Nick Jonas

మొదలైన పెళ్లి సందడి

Updated By ManamMon, 10/29/2018 - 11:21

Priyanka Chopraబాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇంట పెళ్లి సందడి మొదలైంది. అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో ప్రియాంక త్వరలో ఏడు అడుగులు వేయబోతోంది. దీనికి సంబంధించిన న్యూయార్క్‌లోని ప్రియాంక ఇంట ప్రీ వెడ్డింగ్ పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో బ్రైడ్ అని పూలతో డిజైన్ చేసిన ఓ అలంకరణ ముందు నిల్చొన్న ప్రియాంక ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కాగా డిసెంబర్‌లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్‌లో జరగనున్న ప్రియాంక, జోనస్‌ల వివాహానికి దాదాపు 200మంది అతిథులు హాజరు అవ్వనున్నారు. ఆ తరువాత లాస్‌ఏంజెల్స్‌, ముంబయిలో ప్రముఖులకు వారు విందు ఇవ్వనున్నారు.కిస్సింగ్ ఫోటో షేర్ చేసిన హీరోయిన్

Updated By ManamWed, 09/26/2018 - 17:05
Heroine Sonam Kapoor-Anand Ahuja share kissing pic

ఇటలీ : బాలీవుడ్ హీరోయిన్ సోనంకపూర్, ఆనంద్ అహుజా జంట ప్రస్తుతం ఇటలీలో సందడి చేస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్ వేడుకలో పాల్గొన్న హాట్ కపుల్ ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్నారు.

సోనం కపూర్ ఈ సందర్భంగా తన భర్తకు ఇచ్చిన ‘ముద్దు’ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను సోనం కపూర్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా ఈ ఏడాది మే నెలలో సోనం-ఆనంద్ అహుజా వివాహం ముంబైలో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. 

మరో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా తన ఫియాన్సీ నిక్ జోనస్‌తో కలిసి ఇటలీలోని ‘లేక్‌ కోమో’లో జరిగిన ఇషా అంబానీ నిశ్చితార్థ వేడుకకు హాజరు కాగా, పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వేడుకకు విచ్చేశారు.మా ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కలిగిందంటే

Updated By ManamTue, 09/11/2018 - 10:06

Priyanka Chopra, Nick Jonasగత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ఇటీవలే నిశ్చితార్ధం చేసుకొని తమ బంధాన్ని బలపరుచుకున్నారు. అయితే అసలు వారు ఎలా పరిచయం అయ్యారు..? వారిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు కలిగింది,  అనే విషయాలు పెద్దగా ఎవరికీ తెలీవు. వీటి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నిక్ జోనస్.

ప్రియాంక, తను కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యామని.. ఫస్ట్‌ మెసేజ్‌లతో సాగిన తమ బంధం ఆ తరువాత ఫోన్ కాల్స్‌తో ప్రేమ వరకు వచ్చిందని తెలిపాడు. ఇక తాము పర్సనల్‌గా కలవడానికి ఆరు నెలల సమయం పట్టిందని, ఫస్ట్‌ టైమ్ తామిద్దరం మెట్ గాలా ఈవెంట్‌లో కలిశామని పేర్కొన్నాడు. మొదట్లో మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉండేవారిమని, కానీ తమ మధ్య ఏదో ఉందని తమ స్నేహితులు అనుకుండేవారని చెప్పుకొచ్చాడు. అయితే ఐదు నెలల క్రితమే తమ రిలేషన్‌షిప్ పట్ల తాము సీరియస్‌గా ఉన్నామని ఫీల్ అయ్యామని, ఆ తరువాత వెంటనే ఎంగేజ్ అయిపోయామని నిక్ చెప్పాడు. ఇక ఇద్దరికీ కలిపి ప్రిక్ అని పెట్టిన పేరు తనకు నచ్చిందని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో వీరిద్దరు వివాహం చేసుకోవడానికి మరో రెండేళ్లు పడచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రియాంక పెళ్లి ఎక్కడో తెలుసా...!!

Updated By ManamWed, 08/22/2018 - 21:41

Priyanka Chopra

ప్రియాంక.. ప్రియాంక ఎవరు చూసినా ఈ ముద్దుగుమ్మ పెళ్లెప్పుడు...? ఎక్కడ చేసుకుంటున్నది? అనే విషయంపై అభిమానులు మొదలుకుని నెటిజన్ల వరకూ అందరూ చర్చించుకుంటున్నారు. నిశ్చితార్థం ఇటీవల అయిపోయింది కానీ పెళ్లెప్పుడనే విషయం మాత్రం తెలియరాలేదు. దీంతో ఆమె అభిమానులు ఎప్పుడు ప్రకటిస్తారా అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే ప్రియాంక్-నిక్‌ల పెళ్లిపై ఎట్టకేలకు చిన్నపాటి క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్‌ చివర్లో లేదా అక్టోబర్ చివరి నెలలో ప్రియాంక పెళ్లి జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు ఇప్పటికే పెళ్లి ఎక్కడ జరపాలి అనే విషయంపై ప్రియాంక-నిక్ కుటుంబాలు చర్చించుకున్నాయని తెలుస్తోంది. అమెరికాలోని హవాయి దీవులంటే నిక్‌కు ఎనలేని ఇష్టమట. అందుకే నిక్ ఇష్టమైన ప్రదేశంలోనే పెళ్లి జరపాలని కుటుంబీకులు అనుకున్నారట. ఈ విషయం ప్రియాంక చెవిన వేయగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. దీంతో పెళ్లి అక్కడే జరపాలని ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. 

Priyanka Chopra

ఇప్పటికే అక్కడ వేదిక, గెస్ట్ రూమ్స్ బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతిథులుగా ఎవర్ని పిలవాలి..? సినీ, రాజకీయ ప్రముఖులను ఎవరెవర్ని పిలవాలి? అనే విషయమై లిస్ట్ తయారు చేసే పనిలో ప్రియాంక ఫ్యామిలీ నిమగ్నమైందని సమాచారం. అక్కడ పెళ్లయిపోయిన తర్వాత ముంబైలో గ్రాండ్‌గా పార్టీ  స్నేహితులు, ఇండస్ట్రీలోని ప్రముఖులకు పార్టీ ఇవ్వాలని భావిస్తున్నారట. కాగా మీడియాకు చాలా దూరంగా పెళ్లి వేడుక నిర్వహించాలని ఈ జంట భావిస్తోందట. వేడుక అనంతరం కొన్ని ఫొటోలు, వీడియోలను అభిమానులను పంచుకోవాలనుకుంటున్నారట. అయితే మీడియా కంట పడకుండా ఎంత మాత్రం సీక్రెట్ పెళ్లి జరుపుతారో చూడాల్సిందే మరి.

Priyanka Chopra And Nick Jonas' Wedding Destination Revealed

మొత్తానికి చూస్తే.. ఈ జంట ప్రేమ మొదలుకుని పెళ్లి వరకూ అన్నీ మూడో కంటికి తెలియకుండానే చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ మీడియాలో మాత్రం లీకవుతూనే ఉన్నాయి. ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు హోటళ్లలో, ఎయిర్‌పోర్టులో వీరిరివురు మీడియా కంట పడ్డ సందర్భాలు కోకొల్లలు. అయితే పెళ్లి ఎలా జరుగుతుంది..? కేవలం ఇరు కుటుంబీకుల మధ్యనే వేడుక జరుగుతుందా లేకుంటే బాలీవుడ్ తరలివస్తుందా? అనేది మాత్రం తెలియరాలేదు. కాగా మీడియా, అభిమానులకు దూరంగా పెళ్లి చేసుకోవాలన్నది విరుష్క (విరాట్- అనుష్క) జంటతో ట్రెండ్ మొదలయిన సంగతి తెలిసిందే.

Priyanka Chopra And Nick Jonas' Wedding Destination Revealedనెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న ప్రియాంక-నిక్‌ల వీడియో!

Updated By ManamSun, 08/19/2018 - 16:44

Exclusive : Priyanka Chopra and Nick Jonas dancing together in their engagement party

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్‌ నిక్ జోనస్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఆ ప్రేమ కాస్త పెళ్లి దాకా వెళ్లింది. ఇటీవల తన కుటుంబ సభ్యులతో ముంబాయ్ వచ్చిన నిక్.. ప్రియాంక కుటుంబీకులతో మాట్లాడి పెద్దలను ఒప్పించారు. మొత్తానికి ప్రియాంక-నిక్‌ల వివాహానికి పెద్దలు ఎలాంటి అడ్డు చెప్పకపోవడంతో నిశ్చితార్థం తంతు మాత్రం ముగిసిపోయింది. అయితే ఇక మిగిలింది పెళ్లి మాత్రమే.

శనివారం నాడు నిక్-ప్రియాంకల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ప్రియాంక స్వగృహంలోని దగ్గరి బంధువులు, కొందరు ముఖ్యమైన సెలబ్రటీల మధ్య ఈ వేడుక జరిగింది. ఈ శుభకార్యం భారతీయ సంప్రదాయంలో జరిగింది. పసుపు రంగు దుస్తుల్లో ప్రియాంక మెరిసిపోగా.. నిక్‌ మాత్రం అమెరికన్ సంప్రదాయం ప్రకారమే కుర్తా పైజామా ధరించాడు. ఇద్దరూ కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యానికి సంబంధించిన ఫొటోలను నిక్‌, ప్రియాంక ఇద్దరూ వారి ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన ఒకరు ఈ వేడుకను మొత్తం కెమెరాలో బంధించారు. ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

 

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

వీడియోలో ఏముందంటే...
వీడియోలో ప్రియాంక చోప్రా స్టెప్పులేస్తూ దుమ్ములేపుతుండగా.. నిక్ ఆమె వైపు వేలు చూపిస్తూ ఎస్.. ఎస్ అంటున్నట్లుగా తల ఊపుతున్నాడు. ప్రియాంక పక్కనున్న మరో నటి కూడా ఆమెతో పాటుగా డ్యాన్స్ చేస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నిక్, ప్రియాంక అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎట్టకేలకు ఇద్దరూ ఒక్కటయ్యారు.. అయ్యారు కాదూ సగం పెళ్లి అయినట్లేనని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ జంటకు బాలీవుడ్‌ తారలంతా వెల్లువలా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక సోదరి పరిణీతి చోప్రా, సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ శర్మ, నటుడు, నిర్మాత ముస్తక్‌ షైయక్‌ తదితరులు హాజరయ్యారని తెలుస్తోంది.

 

A post shared by Nick Jonas (@nickjonas) on

 ప్రియాంక ఇంట మొదలైన సంబరాలు

Updated By ManamSat, 08/18/2018 - 13:13

Priyanka Chopraబాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. గత నెలలో నిక్ జోనస్‌తో ప్రియాంక ఎంగేజ్‌మెంట్ అవ్వగా.. తాజాగా శనివారం ఇరు కుటుంబాల సమక్షంలో భారతీయ సంప్రదాయాల ప్రకారం మరోసారి నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఇందుకోసం నిక్ జోనస్ కుటుంబం ఇప్పటికే ముంబైకి చేరకుంది.

ఇదిలా ఉంటే ఈ రోజు పది గంటల సమయంలో ప్రియాంక ఇంటిలో పూజలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.  ఈ కార్యక్రమం అనంతరం విందు కార్యక్రమం, సాయంత్రం ఎంగేజ్‌మెంట్ పార్టీ ఉండనుందని తెలిసింది. ఇక సాయంత్రం జరిగే ఎంగేజ్‌మెంట్ పార్టీకి ప్రియాంకకు క్లోజ్‌గా ఉన్న బాలీవుడ్ ప్రముఖులు రానున్నట్లు సమాచారం.కుటుంబంతో ఇండియాకు వస్తున్న నిక్ జోనస్

Updated By ManamThu, 08/16/2018 - 12:08

Priyanka, Nickఅమెరికన్ సింగర్ నిక్ జోనస్ తన కుటంబంతో సహా భారత్‌కు రానున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ నిశ్చితార్థం జరగగా.. అతడి కుటుంబానికి ప్రియాంక ఫ్యామిలీ ట్రీట్ ఇవ్వనుంది. ఈ క్రమంలో నిక్ జోనస్ ఫ్యామిలీ సభ్యులు ఈ వారాంతంలో భారత్‌కు రానున్నారు. ఇక నిక్, ప్రియాంక ఇరు కుటుంబాల ఫ్యామిలీ సభ్యులు కూడా కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు వెల్లడించారు.

కాగా పెళ్లికి ముందు వధూవధుల కుటుంబాలు కలుసుకునే సంప్రదాయం ప్రియాంక కుటుంబసభ్యులు ఆచరిస్తుండగా.. అందులో భాగంగానే నిక్ జోనస్ ఫ్యామిలీ భారత్‌కు రాబోతుంది. అంతేకాదు సంప్రదాయాలకు విలువనిచ్చే ప్రియాంక, తన వివాహాన్ని కూడా భారత సంప్రదాయానికి అనుగుణంగా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో ఇరువురి సన్నిహితులు హాజరుకానున్నట్లు సమాచారం.ప్రియుడి పుట్టినరోజున ప్రియాంక వివాహం

Updated By ManamMon, 07/30/2018 - 13:26

Priyanka ప్రియుడు, అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లికి సిద్ధమైంది. ఈ క్రమంలో వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. నిక్ జోనస్‌ పుట్టినరోజైన సెప్టెంబర్ 16న వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దలు పనులు ప్రారంభించినట్లు సమాచారం. కాగా మరోవైపు వివాహం నేపథ్యంలో సల్మాన్ నటిస్తున్న భారత్ చిత్రం నుంచి ప్రియాంక తప్పుకున్న విషయం తెలిసిందే.  ప్రియుడితో ప్రియాంక పుట్టిన రోజు వేడుకలు 

Updated By ManamWed, 07/18/2018 - 20:23

Priyanka Chopra celebrates 36th birthday with boyfriend

బాలీవుడ్‌ సెక్సీ, గ్లోబల్‌ భామ ప్రియాంక చోప్రా 36వ పుట్టిన రోజు నేడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఘనంగా పుట్టిన వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే ప్రియాంక తన ప్రియుడు, అమెరికన్ సింగన్ నిక్ జోనాస్‌తో కలిసి లండన్‌లోని ఓ హోటల్‌లో వేడుకలు జరుపుకుంది. ఇప్పటికే పలుమార్లు ప్రియుడితో కలిసి అడ్డంగా బుక్కయిన ఈ భామ తాజాగా మరోసారి కెమెరా కంటపడింది. ఈ సెక్సీ భామ కనపడింది ఆలస్యం కెమెరామెన్‌లు క్లిక్కుమనిపించారు. అవును తాను నిక్‌తో కలిసి పుట్టిన రోజు జరుపుకున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక ఫొటోలను సైతం షేర్ చేసింది. కాగా ప్రియాంక ప్రస్తుతం లండన్‌లో ఉంది.ప్రియాంక చోప్రాకు ఎంగేజ్‌మెంట్..? 

Updated By ManamSun, 07/08/2018 - 16:26

Priyanka Chopra, Nick Jonas, spark engagement rumours, wearing matching gold ringsహాలీవుడ్ సినిమాల్లో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఆమె ప్రియుడు గాయకుడు నిక్ జోనాస్‌‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇరువురు తమ కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్, భారత్‌లో వివాహ వేడుకల్లో జంటగా కనిపిస్తున్నారు. గత ఏడాదిలో మమెట్ గాలాలో రొమాంటిక్ బైక్ రైడింగ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ప్రియాంక, నిక్ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Priyanka Chopra, Nick Jonas, spark engagement rumours, wearing matching gold ringsఈ వార్తలకు బలాన్ని చేకూర్చేలా ప్రియాంక, నిక్‌లకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ వార్త బాలీవుడ్‌లో పెద్ద టాపిక్‌గా మారింది. ఇటీవల ప్రియాంక, నిక్‌ జంటగా కనిపించినప్పుడు వారి చేతివేలికి ఒకే రకమైన బంగారు రింగులు ధరించారు. అంటే.. వీరిద్దరికి ఇదివరకే సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందని తెలుస్తోంది. భారత్‌కు వచ్చిన నిక్ ముంబైలో ఆకాశ్ అంబానీ ఎంగేజ్‌మెంట్‌లో ప్రియాంక చోప్రాతో జంటగా మెరిసాడు.
 

 

this is craziness?/ in Mumbai #priyankachopra #nickjonas

A post shared by Priyanka Chopra Fan Page ? ❤︎ (@pcourheartbeat) on

Related News