nasa

సిగరెట్‌తో రాకెట్ లాంచింగ్.. వైరల్ వీడియో!

Updated By ManamThu, 08/30/2018 - 16:05

viral video, man lights rockets, cigarette, NASA, SpaceX, Netizens jokesరాకెట్ లాంచింగ్ చేయాలంటే ఎంతో ఖర్చు, శ్రమతో కూడిన పని. కానీ, ఈ స్పేస్‌మెన్ మాత్రం.. సింపుల్‌గా సిగరెట్‌తో రాకెట్‌ను అవలీలగా ఎగురవేస్తున్నాడు. ఒక్కదాని తరువాత మరొకటి నింగిలోకి భలే వదులుతున్నాడు చూడండి. నడిరోడ్డుపై నిలబడి చేతిలో టపాసు రాకెట్లను పట్టకొని.. స్టైల్‌గా సిగరెట్‌ కాలుస్తూ సరికొత్తగా నింగిలోకి లాంచ్ చేస్తున్నాడు. ఇతగాడు ఎవరో తెలియదు గానీ, నింగిలోకి రాకెట్లు వదులుతుంటే అటుగా వెళ్లే వాహనదారులంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారు.

టపాసు రాకెట్లను నింగిలోకి వదులుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా నాసాకు కొత్త భారతీయ శాస్త్రవేత్త, స్పేస్ఎక్స్ దొరికాడు అంటూ ట్యాగ్‌లు తగిలించి సరదాగా కామెంట్లు చేస్తున్నారు. రాకెట్ లాంచింగ్ స్కిల్స్ అంటే ఇతగాడివేనంటూ జోకులు పేలుస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో..



సూర్యుడి దగ్గరికి ప్రోబ్

Updated By ManamMon, 08/13/2018 - 03:15
  • విజయవంతంగా దూసుకెళ్లిన డెల్టా 4 రాకెట్..

  • ప్రపంచంలోనే తొలిసారి భానుడిపై పరిశోధన

వాషింగ్టన్: సూర్యుడిపైకి తొలిసారిగా చేపట్టిన అంతరిక్ష ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. సాంకేతిక కారణాలతో శనివారం వాయిదా పడిన నాసా ‘పార్కర్  సోలార్ ప్రోబ్’ను ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అనుకున్న సమయానికి డెల్టా 4 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి పంపారు. ఇక్కడి కేప్‌కెనరాల్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రివ్వున ఎగిసింది. ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ రాకెట్ సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించనుంది. సూర్యుడి ఉపరితలంలోని కరోనా వ్యవస్థపై ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ చేయనుంది.

image


తన ప్రయాణంలో ఈ ప్రోబ్ సూర్యుడి ఆవల ఉండే కరోనా వ్యవస్థను 24సార్లు దాటుతుంది. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి సూర్యుడి దగ్గరగా వెళ్లనున్న ప్రయోగం ఇదే. పార్కర్‌తో సౌర రహస్యాలు చాలా వరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడి వాతావరణం కంటే అధికంగా.. కరోనా ఎందుకు సెగలు చిమ్ముతుందో ఈ పరిశోధన ద్వారా తేల్చనున్నారు.పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధనలు చేస్తుంది.  దీని ద్వారా నక్షత్రాలకు సంబంధించిన రహస్యాలను కూడా తెలుసుకోవచ్చు. సూర్యుడి గతశీలతను, దాని అనుక్రమంపై ఓ అంచనా వేయొచ్చు.
 

image

 



మళ్లీ అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్

Updated By ManamSun, 08/05/2018 - 00:16

హ్యూస్టన్:  భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మరోమారు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు.  అంతరిక్షంలోకి వెళ్లనున్న మొత్తం 9 మంది వ్యోమగాముల తాజా తుది జాబితాలో సునీతా పేరు కూడా నాసా ప్రకటించింది.  వచ్చే ఏడాది కమర్షియల్ స్పేస్‌క్రాఫ్ట్సను అమెరికా అంతరిక్షంలోకి ప్రయోగిస్తోంది. ఈ వాహనాన్ని రూపొందించేందుకు నేషనల్ ఏయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కొన్నేళ్లపాటు కృషిచేస్తోంది.  స్పేస్‌ఎక్స్, బోయింగ్ సంయుక్తంగా రూపొందించిన రాకెట్, క్యాప్సూల్స్‌లో తొలిసారి మనుషులను అంతరిక్షంలోకి పంపుతుండగా 2011 తరువాత తొలిసారి మనుషులను తీసుకె ళుతుండడం మరో విశేషం.

image


 అమెరికా నేలపై నుంచి, అమెరికా రాకెట్లో, అమెరికన్ వ్యోమగాములను పంపే అంకం తుదిద శకు చేరుకున్నట్టు ‘లాంచ్ అమెరికా’ను నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టేన్ అభివర్ణించారు.  ఈ ఆపరేషన్ విజయవంత మైతే అంతరిక్షంలోనూ అమెరికా అగ్రగామి అవుతుందని నాసా అభిప్రాయపడింది.  52 ఏళ్ల సునీతా విలియమ్స్‌తో పాటు జోష్ కసాడా అనే మరో 45 ఏళ్ల మహిళా ఆస్ట్రోనాట్ కూడా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.  సునీతా 321 రోజులపాటు అంతరిక్షంలోనే ఉండి పరిశోధనలు పూర్తిచేసుకుని విజయవంతంగా 2012లో తిరిగి భూమి పైకి వచ్చారు.



మరోసారి అంతరిక్షంలోకి సునీత విలియమ్స్‌

Updated By ManamSat, 08/04/2018 - 12:30

Sunitha Williamsదాదాపు ఏడేళ్ల తరువాత మానవ సహిత అంతరిక్షయాత్రలను మళ్లీ చేపట్టనుంది అగ్రరాజ్యం అమెరికా. 2019లో చేపట్టబోయే ఈ యాత్రలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ సహా 9 మంది ఆస్ట్రోనాట్స్‌ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ప్రైవేటు కంపెనీ బోయింగ్‌ రూపొందించిన సీఎస్‌టీ–100 స్టార్‌ లైనర్, స్పేస్‌ ఎక్స్‌ అభివృద్ధి చేసిన డ్రాగన్‌ క్యాప్సూల్స్‌ ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి వెళ్లనున్నారు. 

ఈ వివరాలను శుక్రవారం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాముల్ని, ఆహారపదార్థాలను అంతరిక్షంలోకి చేరవేయనున్నారు. ఇక మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేముందు బోయింగ్, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు తమ నౌకల్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నాయి. కాగా సునీత విలియమ్స్ గతంలో 321 రోజులు అంతరిక్ష కేంద్రంలో గడిపిన విషయం తెలిసిందే. 



భూగ్రహ రక్షణకు నాసా కొత్త వ్యూహం

Updated By ManamSun, 06/24/2018 - 17:08

Nasa, defend Earth, asteroid attackవాషింగ్టన్: అంతరిక్షంలో భూమికి సమీపంలో తిరుగుతున్న చిన్న చిన్న గ్రహాలు.. గ్రహశకలాల నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించేందుకు నాసా సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. సుదూర తీరం నుంచి భూమి వైపునకు దూసుకొచ్చే గ్రహాలు, శకలాలను ముందే గుర్తించే ప్రణాళికను సిద్ధం చేసింది. భూమికి 30 మిలియన్ మైళ్ల దూరంలోకి రాగానే వాటిని అడ్డుకునే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విధాన అధికారులతో పాటు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, ఇతరత్రా ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఫెడరల్ ప్లానింగ్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్(ఎన్‌ఈవో)లను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యూహాల రూపకల్పనలో మునిగింది. చుట్టూ తిరుగుతున్న ఈ ఎన్‌ఈవోలు భూమిని ఢీకొట్టడం అసాధారణమని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు.

ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే మాత్రం నష్టం భారీగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఈవోలు భూమిని తాకే ప్రమాదాన్ని, పొరపాటున పడినా ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడం, అత్యవసర పరిస్థితులనూ ఎదుర్కొనేందుకు వెన్వెంటనే సిద్ధం కావడం తదితర ప్రణాళికలను నాసా బృందం రూపొందించింది. నేషనల్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ ప్రిపేర్డ్‌నెస్ స్ట్రాటజీ అండ్ ఆక్షన్ ప్లాన్ పేరుతో రూపొందించిన డాక్యుమెంట్‌లో ఈ వివరాలను పొందుపరిచింది. ఇందులో భాగంగా.. భూమికి చేరువగా దూసుకొస్తున్న గ్రహాలు, శకలాల గుర్తించే విధానాలను మరింత సానబట్టాలని నాసా నిర్ణయించింది. 



మళ్లీ తవ్వకాలకు సిద్ధమైన క్యూరియాసిటీ

Updated By ManamMon, 05/21/2018 - 22:41

nasaవాషింగ్టన్: అంగారకుడిపై పరిశోధన కోసం పంపించిన క్యూరియాసిటీ రోవర్ మరోమారు తవ్వకాలకు సిద్ధమైంది. అక్కడి రాళ్లకు సంబంధించిన నమూనాలు సేకరించేందుకు డ్రిల్లింగ్ చేయనుందని నాసా జెట్ ప్రపోల్షన్ లేబరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. క్యూరియాసిటీ రోవర్‌లో 2016 సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అంగారకుడిపై పరిశోధనలకు సంబంధించి రోవర్ పూర్తిస్థాయిలో పనిచేయలేదు. తవ్వకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి రోవర్ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. తాజాగా ఓ కొత్త టెక్నిక్‌తో డ్రిల్లింగ్ నిర్వహించనున్నట్లు క్యూరియాసిటీ డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ స్టీవెన్ లీ తెలిపారు. ఫీడ్ ఎక్స్‌టెండింగ్ డ్రిల్లింగ్(ఎఫ్‌ఈడీ)గా వ్యవహరించే ఈ కొత్త విధానం నేలపై ఓ కార్పెంటర్ డ్రిల్లింగ్ చేసినట్లే ఉంటుందని వివరించారు. డ్రిల్లింగ్ సమయంలో మెషిన్‌ను రోవర్ రోబోటిక్ హ్యాండ్‌తో ముందుకు నెడుతుందని చెప్పారు. దీనివల్ల తవ్వకాలలో మరింత ఒత్తిడి పడి డ్రిల్లింగ్ విజయవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం క్యూరియాసిటీ రోవర్ వీరా రూబిన్ రిడ్జ్ ప్రాంతంలో ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.



విశ్వాంతరాల్లోకి టెస్

Updated By ManamThu, 04/19/2018 - 22:06
  • నాసా ప్రయోగం విజయవంతం

  • సూర్యుడి ఆవల గ్రహాలపై పరిశోధన

  • 200 గ్రహాల రూపురేఖలపై అన్వేషణ

imageటంపా: సూర్యుడి ఆవల ఏముందో తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సం స్థ (నాసా) ప్రయోగించిన టెస్ (ట్రాన్సిటింగ్ ఎగ్జోప్లానె ట్ సర్వే శాటిలైట్) ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్ కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.51 గంటలకు అం తరిక్షంలోకి దూసుకుపోయింది. రాకెట్ విజయవంతం గా నింగిలోకి  దూసుకుపోయిందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. వాషింగ్ మెషీన్ పరిణామంలో ఉన్న అత్యాధునిక టెస్ శాటిలైట్‌ను ఫాల్కన్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు.  విశ్వంలో సుమారు 20 వేల వరకు గ్రహాలు ఉన్నాయని,  ఇందులో 50 వరకు భూమితో సమాన పరిణామంలో గ్రహాలు ఉన్నాయని, మరో 500 వరకు గ్రహాలు భూమి కన్నా రెండురెట్లు పెద్దవిగా ఉన్నాయని భావిస్తున్నారు.  ఇవన్నీ దాదాపు 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. టెస్ ఉపగ్రహం వీటిని గురించి పరిశోధిస్తుంది. వీటి గురించి తెలుసుకునేందుకే నాసా ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టింది. ఏలియన్ ప్రపంచాల అన్వేషనలో ఉన్న కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ కంటే ‘టెస్’ మెరుగ్గా పనిచేస్తుంది. రాత్రి వేళల్లో 400 రెట్లు ఎక్కువ ప్రదేశాన్ని ఇది స్కాన్ చేయగలదు. నాసా ప్రయోగించిన ‘టెస్’ రెండేళ్ల వ్యవ దిలో వీటిని అన్వేషించనుంది. ఆ గ్రహాలను గుర్తించిన వెంటనే మరిన్ని పరిశోధనల కోసం నాసా 2020లో జెమ్స్ వెబ్ అనే మరో టెలిస్కోప్‌ను ప్రయోగించనుంది.  ‘టెస్’ సూర్యుడికి అవల ఉండే విశ్వంలో అడుగుపెట్ట నుంది. సూర్యుడితో సమానంగా కాంతులు వెదజల్లే నక్షత్రాల దిశగా ప్రయాణం సాగిస్తుంది. వాటి వివరాల ను సేకరించనుంది.2009లో నాసా ప్రయోగించిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ఇప్పటికే సౌర వ్యవస్థ అవతల 3700 గ్రహాలను గుర్తించింది.వీటిలో తప్పకుండా ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ఉంటారని భావిస్తున్నారు.ఆయా గ్రహాల్లో సైతం భూమి తరహాలో సముద్రాలు, పర్వత ప్రాంతాలు ఉంటాయని నమ్ముతున్నారు.

60 రోజుల తర్వాత పని ప్రారంభం..
ఈ ప్ర యోగం జరిగిన 60 రోజుల తర్వా త ‘టెస్’ తన అన్వేష ణ మొదలుపెడుతుం ది. అప్పటి వరకు భూకక్ష్యలోనే అది పరిభ్రమించ నుంది. ఈ శాటిలైట్‌ను అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్త లు రూపొందించారు.ఇందులో మొత్తం నాలుగు కెమేరాలు ఉన్నాయి



అంగారకుడిపై నీటి ఆనవాళ్లు?

Updated By ManamMon, 02/19/2018 - 04:31

Water on Marsఅంగారకుడిపై నీటి ఆనవాళ్లు కనుగొనేందుకు నాసా శాస్త్రవేత్తలకు మార్గం సుగమం అయ్యింది. అరుణ గ్రహంపై ‘పర్సెవరెన్స్ వ్యాలీ’ గా పిలుస్తున్న ప్రాంతంలో నీటిని పోలిన చారలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) గుర్తించింది. ఇవి నీటి చారలే అయ్యుంటాయని ఆ సంస్థ అభిప్రాయపడింది. 2004 లో ప్రయోగించిన మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ప్రత్యేకమైన ఈ చారలను గుర్తించింది. పర్వత వాలు ప్రాంతాల్లో నీటితో కూడుకున్న మట్టి గడ్డకట్టి ఇలాంటి చారలు ఏర్పడే అవకాశముందని నాసా పరిశోధకులు తెలియజేస్తున్నారు. నాసా ప్రయోగించిన ‘మార్స్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ రోవర్‌ ఆపర్చునిటీ’ అరుణగ్రహంపై ఐదువేల రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నీటి ఆనవాళ్లను పోలి ఉన్న చిత్రాలను గుర్తించింది. వీటి ఆధారంగా మరింత లోతుగా పరిశోధనలు చేసి అంగారకుడిపై నీటి జాడ గుట్టును తెలసుకోనున్నట్లు తెలిపారు. 



మార్స్‌పై రోవర్ సెల్ఫీ

Updated By ManamFri, 02/02/2018 - 19:56

nasaఅంగారకుడి ఉపరితలంపైనున్న ఓ కొండపై సెల్ఫీ తీసుకుంటున్న క్యూరియాసిటీ రోవర్.. వేరా రూబిన్ రిడ్జ్‌గా వ్యవహరిస్తున్న ఈ పర్వతంపై అధ్యయనంలో భాగంగా రోవర్ పలు చిత్రాలను తీసి పంపింది. పనిలోపనిగా తన పరిస్థితిని చూపించే డజనుకు పైగా చిత్రాలనూ తీసింది. ఫొటోలో పైకి లేచిన రోవర్ చేతిని, అందులోని కెమెరాను చూడొచ్చు. ఈ ఫొటోల్లో రెండింటిని కలిపి ఇదిగో ఇలా సెల్ఫీ ఫోజులో నాసా విడుదల చేసింది. 



మార్స్ కాదు ముందు చంద్రుడిపైకి పంపండి

Updated By ManamWed, 12/13/2017 - 09:10

Donald Trumpవాషింగ్టన్: చంద్రుడిపైకి మరోసారి అమెరికన్లను పంపించాలంటూ అమెరికా అంతరిక్ష కేంద్రం నాసాను కోరారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు కొత్త అమెరికా స్పేస్ పాలసీకి సంతకం చేసిన ట్రంప్ అనంతరం మాట్లాడుతూ.., "ఈసారి చంద్రుడిపై అమెరికా జెండానే కాదు.. అమెరికన్‌ పాదాల అచ్చులుకూడా ఉండాలంటూ" తెలిపారు.

భవిష్యత్తులో ప్రజలను మార్స్‌కు పంపే యోచనలో నాసా ఉంది కాబట్టి. అంతకన్నా ముందు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపితే ఆ ప్రయోగానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే చంద్రుడిపై మరోసారి వెళ్లేందుకు మిషన్‌లను ప్రారంభిస్తే అందుకు చాలా ఖర్చవుతుందని భావించిన అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేశారు. దీనికి బదులు 2030లోగా అమెరికన్లను మార్స్‌కు పంపే విషయంపై దృష్టి పెట్టేలా అప్పట్లో అంతరిక్ష విధానాన్ని రూపొందించారు. కానీ ఇప్పుడు ట్రంప్‌ మాత్రం మరోసారి అమెరికన్లను చంద్రుడిపైకి పంపించే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ఇతర దేశాలకు చెందిన ప్రైవేట్‌ రంగాలతో కూడా ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 1969లోనే అమెరికాకు చెందిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై మొట్టమొదటిసారిగా కాలుమోపారు. ఆ తర్వాత హారిసన్‌ ష్మిట్‌ కూడా చంద్రుడిపై గడిపారు.
 





Related News