Nannu Dochukunduvate

దర్శకేంద్రుడి మనసు దోచుకుంది...

Updated By ManamSun, 09/23/2018 - 12:58
  • నన్ను దోచుకుందువంటే...చిత్రానికి రాఘవేంద్రరావు ప్రశంసలు..

raghavendra rao comments on nannu dochukunduvate

సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో మెట్ట‌మెద‌టి చిత్రం గా న‌న్నుదోచుకుందువ‌టే చిత్రం ప్ర‌పంచంలో వున్న తెలుగు ప్రేక్ష‌కులందరి హృదయాల్ని దోచుకుంటోంది. సుధీర్‌బాబు, న‌భా న‌టేష్ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి ఆర్‌.ఎస్ నాయిడు ద‌ర్శ‌కుడు. సూపర్ పాజిటివ్ పబ్లిక్ టాక్ తో ఈ చిత్రం కలెక్షన్స్ పెరుగుతుండడం విశేషం. మొద‌టి రోజు కంటే రెండో రోజు క‌లెక్ష‌న్స్ మూడు రెట్లు అధికంగా పెరగడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. సినీ ప్రేక్ష‌కుల్నే కాకుండా చాలా మంది సెల‌బ్రిటిస్‌ని ఈ చిత్రం విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. 

ముఖ్యంగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, వంశీ పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్‌, ఇంద్ర‌గంటి మెహ‌న‌కృష్ణ‌,  నాని, సందీప్ కిషన్, బి.వి.య‌స్ రవి, గోపి మెహ‌న్‌, అడ‌విశేషు లాంటి స్టార్స్ తమ ప్రశంసల్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. అయితే శ‌తాధిక ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌కేంద్రుడు శ్రీ రాఘ‌వేంద్ర‌రావు ఈ చిత్రాన్ని చూసి  ప్ర‌త్యేకంగా యూనిట్ ని పిలిచి ప్రోత్సహించి శుభాశిస్సులు అందించడం విశేషం.. ఈ చిత్రం ఆయ‌న మ‌న‌సుని దోచుకుంద‌ని... ముఖ్యంగా హీరోయిన్ న‌భా నటేష్ దోచుకుంద‌ని యూనిట్ తో త‌న ఆనందాన్ని పంచుకున్నారు.  ఈ సందర్భంగా 

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఏమన్నారంటే...

‘సుధీర్ బాబు ఫస్ట్ ప్రొడక్షన్స్ కి కంగ్రాట్స్. ఫస్ట్ ప్రొడక్షన్ లోనే మంచి సినిమా తీశావు. చిన్న సినిమా... పెద్ద సినిమా అనే తేడా లేదు. సినిమా ప్రేక్షకులకందరికీ నచ్చితే పెద్ద సినిమా అవుతుంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పెద్ద సినిమా తీయడం... సక్సెస్ కొట్టడం చాలా కష్టం. దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. సుధీర్ బాబు సినిమాలన్నింటిలోకి ఇందులో పెర్ ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. నెంబర్ వన్ గా చేశాడు. చాలా రియలిస్టిక్ గా చేశాడు. నభా నటేష్ చాలా చక్కగా చేసింది. పెర్ ఫార్మెన్స్ వేరీ వెరీ గుడ్. రియల్లీ ఇన్‌స్పైర్ డ్. 

ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కూడా ఒక్క షాట్ కూడా తప్పు లేకుండా... ఎక్కడ ఏం వాడాలో... ఎక్కడ డ్రోన్ వాడాలో... చక్కగా కట్ చేశాడు. ఫొటోగ్రఫి చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నన్ను దోచుకుందువటే పెద్ద సినిమా కిందే లెక్క. పెద్ద మైనస్ ఏంటంటే... ఒక్క తప్పు కూడా లేకపోవడం... కొత్త గా తీసే వాళ్లంటే నాకు చాలా బాగా ఇష్టం. కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది టీం. కంగ్రాట్యూలేషన్స్ అండ్ అల్ ది బెస్ట్’. అని అన్నారు.‘నన్ను దోచుకుందువటే’ రివ్యూ

Updated By ManamFri, 09/21/2018 - 12:53
Nannu Dochukunduvate

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి రాణి పోసాని
బ్యాన‌ర్‌:  సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు:  సుధీర్‌బాబు, న‌భా న‌టేశ్‌, నాజ‌ర్‌, తుల‌సి, సుద‌ర్శ‌న్, పృథ్వీ, జీవా, వైవా హ‌ర్ష‌ త‌దిత‌రులు
సంగీతం: అజ‌నీశ్ లోక్‌నాథ్‌
కెమెరా: సురేశ్ ర‌గుతు
ఎడిటింగ్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌
నిర్మాత :  సుధీర్‌బాబు
ద‌ర్శ‌క‌త్వం :  ఆర్‌.ఎస్‌.నాయుడు

ఇన్ని రోజులు హీరోగా రాణించిన సుధీర్‌బాబు ఉన్న‌ట్లుండి ట‌ర్న్ తీసుకుని నిర్మాత‌గా కూడా మారాడు. త‌నే హీరోగా, నిర్మాత‌గా చేసిన చిత్రం `నన్నుదోచుకుందువ‌టే`. టైటిల్ వింటేనే ఇదొక ల‌వ్‌స్టోరి అని ఎవ‌రికైనా అర్థ‌మైపోతుంది. కాబ‌ట్టి క‌థ గురించి, సినిమా ఎలా ఉంటుందో అని ప్ర‌త్యేకంగా ప్రేక్ష‌కుడు ఆలోచించుకునే పని ఉండ‌దు. `స‌మ్మోహ‌నం` వంటి స‌క్సెస్ త‌ర్వాత ఆర్‌.ఎస్‌.నాయుడు అనే కొత్త ద‌ర్శ‌కుడు సుధీర్‌బాబు చేసిన ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌రకు స‌త్ప‌లితాన్నిచ్చిందో తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం

క‌థ:
కార్తీక్ (సుధీర్ బాబు) ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌గా ఉంటాడు. త‌న‌కు అమెరికా వెళ్లాల‌నేదే ల‌క్ష్యంగా ఉంటుంది. ఆ ల‌క్ష్యంతో చిన్న‌ప్పుడే త‌ల్లి చనిపోయినా.. తండ్రి(నాజ‌ర్‌)కి దూరంగా హాస్ట‌ల్స్‌లో పెరుగుతాడు. రోజులో 18 గంట‌ల‌కు పైగా ఆఫీస్ వ‌ర్క్‌లోనే ఉంటాడు. కార్తీక్ పెళ్లిని అత‌ని మేన‌కోడ‌లుతో చేయాల‌ని అత‌ని తండ్రి నిశ్చ‌యిస్తాడు. అయితే త‌న మేన‌కోడ‌లు మ‌రొక‌రిని ప్రేమిస్తుంద‌ని తెలుసుకుని.. త‌న‌కు సిరి అనే గ‌ర్ల్‌ఫ్రెండ్ ఉంద‌ని అబ‌ద్ధం చెబుతాడు. అది నిజమా?  కాదా?  అని తెలుసుకోవ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చిన తండ్రి కోసం షార్ట్ ఫిలింస్‌లో న‌టించే మేఘ‌న‌(న‌భా న‌టేశ్‌)ను సిరిగా యాక్ట్ చేయ‌మంటాడు. సిరి ప్ర‌వ‌ర్త‌న‌, క‌లుపుగోలుత‌నం కార్తీక్ తండ్రికి నచ్చుతుంది. ఈ ప్ర‌యాణంలో కార్తీక్‌, మేఘ‌న‌లు ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ‌తారు. వారి ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకోవాల‌నుకునే స‌మ‌యంలో అనుకోని మ‌లుపులు తీసుకుంటుంది క‌థ‌. ఆ మ‌లుపులేంటి?  చివ‌ర‌కు కార్తీక్‌, మేఘ‌న ఒక్క‌ట‌య్యారా?   కార్తీక్ అమెరికా వెళ్లాల‌నే ల‌క్ష్యం నేర‌వేరిందా?  అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్‌:
- నటీన‌టుల ప‌నితీరు
-కెమెరా పనిత‌నం
- ఫ‌స్టాఫ్‌లో వైవా హ‌ర్ష‌, సుధీర్ కామెడీ ట్రాక్‌

మైన‌స్ పాయింట్స్‌:
- క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
- అన్ని వ‌ర్గాల‌ను మెప్పించే  కంటెంట్ కాదు
- ట్యూన్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ సోసోగానే ఉంది

Nannu Dochukunduvate


విశ్లేష‌ణ‌
ఈ మ‌ధ్య‌నే `స‌మ్మోహ‌నం`తో హిట్ అందుకున్న క‌థానాయ‌కుడు సుధీర్‌బాబు. ఇందులో ప‌ర్ఫెక్ట్ కేర‌క్ట‌ర్‌ని ప్లే చేశారు. ప‌నిలో సిన్సియారిటీ ఉన్న బాస్‌గా కాస్త ఎక్కువ బాగా న‌టించారు. తండ్రి ముందు బాధ‌ప‌డే కొడుకుగా న‌టించే స‌న్నివేశాల్లో ఇంకాస్త మెచ్యూరిటీ కావాలేమోననిపించింది. అల్ల‌రిపిల్ల‌గా, నేటి త‌రానికి ప్ర‌తినిధిలా న‌భా చ‌క్కగా న‌టించింది. న‌భా తెలుగమ్మాయి కాదంటే ఎవ‌రూ న‌మ్మ‌రేమో. సౌత్ ఇండియ‌న్ గ‌ర్ల్ కాబ‌ట్టి ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి త‌న‌కి. సింగిల్ మ‌ద‌ర్‌గా, కూతురి ఇష్టాయిష్టాల‌ను అర్థం చేసుకునే త‌ల్లిగా తుల‌సి చ‌క్క‌గా న‌టించారు. మిగిలిన పాత్ర‌లు కూడా వాటి ప‌రిధి మేర‌కు బాగానే చేశారు. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు కూడా తెర‌పై క‌నిపించింది. ఇన్నేళ్లుగా ఎన్ని సినిమాల్లో న‌టించినా రానంత లాభం ఈ సినిమాతో వ‌చ్చింద‌ని ఆ మ‌ధ్య సుధీర్ బాహాటంగానే చెప్పారు. అజ‌నీష్ సంగీతం ఇంకాస్త విన‌సొంపుగా ఉంటే బావుండేది. ఎడిటింగ్ విష‌యంలోనూ కాసింత క‌త్తికి ప‌దును పెట్టాల్సింది. డైలాగులు ఎఫెక్టివ్‌గా రాసుకుని ఉంటే బావుండేది. నిజానికి మంచి డైలాగులకు స్కోప్ ఉన్న సినిమా ఇది. చూసినంత సేపూ స‌ర‌దాగా సాగుతుంది. మాస్ ప‌ల్స్ ని అందుకునే స‌న్నివేశాలు మాత్రం త‌క్కువ‌గానే ఉన్నాయి. బీ,సీల్లో ఎలా ఆడుతుందో చూడాలి. మ‌ల్టీప్లెక్స్ మ‌న‌సుల‌ను మాత్రం దోచుకుంటుంది.
బాట‌మ్ లైన్‌: మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ ని `దోచుకుందువ‌టే`
రేటింగ్‌: 2.5/5కొడుకో.. కూతురో పుట్టినట్లు అనిపిస్తుంది - సుధీర్‌బాబు

Updated By ManamWed, 09/19/2018 - 20:01
nannu dochukundhuvate

సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై సుధీర్‌బాబు, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘నన్నుదోచుకుందువటే’. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడు. ఈ నెల 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘‘సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేసి నన్నుదోచుకుందువటే అనే టైటిల్ పెట్టాడంటే.  డైరెక్టర్ స్పాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘సమ్మోహనం’ సినిమాలో సుధీర్ పెర్‌పార్మెన్స్‌కు ఫ్యాన్ అయ్యాను. అజనీష్ ట్యూన్ సెన్స్ బావుంది. సురేశ్ ఫోటోగ్రఫీ కాంటెంపరరీగా ఉంది. నభా నటేశ్ చాలా ఎక్స్‌ప్రెసివ్ హీరోయిన్.

    సుధీర్ ప్యాషన్‌తోనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే ప్యాషన్ తనను ఇంకా ముందుకు తీసుకెళుతుంది’’ అన్నారు. ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ ‘‘నేను చేసిన పదిహేను నిమిషాల షార్ట్‌ఫిలిం చూసి నచ్చడంతో సుధీర్‌బాబుగారు సినిమా ప్రొడ్యూస్ చేశారు. నభా నటేశ్ ఎనర్జిటిక్ గర్ల్. మంచి పెర్ఫామర్. అందరూ చక్కగా సపోర్ట్ చేశారు’’ అన్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘మా ప్రొడక్షన్‌లో తొలి సినిమా. ఆర్.నాయుడుగారు కథ చెప్పినప్పుడు హీరో సుధీర్‌తో పాటు ప్రొడ్యూసర్ సుధీర్‌కి కూడా కథ బాగా నచ్చేసింది. నభా నటేశ్ చాలా మంచి నటి. హీరోగా చేస్తూ నిర్మాతగా చేయడం అంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. బాగాఎంజాయ్ చేశాను. నాకొక కొడుకో, కూతురో పుట్టినట్టుగా ఉంది’’ అన్నారు. 
 అమెరికా వెళ్లే ప్రతోడి మీద అమ్మాయిలకు ఇష్టం ఉండదు

Updated By ManamTue, 09/11/2018 - 11:53

Nannu Dochukunduvate‘సమ్మోహనం’ చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుధీర్ బాబు.. త్వరలో ‘నన్ను దోచుకుందువటే’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కామెడీ, యాక్షన్ మిళితమై వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఈ చిత్రంతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. కాగా ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నబా నటేషి నటించగా.. నాజర్, షణ్ముక, వర్షిణి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ నిర్మించగా.. అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.వినాయక చవితికి...

Updated By ManamThu, 07/26/2018 - 20:54

Nannu-Dochukunduvateసుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యానర్‌లో రూపొందుతోన్న చిత్రం ‘నన్నుదోచుకుందవటే’. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడు. అందరినీ భయపెట్టే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్‌గా సుధీర్‌బాబు నటించగా..  అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ నటించింది. ఒక్క పాట మినహా సినిమా పూర్తయింది. ప్రస్తుతం పాండిచ్చేరిలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అన్నికార్యక్రమాలు పూర్తిచేసి వినాయచవితి పర్వదినాన సెప్టెంబర్ 13న విడుదల చేయాటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరై జేషన్స్‌కి అందరూ కనెక్ట్ అయ్యారు. ఒక్క సాంగ్ మినహా ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేశాం. ప్రస్తుతం పాండిచ్చేరిలో సాంగ్ షూటింగ్ జరుగు తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం’ అన్నారు. సుధీర్ బాబు గారి ఫస్ట్ ప్రొడక్షన్ లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. సినిమాని అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.  అని అన్నారు.‘నన్ను దోచుకుందువటే’ రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamMon, 07/16/2018 - 11:46

sUDHEER BABU సుధీర్ బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా ఆర్‌.ఎస్ నాయుడు తెరకెక్కించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకోగా.. ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఈ చిత్రం నాజర్, తులసీ, హర్ష, వేణు తదితరులు నటించారు. సుధీర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో సుధీర్ నిర్మించిన ఈ చిత్రానికి అజనీశ్ సంగీతం అందించాడు.ఆకట్టుకుంటున్న ‘నన్ను దోచుకుందువటే’ టీజర్ 

Updated By ManamSat, 07/14/2018 - 11:24

ND సుధీర్ బాబు హీరోగా ఆర్ ఎస్ నాయుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నబా నటేశ్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమవుతుంది. ఇప్పటికే పోస్టర్‌లతో ఆకట్టుకున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో సుధీర్ బాబు కంపెనీ మేనేజర్‌గా, నభా నటేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనుంది. సుధీర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రానికి అజనీశ్ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.‘నన్ను దోచుకుందువటే’ టీజర్‌ ఎప్పుడంటే..!

Updated By ManamWed, 07/11/2018 - 13:01
Sudheer Babu

‘సమ్మోహనం’తో ఈ సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుధీర్ బాబు ప్రస్తుతం నన్ను దోచుకుందువటే అనే చిత్రంలో నటించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లు అందరినీ ఆకట్టుకోగా.. త్వరలో టీజర్‌ను విడుదల చేయనున్నారు. జూలై 14న ఈ చిత్ర టీజర్ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో సుధీర్ బాబు సరసన నభా నటేశ్ పరిచయం అవుతండగా.. నాజర్, తులసి, వేణు, రవి వర్మ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుధీర్ బాబునే నిర్మిస్తండగా ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీష్ బి లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‘నన్నుదోచుకుందువటే’ ఫస్ట్ లుక్

Updated By ManamFri, 06/29/2018 - 12:08

Nannu dochukunduvate‘స‌మ్మెహ‌నం’తో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుధీర్ బాబు ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్‌లో హీరోగా చేస్తున్నాడు. ఆర్‌.ఎస్.నాయుడు అనే కొత్త వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ చిత్రంలో నటిస్తున్నాడు సుధీర్. ఈ చిత్రానికి ‘నన్ను దోచుకుందువ‌టే’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తాజాగా ఫస్ట్‌లుక్ విడుదలైంది. హీరో, హీరోయిన్‌లను ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిన ఫస్ట్‌లుక్ అందిరినీ ఆకట్టుకుంటోంది.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నభ నతేశ్ నటిస్తుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ పూర్త‌యింది. త్వరలోనే మిగ‌తా వివ‌రాలను చెబుతామని ఈ సందర్భంగా దర్శకుడు తెలిపాడు. ఇక ఈ చిత్రంలో నాజర్, తులసి, రవి వర్మ, జీవా, వర్షిణి సౌందర్ రాజన్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తుండగా.. అజనీష్ బి లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

Related News