Paddy

రైతులకు కేంద్రం శుభవార్త...

Updated By ManamWed, 09/12/2018 - 18:43
  • ఇక నుంచి కొత్త ధాన్య సేకరణ విధానం

  • ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

farmers

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. ఇటీవల ప్రతిపాదించిన కొత్త ధాన్య సేకరణ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బుధవారం సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇథనాల్ ధరలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ధాన్య సేకరణ విధానం అమలులోకి వస్తే.. రైతులకు తప్పనిసరిగా మద్దతు రానుంది.

ఎందుకంటే.. కొత్త విధానం ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువకు మార్కెట్ ధరలు తగ్గిన పక్షంలో కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఫలితంగా దళారులు తమ ఇష్టారాజ్యంగా పంట ఉత్పత్తులకు ధరలను నిర్ణయించి రైతులను నిలువు దోపిడీ చేసేవారు. కొత్త విధానంతో అలాంటి సమస్యలన్నింటికీ చెక్ పడనుంది.

కొంతమంది అధికారులు, పాలకుల స్వార్థంతో దళారులకు కొమ్ముకాస్తూ.. మార్కెట్‌ను శాసించేవారు. కృతిమంగా పంట ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం, తగ్గించడం చేయడంతో రైతులకు న్యాయం జరిగేది కాదు. కానీ కొత్త విధానం వల్ల మార్కెట్‌లో మద్దతు ధర కంటే పంట ఉత్పత్తులకు తక్కువ ధర వస్తే.. ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించేలా హామీ ఉండడంతో ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది. 

తదనుగుణంగా తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్‌లోని ధరలపై ప్రభుత్వం ఆజమాయిషీ తీసుకుని.. రైతులకు మద్దతు ధర కల్పిస్తుంది. ఇదిలావుంటే.. 22 పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు ఇటీవల ఈ పంటల ఉత్పత్తులకు మద్దతు ధరను పెంచారు. కొత్త ధాన్య సేకరణ విధానం వల్ల కేంద్రంపై రూ.40వేల కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్రం అంచనా వేసింది. అలాగే లీటర్ ఇథనాల్‌కు ఇప్పుడు వస్తున్న రూ.47.5లను ఏకంగా రూ.52కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఖరీఫ్‌లో పెరగనున్న సాగు

Updated By ManamSat, 07/21/2018 - 23:36
  • సాగర్ ఆయకట్టుకు మహర్దశ.. జిల్లాలో అత్యధిక వర్ష పాతం..

  • జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు.. పనుల్లో నిమగ్నమైన రైతాంగం

paddyఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం యావత్తూ సంతోషంలో మునిగింది. ఖరీఫ్ సాగు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా కురియడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఆయా ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటకు ఢోకాలేదని సంబురపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు పెరగనుంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరిసాగు పెరిగే అవకాశం ఉంది. అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు సంతో షంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

నాలుగేళ్లుగా వరి పండడంలేదు..
ఖమ్మం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2,32,707 హెక్టార్లు.. దీనిలో వరి సాధారణ విస్తీర్ణం 60వేల హెక్టార్లు, మొక్కజొన్న 4.3 వేల హెక్టార్లు, పత్తి 98 వేల హెక్టార్లు, చెరకు 4670 హెక్టార్లు, పెసర 8752 హెక్టార్లు, కంది 2200 హెక్టార్లలో సాగు అవుతుంది. అయితే, నాలుగేళ్లుగా సాగర్ ఆయకట్టు కింద వరి సాగు కావడంలేదు. నీటి లభ్యత లేకపోవడంతో మొక్కజొన్న, కంది తదితర పంటలు సాగు చేశారు. ఈ ఏడాది వర్షపాతం అత్యధికంగా నమోదు అయ్యింది. గత సంవత్సరం జూన్‌లో 234 మి.మి. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది 183 మి.మి. వర్షం కురిసింది. జూలై నెలలో గత ఏడాది 200 మి.మి. వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది జూలై 21 నాటికి 240 మి.మి. వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ముమ్మరమైంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో 133.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం 511 అడుగుల నీటి మట్టం ఉంది.. ఇది 540 అడుగులు దాటితే ఒక పంటకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నిండితే అక్కడ నుంచి నాగార్జునసాగర్‌కు చేరే అవకాశం ఉంది. సాగర్ నిండితే జిల్లాలో రెండు పంటలు పండే అవకాశం ఉంది.

నిండిన చెరువులు..
ఇరవై రోజుల వర్షం కారణంగా జిల్లాలోని పెద్ద పెద్ద చెరువులన్నీ నిండాయి. ఇప్పటికే ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చెరువుల మరమ్మత్తులను చేపట్టింది. దీంతో జిల్లాలో సుమారు 6వేల చెరువులలో పూడికతీత పూర్తయింది. ఈ పనులు ముగియడంతో తాజా వర్షాలకు ఆ చెరువులు నిండాయి. అలాగే జిల్లాలోని ప్రాజెక్టులు కూడా నీటితో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి, పత్తి సాగు పెరగనుంది. ఇప్పటికే సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, కూసుమంచి, కొండపల్లి తదితర మండలాల్లో వరినాట్లు మొదలయ్యాయి. పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్ల నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.  నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలో వరిసాగు లేకపోవడంతో నష్టపోయామని, ఈ ఏడాది సజావుగా సాగితే అప్పులు తీరుతాయని రైతులు పేర్కొంటున్నారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

Updated By ManamWed, 07/04/2018 - 14:54

Farmersన్యూఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వరి సహా ఖరీఫ్ పంటల కనీస మద్దతుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్వింటాల్ వరిపై మద్దతు ధర రూ.200వరకు పెరగనుంది.

కొత్తగా పెంచిన కనీస మద్దతు ధరల ప్రకారం.. క్వింటాల్ వరి(సాధారణ రకం) మద్దతు ధర రూ.1550 నుంచి రూ.1,750వరకు పెరిగింది. అలాగే గ్రేడ్ ఏ రకం వరి క్వింటాల్ ధర రూ.1,590 నుంచి రూ.1,750.. పత్తి ధర రూ.4,020 నుంచి రూ.5,150.. కందుల ధర రూ.5,450 నుంచి  రూ.5,675.. పెసర్ల ధర రూ.5,575 నుంచి రూ.6,975.. మినుములు రూ.5,400 నుంచి రూ.5,600లు పెరగనున్నాయి. అయితే పంటల సాగు వ్యయానికి కనీసం 1.5రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను ఇస్తామని 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఈ హామీని నెరవేర్చారు.

Related News