Pawan Sadineni

అనిరుధ్ పాట, సమంత ఆట.. అదరగొడుతున్న యూటర్న్ ప్రమోషనల్ సాంగ్

Updated By ManamMon, 09/03/2018 - 10:43

U turnసమంత ప్రధానపాత్రలో పవన్ తెరకెక్కించిన చిత్రం ‘యూటర్న్’. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు తనే ఆలపించగా.. సమంత డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. కాగా కన్నడలో వఘన విజయం సాధించిన యూటర్న్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి.



నాగ్ ఒప్పుకొంటారా?

Updated By ManamMon, 06/25/2018 - 13:04

nag, kalyan ram క‌ల్యాణ్‌రామ్ న‌టించిగా విడుద‌లైన `నా నువ్వే` ఆయ‌న‌కు డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అందుకే ఆయ‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఆచి తూచి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న ప‌వ‌న్ సాదినేని క‌థ‌ను ఓకే చేశారు. ఇందులో క‌ల్యాణ్‌రామ్‌తో పాటు మ‌రో స్టార్ హీరో కూడా ఉంటారు. ఆ పాత్ర కోసం నాగార్జున‌ను సంప్ర‌దిస్తున్నారు. అయితే నాగార్జున ఇంకా ఓకే చెప్పిందీ, లేనిదీ తెలియ‌లేదు. నాగార్జున‌ను ఒప్పించ‌డంలో ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు గుణ్ణం గంగ‌రాజు కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ట‌. క‌ల్యాణ్ రామ్ త‌న సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తెర‌కెక్కించే ఈ సినిమాకు గుణ్ణం గంగ‌రాజు స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నాగార్జున అంగీక‌రిస్తే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్ నుంచి మొద‌ల‌వుతుంద‌ని వినికిడి. నాగార్జున ప్ర‌స్తుతం నానితో ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 





Related News