ramcharan

హీరో... విలన్?

Updated By ManamFri, 10/26/2018 - 01:29

imageరాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 18న సినిమా ప్రారంభమవుతుందని సమాచారం. ఈ లోపు ఎన్టీఆర్, చరణ్ వారి కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకుని చిత్రీకరణలో పాల్గొంటారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వం చేయబోయే చిత్రం కావడంతో పాటు... ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలు కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరు గుతున్నాయి.

సాధారణంగా రాజమౌళి తన చిత్రంలో విలన్ పాత్రను ఎంతో పవర్‌ఫుల్‌గా చూపి స్తారు. అలాగే ఇప్పుడు తెరకెక్కించబోయే ఈ మల్టీస్టారర్‌లోనూ ఎన్టీఆర్ శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనపడితే.. కథానాయకుడి పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తార ని ఫిలింనగర్ వర్గాల సమాచారం. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.చిరంజీవికి పవన్ బర్త్‌డే శుభాకాంక్షలు

Updated By ManamWed, 08/22/2018 - 15:26

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవికి ఆయన సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు చిరంజీవి బర్త్‌డే సందర్భంగా బుధవారం ఉదయం పవన్ తన భార్యా, పిల్లలతో కలిసి సోదరుడి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఇచ్చి బర్త్‌డే  విషెస్ చెప్పారు. 

‘మామయ్యే మా కుటుంబం బలం, అందరికీ ఆదర్శం. ఉదారస్వభావం కలిగిన వ్యక్తి. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ...ఇందుకు సంబంధించిన రెండు ఫోటోలను రాంచరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మరోవైపు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.‘గ్యాంగ్ లీడర్’ రామ్‌చరణ్?

Updated By ManamWed, 06/13/2018 - 23:50

imageహీరో చిరంజీవి నటించిన సినిమాల్లో ఘనవిజయం సాధించినవి ఎన్నో ఉన్నప్పటికీ ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవికి మాస్ హీరో ఇమేజ్‌ని మరింత పెంచిన సినిమా ఇది. కమర్షియల్‌గా మంచి విజయం సాధించిన ఈ సినిమాని రామ్‌చరణ్‌తో రీమేక్ చెయ్యనున్నారన్న వార్త గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తోంది. రామ్‌చరణ్‌ను గ్యాంగ్‌లీడర్‌గా చూడాలనుకుంటున్నామని సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు పలుమార్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ‘తేజ్ ఐలవ్‌యు’ ఆడియో ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌లో రామ్‌చరణ్ సినిమా ఉంటుందని చూచాయగా చెప్పారు. దీంతో అది ‘గ్యాంగ్ లీడర్’ రీమేకేనన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో కె.ఎస్.రామారావు ఉన్నట్టు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందే మల్టీస్టారర్ తర్వాత చరణ్ ‘గ్యాంగ్ లీడర్’ రీమేక్ చేసే అవకాశం ఉందని సమాచారం. బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న చ‌ర‌ణ్‌

Updated By ManamTue, 05/22/2018 - 14:11

charanమెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో డి.వి.వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. కియ‌రా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా.. ప్ర‌శాంత్‌, స్నేహ‌, ఆర్య‌న్ రాజేశ్‌, అన‌న్య‌, న‌వీన్ చంద్ర ఇతర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. బ్యాంకాక్‌లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్రకారం.. ఆ షెడ్యూల్ పూర్త‌య్యింద‌ని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో చరణ్, కియ‌రాపై కొన్ని రొమాంటిక్, కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్ ఇండియాలో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 'రంగ‌స్థ‌లం' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో.. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.చ‌ర‌ణ్ సినిమాలో కేథ‌రిన్‌?

Updated By ManamThu, 05/10/2018 - 14:01

catherine'సరైనోడు' చిత్రంతో సాలిడ్ హిట్‌ను అందుకుంది కేర‌ళ‌కుట్టి కేథ‌రిన్ ట్రెసా. ఆ సినిమా అందించిన విజ‌యంతో మ‌రిన్ని అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంది. అలాగే ప్ర‌త్యేక గీతాల్లోనూ మెరిసేందుకు వెనుకాడ‌లేదు. ఆ మ‌ధ్య‌ 'స‌రైనోడు' ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను రూపొందించిన 'జయ జానకి నాయక' కోసం ఓ స్పెష‌ల్ సాంగ్‌లో సంద‌డి చేసింది కేథ‌రిన్. తాజాగా.. మ‌రో సినిమాలోనూ ప్ర‌త్యేక గీతం చేసే అవ‌కాశం ఆమెను వెదుక్కుంటూ వ‌చ్చింద‌ని తెలిసింది. ఈ సినిమాకి కూడా బోయ‌పాటి శ్రీ‌నునే ద‌ర్శ‌కుడు కావ‌డం విశేషం. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి ఓ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. కియ‌రా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో ఓ బీట్ ఒరియెంటెడ్ సాంగ్ ఉంద‌ని.. అందులోనే కేథ‌రిన్ మెర‌వ‌నుంద‌ని స‌మాచారం. బ్యాంకాక్ షెడ్యూల్ త‌రువాత ఈ పాట చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే కేథ‌రిన్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా సంద‌డి చేయ‌నుంది.మ‌ల్టీస్టార‌ర్ క‌థ వేరే.. అంటున్న చ‌ర‌ణ్‌

Updated By ManamThu, 05/10/2018 - 13:24

charan'బాహుబ‌లి' సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఆయ‌న‌ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని.. ఇందులో తార‌క్‌, చ‌ర‌ణ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించ‌నున్నార‌ని గ‌త కొన్నాళ్ళుగా క‌థ‌నాలు  వినిపిస్తున్నాయి. అయితే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని ఖండించారు చ‌ర‌ణ్‌. త‌మ పాత్ర‌ల గురించి, నేప‌థ్యం గురించి వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని.. అస‌లు క‌థ వేరే అని ఆయ‌న పేర్కొన్నారు. అక్టోబ‌ర్‌లో సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో చ‌ర‌ణ్ ఓ సినిమా చేస్తుండ‌గా.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ ఓ సినిమా చేస్తున్నారు.చ‌ర‌ణ్‌, బోయ‌పాటి మూవీ అప్‌డేట్‌

Updated By ManamSun, 05/06/2018 - 20:19

charanమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా యాక్షన్ చిత్రాల‌ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఫ్యామిలీ సన్నివేశాలతో పాటు.. అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా చిత్రీకరించారు. 20 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌లో చరణ్, స్నేహ, ప్రశాంత్, కియారా అద్వానీతో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో హైదరాబాద్‌లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ పార్టును పూర్తి చేసుకుందీ చిత్రం. కాగా.. ఇంతకు ముందు జరిగిన 15 రోజుల షెడ్యూల్‌లో వివేక్ ఒబెరాయ్‌తో సహా పలువురు ప్రధాన పాత్రలపై కొన్ని సీన్స్‌ను షూట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మే 12 నుంచి ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ బ్యాంకాక్ బయలుదేరనుంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అటు మాస్ ప్రేక్షకులకి దగ్గరయ్యేలా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూనే.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా బోయ‌పాటి చక్కగా తెరకెక్కిస్తున్నారని చిత్ర నిర్మాత దానయ్య తెలిపారు. కాగా.. 2019 సంక్రాంతికి  ప్రపంచవ్యాప్తంగా  ఈ సినిమా విడుదల కానుంది.రామ్ చరణ్ సినిమాలో శ్రీ‌కాంత్‌?

Updated By ManamSun, 05/06/2018 - 17:55

ramcharanరామ్‌చరణ్ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. భారీ తారాగ‌ణంతో.. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టుడు శ్రీ‌కాంత్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. ఇంత‌కుముందు.. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో రామ్ చర‌ణ్‌కు బాబాయ్‌గా నటించారు శ్రీ‌కాంత్‌. ఇప్పుడు రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో కూడా శ్రీకాంత్ ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారని తెలిసింది.

ఈ క్యారెక్టర్ కోసం శ్రీకాంత్ పేరును చరణ్‌నే స్వ‌యంగా సూచించార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. మరి ఈ సినిమాలో శ్రీకాంత్ చేయబోయే పాత్ర‌ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కాగా.. కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా తెర‌పైకి రానుంది.వైర‌ల్‌.. ఒకే ఫ్రేమ్‌లో తార‌క్‌, చ‌ర‌ణ్ కుటుంబాలు

Updated By ManamSat, 05/05/2018 - 23:49

ntr, ramcharanయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఒకే సినిమాలో క‌లిసి సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న ఈ సినిమా అక్టోబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇదిలా ఉంటే..  రీసెంట్‌గా ఈ ఇద్ద‌రు అగ్ర తార‌లు త‌మ కుటుంబాల‌తో క‌లిసి సంద‌డి చేశారు. తార‌క్‌, ప్ర‌ణ‌తి పెళ్ళి రోజు సంద‌ర్భంగా.. శ‌నివారం చ‌ర‌ణ్ దంప‌తులు తార‌క్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఆ స‌మ‌యంలో తార‌క్‌, ప్ర‌ణ‌తి, అభ‌య్ రామ్ - చ‌ర‌ణ్‌, ఉపాస‌న దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  మొత్తానికి.. మ‌న క‌థానాయ‌కులు, వారి కుటుంబాల మ‌ధ్య స్నేహ పూర్వ‌క వాతావ‌ర‌ణం చూప‌రుల‌కు క‌నువిందు చేస్తోంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.


 'రంగ‌స్థ‌లం'.. మ‌రో మైల్‌స్టోన్‌

Updated By ManamWed, 05/02/2018 - 22:42

rangasthalamసౌండ్ ఇంజ‌నీర్ చిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్ సంద‌డి చేసిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 1980ల నాటి గ్రామీణ వాతావ‌ర‌ణంతో తెర‌కెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. యు.ఎస్‌.లోనూ క‌లెక్ష‌న్ల ప‌రంగా మెప్పించిన ఈ సినిమా.. తాజాగా యు.ఎస్‌.మార్కెట్‌లో మ‌రో మైల్‌స్టోన్‌కు చేరుకుంది. తాజా స‌మాచారం ప్రకారం.. ఈ సినిమా 3.5 మిలియ‌న్ల డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరింది. ఇప్ప‌టికే ఈ క్ల‌బ్‌లో 'బాహుబ‌లి' చిత్రాలు ఉన్నాయి. మూడో సినిమాగా 'రంగ‌స్థ‌లం' చేరిన‌ట్ల‌య్యింది. కాగా.. ఇటీవ‌లే రూ.200 కోట్ల గ్రాస్ ఈ సినిమా క్రాస్ చేసింద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌ట‌న ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Related News