Vishwaroopam 2

‘విశ్వరూపం 2’ రివ్యూ

Updated By ManamFri, 08/10/2018 - 13:07
Vishwaroopam 2

ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌:  రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌

ప్రెజెంట్స్: ఆస్కార్ ఫిలిమ్స్ వి. ర‌విచంద్ర‌న్‌

ఆర్టిస్ట్స్: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్ త‌దిత‌రులు

మ్యూజిక్‌: గిబ్రాన్‌, 

లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి, 

కెమెరా: శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌, 

ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌, 

డైలాగ్స్: శశాంక్‌ వెన్నెలకంటి, 

ప్రొడ్యూస‌ర్స్: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌, 

డైర‌క్ష‌న్‌: కమల్‌హాసన్‌. 

రిలీజ్ డేట్‌: 10.8.2018

క‌మ‌ల్‌హాస‌న్ అత్యంత ప్యాష‌న్‌తో తెర‌కెక్కించిన చిత్రం `విశ్వ‌రూపం`. ఆ సినిమా విడుద‌ల‌కు ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కుందో తెలిసిందే. ఆ సినిమా క్లైమాక్స్ లోనే ఆయ‌న సెకండ్ పార్ట్ గురించి హింట్ ఇచ్చారు. తొలి భాగం విడుద‌లైన నెల రోజుల్లోనే రెండో భాగం విడుద‌ల‌వుతుంద‌ని అంద‌రూ ఎదురుచూశారు. ఎందుకంటే అప్ప‌టికే షూటింగ్ మొత్తం పూర్తయింది. కానీ విడుద‌ల‌కు మాత్రం ఐదు ఏళ్లు స‌మ‌యం ప‌ట్టింది. అయినా క‌మ‌ల్ అంతే ఆస‌క్తిగా ఆ సినిమాకు ప్ర‌మోష‌న్ చేశారు. ఇంత‌కీ తొలి సినిమా ఉన్నంత ఆస‌క్తిక‌రంగా రెండో సినిమా ఉంటుందా? జ‌స్ట్ హావ్ ఎ లుక్‌... 

 

క‌థ‌: 

రా ఏంజెట్ విసాద్ అహ్మ‌ద్‌(క‌మ‌ల్ హాస‌న్‌) .. అల్‌ఖైదాలో ఓమ‌ర్(రాహుల్ దేవ్‌) వేసిన ప్లాన్‌ను లండ‌న్‌లో భ‌గ్నం చేస్తాడు. అక్క‌డ నుండి ఇండియా వెళ్లే క్ర‌మంలో ఓమ‌ర్ మ‌రో ప్లాన్ వేశాడ‌నే సంగ‌తి తెలిస్తుంది. రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఇంగ్లాండ్‌లో మునిగిపోయిన అణు ఆయుధాల‌ను యాక్టివేట్ చేస్తే... అవి పేలి.. పెద్ద సునామీ వ‌చ్చి.. లండ‌న్ న‌గ‌రం నాశ‌నం అయిపోతుంది. కాబ‌ట్టి అణు ఆయుధాల‌ను యాక్టివేట్ చేయాల‌నేది ఓమ‌ర్ ఆలోచ‌న‌. దాన్ని ప‌సిగ‌ట్టిన విసాద్ స‌ముద్రంలోకి త‌న భార్య నిరుప‌మ స‌హాయంతో ఆ ప్లాన్ స‌క్సెస్ కాకుండా అడ్డుకుంటాడు. అక్క‌డ నుండి ఇండియా చేరుకున్న విసాద్ త‌న పై అధికారుల‌ను క‌లిసే ప్ర‌య‌త్నంలో ఉండ‌గా.. అత‌ని భార్య‌, అసిస్టెంట్ ఆశ్రిత‌, త‌ల్లిని ఓమ‌ర్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అప్పుడు విసాడ్ ఏం చేస్తాడు?  అస‌లు ఓమర్ ప్లాన్ ఏంటి? ఇండియాలో ఓమ‌ర్ వేసిన ప్లాన్‌ను విసాద్ ఎలా అడ్డుకున్నాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్‌:

- క‌మ‌ల్ హాస‌న్ స‌హా ఇత‌ర న‌టీన‌ట‌ల ప‌నితీరు

- నిర్మాణ విలువ‌లు

- కెమెరా వ‌ర్క్‌

- సీజీ వ‌ర్క్‌

 మైన‌స్ పాయింట్స్‌:

- సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువ‌గా ఉండ‌టం

- ఎడిటింగ్‌

- నేప‌థ్య సంగీతం

- క‌న్‌ఫ్యూజ‌న్ చేసేలా ఉండ‌టం

Vishwaroopam

విశ్లేష‌ణ‌:

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తూనే.. సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. విశ్వ‌రూపం పార్ట్ వ‌న్‌లో ప్రేక్ష‌కుల‌కు చాలా ప్ర‌శ్న‌లు మిగిలిపోయాయి. అయితే పార్ట్ వ‌న్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇక సీక్వెల్‌లో పార్ట్ వ‌న్‌లోని ప్ర‌శ్న‌ల‌న్నింటినీ క్లియ‌ర్ చేసినా.. స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేవు. యాక్ష‌న్‌సీన్స్ లో క‌మ‌ల్ హాస‌న్ ఎలాంటి డూప్‌లేకుండా చ‌క్క‌గా న‌టించారు. అయితే యాక్ష‌న్ పార్ట్ ఎగ్జ‌యిటింగ్‌గా ఎక్క‌డా అనిపించ‌దు. ఫ‌స్టాఫ్‌లో లండ‌న్ స‌ముద్రంలోని స‌న్నివేశాల్లోని సీజీ వ‌ర్క్ బావుంది. కానీ అస‌లు ఇండియాలో సినిమా స్టార్ట‌వుతుంద‌ని అనుకున్న ప్రేక్ష‌కుడికి సినిమా ఎటువెళుతుందో అనే సందేహం మొద‌ల‌వుతుంది. ఇక ఎడిటింగ్ షార్ప్‌గా లేదు. స‌న్నివేశాలు ల్యాగ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. క‌మ‌ల్ హాస‌న్ రాజ ఏజెంట్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. పూజా కుమార్ పార్ట్ వ‌న్ కంటే దీంట్లో గ్లామ‌ర్ శాతం పెంచారు. ఆండ్రియా యాక్ష‌న్ సీన్స్‌కే ప‌రిమితం అయ్యింది. మొత్తంగా చూస్తే.. పార్ట్ వ‌న్ పై ఉన్న అంచ‌నాల‌తో  విశ్వ‌రూపం 2 కి వ‌చ్చిన ప్రేక్ష‌కులు నిరాశ‌ను మిగిలుస్తుంది

చివ‌ర‌గా.. విశ్వ‌రూపం 2.. ఆస‌క్తి త‌గ్గింది 

రేటింగ్‌: 2.5/5ప్రజల రుణం తీర్చుకోవాలి

Updated By ManamSun, 08/05/2018 - 02:17

సినిమా అనేది కేవలం వినోదమే కాదు.. విజ్ఞానాన్ని కూడా పెంచే ఓ మాధ్యమం. చాలా మంది ప్రశ్నించలేని ప్రశ్నలను సినిమా ప్రశ్నిస్తుంది. ప్రశ్న అనేది ఉన్నప్పుడు మార్పు ఉంటుంది. కాబట్టి ప్రశ్నించే తత్వాన్ని వదులుకోకూడదు అని అంటున్నారు కమల్ హాసన్. సినిమాల్లో నాలుగున్నర దశబ్దాల అనుభవమున్న ఈ లోక నాయకుడు.. ఇప్పుడు తనకు ఇంత గొప్ప స్థానాన్ని, పేరు ప్రఖ్యాతులను ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకుంటా అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన నటించిన ‘విశ్వరూపం 2’ ఆగస్ట్ 10న విడుదలవుతున్న సందర్భంగా కమల్‌హాసన్ ఇంటర్వ్యూ....
 

kamal

ప్రేక్షకులు మరచిపోలేదు..
‘విశ్వరూపం 2’ ఆలస్యానికి మేం కారణం కాదు.. ఒక వైపు రాజ కీయాలు.. మరోవైపు సాంకేతిక కారణాలతోనే సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు సినిమా లైఫ్ స్పాన్ రెండు, మూడు వారాలకు వచ్చింది. నాలుగు సంవత్సరాల తర్వాత సీక్వెల్ వస్తుందంటే ప్రేక్షకులు మరచిపోయారేమో అనుకున్నా.. కానీ ప్రేక్షకులు ఇంకా మా సినిమాను మరచిపోలేదు. 

ప్లాన్ చేయలేదు..
 ‘విశ్వరూపం’ సినిమా రెండు భాగాలుగా ఉండాలని ముందుగానే అనుకున్నాం. అంతే తప్ప సక్సెస్ అయితే మరో పార్ట్ చేద్దామని ప్లాన్ చేయలేదు. నాలుగేళ్ల క్రితమే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశాం. పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం గత ఏడాది చేశాం. టెక్నికల్‌గా సినిమా బావుంటుంది. సినిమా కథలో చిత్రీకరణ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇదేమీ వివాదస్పద చిత్రం కాదు. మొదటి భాగం విషయంలో కొంత మంది మాత్రమే వివాదం చేయాలని చూశారు. అయితే రెండో భాగానికి అలాంటిదేమీ లేదు. నా రాజకీయాలకు, ఈ సినిమాకు సంబంధం లేదు. సినిమా అనే దాన్ని మన ఆలోచనలను, అభిప్రాయాలను చెప్పే ఓ ఫ్లాట్‌ఫామ్‌గా చూడాలంతే.

టెక్నికల్‌గా డెవలప్ అవుతున్నాం...
ప్రస్తుతం ఇండియన్ సినిమా హాలీవుడ్ స్టాండర్డ్స్‌ను రీచ్ అవుతుంది. టెక్నికల్‌గా సినిమా ఎంతగానో డెవలప్ అయింది. మన సినిమాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. ది మంచి పరిణామమే కదా.

పోరాడాల్సిన తరుణం వచ్చింది...
స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు వచ్చింది. మనం అందరం స్వేచ్చ కోసం పోరాడాల్సిన తరుణం వచ్చింది. కానీ మనం 1948లోనే ఆగిపోయి ఉన్నాం. మార్పు కావాలి. అందుకోసం మనం అంతా కలిసి పోరాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నేను ఇప్పుడు ఉన్న స్థానానికి ప్రేక్షకులే కారణం. పేరు, డబ్బు అన్నీ ఇచ్చారు. వారి రుణం తీర్చుకోవాలనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. వాళ్లు ఇన్‌వెస్ట్ చేసిన ప్రొడక్ట్‌లాంటి నేను.. ఇప్పుడు ఆయుధంలా తయారయ్యాను. ఆయుధాన్ని ప్రజలే ఉపయోగించుకోవాలి.
 
లేయర్స్‌గా ఉంటాయి...
 విశ్వరూపం మొదటిభాగంలో హీరో ఎందుకు టీచర్‌లా ఉంటాడు?. అతనికి పెళ్లి ఎలా జరుగుతుంది?. అసలు అమెరికాకు ఎందుకు వచ్చారు? ఆల్‌ఖైదాతో లింక్ ఎలా ఏర్పడుతుంది? అనే విషయాలను మొదటి పార్ట్‌లో ఎక్కడా చూపించలేదు. అవన్నీ లేయర్స్ రూపంలో సెకండ్ పార్ట్‌లో రివీల్ అవుతాయి. మంచి ఎమోషనల్ పార్ట్ కూడా సినిమాలో ఉంటుంది. 

జాతీయత అనేది ...
 జాతీయతకు అర్థం ప్రతి వంద కిలోమీటర్లకు ఓసారి మారుతుంది. ఒకప్పుడు పెషావర్ మనదేశంలో భాగంగానే ఉండేది. కానీ ఇప్పుడు లేదు. దాని వల్ల జాతీయత మారింది కదా.. ఇలాంటి వాటిపై చాలా చర్చలు జరుగుతూనే ఉంటాయి. జరగాలి కూడా. దేశభక్తి అంటే నాకు తెలుసు. నీలో ఎంత దేశభక్తి ఉందని అంటే ఏం చెప్పను. 

ఇంకా నేర్చుకోవాలి...
 మనకు క్రియేటివ్ ఫ్రీడమ్ తక్కువగానే ఉంది. సెన్సార్‌బోర్డ్ ఉండకూడదు. సర్టిఫికేట్ బోర్డు ఉంటే చాలు అని పోరాడాం. కానీ కుదరలేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఇంకా నేర్చుకోవాలి. 

టాలెంట్ పెరుగుతుందే కానీ...
 ఇండియాలో చాలా మంది నటీనటులున్నారు. వారితో నా దగ్గరున్న అన్‌టోల్డ్ స్టోరీస్‌తో సినిమాలు చేస్తాను. నేను నటించకపోవచ్చునేమో కానీ.. టాలెంట్ మాత్రం పెరుగుతుందే తప్ప.. తగ్గదు. కళ.. ఎవరితోనూ ముగియకూడదు.
 హౌస్‌మేట్స్‌తో సందడి చేయనున్న ‘బిగ్‌బాస్’ హోస్ట్

Updated By ManamThu, 08/02/2018 - 13:03

Nani బుల్లితెరపైన దూసుకుపోతున్న షోలలో బిగ్‌బాస్ ఒకటి. తెలుగులో ఈ షో ప్రస్తుతం రెండో సీజన్ జరుగుతుండగా.. తాజాగా ఈ షోకు మరింత ఆకర్షణ రానుంది. అదేంటంటే ఈ హౌస్‌లోకి కమల్ హాసన్ లోకనాయకుడు రానున్నారు. విశ్వరూపం 2 ప్రమోషన్లలో భాగంగా కమల్ తెలుగు బిగ్‌బాస్‌లో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌తో కాసేపు ముచ్చడించనున్నారు కమల్ హాసన్. ఈ నేపథ్యంలో హోస్ట్ నాని, కమల్‌కు స్వాగతం పలికారు. కాగా కోలీవుడ్‌లో బిగ్‌బాస్ సీజన్‌కు కమల్ హాసన్ హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.కమల్‌తో పోటీ పడుతున్న నయనతార

Updated By ManamFri, 07/13/2018 - 10:29

nayan, kamal తమిళనాట టాప్ హీరోలకు సమానంగా క్రేజ్‌ను సంపాదించుకుంది నయనతార. ఆమెకు ఉన్న సక్సెస్ ఇమేజ్‌తో ఇప్పుడు లోకనాయకుడినే ఢీకొట్టబోతోంది. నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ చిత్రాన్ని జూలై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందు అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన ఆగష్టు 10వ తేదికి వాయిదా వేశారు. అయితే అదే రోజు కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీంతో మొదటిసారిగా కమల్‌తో పోటీ పడనుంది నయనతార. కాగా ఇప్పటికే టీజర్లతో ఆకట్టుకున్న ఈ రెండు చిత్రాలపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలంటే ఆగష్టు 10వరకు వేచి ఉండాల్సిందే.‘విశ్వరూపం 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది

Updated By ManamMon, 06/11/2018 - 09:13

Vishwaroopam స్వీయ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన చిత్రం ‘విశ్వరూపం 2’. 2013లో మంచి విజయం సొంతం చేసుకున్న ‘విశ్వరూపం’ సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పలు కారణాల వలన విడుదలకు నోచుకోలేకపోయింది. అయితే గతేడాది ఈ చిత్ర విడుదలకు ఓకే చెప్పడంతో అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్.

ఆగష్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తెలుగు, తమిళ్, హిందీలో ఈ చిత్రం విడుదల కానుండగా.. ట్రైలర్‌ సోమవారం విడుదల కానుంది. హిందీలో ఆమిర్ ఖాన్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, హిందీలో శృతీ హాసన్ ఈ చిత్ర ట్రైలర్‌లను విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, నాజర్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. గిబ్రాన్ సంగీతాన్ని అందించాడు.

Related News