samantha

సమంతను రైల్వే స్టేషన్‌లో వదిలిన చైతూ

Updated By ManamTue, 11/20/2018 - 11:58
Naga Chaitanya, Samantha

హడావిడిగా సమంతను రైల్వేస్టేషన్‌లో దింపేశాడు చైతన్య. అదేంటి సమంతను చైతూ ఎక్కడికి పంపించేస్తున్నాడు అనుకుంటున్నారా.. మరేం లేదండి. వివాహం తరువాత చైతన్య, సమంత కలిసి మజిలి అనే చిత్రంలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రషూటింగ్ ప్రస్తుతం గోపాలపట్నంలో జరుగుతోంది.  

అందులో రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్‌లో సమంత ఉద్యోగినిగా సమంత నటిస్తోంది. షూటింగ్‌లో భాగంగా చైతన్య హడావిడిగా సమంతను రైల్వే స్టేషన్‌లో వదలడం, వెంటనే ఆమె టికెట్ కౌంటర్‌కు వెళ్లడాన్ని తెరకెక్కించారు. ఇక సమంత, నాగచైతన్య అక్కడ షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిసి వారి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాస్ మహంతి ఆధ్వర్యంలో గట్టి భద్రతను ఏర్పాటు చేశాడు. ఇక షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.విజయ్ జతగా...

Updated By ManamSat, 11/17/2018 - 01:46

తమిళ హీరో విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవల సినిమా గురించి అధికారిక సమాచారం వెలువడింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా విజయ్ సరసన నటించబోయే ఇద్దరు హీరోయిన్స్‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేసిందట.

with Vijay


ఒకరు నయనతార, మరొకరు సమంత విజయ్‌తో జతకట్టబోతున్నారని సమాచారం. ఇది వరకు నయనతార, సమంత విజయ్‌తో వేర్వేరు సినిమాల్లో కలిసి నటించారు. కానీ.. ఇద్దరు ఓ హీరోతో కలిసి నటించనుండటం ఇదే తొలిసారి. కల్పాతి అఘోరం నిర్మించబోయే ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నారు. ‘తెరి, మెర్సల్’ చ్రితాలు తర్వాత విజయ్, అట్లీ కలయికలో రాబోతున్న చిత్రమిది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 రెండు పాత్రల్లో సమంత

Updated By ManamSun, 11/11/2018 - 05:50

imageవరస విజయాలను సాధిస్తూ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్న సమంత మరో విభిన్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ చిత్రాన్ని తెలుగులో నందినిరెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంత వృద్ధ మహిళగా కనిపించనుంది. కథ ప్రకారం వృద్ధ మహిళ తనకున్న శక్తులతో 20 ఏళ్ళ అమ్మాయిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. దర్శకురాలు నందినిరెడ్డి ఈ రెండు క్యారెక్టర్లను సమంతతోనే నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట 20 ఏళ్ళ అమ్మాయి క్యారెక్టర్ కోసం కొంతమంది అమ్మాయిలను పరిశీలించినప్పటికీ ఆ క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్ కాకపోవడంతో ఆ క్యారెక్టర్ కూడా సమంతే చేస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.  ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
 

image


 బుల్లితెరపైనా ‘రంగస్థలం’ రికార్డు

Updated By ManamThu, 10/25/2018 - 12:19

Rangasthalamమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ ఏడాది మార్చి చివర్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించగా.. తాజాగా వెండితెరపైనా దూసుకుపోయింది. ఇటీవలే ‘రంగస్థలం’ మొదటి ప్రీమియర్ స్టార్ మాలో ప్రదర్శించబడగా.. 19.5టీఆర్పీ రేటింగ్‌ను సాధించింది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో మహానటి అత్యధిక టీఆర్పీని సాధించగా.. ఆ తరువాత రంగస్థలం నిలిచింది. దీంతో మెగాభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా రామ్ చరణ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సమంత, అనసూయ తదితరులు కీలక పాత్రలలో నటించగా.. కేరళలో ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.మరోసారి నాగశౌర్య, సమంతలతో..

Updated By ManamSat, 10/20/2018 - 00:07

imageటాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత తాజా నందినిరెడ్డి దర్శకత్వంలో నటించబోతోందన్న వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య నటించే అవకాశం ఉందట. నందినిరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, సమంత గతంలో సినిమాలు చేశారు. సమంత ‘జబర్దస్త్’ చిత్రంలో నటించగా, నాగశౌర్య ‘కళ్యాణవైభోగమే’ చిత్రంలో నటించారు. బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో సమంత 70 ఏళ్ళ వృద్ధురాలిగా నటిస్తుందని సమాచారం. మొదలైన చైతన్య- సమంత చిత్రం

Updated By ManamSat, 09/29/2018 - 13:02

Samantha, Naga Chaitanyaటాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య- సమంత కలిసి నాలుగో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మజిలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా.. తాజాగా ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ప్రస్తుతం చైతన్య, సమంతలు ఫారిన్ ట్రిప్‌లో ఉండగా.. వారిద్దరు కాకుండా మిగిలిన పాత్రాధారులపై దర్శకుడు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. ఇక త్వరలోనే చైతన్య, సమంత ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నారు. కాగా వివాహానంతరం వచ్చిన మనస్పర్థలను భార్య, భర్త ఎలా పరిష్కరించుకున్నారో అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. సాహు గారపాటి, హరీశ్ పెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెళ్లి తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఘాటుగా స్పందించిన సమంత

Updated By ManamSat, 09/29/2018 - 00:52

imageఅందరికీ సమాచారం అందించడానికి, తమ భావాలను ఇతరులతో పంచుకోవడానికి సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడుతుంది. అదే సమయంలో కొంతమంది వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేయడం ద్వారా వారిని బాధ పెట్టడానికి కూడా ఈ మీడియా తోడ్పడుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీస్‌కి ఈ బెడద ఎక్కువ ఉంటుంది. ఈమధ్య హీరోయిన్ సమంత వేసుకున్న డ్రెస్‌పై రెండు రోజులుగా చర్చ జరుగుతోంది.

అక్కినేని ఫ్యామిలీలోకి వచ్చాక ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవడం ఏంటి?.. డ్రెస్ బాగోలేదు.. వెంటనే ఫోటోను తీసేయ్.. అంటూ కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టారు. దీనిపై సమంత ఘాటుగా స్పందించారు. ‘‘నేను పెళ్ళయిన తర్వాత ఎలా ఉండాలో చెబుతున్న వారందరికీ ఇదే నా సమాధానం’ అంటూ మధ్య వేలు చూపిస్తూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీనిపైనా కొంతమంది నెటిజన్లు మండిపడగా, మరి కొంతమంది సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వాడి వేడి చర్చ ఇంతటితో ముగుస్తుందా? లేక ఇంకా కొనసాగుతుందో చూడాలి.యూ టర్న్ వండర్‌ఫుల్ మూవీ

Updated By ManamWed, 09/19/2018 - 01:16

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యూ టర్న్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో పార్లమెంట్ సభ్యులు కె.కవిత మాట్లాడుతూ  ‘‘యూ టర్న్ వండర్‌ఫుల్ మూవీ. ఒక పక్క భయపెడుతూనే చాలా మంచి మెసేజ్‌ను ఇచ్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి సమంత భయపడటం లేదు. రంగస్థలంలో తను పోషించిన పాత్రకు.. ఈ సినిమాలో తను పోషించిన పాత్రకు చాలా తేడా ఉంది.

తను బ్రిలియంట్ యాక్టర్. ఇలాంటి సినిమాలు తను మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు పవన్‌కుమార్ మాట్లాడుతూ ‘‘పూర్ణచంద్ర నాతో లూసియా సినిమా నుండి వర్క్ చేస్తున్నారు. నాకు ఎలాంటి మ్యూజిక్ కావాలో దాన్ని అందించడంలో పూర్ణచంద్ర ఎప్పుడూ సక్సెస్ అవుతూ వచ్చారు. తెలుగు నాకు సరిగ్గా రాకపోయినా నా కో డైరెక్టర్స్ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇక సమంతగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సమంత, పవన్‌కుమార్ లేకపోతే యూ టర్న్ మూవీ లేదు. ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఆరు వందల థియేటర్స్ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సమంత మా సినిమాను చేయడానికి అంగీకరించినందుకు ఆనందంగా ఉంది.

image


అలాగే పవన్‌కుమార్‌గారికి థాంక్స్. తమిళంలో కూడా సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇది రెగ్యులర్‌కి భిన్నమైన చిత్రం. ఆదరిస్తున్న అందరికీ థాంక్స్’’ అన్నారు. సమంత మాట్లాడుతూ ‘‘నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఏదో కమర్షియల్ సినిమా చేయాలని కాకుండా కంటెంట్‌పై నమ్మకంతో సినిమా చేశారు. డైరెక్టర్ పవన్‌కుమార్‌కి థాంక్స్. ఒకే సినిమాతో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సక్సెస్ అందుకున్నారు. ఆయనతో వర్క్ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇది సోషల్ మెసేజ్ సినిమా అని అర్థం చేసుకుని అందరూ ఎంకరేజ్ చేశారు. అందరికీ థాంక్స్’’ అన్నారు. ‘‘రంగమ్మా.. మంగమ్మా’’.. మరో రికార్డమ్మా

Updated By ManamMon, 09/17/2018 - 09:29

Rangamma Mangammaరామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలోని ప్రతి విభాగం అందరినీ ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంతో మరోసారి తన మ్యూజిక్ సత్తాను చాటాడు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. మొత్తం ఆరు పాటలు ఉండగా.. ప్రతి పాట అందరినీ మెప్పించేలా కంపోజ్ చేశాడు. కాగా ఈ చిత్రంలోని రంగమ్మా మంగమ్మా వీడియో పాట  ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన ఈ పాట తాజాగా 100మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. దీంతో 100మిలియన్లు సాధించిన రెండో తెలుగు పాటగా రంగమ్మా.. మంగమ్మా నిలిచింది. దేవీ శ్రీ మ్యూజిక్, మానసి వాయిస్‌కు తోడు సమంతల ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాట ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకునేలా చేసింది. కాగా బాహుబలిలోని సాహోరో బాహుబలి పాట తెలుగులో మొదటి 100మిలియన్ల వ్యూస్‌ను సాధించి, రికార్డు సృష్టించింది.తెలుగులో ఇప్పటికి కుదిరింది

Updated By ManamSat, 09/15/2018 - 23:11

imageసమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు.  ఈ సినిమా  సెప్టెంబర్ 13న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు పవన్‌కుమార్ మాట్లాడుతూ ‘‘సినిమాలో చూపించిన ఫ్లైఓవర్ బెంగుళూరులో ఉంది. నాలుగైదు సంవత్సరాలు ఆ ఫ్లై ఓవర్ మీద తిరిగాను. అప్పుడు అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. దాని ఆధారంగా నేను ఈ స్టోరీని డెవలప్ చేశాను. తెలుగు సినిమా విషయానికి వస్తే మేం చేసింది రీమేక్ కాదు. అడాప్టేషన్ మాత్రమే.

చివరి 30 నిమిషాలు తెలుగులో డిఫరెంట్‌గా చేశాం. కన్నడలో తక్కువ బడ్జెట్, ఎక్స్ పెరిమెంటల్ అప్రోచ్‌తో చేశాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది చాలా పెద్దదైంది. లార్జర్ దేన్ లైఫ్‌గా చేశాం. తెలుగులో చేసిన చివరి 30 నిమిషాలను తక్కువ బడ్జెట్‌లో కన్నడలో చేయలేకపోయాం. మామూలుగా మనం సిగ్నల్స్ జంప్ చేస్తాం. దానికి సిగ్గుపడం. పోలీసులు ఫైన్ వేసినా సిగ్గుపడం. కానీ అక్కడ జరిగేది తప్పు అయినప్పుడు సిగ్గుపడాలి, పశ్చాత్తాప పడాలి. అందుకే నేను ఈ సినిమాలో ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేశాను. ఏదో ఒక భయం ఉంటే తప్ప మనం సరిగా ప్రవర్తించం. ఇందులో సమంత చాలా అద్భుతంగా చేశారు. కన్నడ వెర్షన్ ట్రైలర్ విడుదలైనప్పుడు ఆమె చూశారు.

మమ్మల్ని స్క్రిప్ట్ పంపమని అడిగారు. నేను ఎలా పంపడం అని ఆలోచిస్తుండగా, ఆమె మరలా ఫాలో అప్ చేశారు. దాంతో డేర్ చేసి పంపించాను. చదివి హ్యాపీగా ఫీలయ్యారు. మధ్యలో ఒకసారి నాగచైతన్య మమ్మల్ని బెంగుళూరులో కలిశారు. ఆ తర్వాత మా కన్నడ వెర్షన్ విడుదలకు పది రోజుల ముందు నాగచైతన్య, సమంత బెంగుళూరు వచ్చి మమ్మల్ని కలిసి సినిమా చూశారు. మా సినిమా ప్రమోషన్‌లోనూ పాల్గొన్నారు. అప్పుడే సమంత ఈ సినిమాను చేస్తానన్నారు. కానీ ఆమెకు ఉన్న ప్రాజెక్టుల కారణంగా ఆమె ఈ సినిమాను చేయలేదు. ఇన్నాళ్లకు కుదిరింది’’ అన్నారు. 

Related News