naga chaitanya

డోంట్ వర్రీ అంటున్న మారుతి

Updated By ManamSat, 03/24/2018 - 21:10

maruthi‘మ‌హానుభావుడు’ విజయం తర్వాత ద‌ర్శ‌కుడు మారుతి.. యువ క‌థానాయ‌కుడు నాగ‌చైతన్యతో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అనూ ఇమాన్యుయేల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అయితే రెండో షెడ్యూల్ కోసం తాను వెయిట్ చేస్తున్నానని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు మారుతి. చైతన్య ‘సవ్యసాచి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారని.. అది పూర్తయిన తర్వాత తన సినిమా షెడ్యూల్ ప్రారంభమ‌వుతుందని తెలిపారు మారుతి. ‘డోంట్ వర్రీ.. సినిమా అభిమానులను అలరించేలా.. మంచి కావెుడీతో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద’నే హామీని కూడా ఇచ్చారు ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌.'స‌వ్య‌సాచి'.. ఫ‌స్ట్ పంచ్ అదిరింది

Updated By ManamFri, 03/16/2018 - 12:42

savyasachi''రెండు చేతుల్ని స‌మ‌ర్థంగా, శ‌క్తిమంతంగా వాడే వాళ్ళ‌ని స‌వ్య‌సాచి అంటారు. మ‌హాభార‌తంలో అర్జునుడి ఐదో పేరు స‌వ్య‌సాచి. ఎందుకంటే.. అర్జునుడు రెండు చేతుల‌తో ఒకే వేగంతో విలువిద్య ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌డు. అలాగే మా చిత్రంలో కూడా క‌థానాయ‌కుడు త‌న‌ రెండు చేతుల్ని స‌మ‌ర్థ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ను, ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొంటాడు. అదెలాగ‌న్న‌ది తెలుసుకోవాలంటే 'స‌వ్య‌సాచి' చూడాల్సిందే'' అంటున్నారు చందు మొండేటి.

'కార్తికేయ‌', 'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంతమైన చిత్రాల త‌రువాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్ర‌మిది. నాగ‌చైత‌న్య టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఈ రోజు (శుక్ర‌వారం) విడుద‌లైంది. సినిమా థీమ్‌ను ఈ పోస్ట‌ర్‌లో చెప్పే ప్ర‌య‌త్నం క‌నిపించింది. కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ మూవీ జూన్ 14న తెర‌పైకి రానుంది.నాగ్‌కు జోడీగా నాగ‌చైత‌న్య హీరోయిన్‌?

Updated By ManamTue, 03/13/2018 - 16:04

nagనాగ‌చైత‌న్య‌కు జోడీగా న‌టించిన ఓ హీరోయిన్‌.. నాగార్జునకు కూడా జంట‌గా న‌టించ‌నుందా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. నాగార్జున‌, నాని క‌థానాయ‌కులుగా శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై సి.అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడు. మార్చి 18 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

amalaఇదిలా ఉంటే.. ఈ సినిమాలో న‌టించే హీరోయిన్ల‌పై గ‌త కొంత‌కాలంగా ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే.. చిత్ర యూనిట్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రినీ ధృవీక‌రించ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో నాగ్‌కు జోడీగా అమ‌లా పాల్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కుముందు నాగ‌చైత‌న్య న‌టించిన 'బెజ‌వాడ' చిత్రంలో అమ‌ల హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే అమ‌ల ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. కాగా, నాని స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.తాత‌య్య పాత్ర‌లో నాగ‌చైత‌న్య‌?

Updated By ManamSun, 03/11/2018 - 17:55

nagaయువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య.. త‌న తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో సందడి చేయ‌నున్నారా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. న‌టీమ‌ణి సావిత్రి జీవితకథ ఆధారంగా ‘మహానటి’ పేరుతో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నాగ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో న‌టిస్తోంది. జెమిని గ‌ణేశ‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఎస్వీఆర్ పాత్ర‌లో మోహ‌న్ బాబు, జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ల్లో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నారు. అలాగే సావిత్రి సినీ జీవితంలో కీల‌క పాత్రలు పోషించిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు పాత్ర‌ల‌కు కూడా ఈ సినిమా చోటు ఉంద‌ని చాలా రోజులుగా వార్త‌లు వినిపించాయి. అంతేగాకుండా, ఆ పాత్ర‌ల్లో న‌టించే తార‌ల‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వినిపించాయి.

అయితే.. ఎట్ట‌కేల‌కు ఏఎన్నార్ పాత్ర‌కు సంబంధించి క్లారిటీ వ‌చ్చేసింది. ఏఎన్నార్ మ‌న‌వ‌డు నాగచైతన్య ఆ పాత్ర‌లో క‌నిపించ‌డానికి అంగీకారం తెలిపార‌ని స‌మాచారం. అందులో భాగంగా.. రెండు రోజులు షూటింగ్ చేయడానికి డేట్స్ కూడా ఇచ్చార‌ని.. త్వరలోనే చైతన్యపై ఏఎన్నార్‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య నుంచి నాని వరకు చాలామంది పేర్లు వినిపించాయి. త్వ‌ర‌లోనే దీనిపైనా క్లారిటీ వ‌స్తుంది.అను ఇమ్మాన్యుయేల్ అంకుల్ పాత్ర‌లో..

Updated By ManamSat, 03/10/2018 - 18:19

dasariనాగ‌చైత‌న్య‌, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా మారుతి రూపొందిస్తున్న చిత్రం 'శైల‌జా రెడ్డి అల్లుడు' (ప్ర‌చారంలో ఉన్న పేరు). ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావు త‌న‌యుడు దాస‌రి అరుణ్ కుమార్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడ‌ని గ‌త కొంతకాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. అను ఇమ్మాన్యుయేల్‌కి అంకుల్‌గా ఆయ‌న క‌నిపించనున్నార‌ని తెలిసింది. అంటే ర‌మ్య‌కృష్ణ‌కి అన్న‌య్య పాత్ర‌లో అరుణ్ సంద‌డి చేసే అవ‌కాశ‌ముంద‌న్న‌మాట‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.అధికారికం: చై-సామ్ కొత్త చిత్రం

Updated By ManamThu, 03/08/2018 - 13:03

Chai, Sam 'ఏ మాయ చేశావే' చిత్రంలో సూపర్ జోడీ అనిపించుకున్న నాగ చైతన్య, సమంత.. ఆ తరువాత పలు చిత్రాల్లో కలిసి నటించడం, ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం.. ఇలా ఒకదాని తరువాత మరొకటి జరిగాయి. అయితే వివాహం తరువాత కూడా సమంత తన నటనను కొనసాగిస్తుండగా.. చైతూతో కలిసి ఆమె మరో చిత్రంలో కనిపిస్తే బావుంటుందని వారి వారి అభిమానులు భావించారు. ఈ నేపథ్యంలో వారందరికీ ఆ శుభవార్తను చెప్పేశాడు నాగ చైతన్య.

తన తదుపరి చిత్రంలో సమంతతో రొమాన్స్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. "నా తదుపరి చిత్రం శివ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ నిర్మాణంలో ఉండబోతోంది. నా భార్య సమంత అవకాశం ఇస్తే ఈ చిత్రంలో ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటా" అంటూ ట్వీట్ చేశాడు చైతన్య. దీనికి సమాధానం ఇచ్చిన సమంత.. చాలా ఆత్రుతగా ఉందంటూ కామెంట్ పెట్టింది. ఇక ఈ వార్తతో ఈ ఇద్దరి అభిమానులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

 'సవ్యసాచి' ఫ‌స్ట్ లుక్‌, రిలీజ్ డేట్ డిటైల్స్‌

Updated By ManamSat, 03/03/2018 - 16:07

savyasachi'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగచైతన్య, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'సవ్యసాచి'. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమిక కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 18న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను, జూన్ 14న సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ మాట్లాడుతూ.. "మా యూనిట్ సభ్యులందరికీ "సవ్యసాచి" ఒక స్పెషల్ ఫిలిమ్. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో నాగచైతన్య, భూమికపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం అమెరికా వెళ్లనుంది. సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చి 18న విడుదల చేయాలనుకొంటున్నాం. అలాగే మా చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. ఆర్.మాధవన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక "బాహుబలి" తర్వాత కీరవాణి గారు "సవ్యసాచి"కి సంగీతం సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది" అన్నారు.

నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక చావ్లా, రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందు మొండేటి.నాగ‌చైత‌న్య కొత్త చిత్రం.. 'ప్రేయ‌సి'

Updated By ManamFri, 03/02/2018 - 23:41

naga chaitanyaయువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం 'స‌వ్య‌సాచి', 'శైల‌జా రెడ్డి అల్లుడు' చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు త‌క్కువ గ్యాప్‌లోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది. ఇదిలా ఉంటే.. ఈ రెండు సినిమాల త‌రువాత 'నిన్ను కోరి' ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు చైతు. కోన వెంక‌ట్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలిసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకి 'ప్రేయ‌సి' అనే పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. నాగ‌చైత‌న్య శ్రీ‌మ‌తి, న‌టి స‌మంత ఈ చిత్రంలో అతిథి పాత్ర‌లో క‌నిపించే అవకాశ‌ముంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి.'రారండోయ్' జోడితో మరో చిత్రం

Updated By ManamThu, 02/22/2018 - 13:55

Naga Chaitanya, rakul Prreth Singhసినిమాలు చేయడంలో నాగచైతన్య దూకుడును పెంచాడు. ప్రస్తుతం 'సవ్యసాచి', 'శైలజా రెడ్డి అల్లుడు' అనే రెండు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్న చైతూ మరోవైపు కథలను వింటూ ఓకే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ లేడి డైరక్టర్‌కు చైతూ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన సౌజన్య అనే దర్శకురాలు చైతన్యకు ఓ కథను చెప్పిందట. దీన్ని విన్న చైతూ వెంటనే ఒప్పుకోగా.. ఇందులో హీరోయిన్‌గా రకుల్‌ను సంప్రదించారట. ఆమె కూడా ఒప్పుకోవడంతో స్ర్కిప్ట్ పనులు మొదలెట్టినట్లు తెలుస్తోంది. అయితే చైతూ, రకుల్ రారండోయ్ వేడుక చూద్దాంలో కలిసి నటించిన విషయం తెలిసిందే.ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడితో నాగ‌చైత‌న్య‌?

Updated By ManamTue, 02/20/2018 - 22:56

nagaఎన్టీఆర్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని చిత్రాల‌లో 'జై ల‌వ కుశ' ఒక‌టి. ఇందులో జై పాత్ర‌లో తార‌క్ న‌ట విశ్వ‌రూపం చూపారు. ఆ పాత్ర‌ని అంత చ‌క్క‌గా తీర్చిదిద్దిన ఘ‌న‌త మాత్రం ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ)దే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌రువాత బాబీ ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నార‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చింది. యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌కి బాబీ ఓ లైన్ చెప్పార‌ని.. అది చైతుకి బాగా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి అంగీక‌రించారని టీటౌన్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.
Related News