ల ఖరీదు రూ.1.10 లక్ష. బంగ్లాదేశ్‌కు చెందిన బీకన్ సంస్థ నుంచి టాగ్రిక్స్ పేరిట వచ్చే ఔషధాన్ని విక్రయిస్తున్నాం. దాని ధర రూ.39,600. అదే దేశానికి చెందిన ఇన్సెప్టా ఉత్పత్తి చేస్తున్న ఒసిసెంట్‌ను రూ.19 వేలకు అమ్ముతున్నాం. వైద్యులు, రోగులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తేనే వాటిని అమ్ముతున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. నిషేధించిన ఆ ఔషధాన్ని వాడడం అటు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులూ సమర్థించుకోవడం గమనార్హం. నిషేధం ఉందని తెలిసీ దానిని వాడుతున్నారు వారు. ‘‘అన్నిసార్లు ఒసిమెర్టినిబ్‌ను వాడం. ప్రత్యేకమైన సందర్భాల్లోనే వాడుతున్నాం. అదీ కూడా ప్రత్యేకంగా ఆర్డరిచ్చి తెప్పించుకుంటున్నాం. వేరే కేన్సర్ ఔషధాలు cancer drug ప్రభావం చూపనప్పుడే దీనికి వెళతాం. కేవలం ఊపిరితిత్తులు కేన్సర్‌కే కాదు.. ఇతర కేన్సర్లకూ అది ఉపయోగపడుతుంది’’ అని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి ఇన్‌చార్జ్ డైరెక్టర్ ఎన్ జయలత చెబుతున్నారు. ఇక, ఈ నిషేధిత ఔషధాన్ని వాడుతున్నారని తెలిసి అక్టోబరు 13న డీసీజీఐ డైరెక్టర్ జీఎన్ సింగ్ డ్రగ్ నియంత్రణా అధికారులకు సర్క్యలర్‌లు పంపించారు. ఇండియాలో ఇంకా ఒసిమెర్టినిబ్‌ను ఆమోదించలేదని, దాని నాణ్యత, భద్రత, ప్రభావశీలతను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరీక్షిస్తోందని సింగ్ తెలిపారు. ఇంకా ఆమోద ముద్ర పడని ఆ టాబ్లెట్లను అక్రమమార్గాల్లో అమ్ముతున్నారని, ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు జరుగుతున్నట్టు దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చారు. నాణ్యత, భద్రత, ప్రభావశీలత తెలియకుండా వాడితే రోగులు, ప్రజలకు హాని కలిగే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. కాబట్టి అక్రమమార్గాల్లో ఆ ఔషధాన్ని సరఫరా చేస్తున్న సంస్థలు, తయారీ సంస్థలపై ఓ కన్నేసి ఉంచాలని అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా పోర్టులు, విమానాశ్రయాల్లోని కస్టమ్స్ అధికారులకూ దానిపై వివరాలు పంపించారు. ఎగుమతి, దిగుమతి అయ్యే ప్రతి కన్సైన్‌మెంట్‌నూ క్షుణ్నంగా పరిశీలించి పంపాలని సూచించారు.  

Related News