Revanth reddy

నాకు ఆ ఖర్మ పట్టలేదు: నాయిని

Updated By ManamSat, 10/13/2018 - 16:40
Naini Narshimha Reddy slams revanth reddy

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ముషీరాబాద్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన దానిపై రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. తాను పొరపాటున గత ఎన్నికల సందర్భంగా ఐదు లక్షలో, పది లక్షలో కేసీఆర్ ఇస్తారన్నారు అనే బదులు పదికోట్లు అన్నానని, దాన్ని మీడియా సవరించాలన్నారు. 

నాయిని శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌లో చేరాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. నా రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్‌కు వ్యతిరేకమే. దిక్కుమాలిన వాళ్లే అలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలను నేను శిరసా వహిస్తా. ముషీరాబాద్ నుంచి మా అల్లుడు ఇండిపెండెంట్‌గా పోటీచేసే ప్రసక్తే లేదు. మాకు టిక్కెట్ ఇవ్వకుంటే కేసీఆర్ దగ్గర మరో ప్రత్యామ్నాయం ఉండే ఉంటుంది. కాంగ్రెస్‌లోకి మారుతున్నామని ప్రచారం చేసిన ఓ మీడియా సంస్థపై మా అల్లుడు పరువునష్టం దావా వేస్తున్నారు. కేసీఆర్ నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనేది నిజం కాదు. కేసీఆర్‌తో ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నా.

గత ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని చెబితే ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చిల్లరగాడు. ఈసారి కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయం. రేవంత్ కొడంగల్‌కు చేసింది ఏమీ లేదు. ఆయనకు ఇంకా చంద్రబాబుతో చుట్టరికం పోలేదు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే అది కాంగ్రెస్‌కే నష్టం.  రేవంత్ రెడ్డి ...కేసీఆర్‌ను ఎంత తిడితే అన్ని ఓట్లు కాంగ్రెస్ నుంచి దూరం అవుతాయి. ఉత్తమ్ అధికారంలోకి వస్తే అంతు చూస్తామని అధికారులను బెదిరిస్తున్నారు. 

అధికారులు కాంగ్రెస్, టీడీపీ హయంలో పనిచేసినవారే.. ఎక్కడి నుంచో రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ పగటి కలలు కంటున్నారు. ఆయనకు గడ్డం పెరగాల్సిందే కానీ అధికారం రాదు. అప్పుడు ఉత్తమ్‌ను గడ్డం కుమార్ రెడ్డి అని పిలవాల్సిందే. అన్ని సర్వేలు టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయి. మా సంక్షేమ పథకాలే టీఆర్ఎస్‌కు వందసీట్లు తెచ్చిపెడతాయి. కేసీఆర్ పథకాలు దేశంలో అందరికీ ఆదర్శం అయ్యాయి. కాంగ్రెస్ నేతలు జీరోలు కాబట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నారు. మేము హీరోలం. మళ్లీ అధికారం మాదే’ అని ధీమా వ్యక్తం చేశారు.చంద్రబాబుపై విమర్శల్లో పెద్దకుట్ర

Updated By ManamSun, 10/07/2018 - 01:23
  • ఓటుకు నోటు కేసులో ముట్టుకుంటే సత్తా ఏమిటో చూపిస్తా

revanth-reddyహైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చేయడం వెనుక పెద్దకుట్ర దాగిందని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తనపై ఐటీ దాడులు జరిగినప్పుడు  వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు తప్పుడు ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. ప్రసార మాధ్య మాల ప్రచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నామంటూ అధికారులు తనను వేధించారని చెప్పారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో కేసీఆర్ తీరుపై రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం, టీఆర్‌ఎస్‌కు లాభం చేకూరేలా  ఆయా మీడి యా సంస్థలు వ్యవహ రించాయని దుయ్యబ ట్టారు.  తనపై ప్రసారం చేసిన, ప్రచురిం చినవి తప్పుడు వార్తలని ఆ ఆసంస్థలు సవరణ వేయాలని డిమాండ్ చేశారు. 24గంటల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయ స్థానంలో తేల్చుకుం టామని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్ర బాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ దుర్మార్గంగా మాట్లాడటం పెద్ద కుట్రని, మరోసారి సెంటి మెంట్‌ను రగిల్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నా డని మండిపడ్డారు. చంద్ర బాబుపై వాడుతున్న బాషను ప్రజలు గమనిం చాలని సూచించారు. ఓటు నోటు కేసు గురించి పదేపదే మాట్లాడు తున్నాడని, కానీ టీఆర్‌ఎస్ నాయకులు ఏమి చేయలేరని స్పష్టం చేశారు. నా తరువాతే బాబు వద్దకు వెళ్లాలని, ముం దుగా నన్ను పట్టుకో నాబలమేమిటో చూపి స్తానని రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొత్తు కోసం చంద్రబాబు ఐదుకోట్ల రూపా యలు, హెలికాప్టర్ ఇచ్చాడని ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ తను పొత్తుపెట్టుకు న్నప్పుడు ఎన్నికోట్లు తీసుకున్నాడో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ఏమీ పీకుతాడో ...పీకమను..

Updated By ManamSat, 10/06/2018 - 12:46
Revanth reddy-Manam Telugu News

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు గురించి పదే పదే మాట్లాడుతున్న కేసీఆర్ తనను ఏమీ ఏకుతాడో ...పీకమను అంటూ సవాల్ విసిరారు. తనను దాటాకే... చంద్రబాబు వద్దకు వెళ్లాలి కదా అని రేవంత్ అన్నారు.  

రేవంత్ రెడ్డి శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ కేసీఆర్ వస్తాడా? ఆయన వెనకున్న నరేంద్ర మోదీ వస్తాడా? అని ప్రశ్నించారు. పొత్తు కోసం చంద్రబాబు ఐదుకోట్లు...మూడు హెలికాప్టర్లు పంపాడంటున్న కేసీఆర్... నీవు టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికోట్లు తీసుకున్నావో ముందు లెక్క చెప్పు. ఆంధ్రవాళ్లు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్‌కు అమరావతి వెళ్లినప్పుడు అది గుర్తుకు రాలేదా?. కమ్మవాళ్లను విమర్శిస్తున్న కేసీఆర్2కు తన పార్టీలో ఆ సామాజిక వర్గం వాళ్లకు టికెట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు గుర్తు లేదా? అని ప్రశ్నలు సంధించారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎందుకు ఎత్తివేయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలపై ఉన్న కేసులే ఉపసంహరించారు?. ఎందుకు ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించలేదు. ఉద్యమ కేసులు వల్ల అనేకమంది యువత ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ఇప్పుడు కల్లుతాగిన కోతికి తేలు కుడితే ఎలా ఎగురుతుందో... అలా ఎగురుతున్నారు. ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు.

చంద్రబాబుకు కనీసం ఇక్కడ ఓటు కూడా లేదు. మరోసారి సెంటిమెంట్‌తో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనేదాన్ని ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ టీడీపీ పార్టీలో ఉన్నవారు తెలంగాణ బిడ్డలు కాదా? ముఖ్యమంత్రిగా ఉండి నీచమైన విమర్శలు చేయడానికి సిగ్గులేదా?. ఆంద్రా కాంట్రాక్టర్స్ వద్ద మోకరిల్లినప్పుడు ఆంధ్రా అని తెలియదా? నాలుగేళ్లలో ఏమీ చేయలేదని చెప్పేందుకు ఏమీలేదని... చంద్రబాబును టార్గెట్‌తో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ లాంటి అథముడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు అనర్హడు.

ఇక నాపై ఐటీ రైడ్స్ సందర్భంగా కొన్ని టీవీలు...పత్రికలు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి. ఆ వార్తల ఆధారంగానే మొన్న నాపై ఐటీ అధికారులు నాలుగు, ఐదు గంటలపాటు వేధించారు. ఆ చానల్స్, పత్రికలు వెంటనే అవి తప్పుడు వార్తలని వివరణ ఇవ్వాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే పరువునష్టం దావా వేస్తా. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని’ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఇరికించాలని చూస్తున్నారు: రణధీర్

Updated By ManamFri, 10/05/2018 - 14:40
Ranadheer Reddy attend Uppal police station

హైదరాబాద్ : తనకు వచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వడానికే ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు రణధీర్ రెడ్డి తెలిపారు. తనను పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా అరెస్ట్ చేయలేదని, ఇంటికి వచ్చి అదుపులోకి తీసుకుని వెళ్లారన్నారు. లిటిల్ ఫ్లవర్ కళాశాల వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న తనను అరెస్ట్ చేశామని చెబుతున్న పోలీసులు ...ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్ చూపించగలరా? అని రణధీర్ రెడ్డి ప్రశ్నించారు. తనను తీసుకొచ్చిన సమయం ఒకటి. పోలీసులు బయట చెబుతున్న సమయం మరొకటి. కావాలనే పోలీసులు తనను తప్పుడు కేసులలో ఇరికించాలనే చూస్తున్నారని రణధీర్ రెడ్డి అన్నారు. 

కాగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంతో పాటు, ఆయన సన్నిహితుడు ఉదయసింహ నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వీరిద్దరితో రణధీర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ, అలాగే ఓ బ్యాగ్‌తో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే రణధీర్ రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.ఎన్నికల్లో కేసీఆర్ గెలవడు: రేవంత్

Updated By ManamWed, 10/03/2018 - 19:16
reveanth reddy-manam telugu news

హైదరాబాద్ : ఐటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ విచారణ అనంతరం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ వ్యక్తిగతంగా మాపై దాడి చేస్తున్నారు. ఐటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. ఐటీ ముసుగులో మా ఇళ్లపై దాడులు చేస్తున్నారు. నా మీద దాడులు చేయడమే మోదీ, కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇలాంటి దాడుల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అధికారులకు సరైన సమాధానం ఇచ్చాను కాబట్టి బయటకు వచ్చాను. ఈ కేసుల వల్ల ఎన్నికల్లో కేసీఆర్ గెలవడు. రణధీర్ ఇంటిపై దాడి గురించి హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశాను. ఐటీ అధికారులు ముసుగులో కేసీఆర్ ప్రయివేట్ సైన్యం, డీజీపీ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ అధికారి రాధాకృష్ణ మా ఇళ్లలో దాడులు చేశారు. అర్థరాత్రి మా ఇంట్లోకి చొరబడి మనుషులను మాయం చేస్తున్నారు. దానిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం’ అని అన్నారు.


కాగా రేవంత్ రెడ్డి బుధవారం కూడా ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఈ నెల రేవంత్ రెడ్డి ఈ నెల 23న మరోసారి ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు.రణ్‌ధీర్ ఆచూకీ లభ్యం.. ఉదయసింహా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Updated By ManamTue, 10/02/2018 - 10:39

Randheer Reddyహైదరాబాద్: ఉదయ సంహా బంధువు రణ్‌ధీర్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది. 24 గంటల తరువాత ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో రణ్‌ధీర్ ప్రత్యక్షమయ్యాడు. వాహనాల తనిఖీలో రణ్‌ధీర్‌ను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడి వద్ద నుంచి ఒక హార్డ్ డిస్క్, కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

అయితే ఐటీ దాడుల కంటే ముందు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను ఉదయ సింహా, రణ్‌ధీర్ దగ్గర పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆ హార్డ్ డిస్క్‌పై ఆరా తీస్తున్న పోలీసులు.. అందులో కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డికి సంబంధించిన వివరాలు ఉన్నాయేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉదయ సింహా మెడ చుట్టూ ఉచ్చు బిగియనుందని తెలుస్తోంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు తమ బంధువు రణ్‌ధీర్‌ను తీసుకెళ్లినట్లు ఉదయ సింహా సోమవారం వెల్లడించారు. ఈ విషయాన్ని ఐటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. తాము ఎలాంటి సోదాలు చేయలేదని, తమకు ఎలాంటి సంబంధం లేదని వారు అన్నారని ఉదయ సింహా చెప్పారు. దీంతో రణ్‌ధీర్ మిస్సింగ్‌పై ఆయన కుటుంబ సభ్యులు ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఐటీ విచారణకు హాజరైన ఉదయసింహా

Updated By ManamMon, 10/01/2018 - 12:30

Udaya Simhaహైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఉదయ సింహా సోమవారం విచారణ నిమిత్తం ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. బషీరాబాగ్‌లోని ఐటీ కార్యాలయానికి ఆయన వెళ్లారు. ఆదాయపు పన్ను ఎగవేత విషయంలో అధికారులు... ఉదయ సింహాను ప్రశ్నించారు.

అయితే పన్ను ఎగవేత, అవినీతి ఆరోపణలతో గత బుధవారం రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు ఉదయ సింహా, ఎమ్మెల్సీ సెబాస్టియన్, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి ఇళ్ళల్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 1న తమముందు హాజరుకావాలంటూ ఉదయ సింహా, సెబాస్టియన్, కొండలరెడ్డిలకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా ఉదయ సింహా ఐటీ ఆఫీసుకు వెళ్లారు. విచారణ అనంతరం ఉదయసింహా మాట్లాడుతూ ...మరోసారి ఐటీ అధికారుల విచారణకు హాజరు కానున్నట్లు తెలిపారు. 3వ తేదీన మళ్లీ ఐటీ విచారణకు హాజరు అవుతారు.కేసీఆర్, గంపాపై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

Updated By ManamSun, 09/30/2018 - 18:26
  • గంపా నువ్వు చేసింది ఏంది?. నీకు వచ్చింది ఎంత?.

  • కేసీఆర్ రాష్ట్రాన్ని, గంపా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

  • కామారెడ్డికి అధిక నిధులు తెచ్చింది షబ్బీరన్నే

Revanth reddy speech in kamareddy district bhikkanur

కామారెడ్డి : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, గంపా గోవర్థన్‌ను వంద మీటర్ల గోతితీసి పాతరేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  నిర్వహించిన రోడ్ షోలో  షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.  షబ్బీర్ అలీ తరఫున ప్రచారం చేసిన
ఆయన టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. ఏసీబీ, ఐటీ దాడులు చేసి నన్ను ఏమీ పీకలేరు. ఎవరికీ భయపడేది లేదని అన్నారు.
గంపా ఇక నీ తట్టాబుట్టా సర్దుకోవాలే..
‘ప్రజలు గంపా గోవర్థన్‌ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆయన ఎన్నడూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడలేదు. కామారెడ్డిలో అడ్డగోలుగా ఇసుక మాఫియాకు తెరలేపారు. అదేమని ప్రశ్నిస్తే అమాయకులను లారీల కింద పడేసి చంపుతున్నావు. గంపా ఇక నీ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటే... గంపా కామారెడ్డిని దోచుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలకు కరెంట్ షాక్ కొట్టించాలి. మన కరెంట్ ఓటు... దానితోనే సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలే, రిజర్వేషన్లు లేవు.

షబ్బీర్ అలీకి ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఉప ముఖ్యమంత్రిగా చూడవచ్చు. గతంలో కామారెడ్డి నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసింది షబ్బీర్ అలీనే. షబ్బీర్ అన్నను గెలిపిస్తే కామారెడ్డి పేరును దేశంలో ఉంచుతారు.

ఇక ఎన్నికల సందర్భంగా మీ ఊరికి కేసీఆర్ వచ్చినా, కేటీఆర్ వచ్చినా వారి బట్టలు ఊడదీసి పంపండి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 6వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో దోచుకునే పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే’ అంటూ విమర్శల వర్షం కురిపించారు.'రేవంత్ తప్పులు చేస్తే జైలుకు వెళ్లక తప్పదు'

Updated By ManamSat, 09/29/2018 - 21:05
  • టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో జగదీశ్ రెడ్డి వ్యాఖ్య

Revanth Reddy, Revanth Reddy jail, Jagadeesh Reddy, KCR, TRS govt, Congress party allegationsహైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తప్పులు చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఆపద్ధర్మ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదాయ పన్ను సక్రమంగా కట్టకపోతే దాడులు చేస్తారని అన్నారు. శనివారం ఆయన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ.. అసహనంతోనే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తు్న్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి కంటే పెద్ద నేతలు చాలా మంది ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షంగా ప్రజల తరపున ఎలా పోరాడాలో కూడా కాంగ్రెస్‌కు తెలియదని విమర్శించారు. నాలుగేళ్లలో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని దుయ్యబట్టారు. రేవంత్ ఇంటిపై దాడుల్లో ఏం దొరికిందో అధికారులే చెబుతారని జగదీశ్ చెప్పారు. ఐటీ దాడుల్ని అడ్డంపెట్టుకుని టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ దుష్ర్పచారం చేస్తోందని ధ్వజమెత్తారు. 

దొంగలంతా కలిసి పోలీసు శాఖను రద్దు చేయాలని డిమాండ్ చేసినట్టుంది కాంగ్రెస్ తీరని జగదీశ్ ఎద్దేవా చేశారు. ఆదాయ పన్ను శాఖ ఎక్కడైనా సోదాలు నిర్వహించవచ్చు.. వ్యాపారులు, రాజకీయ నాయకులపై సోదాలు జరుగుతుంటాయని, అఫిడవిట్‌లో తేడా ఉందని ఎవరో ఫిర్యాదు చేస్తే టీఆర్ఎస్‌కు ఏం సంబంధం? అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పొరపాటు చేయకుండా ఉంటే.. జైలుకు వెళ్లరని, పొరపాటు చేస్తే తప్పించుకోలేరని చెప్పారు. టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులపై కూడా ఐటీ సోదాలు జరిగాయని, పార్టీ కార్యకర్తలకు.. సోదాలకు ఏం సంబంధం? కేసీఆర్‌ కుటుంబంపై ఆరోపణలు చేయడం మంచిది కాదని, రేవంత్‌రెడ్డి తన తప్పులను సరిదిద్దుకుంటే మంచిదని జగదీశ్‌రెడ్డి హితవు పలికారు.'రేవంత్.. దమ్ముంటే విచారణ ఎదుర్కో'

Updated By ManamSat, 09/29/2018 - 18:58
  • ఎంపీ బాల్క సుమన్ హెచ్చరిక.. 

Balka Suman, Revanth Reddy, IT Raids, Chandrababu Naidu, KCR, TRS govtహైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టుపట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన రేవంత్ కేసీఆర్‌‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ బాల్కసుమన్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అదే స్థాయిలో తిప్పికొట్టారు. రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని.. నోరుంది కదా అని ఏదిబడితే అది మాట్లాడితే బయట తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి చంద్రబాబు కోవర్ట్‌ అని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి నువ్వు స్వాతిముత్యం కమల్‌హాసన్‌వి కాదు.. విశ్వరూపం కమలహాసన్‌వి అని సెటైర్లు వేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి కేసీఆర్‌.. కేసీఆర్‌ది ఉద్యమ కుటుంబం.. ఆయన తెలంగాణ జాతిపిత అని సుమన్‌ చెప్పారు. 

తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ ఎదుర్కొని నిజాయితీగా బయటపడాలని హితవు పలికారు. ఆరోపణలు ఎదుర్కొంటూ జగన్‌ విచారణకు హాజరుకావడం లేదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే విచారణ ఎదుర్కో.. అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దని అన్నారు. రేవంత్ బండారం మొత్తం తనకు తెలుసనని సుమన్ విమర్శించారు. డొల్ల కంపెనీలు, అక్రమాస్తులపై రేవంత్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగలా మారారని దుయ్యబట్టారు. రేవంత్ ఎవరెవర్ని మోసం చేశారో అందరికి తెలుసుని చెప్పారు. రేవంత్ ఓ విష పురుగు అని ధ్వజమెత్తారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది రేవంత్‌రెడ్డి తీరని ఎద్దేవా చేశారు. కులం పేరిట రాష్ట్రంలో విద్వేష పూరిత వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. నిప్పులాగా బతుకుతున్న కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్‌ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం అన్నా.. ప్రభుత్వమన్నా అతనికి గౌరవం లేదని సుమన్ విమర్శలు గుప్పించారు. 

Related News