samantha

సమంత ఖాతాలో ఏడు మిలియన్లు

Updated By ManamWed, 09/05/2018 - 13:22

Samanthaవివాహం తరువాత కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత సోషల్ మీడియాలో కూడా సత్తాను చాటుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ ఖాతాలో ఏడు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో శృతీహాసన్ తరువాత 7మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. కాగా సమంత నటించిన తాజా చిత్రాలు ‘సీమరాజా’, ‘యూటర్న్’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.సమంత పాత్రలో మేఘా ఆకాశ్..?

Updated By ManamTue, 09/04/2018 - 14:43

Megha Akash‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన మేఘా ఆకాశ్ కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఘన విజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో మేఘా ఆకాశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. శింబు ఇందులో హీరోగా నటిస్తుండగా.. ఈ నెల చివరి వారంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటి షెడ్యూల్‌లోనే మేఘా జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో సమంత పాత్రలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సుందర్.సి దర్శకత్వం వహించనున్నాడు.అనిరుధ్ పాట, సమంత ఆట.. అదరగొడుతున్న యూటర్న్ ప్రమోషనల్ సాంగ్

Updated By ManamMon, 09/03/2018 - 10:43

U turnసమంత ప్రధానపాత్రలో పవన్ తెరకెక్కించిన చిత్రం ‘యూటర్న్’. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు తనే ఆలపించగా.. సమంత డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. కాగా కన్నడలో వఘన విజయం సాధించిన యూటర్న్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి.ఓ మంచి పని కోసం...

Updated By ManamSun, 09/02/2018 - 01:36

imageదక్షిణాదిలో హీరోయిన్‌గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సమంత నటిగానే కాదు సమాజ సేవ చేయడంలోనూ మంచి పేరు తెచ్చు కుంటున్నారు. ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్రచికిత్స చేయించేందుకు నిధులను సేకరిస్తున్నారు. అందులో భాగంగా చెన్నయ్ వెళ్ళిన సమంత ట్రిప్లికేన్‌లోని జామబజార్ వెళ్ళారు.

అక్కడ రోడ్డు పక్కనే ఉన్న ఓ కూరగాయల దుకాణం యజimageమానికి విషయం చెప్పారు. అకస్మాత్తుగా కూరగాయల దుకాణంలో సమంత ప్రత్యక్షం కావడంతో జనం ఆ షాపు చుట్టూ గుమిగూడారు. అక్కడికి వచ్చినవారికి ఏమేం కావాలో కనుక్కొని కూరగాయలు అమ్మడం మొదలుపెట్టారు. పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి అందరూ కూరగాయలు కొనుకోలు చేశారు. నిమిషాల వ్యవధిలో షాపులోని కూరగాయలన్నీ అయిపోయాయి.సెప్టెంబ‌ర్ 13న స‌మంత ’యు ట‌ర్న్‘

Updated By ManamTue, 08/28/2018 - 15:14

u turn యు ట‌ర్న్ విడుద‌ల తేదీ సెప్టెంబ‌ర్ 13న ఖ‌రారైంది. స‌మంత అక్కినేని,ఆది పినిశెట్టి ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన యు ట‌ర్న్ ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. త‌మిళ‌,తెలుగులో క‌లిపి దాదాపు 6.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. యు ట‌ర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు,త‌మిళ్ లో తెర‌కెక్కించారు.

రెండు భాష‌ల్లోనూ ఒకేరోజు విడుద‌ల కానుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్, భూమికా చావ్లా యు ట‌ర్న్ లో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు యు ట‌ర్న్ చిత్రాన్ని నిర్మించారు. 
 చైతూ కోసం మనసు మార్చుకున్న సమంత

Updated By ManamFri, 08/24/2018 - 10:30

Chaithu, Samanthaఓ వైపు చైతన్య, సమంత దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే కెరీర్ పరంగా ఈ ఇద్దరు మొదటిసారి పోటీ పడాల్సి వచ్చింది. కానీ ఈ విషయంలో భర్త కోసం సమంత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా మారుతి శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం మామూలుగా ఆగష్టు 31న విడుదల అవ్వాల్సి ఉంది. అయితే రీ రికార్డింగ్‌లో ఆలస్యం అవ్వడం వలన వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

ఇక మరోవైపు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యూటర్న్’ చిత్రాన్ని అదే రోజున విడుదల చేయాలని ఎప్పుడో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను వాయిదా వేయడం లేక ముందే విడుదల చేయడం చేయాలని సమంత భావిస్తుందట. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి విడుదల తేదిని 27వ తేదిన ప్రకటిస్తామని తాజాగా ప్రకటించింది సమంత. దీంతో చై కోసం సామ్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జీవితంలోనే కాకుండా కెరీర్ పరంగా కూడా ఈ ఇద్దరి అండర్‌స్టాడింగ్ అందరినీ మెప్పిస్తోంది.నేనేం చెయ్యలేదు సర్

Updated By ManamFri, 08/17/2018 - 15:07

U Turnసమంత అక్కినేని ప్రధానపాత్రలో పవన్ తెరకెక్కించిన చిత్రం ‘యూటర్న్’. కన్నడలో విజయం సాధించిన యూటర్న్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఇందులో రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీనివాస చిత్తురీ, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించగా.. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.బిగ్‌సి బ్రాండ్‌కి సమంత ప్రచారం

Updated By ManamFri, 08/17/2018 - 06:26

samanthaహైదరాబాద్: కొత్త రూపు సంతరించుకున్న బిగ్ సి బ్రాండ్ లోగోను గురువారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. బిగ్ సి బ్రాండ్ గత 16 ఏళ్ళ ప్రయాణంలో ఉన్నతమైన ఎత్తుకు ఎదిగింది. పొందికగా నేటి స్మార్ట్ ఫోన్ల వలే ఆకర్షణీయంగా కనిపించేలా  ఈ కొత్త లోగో రూపొందించారు. అమ్మకాలు, సేవల ప్రమాణాలలో పూర్వపు నాణ్యత, స్థిరత్వమే కొనసాగుతాయని తెలియజేయడానికి సంకేతంగా బ్రాండ్ రంగులలో మార్పు తీసుకురాలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాత కాలానికి చెందిన చిహ్నంలో  కొత్త చిహ్నం మూలాలు పొందుపరచడం గమనించవలసిన విశేషమన్నారు.  బిగ్ సి దృష్టిలో కస్టమరే ఆరాధ్య దైవమని బిగ్‌ సి స్థాపకుడు ఎం. బాలు చౌదరి అన్నారు. మొదట్లో రూ. 15 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం ప్రస్తుతం రూ. 1500 కోట్లకు చేరినట్లు ఆయన తెలిపారు. బిగ్ సి బ్రాండ్‌కి ప్రకటన కర్తగా సమంత అక్కినేని వ్యవహరించనున్నారని ఆయన వెల్లడించారు. ఈ సెప్టెంబర్‌లో తమిళ నాడు మా ర్కెట్‌లో ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కస్టమర్లకు గొప్ప ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని మొబైల్స్‌పై ఉచితంగా బీమా రక్షణ కల్పించడం వాటిలో ఒకటి. ‘‘బిగ్ సితో అనుబంధం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని సమంత అన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ సి డైరెక్టర్లు వై. స్వప్న, జి. బాలాజి రెడ్డి, కైలాస్ లఖ్యాని, ఆర్. గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సికి 225కి పైగా దుకాణాలున్నాయి. ‘గీత గోవిందం’పై పలువురి ప్రశంసలు

Updated By ManamThu, 08/16/2018 - 15:06

Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ థియేటర్లలో దూసుకుపోతోంది. విడుదలకు ముందే ఈ చిత్రంలోని కొన్ని సీన్లు లీక్ అయినప్పటికీ.. రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ చిత్రాన్ని చూసిన మహేశ్ బాబు.. ‘‘గీత గోవిందం ఓ విజేత. సినిమా మొత్తం ఎంజాయ్ చేశాను. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా బాగా చేశారు. సుబ్బరాజు, వెన్నల కిశోర్‌లను ప్రత్యేకంగా పేర్కొనాలి. టీం మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ కామెంట్ పెట్టాడు. ‘‘గీత గోవిందం చూశాను. విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ ఇద్దరు ఉన్న ఏ చిత్రాన్నైనా చూస్తాను. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ సమంత స్పందించింది.

వీరితో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. ‘‘గీత గోవిందం చాలా బావుంది. విజయ్ దేవరకొండ నువ్వు చంపేశావు. రష్మిక మందన్నా నువ్వు సూపర్. వెన్నల కిశోర్ నిన్ను ప్రత్యేకంగా అభినందించాలి. మూలాలు మర్చిపోకూడదు. పరశురామ్ గ్రాండ్ సక్సెస్ నీ సొంతం. చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్’’ అంటూ పెట్టారు. అలాగే ‘‘గీత గోవిందం ఓ నవ్వుల ప్రవాహం. సినిమా మొత్తాన్ని ఎంజాయ్ చేశా. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ నిర్మాత శోభు యార్లగడ్డ పేర్కొన్నారు.చై, సామ్‌ మూవీ టైటిల్ ఇదేనా..!

Updated By ManamThu, 08/16/2018 - 11:28

Naga Chaitanya, Samanthaటాలీవుడ్ క్రేజీ కపుల్ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం కోసం టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లైన భార్య భర్తల మధ్య జరిగే కథాంశంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మజిలి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా వివాహం తరువాత చైతన్య, సమంత నటిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Related News