suresh productions

C/O కంచరపాలెం రివ్యూ

Updated By ManamFri, 09/07/2018 - 13:23
C/O Kancharapalem

చేసే ప్ర‌య‌త్నంలో నిజాయ‌తీ.. చెప్పాల‌నుకున్న దాన్ని సూటిగా, హ‌త్తుకునేలా ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు దాన్ని రీచ్ ఎక్కువ‌గా ఉంటుంది. అందుకు ప‌రిస్థితులు కూడా కూడి వ‌స్తాయి. ఇప్ప‌డు `కేరాఫ్ కంచ‌ర‌పాలెం` సినిమా విష‌యంలో అదే జ‌రుగుతుది. ద‌ర్శ‌కుడు వెంక‌టేశ్ మ‌హా ఓ మెయిన్ పాయింట్‌ను బేస్ చేసుకుని చివ‌రి వ‌ర‌కు రివీల్ చేయ‌కుండా నాలుగు జంట‌ల క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రించిన ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం. ఇంత‌కు కంచ‌ర‌పాలెంలో వెంక‌టేశ్ మ‌హా ఏం చెప్పాడు? అత‌ను చెప్పాల‌నుకున్న విష‌య‌మేంటి? అనే సంగ‌తుల‌ను తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం. 
నటీనటులు: సుబ్బారావు, రాధా బెస్సి,కార్తీక్‌ రత్నం, ప్రణీత పట్నాయక్‌,  మోహన్‌ భగత్‌, ప్రవీణ పరుచూరి,  కేశవ కర్రి, నిత్యశ్రీ గోరు తదితరులు.
బ్యాన‌ర్‌: సురేశ్‌ ప్రొడక్షన్స్‌  
సమర్పణ: రానా దగ్గుబాటి 
నిర్మాత: విజయ ప్రవీణ పరుచూరి 
దర్శకత్వం: వెంకటేశ్‌ మహా 
సంగీతం: స్వీకర్‌ అగస్థి 
కూర్పు: రవితేజ 
ఛాయాగ్రహణం: వరుణ్‌ చపేకర్‌, ఆదిత్య జవ్వాది 

క‌థ:
గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్‌లో అటెండ‌ర్‌గా ప‌నిచేసే రాజు(సుబ్బారావు)కి 49 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి కాదు. అదే ఆపీస్‌లో పెద్ద ఆఫీస‌ర్‌గా వ‌చ్చిన 42 రాధ‌(రాధా బెస్సి)కి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి ప్రేమ పుడుతుంది. అయితే అప్ప‌టికే రాధ‌కు ఇర‌వై యేళ్ల కూతురుంటుంది. త‌న కుటుంబం త‌న‌ను త‌ప్పుగా అనుకుంటుందేమోన‌ని, లోకం త‌న‌ను ఏమ‌నుకుంటుందోన‌ని రాజు ఆలోచ‌న‌లో ఉంటారు. 
ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దివే సుంద‌రం(కేశ‌వ కర్రి), త‌న క్లాస్ మేట్ సునీత‌(నిత్య‌శ్రీ గోరు)ని ఇష్ట‌ప‌డ‌తాడు. ముందు సుంద‌రంతో సునీత మాట్లాడ‌దు. సుంద‌రం తండ్రి బొమ్మ‌లు చేస్తుంటాడు. వినాయ‌క చ‌వితికి తండ్రి చేసి వినాయ‌కుడి బొమ్మ‌కు దండం పెట్టుకున్న రోజున సుంద‌రంతో సునీత మాట్లాడుతుంది. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో సునీత ఊరు విడిచి పెట్టి వెళ్లిపోతుంది. అప్పుడు సుంద‌రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు. ఆ నిర్ణ‌యం అత‌ని జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? జోసెఫ్‌(కార్తీక్ ర‌త్నం) అనాథ‌, అమ్మోరు అనే వ్య‌క్తి చెప్పిన వాళ్ల‌ని కొడుతూ చిన్న చిత‌కా ప‌నులు చేస్తుంటాడు. ఓ గొడ‌వ‌లో భార్గ‌వితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. గొడ‌వ‌తో ప్రారంభ‌మైన ఇద్ద‌రి ప‌రిచ‌యం ప్రేమ‌కు దారి తీస్తుంది. మ‌రి వీరి ప్రేమకు అడ్డుప‌డే విష‌యాలేంటి? వైన్ షాప్‌లో ప‌నిచేసే గ‌డ్డం(మోహ‌న్ భ‌గ‌త్‌).. స‌లీమా అనే ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె వేశ్య అని తెలిసినా పెళ్లిచేసుకోవాల‌నుకుంటాడు. చివ‌ర‌కు వారి జీవితం ఎలాంటి మ‌లుపు తిరిగింది? నాలుగు జీవితాలకు మెయిన్ పాయింట్ ఏంటోతెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:
నటీనటుల విషయానికి వస్తే.. నాలుగు జంటల్లో రాజు, రాధ జోడికి ఎక్కువ మార్కులు వేయాల్సిందే. ముఖ్యంగా సినిమాలో సందర్భానుసారం వచ్చే కామెడీ అంతా రాజు పాత్ర కారణంగా వచ్చిందే. పెళ్లి కానీ రాజు పాత్రలో సుబ్బారావు .. భర్త చనిపోయి కూతురున్నా మళ్లీ పెళ్లి చేసుకోవాలనే తల్లి పాత్రలో రాధ బెస్సి.. వేశ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే గడ్డం పాత్రలో మోహన్ భగత్.. ప్రేమించిన వాడి కోసం పరితపించే సలీమా పాత్రలో ప్రవీణ పరుచూరి, అనాథ అయిన జోసెఫ్ ప్రేమ కోసం బుద్ధిమంతుడిగా మారిపోతే.. ప్రేమించినా కులం కోసం ప్రేమను వదులుకునే బ్రాహ్మణ యువతి భార్గవిగా ప్రవీణ పట్నాయక్ చక్కగా నటించారు. వీరు తప్ప మరొకరు ఈ పాత్రలు చేయలేరనేంత చక్కగా నటించారు. వీరు నటన పరంగా సినిమాకు ఎంత ప్లస్ అయ్యారో అంతే మైనస్ కూడా ఉంది. ఆడియెన్ కొత్త ముఖాలను కనెక్ట్ చేసుకుని సినిమా చూడాలనుకోడు.. ఒకవేళ అలా అనుకోవాలంటే అందరూ కొత్తవాళ్లే కావడంత సినిమాకు సమయం పడుతుంది. ఇక దర్శకుడు వెంకటేశ్ మహా సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ప్రతి పాత్రను, సన్నివేశాన్ని నేటివిటీకి దగ్గరగా చిత్రీకరించాడు.  వరుణ్ చపేకర్, ఆదిత్య జవ్వాది కెమెరా వర్క్ కారణంగా ప్రేక్షకుడు ఆ నేటివిటీని ఫీల్ అవుతాడు. స్వీకర్ అగస్థి సంగీతం, నేపథ్య సంగీతం మెచ్చుకునేలా ఉంది. ఇలాంటి క‌థ‌, క‌థనాన్ని న‌మ్మి సినిమాను నిర్మించిన నిర్మాత విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి, సినిమాను ప్రేక్ష‌కుల‌కు చేర‌వేయ‌డానికి ముందుకు వ‌చ్చిన సురేశ్ ప్రొడ‌క్షన్స్ అభినందనీయులు. సినిమాలో ద‌ర్శ‌కుడు చెప్పిన పాయింట్‌లో కొత్త‌దనం లేదు. అయితే తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. స్లో నెరేష‌న్ వంటివి మిన‌హా సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. 
కేరాఫ్ కంచ‌ర‌పాలెం... కాన్సెప్ట్ పాత‌దే.. అయితే ప్ర‌య‌త్న‌మే కొత్త‌ది
రేటింగ్: 3/5



దసరాకు రానున్న ‘అదుగో’..!

Updated By ManamMon, 08/20/2018 - 14:32

Adugoపందిపిల్ల ప్రధానపాత్రలో విభిన్న దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ అనుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సురేశ్ బాబు నిర్మించారు.



ఈ నగరానికి ఏమైంది? రివ్యూ

Updated By ManamFri, 06/29/2018 - 14:57
ene

రిలీజ్ డేట్‌: 29.06.2018
యాక్ట‌ర్స్: విశ్వక్సేన్‌ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అభివన్‌ గోమతం, వెంకటేష్‌ కాకుమాను, అనిషా ఆంబ్రోస్‌, సిమ్రన్‌ చౌదరి తదితరులు 
మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌ 
కెమెరా: నికిత్‌ బొమ్మి 
ప్రొడ్యూస‌ర్‌: డి.సురేష్‌బాబు 
డైర‌క్ట‌ర్‌: తరుణ్‌ భాస్కర్‌ 
బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ 

త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం తొలి సినిమా `పెళ్లి చూపులు`తో మంచి హిట్‌ని అందుకున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన రెండో సినిమా ` ఈ న‌గ‌రానికి ఏమైంది` శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ తాజా సినిమాను సురేశ్ ప్రొడ‌క్షన్స్ నిర్మించింది. గ‌త సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు టెక్నిక‌ల్ ప‌రంగా మ‌రింత ఖ‌ర్చుపెట్టి తీశాన‌ని అన్నారు త‌రుణ్‌. క‌థ విన‌గానే న‌చ్చ‌డంతో గో ఎ హెడ్ అన్న‌ట్టు సురేశ్ ఇదివ‌ర‌కే చెప్పారు. సో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల కాన్ఫిడెన్స్ స్క్రీన్ మీద‌కు ఎంత ట్రాన్స్ ఫ‌ర్ అయిందో హావ్ ఎ లుక్‌...
క‌థ‌:
వివేక్ (విష్వ‌క్సేన్‌ నాయుడు), కార్తీక్‌(సుశాంత్‌రెడ్డి), కౌశిక్‌(అభినవ్ గోమటం), ఉపేంద్ర(వెంకటేశ్‌ కాకుమాను) అనే న‌లుగురు స్నేహితులు క‌లిసి ఓ షార్ట్ ఫిల్మ్ తీసి త‌మ ప్యాష‌న్‌ను నిరూపించుకుని సినిమాల్లోకి వెళ్లాల‌ని అనుకుంటారు. అయితే వారిలో వివేక్‌కి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ‌. ప్ర‌తిదానికీ భ‌య‌ప‌డుతుంటాడు. అత‌ని మ‌న‌స్త‌త్వానికి త‌గ్గ‌ట్టుగానే ఓ అమ్మాయి అత‌ని జీవితంలోకి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి వెళ్లిపోతుంది. తాను తీసే షార్ట్ ఫిల్మ్స్ కి ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోతే ఫ్రెండ్స్ కూడా ఎక్క‌డ త‌న‌ని వ‌దిలి వెళ్లిపోతారోన‌ని బాధ‌ప‌డుతుంటాడు. దాంతో అత‌నికి ఫ్రెండ్స్ దూర‌మ‌వుతుంటారు. ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన ఉద్యోగాలు చేసుకుంటుంటారు. కార్తిక్ కి పెళ్లి కుద‌ర‌డంతో స్నేహితుల‌కు పార్టీ ఇస్తాడు. ఆ పార్టీ హైద‌రాబాద్ నుంచి మ‌త్తులో గోవాకు చేరుతుంది. ఆ పార్టీలో కార్తిక్ ఎంగేజ్‌మెంట్ రింగ్ మిస్ అవుతుంది. దాని కోసం ఆ స్నేహితులు ప‌డ్డ పాట్లు ఏంటి? అప్ప‌టిదాకా షార్ట్ ఫిల్మ్స్ కి దూరంగా ఉన్న వాళ్లు.. మ‌ర‌లా ఏం చేశారు? వ‌ంటివి ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

స‌మీక్ష‌
న‌టీన‌టులు పాత్ర‌ల్లో ఒదిగిపోతే సినిమా స‌గం స‌క్సెస్ అయిన‌ట్టే. ఈ సినిమాకు ఆడిష‌న్స్ నిర్వ‌హించి కొత్త‌వారిని తీసుకుని మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్‌. న‌టీన‌టులంద‌రూ త‌మ పాత్ర‌ల్లో ఇట్టే ఒదిగిపోయారు. గోవాలోగానీ, ఫారిన‌ర్స్ ని చూపిస్తున్న‌ప్పుడుగానీ ఎక్క‌డా అశ్లీల‌త‌కు తావివ్వ‌లేదు. అక్క‌డ అంత జాగ్ర‌త్త‌లు తీసుకున్న త‌రుణ్ సినిమా క‌థ విష‌యంలో ఎందుకో ఆ జాగ్ర‌త్త‌ను తీసుకోలేదు. న‌లుగురు కుర్రాళ్లు త‌మ ప్యాష‌న్ కోసం ఏదో చేయ‌డం అనేది తెలుగు తెర‌కి కొత్త క‌థ కాదు. చాలా పాత క‌థే. నిజానికి బోర్ క‌థ‌. కానీ ఈ సినిమాలో త‌రుణ్ చూపించిన జిమ్మిక్కులు ప‌నిచేశాయి. ఆ జిమ్మిక్కు ఏంటంటే మ‌ద్యం సేవించేట‌ప్పుడు పుట్టే కామెడీని ప‌ట్టుకున్నాడు. న‌లుగురు స్నేహితులు కూర్చుని మ‌ద్యం తాగుతుంటే వాళ్లు ఎలా మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ మ‌ధ్య గొడ‌వ‌లు ఎలా ఉంటాయి.. వాటిని మ‌రొక‌రు ఎలా అర్థం చేసుకుంటారు?  తాగిన త‌ర్వాత ఎవ‌రు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు?  అస‌లు యువ‌త‌కు కావాల్సింది ఏంటి?  సంతోష‌మే అయితే అది యుస్ సంబంధాల‌లోనూ, డాల‌ర్ల‌లోనూ ఉందా? వ‌ంటి చాలా విష‌యాల‌ను అంత‌ర్లీనంగా చిత్రీక‌రించాడు. కామెడీని రాయ‌గ‌లిగిన ర‌చ‌యిత బారులోనే రాయాల్సిన అవ‌స‌రం లేదు. దానికి వేరే నేప‌థ్యాన్ని కూడా తీసుకొని ఉండ‌వ‌చ్చు. కానీ ఎందుకో ఆయ‌న ప‌బ్‌ల‌కే ఓటు వేశారు. పూర్తిగా యువ‌త‌ను ఉద్దేశించి తీసే ఈ సినిమాలో అన్ని తాగుడు సీన్ల‌ను పెట్ట‌కుండా ఉంటే బావుండేది. క‌డుపుబ్బ న‌వ్వించి, త‌న మార్కు స‌హ‌జ‌త్వానికి మ‌రోసారి గిరాకీ ఉంద‌ని ప్రూవ్ చేసుకున్నాడు త‌రుణ్‌. ఇది పూర్తిగా ద‌ర్శ‌కుడి సినిమానే అయినా, ప‌రిశ్ర‌మ‌కు మ‌రికొంద‌రు న‌టీన‌టులు దొరికార‌న‌డంలో అనుమానం లేదు. ప‌బ్ క‌ల్చ‌ర్‌, గోవా, ఫ్రెండ్స్, న‌చ్చింది చేయ‌డం, ప్యాష‌న్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఈ క‌థ అర్థ‌మ‌వుతుంది. ఎంజాయ్ చేస్తారు. కానీ అందులో తాగుడు సీన్ల‌ను చూసి ఇన్‌స్ప‌యిర్ కాక‌పోతే మ‌రీ మంచిది.
ఎండింగ్ వ‌ర్డ్:  యూత్‌కి న‌చ్చుతుంది

రేటింగ్‌: 2.75/5



‘ఈ నగరానికి ఏమైంది?’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే!

Updated By ManamSun, 06/24/2018 - 13:22

ENEనలుగురు కొత్త వాళ్లతో ‘పెళ్లి చూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ఈ నగరానికి ఏమైంది? ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. సోమవారం(జూన్ 25న) హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.

ఇక ఈ చిత్రంలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్, వెంకటేశ్ కాకుమాన్ హీరోలుగా కనిపిస్తుండగా.. అనీషా అంబ్రోన్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు.  
 



‘ఈ నగరానికి ఏమైంది?’ ట్రైలర్ టాక్

Updated By ManamSun, 06/10/2018 - 10:43

Ee Nagaraniki Emaindi  ‘పెళ్లిచూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈ నగరానికి ఏమైంది. విశ్వసేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతమ్, వెంకటేశ్ కకుమాను ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం కామెడీతో నిండిన ఈ ట్రైలర్ అందరి చేత నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ చిత్రంలో అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్‌పై సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.



‘ఈ నగరానికి ఏమైంది?’ మోషన్ పోస్టర్

Updated By ManamFri, 06/01/2018 - 14:43

ee nagaraniki emaindi ‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘నీ గ్యాంగ్‌తో థియేటర్‌కు రా చూస్కుందాం’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. అందులో నలుగురు కొత్తవాళ్లు ఉండగా వారి కారెక్టర్లను రివీల్ చేశాడు. కాగా ఈ చిత్రం ద్వారా విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కకుమాను పరిచయం అవుతుండగా అనీశా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా కనిపించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

 



వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్‌

Updated By ManamSat, 10/21/2017 - 17:16

'గురు' చిత్రం త‌రువాత మ‌రో సినిమా చేయ‌ని విక్ట‌రీ వెంక‌టేష్‌.. ఎట్ట‌కేల‌కు కొత్త ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 'నేనే రాజు నేనే మంత్రి'తో చాలా కాలం త‌రువాత విజ‌యం అందుకున్న తేజ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. న‌వంబ‌ర్‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాలో వెంకీతో పాటు మ‌రో హీరో కూడా న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. నారా రోహిత్ గానీ, సుమంత్ గానీ ఆ పాత్ర చేసే అవ‌కాశ‌ముంద‌ట‌. అనూప్ రూబెన్స్ సంగీత‌మందించే ఈ చిత్రంలో  ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థానముండ‌గా వారిలో ఒక‌రిగా మెహ‌రీన్ ఎంపికైంద‌ని స‌మాచార‌మ్‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.





Related News