Geetha Govindam

‘గీత గోవిందం’కి అన్నీ సెట్ అయ్యాయి

Updated By ManamTue, 08/28/2018 - 21:33

imageవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా జి.ఎ2 పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా విడుదలైన సందర్భంగా దర్శకుడు పరశురాం సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన గురించి తెలియజేస్తూ ‘‘ప్రపంచంలోని అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. కలెక్షన్లు కూడా ఆనందంగా అనిపించాయి. అరవింద్‌గారికి, వాసుగారికి, విజయ్ దేవరకొండగారికి థాంక్స్. చిన్న సినిమాగా రెండేళ్ల క్రితం మొదలైంది. ఒక పెద్ద సినిమాకు ఎలా ఫీడ్ బ్యాక్ వస్తుందో... థియేటర్స్‌లోగానీ, రెవెన్యూ సైడ్‌గానీ అలాగే ఉంది. అందుకే ఇంత ఆనందంగా ఉంది. నేను డైరక్టర్ అయి పదేళ్లయింది.

2008లో నా తొలి సినిమా విడుదలైంది. మొత్తం ఆరు సినిమాలు డైరక్ట్ చేశాను. వాటిలో ఆడినవీ ఉన్నాయి. ఆడనవీ ఉన్నాయి. కానీ గీతగోవిందం దర్శకుడిగా, రచయితగా నన్ను ఇంకో స్థాయిలో నిలబెట్టింది. అయితే అన్ని సినిమాలకు నేను పడ్డ కష్టం ఒకటే. కాకపోతే దీనికి అన్నీ సెట్ అయ్యాయి. విజయ్‌కి ఉన్న క్రేజ్ కూడా చాలా హెల్ప్ అయింది. నేను నెక్స్‌ట్ చేయబోయే సినిమా ఓ మెంటర్‌కి, ఓ వ్యక్తికి సంబంధించిన కథతో ఉంటుంది. ఆ సినిమా వివరాలు త్వరలోనే తెలియజేస్తాను’’ అన్నారు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: విజయ్ దేవరకొండ

Updated By ManamFri, 08/24/2018 - 13:28

Vijay Devarakonda‘గీత గోవిందం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 40ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని ముందు అనుకున్నానని, అయితే ఇప్పుడు దానిని 35కు తగ్గించానని విజయ్ చెప్పుకొచ్చాడు. 

తన మైండ్ సెట్‌కు పెద్దలు కుదిర్చిన పెళ్లి సెట్ అవ్వదని, అందుకే ప్రేమ వివాహాన్నే చేసుకుంటానని పేర్కొన్నాడు. ‘‘ఆమె తెలంగాణకు చెందిన అమ్మాయి అవ్వొచ్చు, కాకపోవచ్చు, ఏ దేశం అమ్మాయి అయినా ఉండొచ్చు. ముందు మేమిద్దరం కనెక్ట్ అవ్వాలి. ఒకరినొకరు తెలుసుకోవాలి. గీత గోవిందంలో తన పాత్ర గోవిందం తరహాలో ప్రత్యేకమైన కోరికలు ఏవీ నాకు లేవు’’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.75కోట్ల క్లబ్‌లో ‘గీత గోవిందం’

Updated By ManamFri, 08/24/2018 - 09:24

Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం 75కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాడుతో పాటు ఆస్ట్రేలియా, యూఎస్‌లో ఈ చిత్రం తన హవాను కొనసాగిస్తోంది. ఇప్పటికే 75కోట్ల క్లబ్‌లో చేరిందంటే ఇక ఫుల్‌రన్‌లో ఈ చిత్రం మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. కాగా రొటీన్ స్టోరీ అయినప్పటికీ పరశురామ్ తెరకెక్కించిన తీరు, నటీనటుల సహజ నటన, గోపి సుందర్ మ్యూజిక్ ఈ చిత్రానికి మెయిన్ అస్సెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండకు మరో షాక్

Updated By ManamTue, 08/21/2018 - 11:00

Taxiwala‘గీత గోవిందం’ విజయాన్ని అనుభవిస్తున్న యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండకు మరో షాక్ తగిలింది. అతడి తదుపరి చిత్రం ట్యాక్సీవాలా హెచ్‌డీ ప్రింట్‌తో పూర్తి సినిమాను యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అప్‌లోడ్ చేశారని నిర్మాణ సంస్థ గుర్తించింది. దీంతో నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ దర్యాప్తును చేపట్టారు. దీనిపై మాట్లాడిన నిర్మాతలు.. ఇప్పటికే తాము తెలుగు ఫిలిమ్ చాంబర్‌ ఆధీనంలోని యాంటీ వీడియో పైరసీ సెల్‌కు ఫిర్యాదు చేశామని, వారి ద్వారా కీలక సమాచారం సేకరించి, ఆయా లింకుల్ని సైబర్ క్రైమ్ పోలీసులకు అందించామని తెలిపారు. ఇదిలా ఉంటే గీత గోవిందం కూడా విడుదలకు ముందే లీక్ అయింది. అయితే లీక్‌కు సంబంధం లేకుండా ఈ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.‘గీత గోవిందం’ హవా.. ఇద్దరు స్టార్ హీరోలను వెనక్కి నెట్టేసిన విజయ్

Updated By ManamMon, 08/20/2018 - 10:57

Geetham Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అమెరికాలో వన్ మిలియన్ క్లబ్‌లో చేరిన గీత గోవిందం, మరోవైపు ఆస్ట్రేలియాలో కూడా దూసుకుపోతోంది. ఆగష్టు 15న విడుదలైన ఈ చిత్రం అదే రోజు విడుదలైన రెండు బాలీవుడ్ మూవీలను కలెక్షన్లలో వెనక్కి నెట్టేసింది.

అక్షయ్ కుమార్ గోల్డ్, జాన్ అబ్రహాంల సత్యమేవ జయతే చిత్రాలు గీత గోవిందంతో పాటు విడుదల అవ్వగా.. వారాంతంలో ఆ రెండు చిత్రాలపై విజయ్ పైచేయి సాధించాడు. ‘గోల్డ్’, ‘సత్యమేమ జయతే’ చిత్రాలు రెండు కలిసి 192, 306 డాలర్లు కలెక్ట్ చేయగా.. ‘గీత గోవిందం’ ఒక్కటే 202, 266 డాలర్లను కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ప్రకటించాడు. రెండు హిందీ చిత్రాలను ఒక తెలుగు చిత్రం గట్టి పోటీ ఇస్తోందని ఆయన తెలిపాడు. మొత్తానికి బాలీవుడ్ చిత్రాలపై మరోసారి సత్తా చాటుతోంది తెలుగు చిత్రం.

 కేరళ వరద బాధితులకు ‘గీత గోవిందం’ టీం సాయం

Updated By ManamFri, 08/17/2018 - 14:30

Geetha Govindamభారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికి దాదాపు 50కి మంది పైగా మరణించగా.. వరద నీరు పెరిగిపోవడం, పలు భవనాలు ధ్వంసం అవ్వడంతో వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో పలు ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు కేరళ బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, కమల్ హాసన్, సూర్య, కార్తి, దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, సిద్ధార్థ్ విశాల్ తదితరులు వరద బాధితులకు విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా గీత గోవిందం టీం కేరళ బాధితులకు సాయం ప్రకటించింది.

గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం కేరళలోనూ విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. దీంతో కేరళలో వచ్చిన వసూళ్లన్నీ అక్కడ వరద బాధితుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్ణయం ప్రకారం కేరళలో గీత గోవిందంకు వచ్చే వసూళ్లన్నీ అక్కడ వరద బాధితుల కోసం విరాళంగా ఇవ్వనున్నాం అంటూ చిత్రవర్గాలు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాయి. వారి నటన కథకు అందాన్ని పెంచింది: చెర్రీ

Updated By ManamFri, 08/17/2018 - 11:32

Ram Charan, Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ‘గీత గోవిందం’ థియేటర్లలో దూసుకుపోతుండగా.. చిత్రాన్ని చూసిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గీత గోవిందంపై తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు.

అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ ఛేంజ్ఓవర్ చాలా బావుంది. విజయ్ దేవరకొండ, రష్మిత నటన చాలా బావుంది. వారి నటనతో కథకు మరింత అందం తీసుకొచ్చారు. గోపి సుందర్ సంగీతం బావుంది. చాలా బాగా రచించి, చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు పరశురామ్, నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2తో పాటు ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ అంటూ కామెంట్ పెట్టారు.

 

A perfect changeover after #ArjunReddy. It was a treat to watch Vijay Deverakonda and Rashmika Mandanna perform so...

Posted by Ram Charan on Thursday, August 16, 2018

 నా పెళ్లి ఆగిపోయిందా..!

Updated By ManamFri, 08/17/2018 - 10:30

Rashmika Mandanna‘ఛలో’తో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక మందన్న, ‘గీత గోవిందం’తో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో నాని సరసన దేవదాస్, విజయ్ దేవరకొండ సరసన కామ్రేట్‌లో నటిస్తోంది. ఇదిలా ఉంటే కిర్రిక్ పార్టీతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. గతేడాది ఈ ఇద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఇటీవల ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే వారిద్దరు నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇవి కాస్త రష్మిక వద్దకు చేరడంతో వాటిపై ఆమె స్పందించింది.

తామిద్దరం రెండున్నరేళ్ల తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఇప్పుడు నటనలో బిజీగా ఉండటంతో పెళ్లి చేసుకోవాలన్న తేదీలను నిర్ణయించుకోలేదని తెలిపింది. తమ పెళ్లి ఆగిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇక గీత గోవిందం సినిమా కోసం దాదాపు ఏడున్నర నెలలు పనిచేశానని, అందులో ఏడు నెలల పాటు కోపంతో నటిస్తే, చివరి 15రోజులు మాత్రం సరదాగా గడిపానని తెలిపింది.‘గీత గోవిందం’పై పలువురి ప్రశంసలు

Updated By ManamThu, 08/16/2018 - 15:06

Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ థియేటర్లలో దూసుకుపోతోంది. విడుదలకు ముందే ఈ చిత్రంలోని కొన్ని సీన్లు లీక్ అయినప్పటికీ.. రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ చిత్రాన్ని చూసిన మహేశ్ బాబు.. ‘‘గీత గోవిందం ఓ విజేత. సినిమా మొత్తం ఎంజాయ్ చేశాను. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా బాగా చేశారు. సుబ్బరాజు, వెన్నల కిశోర్‌లను ప్రత్యేకంగా పేర్కొనాలి. టీం మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ కామెంట్ పెట్టాడు. ‘‘గీత గోవిందం చూశాను. విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ ఇద్దరు ఉన్న ఏ చిత్రాన్నైనా చూస్తాను. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ సమంత స్పందించింది.

వీరితో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. ‘‘గీత గోవిందం చాలా బావుంది. విజయ్ దేవరకొండ నువ్వు చంపేశావు. రష్మిక మందన్నా నువ్వు సూపర్. వెన్నల కిశోర్ నిన్ను ప్రత్యేకంగా అభినందించాలి. మూలాలు మర్చిపోకూడదు. పరశురామ్ గ్రాండ్ సక్సెస్ నీ సొంతం. చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్’’ అంటూ పెట్టారు. అలాగే ‘‘గీత గోవిందం ఓ నవ్వుల ప్రవాహం. సినిమా మొత్తాన్ని ఎంజాయ్ చేశా. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ నిర్మాత శోభు యార్లగడ్డ పేర్కొన్నారు.గీత గోవిందంపై దర్శకధీరుడి ప్రశంసలు

Updated By ManamThu, 08/16/2018 - 09:21

Rajamouli, Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో థియేటర్లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసిన దర్శకధీరుడు రాజమౌళి మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.

‘‘గీత గోవిందం ఓ నవ్వుల ప్రవాహం. విజయ్ దేవరకొండ పాత్రను ఇలా ఊహించలేదు. అర్జున్ రెడ్డి తరువాత అతడి పాత్ర ఎంపిక బావుంది. ఏం చేస్తున్నాడో అతడికి బాగా స్పష్టంగా తెలుసు. సినిమా మొత్తం నవ్వులు పూయించింది. పరశురామ్ చిత్రాన్ని బాగా రచించి, దర్శకత్వం వహించారు. రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణమ్మ గారు, వెన్నల కిశోర్.. చాలా బాగా చేశారు. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ.. ‘‘మీ దగ్గర నుంచి ప్రశంసలు పొందడం ఎప్పటికైనా స్పెషల్’’ అంటూ కామెంట్ ఇచ్చాడు.

 

Related News